జై శ్రీమన్నారాయణ.🙏
భారతమాత ముద్దుబిడ్డలయిన మీకు
భారత దేశ 73వ సర్వసత్తాక గణతంత్ర సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు.💐
0
comments
జై శ్రీమన్నారాయణ.🙏
భారతమాత ముద్దుబిడ్డలయిన మీకు
భారత దేశ 73వ సర్వసత్తాక గణతంత్ర సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు.💐
0
comments
0
comments
జైశ్రీరామ్.
శ్లో. ఏషా తే௨భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు |
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి || 39
తే.గీ. ఆత్మతత్వమ్ము సాంఖ్య మతానుసార
మీకు వివరించి చెప్పితి ప్రాకటముగ.
కర్మయోగబుఁ దెలిపెద కలిగియున్న
బంధనము లాత్మ వీడగా పార్థ! వినుము.
భావము.
పార్థా ! ఇంతవరకూ నీకు సాంఖ్యమతానుసారం ఆత్మతత్వం గురించి
చెప్పాను. ఇక సంసారబంధం వదులుకోవడానికి సాధనమైన నిష్కామ
కర్మయోగం గురించి చెబుతాను విను.
శ్లో. నేహాభిక్రమనాశో௨స్తి ప్రత్యవాయో న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ || 40
తే.గీ. కర్మయోగమారంభించి కడవరకును
చేయకున్నను, యేకొద్ది చేసిన నది
వ్యర్థమయిపోదు,చక్కగా సార్థకమగు
కలుగు సంసారభయమును దొలఁగఁ జేయు,
భావము.
ఈ కర్మయోగం ప్రారంభించి, పూర్తి చేయలేకపోయినా వృథాగా పోదు;
దోషం లేదు. ఏ కొద్దిగా ఆచరించినా ఈ యోగం దారుణమైన సంసారభయం
నుంచి కాపాడుతుంది.
జైహింద్.
0
comments
శ్లో. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః || 37
తే.గీ. యుద్ధరంగంబులో మృతి యొసగు ముక్తి,
జయముపొందిన రాజ్యంపు సౌఖ్యమబ్బు,
నర్జునా యిది నీమది నరయవేల?
యుద్ధసన్నద్ధుఁడుగ నగు మొప్పుగాను
భావము.
అర్జునా ! ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. శత్రువులను
జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృతనిశ్చయంతో
యుద్ధానికి నడుంబిగించు.
శ్లో. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జాయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి
|| 38
తే.గీ. సుఖము దుఃఖము నొకటిగ ఊడు పార్థ!
లాభనష్టంబుల గనవలయునటులనె,
అపజయంబైన జయమైన నటులె గనుము,
యుద్ధమునకు సన్నద్ధమై యొప్పుమయ్య.
భావము.
సుఖదుఃఖాలూ, లాభనష్టాలూ, జయాపజయాలూ సమానంగా భావించి
సమరం సాగించు. అప్పుడు నీకు పాపం కలగదు.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ || 35
కం. వీరాగ్రేసరునిగ నిను
గౌరవముగఁ జూచువారు గాంచుదు రికపై
భీరువనుచు చులకనగా,
పోరాములవేల
ధీరపుంగవ నీకున్.,
భావము.
ఇన్నాళ్ళూ నిన్ను మహావీరుడిగా గౌరవిస్తున్న వాళ్ళంతా, భయపడి యుద్ధం
మానేశావని భావించి చులకనగా చూస్తారు.
శ్లో. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవా௨హితాః |
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ || 36
తే.గీ. నీ పరాక్రమమును గూర్చి నీదు రిపులు
చెడుగ పల్కుచు నిందింత్రు, చేవలేని
వాని వలె నుండ సాధ్యమా? దీనముగను
,దుఃఖితులమయిపార్థుఁడా! తోచలేదొ?
భావము.
నీ శత్రువులు నీ పరాక్రమాన్ని నిందిస్తూ అనరాని మాటలెన్నో
అంటారు. అంతకుమించిన దుఃఖమేముంది?
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి || 33
తే.గీ. చేయుమీ ధర్మ యుద్ధము చేయకున్న
కులపు ధర్మము వీడిన కూళవగుదు
పేరు ప్రఖ్యాతులన్ బాపు భీరువగుదు,
పాపివగుదు వర్జున నీవు పరువు తీసి.
భావము.
నీవు ఈ ధర్మయుద్ధం చేయకపోతే నీ కులధర్మమూ, పేరు
ప్రఖ్యాతులూ పాడుచేసి పాపం కట్టుకంటావు.
శ్లో. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే௨వ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే || 34
తే.గీ. అంత మాత్రమే కాదయ, వింతగాను,
నీకు కలిగిన యపకీర్తి లోకమందు
చెప్పుకొందురు లోకులు, చింత చేయ
మరణమే కన యపకీర్తి మాన్యులకును., 8
భావము.
అంతే కాకుండా నీ అపకీర్తిని ప్రజలు చిరకాలం చెప్పుకుంటారు.
పరువు ప్రతిష్ఠలున్నవాడికి అపనిందకంటే మరణమే మంచిది.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయో௨న్యత్ క్షత్రియస్య న విద్యతే || 31
తే.గీ. నీదు ధర్మంబు కనియైన నీవుజంకు
వీడఁగాతగు, యుద్ధంబు వీరవృత్తి
క్షత్రియోత్తమ! యిది నీవు కానలేవొ?
ధర్మబద్ధంపు వర్తన తగును నీకు.
భావము.
నీ ధర్మాన్ని తెలుసుకుని అయినా నీవు జంకకు. ఎందుకంటే
క్షత్రియుడికి ధర్మయుద్ధాన్ని మించిన మహాభాగ్యం మరొకటి లేదు.
శ్లో. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖినః క్షత్రియాః పార్థ లబంతే యుద్ధమీదృశమ్ || 32
తే.గీ. తెరచి యున్న స్వర్గ ద్వార మరయ యుద్ధ
రంగము లభియించెను నీకు బెంగదేల?
పుణ్యఫలమిదికనగ నపుణ్యులకిల
దొరకబోదని గ్రహియించు దురిత దూర.
భావము.
తెరచివుంచిన స్వర్గద్వారం లాంటి ఈ సంగ్రామం నీకు అప్రయత్నంగా
లభించింది. ఇలాంటి సదవకాశం పుణ్యం చేసుకున్న క్షత్రియులే
పొందగలుగుతారు.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
0
comments
ఓం నమశ్శివాయ.
ఓం శాంతిః.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం
ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ || 29
తే.గీ. అచ్చెరువుగను కను నొకండాత్మనెంచి,
చిత్రముగ బల్కు నొక్కండు చింత చేసి,
వింతగా నొక్క డాత్మను వినుచు నుండు,
నొక్కడున్ దెలియగ నేర డక్కజమిది.
భావము.
ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంకొకడు దీన్ని
గురించి విచిత్రంగా మాట్లాడుతున్నాడు. మరొకడు వింతగా
వింటున్నాడు. అయితే ఈ ఆత్మ స్వరూపస్వభావాలు
తెలుసుకున్న వాడు ఒక్కడూ లేడు.
శ్లో. దేహీ నిత్యమవధ్యో௨యం దేహే సర్వస్య భారత |
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి || 30
తే.గీ. అన్ని దేహంబు లందుండు నాత్మ కరయ
మరణ ముండదు, దీనికై మదిని దలచి
వగచుటెందుల కో పార్థ! ప్రాణులకయి,
వీడుమజ్ణానమును నీవు, వీడు చింత.
భావము.
అన్ని దేహాలలోనూ వుండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల
ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించనక్కరలేదు.
జైహింద్.
0
comments
0
comments
జై శ్రీరామ్.
జై శ్రీమన్నారాయణ.🙏
భక్తిసాధనం వారి కోరికమేరకు నేనిచ్చిన సమస్య.
👇
కర్కటరాశి వీడనని గట్టిగ పట్టును బట్టె సూర్యుడున్.
దీనికి
నా పూరణము.
👇
ఉ. అర్కుఁ డసాదృశంబుగ మహాద్భుత యోగము కూర్ప జాతికిన్
కర్కట రాశి వీడి వెలుగన్ మకరంబున, నేను చత్తునం
చర్క సమాన తేజుఁడు మహాత్ముఁడు భీష్ముఁడు పల్క, .. బాధతో
*కర్కటరాశి వీడనని గట్టిగ పట్టును బట్టె సూర్యుడున్.*
ఇది ☝️ఆ రోజే నేను చేసిన పూరణము..🙏
అమ్మవారు ఇటువంటి సమస్య నా చేత యిప్పించడం గురించి
ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతోందండి.
అపరవ్యాసులయిన బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారు
ఉత్తరాయణం రాక కోసం వేచి ఉన్న సంగతి అమ్మకు తెలియును.
ఆ సూర్యభగవానుడు కూడా వీరు కాలం చేయుట యిష్టము లేక
కర్కట రాశి నుండి మకరమునకు వెళ్ళితే ఇంతటి మహాత్ముఁడు
లోకానికి దూరమవ డానికి కారకుఁడనవుతానని భావించి అక్కడనుండి
కదలకూడదని మొండి చేశాఁడు. ఐనా విధికి తలవంచక తప్పని రవి
కర్కటాన్ని వదిలి మకరానికి చేరక తప్పలేదు.
అపరవ్యాసులయిన శాస్త్రిగారు తనకు అనుకూలమయిన సమయం
వచ్చినదని పరమాత్మలో లీనమయారు.
ఇంతటి భవిష్యత్ ముందుగా మనము గ్రహించ లేకపోవచ్చును గాని
ఆమ్మ పలికించే మాటలు అర్థవంతాలు భావి సూచికలున్నూ.
ఆ విధముగా పలికించిన అమ్మపాదస్మరణకన్న పరమార్థ
మేముంటుందండీ.🙏
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే௨ర్థే న త్వం శోచితుమర్హసి || 2 . 27 ||
కం. పుట్టిన మరణము తప్పదు
పుట్టుట తప్పదు మరణము పొందినచో, నే
జట్టియు మార్చగ లేడిది,
యిట్టుల దుఃఖింపతగ దిదేల నెఱుఁగవో?
భావము.
పుట్టిన వాడికి చావు తప్పదు. చచ్చిన వాడికి పుట్టుక తప్పదు.
తప్పించరాని ఈ విషయంలో తపించనవసరం లేదు.
శ్లో. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. || 2 . 28 ||
కం. పుట్టక పూర్వము తెలియదు
గిట్టిన పిదపను తెలియదు కించిత్తయినన్.
బుట్టిన జీవిని గూర్చి మ
రిట్టుల యీమద్యము కని యేలను చింతల్?
భావము.
జీవులు పుట్టుకకు పూర్వం కాని, మరణానంతరం కాని ఏ రూపంలో
వుంటాయో తెలియదు. మధ్యకాలంలో మాత్రమే కనబడుతాయి.
అర్జునా !అలాంటప్పుడు విచారమెందుకు?
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. అవ్యక్తో௨యమచింత్యో௨యమవికార్యో௨యముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి || 25
తే.గీ. ఇంద్రియములకగోచరమెన్ననాత్మ,
మనసుకందదదవికారి,మదిని యాత్మ
తత్వమెఱుఁగుమునీవిక మదిని గలుగు
చింత వీడుముబాధ్యతావంత కనుము.,
భావము.
ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు.
వికారాలకు గురికాదు. ఈ ఆత్మతత్వం తెలుసుకుని నీవు విచారించడం
మానుకొనుము.
శ్లో. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి || 26 ||
తే.గీ. పార్థ!! దేహంబుతోఁ బాటు వరలుచున్న
యాత్మకున్ జావు పుట్టుక లలరు ననుచు
నీవు భావించుచున్నను, ధీవరేణ్య!
మదిని శోకింపఁ బనిలేదు మృదుల హృదయ!.
భావము.
అర్జునా ! శరీరంతోపాటు ఆత్మకు కూడా సదా చావు పుట్టుక
లుంటాయని భావిస్తున్నప్పటికీ నీవిలా శోకించవలసిన పనిలేదు.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || 23 ||
తే.గీ. అగ్ని కాల్చగ లే దాత్మ నరసి చూడ,
శస్త్రములు చీల్చలేవు ప్రశస్తమయిన
నీరు తడుపంగలే దిక ఘోరమైన
గాలి యెండగాఁ జేయలే దేలొ? కనుమ.
భావము.
ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు; అగ్ని కాల్చలేదు; నీరు
తడుపలేదు; గాలి ఎండబెట్టలేదు.
శ్లో. అచ్ఛేద్యో௨యమదాహ్యో௨యమక్లేద్యో௨శోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణురచలో௨యం సనాతనః || 24 ||
తే.గీ. ఆత్మ ఖండింపఁబడని దీవరసి చూడ,
కాల దగ్నికి, తడవదు కనగ నీటి
కి నిల నెండదు, నిత్యము, వినగ శాశ్వ
తంబ దచలమునయి, సనాతనమెఱుంగ,.
భావము.
ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది; అది
నిత్యం, సర్వవ్యాప్తం, శాశ్వతం, చలనరహితం, సనాతనం.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ || 2 . 21||
తే.గీ. చావుపుట్టుకల్ లేనిదై శాశ్వతమయి
యుండునాత్మయం చెఱిగిన నోపునెవఁడు
చంపగను దాని దానిచేఁ జంపఁజేయ?
పార్థుఁడా! నీ వెఱుఁగవొకొ? పద్ధతినిట.
భావము.
పార్థా ! ఆత్మ నాశనరహితమనీ, చావు పుట్టుకలు లేనిదనీ, శాశ్వత
మైనదనీ తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపుతాడు?
ఎలా చంపిస్తాడు?
శ్లో. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో௨పరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ || 2 . 22||
తే.గీ. ప్రాత చిరిగిన వస్త్రము విడిచిపెట్టి
నూతనంబైన వస్త్రమును తొడుగునటు,
శిధిలదేహంబు వీడుచు జీవుం_డటులె
క్రొత్త దేహంబులో చేరి కుదురుకొనును
భావము.
మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టి క్రొత్తబట్టలు
వేసుకున్నట్లే ఆత్మ కృశించిన శరీరాలను వదలి కొత్త దేహాలు
పొందుతుంది.
జైహింద్.
0
comments
0
comments