జైశ్రీరామ్.
నెమ్మనాన అమ్మ కీర్తిన్!నింపి పెంపు ధర్మ నిరతిన్!నీదు ఖ్యాతి విశ్వ వ్యాప్తమౌ!
వమ్ము జేయ తప్పిదంబౌ!వంపు గూర్ప దోష మరయున్!బాధ లేర్ప బాయు సౌఖ్యముల్!
చిమ్మ చీకటౌను లోకమ్!చెంప పెట్టు గాదె! గనగన్!ఛీదరింతు రెల్ల వారలున్!
తెమ్ము పేరు!నీమ నిష్టన్!దింపు సేయమాయు!ప్రగతే!ధీ దితుల్చెడంగ నీకుమా!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందము నందలి,ఉత్కృతి"-
ఛందము లోనిది,ప్రాస న్యమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
1.గర్భ గత"-నెమ్మనాన"-వృత్తము,
నెమ్మనాన అమ్మ కీర్తిన్!
వమ్ము జేయ తప్పిదంబౌ!
చిమ్మ చీకటౌను లోకమ్!
తెమ్ము పేరు నీమ నిష్టన్!
అభిజ్ఞా ఛందము నందలి "-అనుష్టుప్ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8,అక్షరము లుండును,
2,గర్భగత"-వమ్ము జేయు"-వృత్తము,
నింపి పెంపు ధర్మ నిరతిన్!
వంపు గూర్ప దోష మరయున్!
చెంప పెట్టు గాదె!కనగన్!
దింపు సేయ మారు ప్రగతే!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి ఛందము లోనిది
ప్రాస నియమము కలదు,పాదమునకు9,అక్షరము లుండును,
3.గర్భగత"చిమ్మచీకటి"-వృత్తము,
నీదు ఖ్యాతి విశ్వ వ్యాప్తమౌ!
బాధ లేర్ప బాయు సౌఖ్యముల్!
ఛీదరింతు రెల్లవారలున్!
ధీ దితుల్చెడంగ నీకుమా!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,9,అక్షరములుండును,
4.గర్భగత"-పేరొనరు"-వృత్తము,
నెమ్మనాన అమ్మ కీర్తిన్!నింపి పెంపు ధర్మ నిరతిన్!
వమ్ము జేయ తప్పిదంబౌ!వంపు గూర్ప దోష మరయున్!
చిమ్మచీకటౌను లోకమ్!చెంప పెట్టు.గాదె?కనగన్!
తెమ్ము పేరు నీమ నిష్ట!దింపు సేయ మారు ప్రగతే!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,17,అక్షరము లుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"-చీకటి"-వృత్తము,
నింపి పెంపు ధర్మ నిరతిన్!నీదు ఖ్యాతి విశ్వ వ్యాప్తమౌ!
వంపు గూర్ప ధర్మ మరయున్!బాధ లేర్ప బాయు సౌఖ్యముల్!
చెంప పెట్టు గాదె?కనగన్!ఛీదరింతు రెల్ల వారలున్!
దింపు సేయ మారు ప్రగతే!ధీ దితుల్చెడంగ నీకుమా!
అణిమా ఛందము లోని"ధృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"-దోషతా"-వృత్తము,
నెమ్మనాన అమ్మ కీర్తిన్!నీదు ఖ్యాతి విశ్వ వ్యాప్తమౌ!
వమ్ము సేయ తప్పిదంబౌ!బాధ లేర్ప బాయు సౌఖ్యముల్!
చిమ్మ చీకటౌను లోకమ్!ఛీదరింతు రెల్ల వారలున్
తెమ్ము పేరు నీమ నిష్టన్!ధీదితు ల్చెడంగ నీకుమా!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,17,అక్షరము లుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును,
7.గర్భగత"-కీర్తి మాయు"-వృత్తము,
నీదు ఖ్యాతి విశ్వ వ్యాప్తమౌ!నెమ్మనాన అమ్మ కీర్తిన్!
బాధ లేర్ప బాయు సౌఖ్యముల్!వమ్ము సేయ తప్పిదంబౌ!
ఛీదరింతు రెల్ల వారలున్!చిమ్మ చీకటౌను లోకమ్!
ధీ దితుల్చెడంగ నీకుమా!తెమ్ము పేరు నీమ నిష్టన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
8.గర్భగత"-అవమానం"-వృత్తము,
నింపి పెంపు ధర్మ నిరతిన్!నీదు ఖ్యాతి విశ్వ వ్యాప్తమౌ!
వంపు గూర్ప ధర్మ మరయున్!బాధ లేర్ప బాయు సౌఖ్యముల్!
చెంప పెట్టు కాదె?కనగన్!ఛీదరింతు రెల్ల వారలున్!
దింపు సేయ మారు ప్రగతే!ధీ దితుల్చెడంగ నీకుమా!
అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,18,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"-వ్యాప్తము"-వృత్తము,
నీదు ఖ్యాతి విశ్వ వ్యాప్తమౌ!నింపి పెంపు ధర్మ నిరతిన్!
బాధ లేర్ప బాయు సౌఖ్యముల్!వంపు గూర్ప ధర్మ మరయున్!
ఛీదరింతు రెల్ల వారలున్!చెంప పెట్టు గాదె?కాదె?కనగన్!
ధీదితుల్!చెడంగ నీకుమా!దింపు సేయ మారు ప్రగతే!
అణిమా ఛందము నందలి"ధృతి ;ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,18,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
10,గర్భగత"-ధర్మ నిరతి"-వృత్తము,
నింపి పెంపు ధర్మ నిరతిన్!నెమ్మనాన అమ్మ కీర్తిన్!నీదు ఖ్యాతి విశ్వ వ్యాప్తమౌ!
వంపు గూర్ప ధర్మ మరయున్!వమ్ము సేయ తప్పిదంబౌ!బాధలేర్ప బాయు సౌఖ్యములి!
చెంప పెట్టు కాదె?కనగన్!చిమ్మ చీకటౌను లోకమ్!ఛీదరింతు రెల్ల వారలున్!
దింపు సేయ మారు ప్రగతే!తెమ్ము పేరు నీమ నిష్టన్!ధీ దితుల్చెడంగ నీకుమా!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదుపాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
11.గర్భగత"-దోషమగు"-వృత్తము,
నెమ్మనాన అమ్మ కీర్తిన్!నీదు ఖ్యాతి విశ్వ వ్యాప్తమౌ!నింపి పెంపు ధర్మ నిరతిన్!
వమ్ము సేయ తప్పిదంబౌ!బాధ లేర్ప బాయు సౌఖ్యముల్!వంపు గూర్ప ధర్మ మరయున్!
చిమ్మ చీకటౌను లోకమ్!ఛీదరింతు రెల్ల వారలున్!చెంప పెట్టు కాదె?కనగన్!
తెమ్ము పేరు నీమ నిష్టన్!ధీ దెతుల్చెడంగ నీకుమా!దింపు సేయ మారు ప్రగతే!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
12.గర్భగత:-జాతి నిల్పు"-వృత్తము,
నీదు ఖ్యాతి విశ్వ వ్యాప్తమౌ!నెమ్మనాన అమ్మ కీర్తిన్!నింపి పెంపు ధర్మ నిరతిన్!
బాధ లేర్ప బాయు సౌఖ్యముల్!వమ్ము సేయ తప్పి దంబౌ!వంపు గూర్ప ధర్మ మరయున్!
ఛీదరింతు రెల్ల వారలున్!చిమ్మ చీకటౌను లోకమ్!చెంప పెట్టు కాదె?కనగన్!
ధీ దితుల్వెడంగ నీకుమా!తెమ్ము పేరు నీమ నిష్టన్!దింపు సేయ మారు ప్రగతే!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
13.గర్భగత"-ఛీదరించు"-వృత్తము,
నింపి పెంపు ధర్మ నిరతిన్!నీదు ఖ్యాతి విశ్వ వ్యాప్తమౌ!నెమ్మనాన అమ్మ కీర్తిన్!
వంపు గూర్ప ధర్మ మరయున్!బాధ లేర్ప బాయు సౌఖ్యముల్!వమ్ము సేయ తప్పిదంబౌ!
చెంప పెట్టు కాదె?కనగన్!ఛీదరింతు రెల్ల వారలున్!చిమ్మ చీకటౌను లోకమ్!
దింపు సేయ మారు ప్రగతే!ధీ దితుల్వెడంగ నీకుమా!తెమ్ము పేరు నీమ నిష్టన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
14,గర్భగత"-ధీ దితుల్"-వృత్తము,
నీదు ఖ్యాతి విశ్వ వ్యాప్తమౌ!నింపి పెంపు ధర్మ నిరతిన్!నెమ్మనాన అమ్మ కీర్తిన్!
బాధ లేర్ప బాయు సౌఖ్యముల్!వంపు గూర్ప ధర్మ మరయున్!వమ్ము సేయ తప్పిదంబౌ!
ఛీదరింతు రెల్ల వారలున్!చెంప పెట్టు కాదె?కనగన్!చిమ్మ చీకటౌను లోకమ్!
ధీ దితుల్వెడంగ నీకుమా!దింపు సీయ మారు ప్రగతే!తెమ్ము పేరు నీమ నిష్టన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును.
రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.