గృహిణి లేని గృహము.
శ్లోll
పుత్ర పౌత్ర వధూ భృత్యై రాక్రాంతమపి సర్వత:
భార్యా హీనం గృహస్థస్య శూన్యమేవ గృహం భవేత్.
గీll
పుత్ర, పౌత్రులు, కోడళ్ళు, ముఖ్య భృత్య
గణము తోడుత నున్నట్టి తనదు గృహము,
భార్య లేకున్నశూన్యము భర్తలకును.
భార్య లేనట్టి గృహపతి బ్రతుకు భరము.
భావము:-
పుత్రులు, పౌత్రులు, కోడళ్ళు సేవకులు, మొదలైన వాళ్ళతో నిండి యున్నదైనాసరే తన గృహం తన భార్య లేనిచో గృహస్తునికి శూన్యంగానే ఉన్నట్లుంటుంది.
జైహింద్.
Print this post
గణపతి పాట. రచన, సంగీతం,గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.
-
జైశ్రీరామ్.
శ్రీమతి వల్లూరి సరవతి గారు చక్కని సంప్రదాయకుటుంబీకులు. భక్తి తత్పరతతో
రచించిన వారి పద్యాలయినా పాటలయినా మనోహరంగా పాడే సుస్వభావం ఉన్న జనని. వారే
...
2 రోజుల క్రితం
1 comments:
నిజమె ఇంట్లొ ఎంత మంది ఉన్నను ఇల్లాలు లెని ఇల్లు కళా విహీనమే అందుకే " ఆడది లేని ఇంటా ఆరిపోయిన వంటా " అన్నాడో కవి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.