గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2018, మంగళవారం

౩వ పద్య పక్షమ్. వృద్ధాప్యం కష్ట సుఖాలు. రచన. చింతా రామ కృష్ణా రావు.

3 comments

జై శ్రీరామ్.
౩వ పద్య పక్షమ్. వృద్ధాప్యం కష్ట సుఖాలు.
రచన. చింతా రామ కృష్ణా రావు.
ఆటవెలది త్రయ గర్భ సీసము.
శ్రీ రమా రమణుఁడ! శేషశాయిగనుండి - చింత చేయ వసలు జీవితాన
మానవునిఁగ బుట్టి మనుజుఁడెంతటి బాధ - లనుభవించుననుచు, కనవు కృష్ణ.
బాల్య యౌవనములు పరుగిడి పోవగా - వృద్ధ దశకుఁ జేర విస్తు గొల్పు
చింతలెల్ల మదిని చీకాకు పరచెడు. - శాంతి మార్గమగుము చాలు కృష్ణ!
.వె. కన్నులుండియు నిను మిన్నకుందురు కనన్, - కంటి చూపు తొలఁగ కలత చెంది,
కన్నతండ్రివగుచు కనులలో నిలువుమా - యనుచు నేడ్తు రపుడు వినుము కృష్ణ!    1.
ఆటవెలది త్రయ గర్భ సీసము.
పిన్న వయసులోన కన్ను గానక, నాడు - చేయరాని పనులు చేసి యుండి,
తనువు మాయు సమయమున నిన్నుఁ దలచినన్ - బాప ఫలితమెటులఁ బాయు కృష్ణ!
వృద్ధ వయసు తానె పిలవకనే వచ్చి - పైనఁ బడుచునుండ బాధపడుచు
బిడ్డలతని బాధ పెడచెవిన్ బెట్టుటన్ - నడ్డి విరిగినట్లు నడచు కృష్ణ!
.వె. దేహమతని మాట తిన్నగా వినకుండ - మూలఁబడుచు నుండ కూలిపోవు.
వృద్ధుఁడపుడు జ్ఞాన వృద్ధుఁడై చింతించి - నీవె దిక్కనునయ. నిజము కృష్ణ!    2.
ఆటవెలది త్రయ గర్భ సీసము.
దాన గుణము వీడి, దాయాదులను వీడి - ధనము నిలువఁ జేసి తనయులకిడ,
వారలతని వీడి పైదేశములనుండ - చూడరంచు వగచుచుండు కృష్ణ!
పుణ్యమొసగు కార్యములు జేయనైతినే, - సన్యసించనయితి ధన్యుఁడనవ                                          
జన్య జనక మర్మజంబగు మూర్ఖతన్ - తప్పు చేసితినని తలఁచు కృష్ణ!
.వె. ప్రగతిఁ గొలుప పద్య పక్షాన నిలనైతి - రచన చేసి కృతిని ప్రబలనైతి
ఇప్పుడేమి చేతు నీశ్వరా యని, వృద్ధు - డేడ్చుచుండి కరము మోడ్చి కృష్ణ!,     3.
శా. మా యానందము కోరి మేము సుతులన్ మానుండి దూరంబుగా
శ్రేయంబిచ్చెడి పాఠశాలలనుచున్ చేర్పించ, వారచ్చటన్
మాయందున్ మమకారమున్ విడిచి సంభావించుటే మానిరే!
మా యీ దుస్థితి హేతువయ్యదె కనన్. మా కర్మ మా దోషమే.     4.
శా. ఈ వృద్ధాశ్రమ జీవితంబు కనఁగా హేయంబు. దౌర్భాగ్యమున్.
జీవంబుండగ పాతిపెట్టుటిది. చూచేవారికిన్ జాలియౌన్.
నావారైన సుతుల్, సుతల్ మనుమలున్ నా వారలున్ కానమిన్
జీవంబున్న శవంబులైతిమనుచున్ జీవింత్రు కృష్ణా! వ్యధన్.      5.

స్వస్తి.
జైహింద్.

8, జనవరి 2018, సోమవారం

౨వ పద్య పక్షమ్. జీవనాధార జలవనరుల సద్వినియోగం. రచన. చింతా రామకృష్ణా రావు

1 comments

జై శ్రీరామ్.
౨వ పద్య పక్షమ్. జీవనాధార జలవనరుల సద్వినియోగం.
రచన. చింతా రామకృష్ణా రావు
ఆటవెలది త్రయ గర్భ సీసము.
శ్రీకరమగు ధాత్రి జీవకోటికి నిత్య - జీవ జలమునిచ్చు, క్షేమమిచ్చు.
యుగ యుగాలుగనిది జగతిని నిత్యమున్ - సాగుననుట కీవె సాక్షి కృష్ణ
కలుషమైన జలము కలుషంబు లెటు పాపు? - కావ వలయు నీటి జీవన గతి
నీరు లేక జగతి నిలుచుటెట్టులు? కాన - నీటి నిలువ పెంచు మేటి కృష్ణ!
.వె. ప్రాణులకిల నీరు ప్రాణవాయువటులే. - నీటి నిలువ భువిని నిలుప వలయు.
సలిల రక్షణమును జరుపకుండిన జల - మంతరించు కద యనంత కృష్ణ!                     1
ఆటవెలది త్రయ గర్భ సీసము.
మానవుల్ జలమును మన్నించి రక్షించు - పూనికఁ గొని చేయఁ బుణ్యమొదవు.
నీరు వ్యర్థ పరచు నీచులు పాపులై - యంతరింత్రుకద యనంత కృష్ణ!
ధనము ఖర్చయినను దానినార్జింపగా - వచ్చు. భువిని నీరు మచ్చుకయిన
మిగులనీక మితికి మించి వెచ్చించిన - మృగ్యమౌన్. గొలుపు పరిణతి కృష్ణ!
.వె. జ్ఞాన మొసగుమయ్య సద్భావనము నిమ్ము - మానవాళినిలను మనఁగనిమ్ము.
నీటి నిలువఁ బెంచు నేర్పరులుగఁ జేయ - నేలతల్లి మెచ్చు నిన్ను కృష్ణ!                        2
ఆటవెలది త్రయ గర్భ సీసము.
బ్రతుకనెంచు జనులు పరమాత్మ సృష్టి యీ - నీరమనుచు దాని పారఁబోయ
వలవ రిలను జలము వర్ధిల్లఁ జేయఁగాఁ - వలచి యింకఁ జేయఁ దలచు కృష్ణ!
పూర్వ కాలమునను భూమి పీల్చుటఁ జేసి - నీటి మయము భూమి నిత్యమపుడు.
రాళ్ళ కట్టడములు వేళ్ళూనుటను చేసి - భూమి పీల్చునెటుల పూజ్య కృష్ణ!
.వె. ఇలకు నింక జలము నింకుడు గోతులన్ - గొలుపుటుత్తమమయ జలలు పెరుగు
సహజ వనరులందు సలిలంబు మృగ్యమౌన్ - కావకున్న దానిఁ గనుము కృష్ణ.!             3
మత్తకోకిల - ద్విపదద్వయ - తరువోజ - గర్భ సీసము.
నీరు జీవన ధార, నిల్పుము నీవు ని - త్యుఁడ! భూమిపై నేర్పుతోడవగను.
పారఁ బోయక కోరువారికి పంచి వ - ర్ధిలఁ జేయుమా! భవ్య తేజమున/ను.
నీరమే రమ. వాడ నేర్పుము నిత్యని - ర్మల చిత్తమున్ నేర్చు రాజిలఁగ/ను
నీరు తక్కువ వాడు నేర్పరి నిల్పుని - త్యము నన్యులన్. నిత్య ధార్మికుఁడు/ను
తే.గీ. నీరు వ్యర్ధము చేసినన్ నిలువదు రమ. - నీరు పొదుపుగా వాడిన నిలుచునామె.        4
భావి జీవన గతికయి జీవ జలలఁ - బెంచు, నీటిని భూమినింకించు కృష్ణ!
సీ. గంగను తలఁ దాల్చె గౌరీశుడే. యట్టి - గంగను చూడరే గౌరవముగ?
నింగిని వీడి మీ ముంగిలికొచ్చు నా - యంగన నింకనీరా పృథివిని ?
పొంగారు భూమిపై నింగినంటెడి యిండ్లు - నిర్మించి నీటిని నిలుపఁ తగునె?
కొంగుబంగారమీ పొంగెడి జలము మీ - ముంగిట నింకించి పొంగరేల?
తే.గీ. నీటికింకుడు గోతులే నెలవు కాన - వాటి నిర్మాణములు చేసి వరలనిండు
భూమి ననువైన నీటితో పూజ్యులార! - గంగ మీ కోరికల్ తీర్చి కాచునిలను.
. జనులకు విన్నవింతునిల జక్కఁగ నీటిని వాడుకొండు మీ
రనవసరంబుగా జలము వ్యర్థము చేయక, నీరు భూమిలో
ఘనముగ నింకునట్టులుగ కట్టడిఁ జేసి చరింపఁ జేయుడీ!
జనులిక నీటి లోటు కనఁ జాలరు వారి మితవ్యయంబునన్.                                      5
 స్వస్తి 
   జైహింద్.

7, జనవరి 2018, ఆదివారం

(ప్రథమ) పద్య పక్షమ్. కార్మిక సంక్షేమమ్. రచన. చింతా రామకృష్ణారావు.

1 comments

శ్రీరస్తు.
(ప్రథమ) పద్య పక్షమ్.  కార్మిక సంక్షేమమ్.
రచన. చింతా రామకృష్ణారావు.

శా. శ్రీలన్ దేల్చ మనోజ్ఞ భారతిని సచ్చీలంబుతోఁ గార్మికుం
డాలోచించి, దురంత కర్మగతి మోహాదుల్ విసర్జించి, తా
నేలున్ యంత్ర కబంద రాక్షసుల, మోహించున్ ప్రమాదంబులన్.
చాలం గల్గెడివారు లేరు తనతోన్ సద్భాష్యమై యొప్పుటన్.   1.
ఆటవెలదిత్రయ గర్భసీసము.
కార్మిక జనపాళి కష్టంబు మరిపించి - గౌరవమును గొల్పు కార్యములను
చేయునటులఁ జేసి చేయూత నీయుమా - నమ్మి కొలుతు నిన్ననంత కృష్ణ.
తగిన వసతి, భుక్తి, ప్రగణిత వైద్యము, - చదువు నేర్ప బడులు సముచితముగ
వారి వారికొఱకు వర్ధిల్ల కల్పించు - భక్తిగ నినుఁ గొల్తు భవ్య కృష్ణ.
.వె. కష్ట జీవులకును కర్మ వీరులకును - కామితములు తీర్చి కరుణఁ జూపు.
పద్య సద్రచనను పటువర్ధనము చేయు - పద్య పక్ష మధుర భావ కృష్ణ.   2.
ఆటవెలదిత్రయ గర్భసీసము.
నీరజాక్ష! యతని భారము కనవేల - నిత్య సంతసమును నిలుప వే?
యతని జీవితమున వెతలు బాపినఁ జాలు. - పద్య పక్షమటుల వరలుఁ గృష్ణ!
జీవితాన సుఖము, భావిపై నాశయు, - కలుగునటులఁ జేసి కనఁగ లేవ?
భావి లేని యతని జీవితమ్మది యెట్లు - వరలునయ్య? కనుమ వరలఁ గృష్ణ.
ఆ.వె. బంధు హితుల తోడఁ  కపక నవ్వుచు - పండుగలను వెలుఁగ నిండు మదిని
చేయువాఁడవనుచు చేయంగ కోరుదు - నిష్టఁ గొలిచి నిన్ బ్రకృష్ట కృష్ణ! !    3.
ఆటవెలదిత్రయ గర్భసీసము.
పద్య పక్షమునను ప్రబలెడి శ్రీకృష్ణ! - కార్మికులకు నీవు కావె రక్ష?
వారి జీవితమును వర్ధిల్లఁ జేయుమా! - భక్త సులభ దివ్య భాగ్య కృష్ణ!
యంత్రరాక్షసులను మంత్ర ముగ్ధులఁ జేసి - నేర్పు మీర ప్రగతి నిత్యమొసఁగు
సాధనమున దేశ సంపద పెంతురా - కార్మికులను నీవె కలవు కృష్ణ!
.వె. కార్మికులను కాచు ఘనులు కర్మాగార - ప్రభువులందు నిలిచి వరలు కృష్ణ!
కార్మికులను బ్రేమఁ గనఁ జేయుమా! వారి - గౌరవమును నిల్పి కాచు కృష్ణ!   4.
బహు ద్వివిధ కంద గీత గర్భ చంపకమాల.
ధర క్షమ వేల్పులై, శ్రమను ధర్మము చేయుచు క్రాలుచుంద్రు ప్రా
గ్వర సుమతుల్ లసత్ క్షమజ వర్గము కార్మిక శక్తి వీవెగా!
వర ప్రముదాస్పదా! వసుధ పై శ్రమఁ గాంచుము. పద్య పక్ష స
ద్భర విమలాత్మలన్ యతుల ధైర్యము నీవ యనంత కృష్ణయా!  5.           స్వస్తి.
జైహింద్.

6, జనవరి 2018, శనివారం

జయప్రకాశ్ నారాయణ్ నగర్.. శ్రీవేంకటేశ్వర స్వామివారి పుష్కర ప్రయుక్త బ్రహ్మోత్సవ ఆహ్వాన శుభపత్రిక.

1 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

5, జనవరి 2018, శుక్రవారం

రసజమా,అభిదా,హానిదా, గర్భ "మధురాక్షరీ"వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్.
రసజమా,అభిదా,హానిదా, గర్భ "మధురాక్షరీ"వృత్తము.
 రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                     

                 మధురాక్షరీవృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.య.ర.స.య.ర.స.లగ.గణములు.
10,19.యక్షరములుయతులు.ప్రాస నీమము గలదు.
పట్టువిడుపులేని!పంతం!ప్రాణహానికి దారితీయున్!పాపమోపును భూతలిన్!
గుట్టొనరని!దేశభాగ్యం!గోనెకంకెల బేరమేర్పన్!గోపనంబులు!మాయమౌ!
నెట్టప్రగతి వెల్గు! తీరున్! నేను!నాదను! నీచనైజం! నీపురోగతి! మార్చునే!
దిట్టజగతి!ధీటు మాయున్!దీనబాంధవు!రక్ష మృగ్యం!తీపిరోజులురావికన్!

1.గర్భగత"మాతృనిందా"-వృత్తము.
బృహతీందము.భ.స.య.గణములు.వృ.సం.95.   .ప్రాసగలదు.
పట్టు విడుపు లేని పంతం
గుట్టొనరని దేశ!భాగ్యం
నెట్ట!ప్రగతివెల్గు తీరున్!
దిట్టజగతి'ధీటు!మాయున్!

2.గర్భగత"రసయా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.123. ప్రాసగలదు.
ప్రాణహానికి!దారితీయున్!
గోనె కంకెల!బేరమేర్పన్!
నేను!నాదను!నీచ నైజం!
దీనబాంధవు!రక్షమృగ్యం

3.గర్భగత"మృదుమానస"-వృత్తము
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91. ప్రాసగలదు.
పాపమోపును!భూతలిన్!
గోపనంబులు!మాయమౌ!
నీ!పురోగతి!మార్చునే!
తీపిరోజులు!రావికన్!

4.గర్భగత"హానినా"-వృత్తము.
ధృతిఛందము.భ.స.య.ర.స.య.గణములు.యతి10.వయక్షరము.
ప్రాసనియమముగలదు.
పట్టువిడుపులేని పంతం!ప్రాణహానికి!దారితీయున్!
గుట్టొనరని!దేశభాగ్యం!గోనెకంకెల బేరమేర్చున్!
నెట్ట!ప్రగతివెల్గు తీరున్!నేను!నాదను!నీచనైజం!
దిట్ట!జగతి ధీటుమాయున్!దీనబాంధవు!రక్షమృగ్యం!

5.గర్భగత"రసాయన"-వృత్తము.
అత్యష్టష్టీఛందము.ర.స.య.ర.స.లగ.గణములు.యతి10.వయక్షరము.
ప్రాసనియమముగలదు.
ప్రాణహానికి!దారితీయున్!పాపమోపును!భూతలిన్!
గోనెకంకెల!బేరమేర్చున్!గోపనంబులు!మాయమౌ!
నేను!నాదను!నీచ నైజం!నీ!పురోగతి!మార్చునే?
దీనబాంధవు!రక్ష !మృగ్యం!తీపిరోజులు!రావికన్!,

6.గర్భగత"-యశశ్వినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము. ర.స.య.ర.స.య.న.జ.గగ.గణములు.
యతులు10,18.అక్షరములు.ప్రాసనీమముగలదు.
ప్రాణహానికిదారితీయున్!పాపమోపును!భూతలిన్పట్టువిడుపులేని పంతమ్!
గోనెకంకెల!బేరమేర్చున్!గోపనంబులు!మాయమౌ!గుట్టొనరని!దేశభాగ్యమ్!
నేను!నాదను!నీచనైజం!నీ పురోగతిమార్చునే!నెట్ట ప్రగతివెల్గు!తీరున్!
దీనబాంధవు రక్షమృగ్యం!తీపిరోజులు!రావికన్!దిట్టజగతి!ధీటు ముయున్!

7.గర్భగత"-పఠిమా"-వృత్తము.
అత్యష్టిఛందము.ర.స.య.న.జ.గగ.గణములు.యతి09.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
పాపమోపును!భూతలిన్!పట్టువిడుపు లేనిపంతమ్!
గోపనంబులు!మాయమౌ!గుట్టొనరని!దేశభాగ్యం!
నీ!పురోగతి!మార్చునే!నెట్ట ప్రగతివెల్గు తీరున్!
తీపిరోజులు!రావికన్!దిట్టజగతి!ధీటు మాయున్!

8.గర్భగత"రసమజా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.న.జ.మ.జ.జ.గగ.గణములు.
యతులు09,18.అక్షరములు.ప్రాసనీమము గలదు.
పాపమోపును!భూతలిన్!పట్టువిడుపు లేని పంతం!ప్రాణహానికి!దారితీయున్!
గోపనంబులుమాయమౌ!గుట్టొనరని దేశభాగ్యం!గోనెకంకెలబేరమేర్చున్!
నీ పురోగతి!మార్చునే?నెట్ట ప్రగతి వెల్గుతీరుం!నేను నాదను నీచ నైజమ్!
తీపిరోజులు రావికన్!దిట్ట జగతి ధీటు మాయున్!దీనబాంధవు!రక్షమృగ్యమ్,


9.గర్భగత"-అభిదా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.భ.స.య.ర.స.లగ.గణములు.
యతులు10,19.అక్షరములు.ప్రాసనీమము గలదు.
ప్రాణహానికి దారి తీయున్!పట్టు విడుపు లేనిపంతం!పాపమోపును!భూతలిన్!
గోనెకంకెలబేరమేర్చున్!గుట్టొనరని దేశభాగ్యం!గోపనంబులు!మాయమౌ!
నేను నాదను నిచనైజం!నెట్ట ప్రగతి వెల్గుతీరున్!నీపురోగతి!మార్చునే?
దీన బాంధవు!రక్ష మృగ్యం!దిట్ట జగతి!ధీటు!మాయున్!తీపిరోజులు!రావికన్!

10.గర్భగత"-హానిదా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.య.ర.స.య.జ.జ.గగ.గణములు.
యతులు10,18.అక్షరములు.ప్రాసనీమము గలదు.
పట్టు విడుపు లేని పంతం!పాపమోపును భూతలిన్!ప్రాణహానికి!దారితీయున్!
గుట్టొనరని దేశ భాగ్యం!గోపనంబులు!మాయమౌ!గోనెకంకెల!బేరమేర్చున్!
నెట్ట ప్రగతి వెల్గు తీరున్!నీ పురోగతి మార్చునే?నేను,నాదను!నీచనైజం!
దిట్ట జగతి!ధీటు మాయున్!తీపిరోజులు!రావికన్!దీనబాంధవు!రక్ష!మృగ్యమ్ 
స్వస్తి.
జైహింద్.

4, జనవరి 2018, గురువారం

రాగరంజిత,భాతిభవ్య,భావజారి,గర్భ "రజనీకర". వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్.
రాగరంజిత,భాతిభవ్య,భావజారి,గర్భ "రజనీకర". వృత్తము.
 రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                    జుత్తాడ.
                      రజనీకరవృత్తము. 
                     ****************
ఉత్కృతిఛందము,ర.జ.న.ర.జ.ర.జ.ర.లగ.గణములు.
యతులు.10,18.అక్షరములు.ప్రాసననీమముగలదు.
పారమార్ధచింత స్థిరము!భాతి భవ్య కీర్తి గాదె?భావజారి గొల్వు నీతినిన్!
సారసంబు శ్రీల వరము!జాతి శాంతి గోరుమయ్య!సావధానమందు!మిత్రమా!
నీరజాక్షు జీరగలవు! నీతినీమ మోడకున్న!నీవరాశి చేర్చు! కాశికిన్
సా, రసంబు నిండునొదవు!జాతసార సౌరులందు?సా వజీరువై వెలుంగుమా!

1.గర్భగత"సాదృశీ"వృత్తము.
బృహతీఛందము.వృ.సం.491.ర.జ.న.గ గణములు.ప్రాస గలదు.
పారమార్ధ చింత స్థిరము
సారసంబు శ్రీల వరము
నీరజాక్షు జీరగలవు
సా,రసంబు నిండు నొదవు!

2.గర్భగత" సమాశ్రీ" వృత్తము.
అనుష్టుప్ఛందము. వృ.సం.171. ర.జ.గల. గణములు. ప్రాస గలదు.
భాతి భవ్య కీర్తి గాదె?
జాతి శాంతి గోరు మయ్య!
నీతి నీమ మోడకున్న!
జాత సార సౌరులందు!

3.గర్భగత" మత్త రజినీ" వృత్తము.
బృహతీఛందము. వృ.సం.171. ర.జ.ర. గణములు. ప్రాస గలదు.
భావజారి గొల్వు నీతినిన్!
సావధానమందు!మిత్రమా!
నీ,వరాశి  జేర్చు! కాశికిన్!
సా వజీరువై! వెలుంగుమా!

4.గర్భగత"రజోనరజ" వత్తము.
అత్యష్టీ ఛందము. ర.జ.న.ర.జ.గల. గణములు.10వ.యక్షరముయతి.
ప్రాస నీమముగలదు.
పారమార్ధ చింత స్థిరము! భాతి భవ్య కీర్తి గాదె?
సారసంబు శ్రీల వరము! జాతి శాంతిగోరుమయ్య!
నీరజాక్షు జీర గలవు! నీతి నీమ మోడకున్న!
సా, రసంబు నిండు నొదవు! జాతసార సౌరు లందు!.

5.గర్భగత"సుగంధీ" వృత్తము.
అత్యష్టీ ఛందము. ర.జ.ర.జ.ర.లగ. గణములు. 11వ.యక్షరముయతి.
ప్రాస నీమముగలదు.
భాతి భవ్య కీర్తి గాదె? భావజారి గొల్వు! నీతినిన్!
జాతి శాంతి గోరు మయ్య! సావధాన మందు! మిత్రమా!
నీతినీమ మోడకున్న! నీ వరాశి జేర్చు!  కాశికిన్!
జాతసార!సౌరులందు? సా వజీరువై వెలుంగుమా!

6.గర్భగత"రజర రజనా" వృత్తము.
ధృతిఛందము. ర.జ.ర.ర.జ.న. గణములు. 10.వ.యక్షరముయతి.
ప్రాస నీమముగలదు.
భావజారి గొల్వునీతినిన్!పారమార్ధ చింత స్థిరము!
సావధానమందు? మిత్రమా!సారసంబు శ్రీల వరము!
నీ వరాశి జేర్చు కాశికిన్!  నీరజాక్షు జీర గలవు!
సా వజీరువై వెలుంగుమా!సా రసంబు నిండునొదవు!

7.గర్భగత"గంధానిల" వృత్తము.
అత్యష్టీ ఛందము. ర.జ.ర.జ.ర.లల. గణములు09.వ.యక్షరము యతి.
ప్రాస నీమము గలదు.
భాతి!భవ్యకీర్తి గాదె? పారమార్ధ చింత స్థిరము!
జాతి శాంతి గోరుమయ్య!  సారసంబు! శ్రీల వరము!
నీతి నీమ మోడకున్న!  నీరజాక్షు జీర గలవు!
జాత సార సౌరు లందు? సా, రసంబు నిండు నొదవు!

8.గర్భగత"రాగ రంజిత" వృత్తము.
ఉత్కృతి ఛందము. ర.జ.ర.జ.ర.య.జ.ర.లల.గణములు.
09,18.యక్షరములు యతులు.ప్రాసగలదు.
భాతి!భవ్యకీర్తిగాదె?భావజారి!గొల్వు!నీతినిన్?పారమార్ధచింత!స్థిరము!
జాతి!శాంతిగోరుమయ్య!సావధానమందు?మిత్రమా!సారసంబు!శ్రీలవరము!
నీతినీమ!మోడకున్న?నీ!వరాశి!జేర్చు!కాశికిన్!నీరజాక్షు!జీరగలవు 
జాతసార సౌరులందు?సా వజీరువై!వెలుంగుమా!సా,రసంబు!నిండు నొదవు!

9.గర్భగత"భాతిభావ్య" వృత్తము.
ఉత్కృతిఛందము. ర.జ.ర.ర.జ.న.ర.జ.గల.గణములు.
10.19..యక్షరములు.యతులు.ప్రాసగలదు
భావజారి!గొల్వు!నీతినిన్!పారమార్ధచింత!స్థిరము!భాతి!భవ్యకీర్తిగాదె?
సావధాన మందు?మిత్రమా!సారసంబు!శ్రీలవరము!జాతిశాంతి!గోరుమయ్య!
నీ వరాశి జేర్చు!కాశికిన్!  నీరజాక్షు! జీర గలవు?నీతినీమ మోడకున్న?
సా,వజీరువై!వెలుంగుమా!సా,రసంబు నిండునొదవు, జాతసార!సౌరులందు?

10.గర్భగత"భావజారి"వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర .జర.స.జ.ర.లగ..గణములు.
09.18.యక్షరములు.యతులు.ప్రాసగలదు.
భాతి!భవ్యకీర్తిగాదె?పారమార్ధచింత! స్థిరము!భావజారి!గొల్వు?నీతినిన్
జాతి!శాంతి గోరుమయ్య!సారసంబు!శ్రీలవరము!సావధానమందు!మిత్రమా!
నీతినీమ !మోడకున్న?నీరజాక్షు!జీరగలవు!నీ! వరాశి జేర్చు  కాశికిన్!
జాతసార!సౌరులందు!సా,రసంబు!నిండునొదవు సా,వజీరువై! వెలుంగుమా!
స్వస్తి.
జైహింద్.

3, జనవరి 2018, బుధవారం

యాచకో లఘుతాం యాతి . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. యాచకో లఘుతాం యాతి | సద్య:శీల గుణాన్విత:
శ్రీపతి ర్వామనో భూత్వా | యాచతే స్మ బలిం పురా.
క. యాచన చులకన చేయును.
యాచనచే వామనుఁడయె హరి బలి యెదుటన్.
యాచనఁ గుణములు మాయును.
యాచించని బ్రతుకు బ్రతుకు.హరినే మించున్.
భావము. ఎంత గుణవంతుడైతేనేమి, యాచించే సరికి తేలిక అయిపోతాడు. సాక్షాత్తు లక్ష్మీ దేవికి మగడై ఉండి కూడా, విష్ణువు రాక్షస రాజైన బలి ముందు వామను(మరిగుజ్జు)డై పోయాడు కదా..
జైహింద్.

2, జనవరి 2018, మంగళవారం

యోజనానాం సహస్రాణి . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
గీ. నడచి పోవుచు యోజనాల్ గడచు చీమ.
నడవకున్ననునడుగైన గడవ లేడు
గరుడుఁడైనను. గమ్యంబునరసి మనము
యత్నమొనరింపసాధ్యమౌననుపమగతి.

జైహింద్.

1, జనవరి 2018, సోమవారం

శ్రీ విళంబి వత్సరమును మన చెంతకు తీసుకు వచ్చు ప్రవృత్తితో వచ్చుచున్న 2018 పరాంగ్ల వత్సరాదికి స్వాగతమ్.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులకు వందన సహస్రములు.
పరమ పూజ్యమయిన 
మనకత్యంత ప్రియతమమైన 
శ్రీ విళంబి వత్సరమును  
మన చెంతకు తీసుకు వచ్చు 
ప్రవృత్తితో వచ్చుచున్న 
2018 పరాంగ్ల వత్సరాదిని స్వాగతించుచు, 
ఉగాది శుభాగమనానికై ఎదురు చూచుచున్న 
మీ అందరికీ నా శుభాకాంక్షలు.

చ. ఘనతరమౌ విళంబిని ప్రకాశముగా భువిపైకి చేర్చగా
వినయముతోడ వచ్చి మురిపించగనున్న పరాంగ్ల వత్సరా!
గుణ గణముల్ శుభాస్పద ముకుంద ప్రియమ్ముగ నుండ రమ్ము. స
ద్గుణుగ విళంబి పోలి సుగతుల్ గను మాకడ. స్వాగతమ్మిదే.
జైహింద్.