గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఆగస్టు 2010, ఆదివారం

శ్రీ వల్లభవఝల వారి శ్రీ చక్ర బంధ గీతములు

జై శ్రీరామ్.
ఆర్యులారా!

శ్రీమాన్ వల్లభవఝల నరసింహ మూర్తి ప్రముఖ జ్యోతిశ్శాస్త్రజ్ఞూలే కాదు. ప్రముఖ రచయిత అని కూడా వారి రచనలు రుజువు చేస్తున్నాయి.వారు రచించిన శ్రీచక్ర శోభిత గీతమే ఇందుకు తార్కాణము. పైన ఉన్న శ్రీ కేంద్రముగా కల చక్రమున ఉపరితలమున వృత్తమున గల చిన్న చరుతములలోని అక్షరములను ఒకచో చేర్చినచో ఒక అర్థవంతమైన పదము ప్రత్యక్షమగుచున్నది. దీనినే అర్థ గోపన పద బంధము అని చెప్పుకొన వచ్చును.   వీరు వ్రాసిన పదమునగల అర్థ గోపనము చూడుడు. మనము నిలచుమ! = నా మనసులో నిలచి యుండుము! పరమాత్మ తన మనసులో శాస్వితముగా నిలిచి ఉండిపోవాలనే జిజ్ఞాసతో వ్రాసిన పద్యము.ఎంత చక్కటి భావన. ఇప్పుడా పద్యం చూద్దాము.
రెండవ పద్యము కూడా ఇటులనే గ్రహింపనగును.
చూచితిరికదా!
ధన్యవాదములు.
జైహింద్.
Print this post

3 comments:

అజ్ఞాత చెప్పారు...

Sir,
The picture is not visible.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చక్ర బధం బాగుంది. కానీ " శ్రీ కేంద్రము గా గల చక్రమున ఉపరితలమున గల చిన్న చతురము అందలి అక్షరములకు గల అర్ధవంత మైన పదము తెలుసు కొగల తెలివి నాకు లేదు కావున తెలుప గలిగితె ముదావహం

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చివరి పాదం " మముననాముల నిశ్చల మౌచు " అని ఉంది కద !అందులోంచి " మనముల నిలుచుమ " కవిగారు చెప్పినట్టుగ " నా మనసులొ నిలచి యుండుము " బహుస అదె పదము అనుకుంటున్నాను. కాక పోతె ఏముంది ? ఇం......తే.....సంగతులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.