జైశ్రీరామ్.
ఆర్యులకు వందన సహస్రములు.
పరమ పూజ్యమయిన
మనకత్యంత ప్రియతమమైన
శ్రీ విళంబి వత్సరమును
మన చెంతకు తీసుకు వచ్చు
ప్రవృత్తితో వచ్చుచున్న
2018 పరాంగ్ల వత్సరాదిని స్వాగతించుచు,
ఉగాది శుభాగమనానికై ఎదురు చూచుచున్న
మీ అందరికీ నా శుభాకాంక్షలు.
చ. ఘనతరమౌ విళంబిని ప్రకాశముగా భువిపైకి చేర్చగా
వినయముతోడ వచ్చి మురిపించగనున్న పరాంగ్ల వత్సరా!
గుణ గణముల్ శుభాస్పద ముకుంద ప్రియమ్ముగ నుండ రమ్ము. స
ద్గుణుగ విళంబి పోలి సుగతుల్ గను మాకడ. స్వాగతమ్మిదే.
జైహింద్.
2 comments:
నమస్కారములు
సోదర సోదరీమణు లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
గురుదేవులకు మరియు బ్లాగు వీక్షకులకు
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.