గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2010, సోమవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 101.


శ్లోll
తుల్యం పరోపతాపిత్వం , క్రుద్ధయో: సాధునీచయో:
న దాహే జ్వలతోర్భేధ:, చందనేంధనయో: క్వచిత్.
ఆ.వె.ll
మంచివారలైన; వంచితు లైనను
కోపగింప పరులు తాపమొందు.
అగ్ని తుమ్మచెట్టు; నటులె గంధపు చెట్టు
నంటుకొన్నఁ గాల్చు నవనిపై. 
భావము:-
కోపం మంచి వారికి వచ్చినా, చెడ్డ వారికి వచ్చినా అది ఇతరులను బాధించును. గంధపు చెట్టునయినా , తుమ్మ చెట్టునయినా అగ్ని ఒకే విధముగా దహించి వే్యును కదా? కోపం అగ్ని వంటిదన్న మాట. అది ఇతరులనే కాదు, మనలనీ దహించి వేస్తుంది. అందుకే పెద్దలు శాంతముగా ఉండవలెనని సూచిస్తూ అన్ని కార్యక్రమముల లోనూ శాంతి మంత్రమును పఠించుచుందురు.
శాంతమూ లేకా సౌఖ్యమూ లేదూ సారసా దళా నయనా; అనే పాట మనకు సుపరిచితమే కదా! అందుకే నిరంతరం మనస్సును శాంతంగా ఉంచుకొనే ప్రయత్నం చేద్దామా?
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తపస్సు చేయడానికి ' నర్మదా తటము " దాన మివ్వడానికి " కురుక్షేత్ర ధాత్రి " మూఢులు ఘనత పొందడానికి " గౌతమీ తీరం " శ్రేష్టం అని చెప్పినట్టు గా మంచి సూక్తి ముక్తాలను ఏరుకోవాలంటే " చింతా వారి " ఆంధ్రామృతాన్ని దర్శిం చాల్సిందే

yuddandisivasubramanyam చెప్పారు...

excellent

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.