గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జులై 2025, గురువారం

బీజ ప్రాశస్త్యము........శ్రీ వల్లభ,

 జైశ్రీరామ్.

1,ఉ;-స్థావర జంగమాదుల!విశాల జగత్తుల!నేలి బ్రోవు,వి
       శ్వావసు డీవ గావ సుర సార మహోత్తమ!శ్రీకరాంబుధీ!
       ధీ వర శేష సాయి!వరతేజ!విరించి మహోజ్వల సృష్టికిన్!
      తావక బీజ జీవ మిడి!ధారుణి భూత జగంబు గూర్చితే!

2.ఉ:-బీజము వోజమై!జగతి విస్తృత !కీర్తి ప్రకీర్తి ధామమై!
        తేజము నింప నిండు గనె!ధీరత మార్భటి భావ బంధురిన్!
        భూజ వరాశి పెంపిడుచు!పుష్కళ బంగరు!సేధ్య సంస్కృతిన్!
       రాజిత పోషణం జెలగ!రామమునై విలసిల్లె లోకమున్!

3.ఉ:-జీవ కణంబు బీజ మయి!జీవన సృష్టి రహస్యమై జనెన్!
        భూవర భూత ప్రాపకత!భుక్తికి ముక్తికి జీవ రక్తికిన్!
        తావయి శక్తి బీజముల!తత్పరముం దలపించు గాన,స
       ద్భావన సర్వ శ్రేయమును!వాంఛిలు మెల్లెడ ముక్తి గోరుచున్!

4.కం:-బీజం బణు మిశ్రిత మయి
         తేజం బణు బలం బదెంచ!దివ్యం!దీప్తిదమ్!
        భూ జాత్వ హరం సర్వమ్!
        శ్రీ జంగమ ధాత్రి  పోష!!శ్రీదంబొదవున్!

5.కం:-ఇందన మణు శక్తులు భువి
        ఛందన సుర గంధ మొనర!సౌరులు జిమ్మున్!
        బంధుర ద్వేషపు చర్యలు
        గంథమునే!చెరచి వైచు!కాన రదేమో?

     గంథము=భూమి,చారణ=చరించుట(మసలుకొనుట).

6.ఉ:-జన్మము దైవ మీయగను!చక్కగ జీవన యాత్ర మాని!శ్రీ
        మన్మహ లక్ష్మి పెంపనుచు!మత్సర మూని వినాశ కారులై!
       మున్మును జీవ దూరులవ!ముచ్చటి గాదిల!భూత ధాత్రినిన్!
      సన్మతి జీవ కారుణత!సాగను శర్వుడు!నిచ్ఛ మెచ్చడే?

7.ఉ:-జాతుల భేదమే!జగతి సర్వ వినాశక కారకంబులై!
        చేతన శూన్యులం వరల జేసి విశేషత రూపు మాపి,సం
       పాతపు ప్రజ్ఞ దోర్బలము!భారత ఖ్యాతిని కాననీకిలన్!
       పాతెను పాతళంబునను!పట్టని దిట్ట తనంబు ధీటునన్!

8,ఉ:-గోటిని మీటి జ్ఞానమును!కొంపలు గూల్చెడి కూల కర్ములున్!
        తేటున దేలి యాడు నప శీలురు!భూతలి నిండి యుండగా
       పేటలు కోటలుం వెడలు!పెన్నిథు లెల్లను చెల్లి పోవు ,నిం
       కేటికి జీవనంబని!వికీర్ణత లోకము చీకటౌ!గదే?

9,ఉ;-చీకటి కావలం నిలుచు!చిన్మయ మానసు డాది విష్ణుడే!
        ప్రాకట లీల పోషణకు పట్టుగ జన్మము నెత్తి దోషులన్!
        భీకర కార్ముకంబులను!వీడక నాశన మేర్చి ధర్మమున్!
       శ్రీకర మేర్చి బ్రోచు నట!జీవన సత్యము నేర్పి లోకమున్!

జైహిద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.