గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఆగస్టు 2010, శనివారం

మెఱుగుమిల్లి క్రొత్త బ్లాగు మన కోసం.

ప్రియ సాహితీ బంధువులారా! 
ఈ రోజు నుండీ మనకు మరొక క్రొత్త తెలుగు బ్లాగు ఆనందం కలుగ జేస్తోంది. జూలై 31వ తేదీన ఆంధ్రామృతంలో చూపించిన చీ.యమ్.ఆర్. పురస్కార గ్రహీత డా.మెఱుగుమిల్లి వేంకటేశ్వర రావు " Merugumilli " అనే పేరుతో మనముందుంచారు. http://merugumilli.blogspot.com ద్వారా మనం ఆ బ్లాగును చూడగలము. దానిని మీకు ప్రత్యక్షంగా చూడడం నిమిత్తం మీ ముందుంచుతున్నాను.



THURSDAY, AUGUST 26, 2010




THURSDAY, AUGUST 26, 2010sarvepalli
మిణుగురు  మిన్నంటి  మిహిర  సంకాశమై 
                దీధితుల్ కురిసిన తీపిగురుతు 
గురు శిష్యబంధమ్ము  తరతరమ్ములకును 
               దివ్యమై తనరారు తీపిగురుతు 
జ్ఞానశక్తి  నియంత సామ్రాట్టులకునైన 
               తృషను తీర్చిన మేటి తీపిగురుతు 
విశ్వంబు విశ్వమే వినయాన్జలుల తోడ 
              ధీసారముంగొన్న తీపిగురుతు 
దార్శనికుడు జగద్వంద్య  తత్వవేత్త , భారతావని ముద్దుల పట్టియైన 
గురువరుండు సర్వేపల్లి. మరులుగొల్పు,సాధుమూర్తి రాధాకృష్ణ సంస్మరణము  
Print this post

1 comments:

A K Sastry చెప్పారు...

చీ ఎమ్ ఆర్ కీ, మెరుగుమిల్లికీ నమస్కారం!

అలాగే చింతా వారికి కూడా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.