గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జులై 2025, శుక్రవారం

నేను ఇదివరకు చేసిన అవధానము చూచినవారు అందచేసిన వారి అభిప్రాయములు.

జైశ్రీరామ్.




 vijaya chinta.vijaya123@gmail.com
25 ఏప్రి, శని 6:50 PM (13 గంటల క్రితం)
[24/04, 9:34 pm] Rama Krishna Rao: గాయత్రి ఉప్మాక.👇🏼
మాన్యులు ,చిత్రకవితాసామ్రాట్టులు ,
మాఅన్నయ్యగారు ,శ్రీచింతారామకృష్ణ గారు ,అవధానివర్యులకు ,ప్రణతులతో ,
తే.గీ.ఆశుపద్యధార ,నలవోకగమనమ్ము
చిత్రకవితలల్లు ,శేముషిధుని ,
నిత్యకవనసేద్య ,నిష్ఠాగరిష్టులు
అన్నగారి.,ప్రతిభకంజలింతు.
[24/04, 9:35 pm] Rama Krishna Rao: *శ్రీ శంకరయ్య గురువు గారు తలపెట్టిన అవధాన సప్తాహంలో ఇవాళ విజయ దుంధుభి మ్రోగించిన అవధాన వరేణ్యులు   శ్రీ చింతా రామకృష్ణారావుగారికి శుభాభినందనలతో..*

*చింతావారల పద్యధార సుమనోజ్ఞేయమ్ముగాసాగె! తా*
*చింతాకంతయునాగకుండె!  ప్రజ నిశ్చేష్టమ్ముగానిల్చెనీ*
*భ్రాంతిన్జెందెడుశబ్దశక్తి వరలెన్! పద్యాల మాధుర్య మీ*
*పొంతన్జాలుగ వెల్లువెత్త మదిలో పొంగారె నానందమే!!*
  - అవుసుల భానుప్రకాశ్.
[24/04, 9:36 pm] Rama Krishna Rao: రామకృష్ణావధానిని ప్రస్తుతింతు
అలవోకగ నవధానము
సలలితముగ పూర్తి చేసి సహభాషనగా 
గెలిచి గెలిపించితిరి ప్ర
శ్నలనడిగినవారి నితర సామూహికులన్.
డా. జంధ్యాల సుబ్బలక్ష్మి
[24/04, 9:37 pm] Rama Krishna Rao: ఆన్ లైన్ ఆవ ధానం లో పాల్గొన్న అవధానులు శ్రీ చింతా రామ కృష్ణ గారికి, పృచ్ఛక వర్గానికి 
అభినందన మందార మాల. 
🌺🙏🌺👌
యాడికి శివ ప్రభాకర రెడ్డి.
[24/04, 9:38 pm] Rama Krishna Rao: వంతుల్ వేయుచువచ్చి భావతతి సంభావించగాడెందమున్

గంతుల్వైచెను పద్యమాలికలు వాగ్ధారాప్రవాహామ్ములన్

వింతల్వోయెరసజ్ఞమండలి
భవద్విజ్ఞానదీవ్యత్ప్రభన్

చింతావంశకులాబ్దిసోమ!
కవితాచింతామణీ !
సన్నుతుల్.

.....లోకాజగన్నాథశాస్త్రీ...🌹
[24/04, 9:43 pm] Rama Krishna Rao: 🙏🙏ఆరవ అవధానాన్ని గావించిన మాన్యులు శ్రీ చింతా రామకృష్ణారావు గారికి, సంచాలకులు శ్రీ కంది శంకరయ్య గారికి మరియు
పృచ్ఛక మహాశయులకు అభినందనములు!!
👏👍👏👍
వెల్ధండి సత్యనారాయణగారు.
[24/04, 9:44 pm] Rama Krishna Rao: వంతుల్ వేయుచువచ్చి భావతతి సంభావించగాడెందమున్

గంతుల్వైచెను పద్యమాలికలు వాగ్ధారాప్రవాహామ్ములన్

వింతల్వోయెరసజ్ఞమండలి
భవద్విజ్ఞానదీవ్యత్ప్రభన్

చింతావంశకులాబ్దిసోమ!
కవితాచింతామణీ !
సన్నుతుల్.

.....లోకాజగన్నాథశాస్త్రీ...🌹
[24/04, 9:46 pm] Rama Krishna Rao: అవధానం విజయవంతంగా పూర్తిచేసిన విద్వత్కవివరేణ్యులు శ్రీచింతా రామకృష్ణరావు గారికి హృదయపూర్వక శుభాభినందనములతో....

చింతయొకింత లేక విరచించితిరయ్య వధాన పద్యమా
ద్యంతము హృద్యమై వెలిగెనధ్బుత రీతి కవిత్వ వైఖరుల్ 
సుంతయు ధార తప్పదు యశోవిభవంబు త్వదీయ శైలి ధీ
మంతులు మీకునిచ్చెద నమస్కృతి లక్షలు నమ్ర బుద్ధినై.  

 
మీయవధానమున్ గనుట మేదిని నాదొక పూర్వ పుణ్యమై 
హాయిని గూర్చె చిత్తమున నద్భుత భవ్య పదాళికూర్పునన్  
శ్రేయముగూర్ప సల్పితె విశేషవధానము నేఁడు "వేలకున్ 
వేయి" నమస్కృతుల్నిడెద ప్రేమగ గైకొను సత్కవీశ్వరా!
పీ.సంపత్ కుమార్.
[24/04, 9:47 pm] Rama Krishna Rao: అన్ని యంశములను నవలీల జెప్పగ
సుధలు గురిసె నయ్య సుకవి వర్య
నవరసంబు లొలికె నవధాన మునరయ
రసిక రామ కృష్ణరావు గారు.
పి.మోహన్ రెడ్డి.
[24/04, 9:48 pm] Rama Krishna Rao: ఆరవ అవధానాన్ని నిర్వహించిన శ్రీ చింతా రామకృష్ణారావు గారికి, సంచాలకులు శ్రీ కంది శంకరయ్య గారికి మరియు
పృచ్ఛక మహాశయులకు అభినందన వందనములు!!
రయమున సాగిన నేటి అవధానం ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించింది.
👏👍👏👍👏👍👏👍
పిన్నక నాగేశ్వరరావు.
[24/04, 9:49 pm] Rama Krishna Rao: అన్ని యంశములను నవలీల జెప్పగ
సుధలు గురిసె నయ్య సుకవి వర్య
ముదము గూర్చితివిల నవధాన మునరయంగ
రసిక రామ కృష్ణరావు గారు.
పి.మోహన్ రెడ్డి.
[24/04, 9:50 pm] Rama Krishna Rao: ఆరవరోజు అవధానాన్ని నిర్వహించిన శ్రీ చింతా రామకృష్ణరావు గారికి,సంచాలకులకు,పృచ్ఛకోత్తములకు అభినందన వందనములు.🙏🙏🙏
వీ.భారతి.
[24/04, 9:51 pm] Rama Krishna Rao: నేడుఅవధానముచేసిఅందరి మన్ననలు పొందిన శ్రీ చింతారామకృష్ణారావుగారు,గారికి ,గురువు గారు కంది వారికి
పృచ్ఛకాళికి అభినందనలు.

చింతావారికి అభినందనలతో
**************************

1
*అంతా మాయగ సాగెను*
*చింతా వారల వధాన శీఘ్రతఁగన శ్రీ*
*కాంతుడె యెదని ల్చుచునా*
*సాంతము నివ్విధి గనడిపె జనములు మెచ్చన్*

2
 *మద్యము వలెమత్తునొసగె*
*హృద్యములైపద్యరాశి హృదయ ముదోచెన్*
*సద్యశ మునుగొన్నసుకవీ!*
*సద్యః స్ఫురణంబునొసగి శారద గాచెన్*
**********((****************
తురిమెళ్ళ రాధాకృష్ణ మూర్తి
శాంతి నగర్
*******************(((*
[24/04, 9:53 pm] Rama Krishna Rao: 🙏

చింతారామకవీంద్రచిత్రకవితాక్షిప్రోక్తిధారాసుధీ
మంతంబై విలసిల్లె నవ్యకృతమై మాన్యావధానమ్మునై
వింతై ధారణధోరణీఘటితనిర్భిన్నస్ఫురద్రమ్యవి
క్రాంతంబై యెదలోన వెల్లివిరిసెన్ కావ్యప్రభాభాసమై.

కంజర్ల రామాచార్య
వనస్థలిపురము
[24/04, 9:55 pm] Rama Krishna Rao: మాన్యులు చిత్రకవులు.. బంధకవులు.. అవధానివరేణ్యులు.. ఆత్మీయమిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు గారికి అభినందనచందనమ్ 💐💐👏👏🙏🙏

బంతుల్ జాజులు బొండుమల్లెలనగన్ పద్యాలు శోభిల్లె   శ్రీ....
మంతంబైన వధానమందు! గనగా మాధ్వీరసంబూరె ! ధీ... 
మంతా! మీకు శుభాభినందనలసామాన్యా! విలోకించి
ది... 
గ్దంతుల్ మెచ్చిరి! వాణి మెచ్చినది! చింతా రామకృష్ణాహ్వయా.!! 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
[24/04, 9:56 pm] Rama Krishna Rao: చిత్ర కవితా సామ్రాట్ శ్రీ చంతారామకృష్ణారావు గారికి
అభినందనలతో
కం:
అవధానము కడుమోదము
నవరసముల పద్య సొగసు 
                       నర్తన జేసెన్!
కవిలోకము సంబరపడ
రవళించెను రామకృష్ణ 
                     రావవధానమ్!

              డా.మహ్మద్ షరీఫ్
[24/04, 9:57 pm] Rama Krishna Rao: చింతలులేకసాగినది, చిన్మయరూపుడు రామకృష్ణుడై
వింతగజూడకెవ్వరును ,విద్యనుజూపెను మేలుమేలనన్
సుంతయు జంకలేదుగద ,శూన్యముజూడడుయెప్పుడేనియున్
పంతముబట్టెనాప్రతిభ,ప్రాభవమందగజేయనీతనిన్ 
***********************
రావెలపురుషోత్తమరావు
[24/04, 10:00 pm] Rama Krishna Rao: చింతిలి రామా! కృష్ణా!
పంతము తోడన్ వధాన వాసంతము నెం
తెంతో వర్ధిల జేసిరి
సంతస మాయెను కవీశ సన్నుతి గొనుమా

తిరుక్కోవళ్ళూరు శ్రీ హర్ష
[24/04, 10:02 pm] Rama Krishna Rao: చింతలులేకసాగినది, చిన్మయరూపుడు రామకృష్ణుడై
వింతగజూడకెవ్వరును ,విద్యనుజూపెను మేలుమేలనన్
సుంతయు జంకలేదుగద ,శూన్యముజూడడుయెప్పుడేనియున్
పంతముబట్టెనాప్రతిభ,ప్రాభవమందగజేయనీతనిన్ 
***********************
రావెలపురుషోత్తమరావు
[24/04, 10:04 pm] Rama Krishna Rao: ఛత్రపతిశివాజీ పై చెప్పిన పద్యం అద్భుతం.చిత్రకవి సమ్రాట్టులకు శిరసు వంచి నమస్కరించుచున్నాను.నిజంగా భరతమాత అతణ్ణి తలచుకున్నపుడల్లా మీ పద్యం చదువుకుంటుందంటే అతిశయోక్తి ఎంతమాత్రము లేదు.💐👌🙏🙏🙏
[24/04, 10:04 pm] Rama Krishna Rao: పీ.లక్ష్మణ్☝🏽
[24/04, 10:05 pm] Rama Krishna Rao: మృదుపదముల రవళించుచు
పదునుగ తన భాషపటిమ ప్రవహించంగా
మధురముగనుముగియించెను
సదమలమౌ కవులుకూడ సన్నుతిజేయన్
++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
[24/04, 10:06 pm] Rama Krishna Rao: కం.
పంతముతో నవధానము
నెంతో నేర్పుగనుజేసె నింపునుకూర్చెన్ 
వింతగ నతి వేగముతో
చింతార్యుడురామకృష్ణ!చేకొనె నుతులన్
[24/04, 10:06 pm] Rama Krishna Rao: ☝🏽జీ.గోవర్ధన్.
[24/04, 10:07 pm] Rama Krishna Rao: కరువేయాయెనుసాహితీప్రభలు యీ ఖండాంతరక్షోభతో
చిరుదివ్వెల్ వెలిగించుతీరుగనగా శ్రీచంద్రమౌళీశ్వరా 
పరువేనిల్పగ వచ్చిచేరెనిత డే ప్రారబ్ధమే పుణ్యమై
తరమా యింతటి ధన్యతన్ గనెడు చైతన్యమ్ము శోభిల్లగన్
++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
[24/04, 10:08 pm] Rama Krishna Rao: చింతవంశాబ్ధి చంద్రమా పంతులయ్య
చిత్రకవిత నిర్మాణ సుశ్రీ విలాస
లలిత లావణ్య యవధాని రామకృష్ణ
యంజలించితి మీకిదె రంజనముగ
అంజయ్యగౌడ్🙏🙏🙏🙏🙏
[24/04, 10:08 pm] Rama Krishna Rao: శ్రీ గురుభ్యోనమ:...రామక్రిష్ణ గారి అవధానం. గురువు గారి సంచాలకత్వం. మరియు ప్రుఛ్చకచక్రవర్తులే అత్యంత అద్భుతమైన అవధనప్రక్రియ..ఆద్యంతం మాకు అద్రుష్టం.. కరోన లాక్డవున్ వేళ గురువుల సన్నిధిలో వున్న అనుభూతి.🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
[24/04, 10:10 pm] Rama Krishna Rao: చిత్రముగ పద్యములు జెప్పి చిత్రములకు 
దత్తపది సమస్యాదుల ధారతోడ
భావములు చిందె సుధ జారె 
రమ్యమయ్యెవధానము రామ కృష్ణ.
పి.మోహన్ రెడ్డి.
[24/04, 10:10 pm] Rama Krishna Rao: చిత్రముగ పద్యములు జెప్పి చిత్రములకు 
దత్తపది సమస్యాదుల ధారతోడ
భావములు చిందె సుధ జారె 
రమ్యమయ్యెవధానము రామ కృష్ణ.
పి.మోహన్ రెడ్డి.
[24/04, 10:12 pm] Rama Krishna Rao: ఏ పగిది రామకృష్ణుం
డే పరగును సదవధాన మిత్తరి యనుచున్
కోపముతో పసిగెట్టెను
పాపాత్ముడు. విట్టుబాబు పక్కున నవ్వెన్... (హాస్యానికి)
[24/04, 10:12 pm] Rama Krishna Rao: 👆🏽అప్రస్తుతానికి నా పూరణ
[24/04, 10:16 pm] Rama Krishna Rao: చిత్రముగ పద్యములుజెప్పి చిత్రములకు
భావములుచిందె, సుధ జారె భళివధాని
దత్తపదిసమస్యాదుల ధార తోడ
రమ్యమయ్యెవధానము రామ కృష్ణ.
పి.మోహన్ రెడ్డి.
[24/04, 10:17 pm] Rama Krishna Rao: ఆరవ అవధానాన్ని నిర్వహించిన శ్రీ చింతా రామకృష్ణారావు గారికి, సంచాలకులు శ్రీ కంది శంకరయ్య గారికి మరియు
పృచ్ఛక మహాశయులకు అభినందన వందనములు!!
రయమున సాగిన నేటి అవధానం ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించింది.
👏👍👏👍👏👍👏👍
[24/04, 10:19 pm] Rama Krishna Rao: .             *మెచ్చుకోలు*

చింతావారు! వధానము
చింతయె లేకుండ సాగె చిత్రముగ నహో!
ఎంతయినన్ గృతకృత్యులు..
దొంతరగా పద్యము లవి దొరలును మీకున్

    ~డా.వెలుదండ సత్యనారాయణ 
                   24.4.20
[24/04, 10:23 pm] Rama Krishna Rao: ధారగ పద్యాల్ కొబ్బరి
నీరై స్వారస్య గుణము నిండుగ
నుండెన్
ధీరా దాహము తీరెను
భారంబగు నెండవేళ బాసెనుచింతల్
డా ,వజ్జలరంగాచార్య
[24/04, 10:24 pm] Rama Krishna Rao: సరసాత్ముండవు నూత్న చిత్రకవితా సామ్రాజ్యనాథుండవీ
వరయంగా ఘన శంకరాభరణ జాలాష్టావధానమ్ములో
స్మరణీయంబగు ప్రజ్ఞ చూపితివి భాషాయోష తోడుండ, మా
తరమా నిన్గొనియాడ పూజ్యతమ! చింతా రామ కృష్ణాహ్వయా!

సీ వీ కుమార్
[24/04, 10:24 pm] Rama Krishna Rao: *నేడు మన శంకరాభరణం వాట్సాప్ సమూహమునందున బ్రహ్మశ్రీ చింతారామకృష్ణారావు గారి అష్టావధానము , బ్రహ్మశ్రీ కందిశంకరయ్య గారి సంచాలకుల ఆధ్వర్యంలో శుభప్రదమైనందున వారిరువురిని ప్రశంసిస్తూ వ్రాసిన పద్యాలు!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
*01*

*తే.గీ.*

*గర్భకవనము జెప్పెడి గరిమగలిగి*
*మెప్పులెన్నియొవడసిన గొప్పవారు*
*నొక్క దినమున శతకంబు లెక్కతోడ*
*వ్రాసి భాషామతల్లికి వరముగనిడె!!!*

*02*

*తేటగీతిమాలిక*

*లక్ష్మినరసింహస్వామిని లక్షణముగ*
*స్తుతిని గావించి శతకమ్ము సురులమెచ్చ*
*నూటపదియెన్మిది రకాల బాటజూపి*
*వివిధ ఛందస్సులందున వెలవరించె!!!*
*నేడు నవధానమును జేయ వేడుకయ్యె!!!*


*03*

*తే.గీ.*

*సత్యధర్మమ్ము పాటించు సతముతాను*
*కందిశంకరయ్య గురువు కరుణశీలి*
*వారి యాధ్వర్యమున సాగ వాణిమురిసె*
*నేటి యవధానమును జూచి నిజముసుమ్మి!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
*గొల్లపల్లిరఘురామశర్మ*
[24/04, 10:24 pm] Rama Krishna Rao: చిత్రకవితారచనావిదగ్ధులు సుకవివర్యులు మన్మిత్రులు మాన్యులు శ్రీ చింతా రామకృష్ణారావు మహోదయులు నేఁటి యవధానమును విజయవంతముగా నిర్వహించిన శుభసందర్భమున నభినందనచందనములందఁచేయుచు...


సంతసమందఁజేసితిరి శంకరు వాట్సపు బృందమందునన్
సుంతయు నాఁగకుండఁ గన చోద్యమొసంగుచుఁ పద్యరాజముల్
వింతగఁ జెప్పినారలయ వేడుకఁ జిత్తములోలలాడ నో
చింతవరాన్వయా నతులఁ జేసెద నమ్రత రామకృష్ణుఁడా!

మధురకవి గుండు మధుసూదన్
[24/04, 10:26 pm] Rama Krishna Rao: చిత్రకవితారచనావిదగ్ధులు సుకవివర్యులు మన్మిత్రులు మాన్యులు శ్రీ చింతా రామకృష్ణారావు మహోదయులు నేఁటి యవధానమును విజయవంతముగా నిర్వహించిన శుభసందర్భమున నభినందనచందనములందఁచేయుచు...


సంతసమందఁజేసితిరి శంకరు వాట్సపు బృందమందునన్
సుంతయు నాఁగకుండఁ గన చోద్యమొసంగుచుఁ పద్యరాజముల్
వింతగఁ జెప్పినారలయ వేడుకఁ జిత్తములోలలాడ నో
చింతవరాన్వయా నతులఁ జేసెద నమ్రత రామకృష్ణుఁడా!

మధురకవి గుండు మధుసూదన్
[24/04, 10:29 pm] Rama Krishna Rao: [24/04, 5:13 pm] Avadhaani Anil: శ్రీగురుభ్యో నమః

శ్రీ మహా గణపతయే నమః

శ్రీ శారదాంబాయై నమః

చిత్రకవిసమ్రాట్ బ్రహ్మశ్రీ చింతా రామకృష్ణారావు మహోదయులు మరల
అవధాన రంగంలోనికి అడిగిడి  అష్టావధానాన్ని విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా అందజేసిన పద్యరత్నములు.


ఆశుధారాప్రవాహంబునల్లు కవిత
నోలలాడించు జనుల పేరోలగమున
నిత్యసారస్వత క్రియాన్వితులు రామ
కృష్ణ రావుగారికి మహినెదురుగలదె.

గంగానిమ్నగ పోలికన్ తమదు వాగ్ధారాప్రవాహంబును
ప్పొంగన్ వాక్యమొ కావ్యమో తెలియకన్ పొల్పైన పద్యంబులు
త్తుంగంబై జనియింపపామరులునందున్ మజ్జనంబాడ స
త్సంగంబున్ బుధులేమనంగ వలె చింతా రామకృష్ణాహ్వయా! 

అమితగుణాఢ్యులై  కవులయందున గాంచగ నగ్రగణ్యులై
ద్యుమణియునౌచు నాశ్రితుల దుర్బలతన్ తొలగించి జ్ఞానతే
జములనొసంగు చింత కులచంద్రులు ధీమణి రామకృష్ణరా
వు మహితకీర్తిమంతులలవోకగ తానవధానియయ్యెగా ||

నిరుపమవేగముంగలిగి నేర్పునుజూప కవిత్వతత్వమున్
చొరవగజేరి చొచ్చుకొని శోధకులెల్లర మానసాబ్జమం
దిరములలో తిరంబగు గతిన్ గొనె, శ్రీ యుత రామకృష్ణ రా
వు రుచిరవత్కవీంద్ర! ఘనపుణ్యచరిత్ర! నమస్కరించెదన్ ||


బుధజన విధేయుడు 

డా.మాడుగుల అనిల్ కుమార్
[24/04, 5:13 pm] Venkateswralu Facebook: శంకారాభరణం అవధానసప్తాహములో ఆరవ అవధానమును దిగ్విజయంబుగా పూర్తిచేసిన యవధాని శ్రీ చింతారామకృష్ణా రావు గారికి వినయపూర్వకమగు అభినందనలతో 
ఐతగోని వేంకటేశ్వర్లు నల్లగొండ అష్టావధాని 

ఆదర్శంబును జూపినారు సరసంబైనట్టి సచ్ఛబ్ద భా 
వౌదార్యంబగు పద్యసూనములు మీదౌ రీతితోఁబూచి యా 
మోదంబున్ వెసనించినారలవి యామోదంబులై పృచ్ఛకుల్ స 
న్మోదంబంద వధానమున్  వెలిగె సంపూర్ణంబునై నేడిటన్ 
నాదౌనీ యుడుతాప్రశంసఁగొన చింతా రామకృష్ణా నతుల్ 

అనుభవమొక్కవైపు పరమాద్భుతరీతిగ శబ్దసంఘటం 
బును వెసనేర్చిగూర్చగల స్ఫూర్తి రహిల్ల మరొక్కవైపు నే 
మన వయసన్న కొండ యది మాధవభక్తిఁదృణంబునయ్యె పూ 
ర్ణ నయముతోన్  వధాననిధి నవ్యత భవ్యతతోఁదరించు కే 
ళినిఁగన రోమహర్షమయి ప్రీతి నమస్కృతి మీకుఁజేసెదన్
[24/04, 5:13 pm] +91 96038 27827: అద్భుతమైన అవధానం వీక్షించే అవకాశం నేడు కలిగింది. వేగంగా, రస వంతంగా, ఆద్యంతం ఆసక్తి దాయకంగా, జయప్రదంగా కార్యక్రమం సాగింది.
అవధాని శ్రీ రామకృష్ణరావుగారికి
పృచ్ఛకోత్తములకు
గురువర్యులు శంకరయ్యగారికి
హృదయపూర్వక
అభినందనలు
వందనాలు.

నివర్తి మోహన్ కుమార్
[24/04, 5:13 pm] Sreedhar Maachavolu. Hyd: అవధానాన్ని ఆద్యంతం రసరమ్యంగా నిర్వహించిన అవధాని గురువర్యులు, చిత్రకవితా సమ్రాట్ శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి,  సంచాలకులు గురువర్యులు శంకరాభరణ సమూహ నిర్వాహకులు  శ్రీ కంది శంకరయ్య గారికి, పృచ్ఛక కవిమిత్రులకు అభినందన వందనములు. 
నాకీ అవకాశాన్ని కలిగించిన గురువర్యులు శంకరాభరణ సమూహ నిర్వాహకులు  శ్రీ కంది శంకరయ్య గారికి కృతఙ్ఞతలు.
మాశ్రీ
[24/04, 5:13 pm] +91 70938 14850: మహనీయులందరికీ సుందరాభివందనములు.
నేటి అవధానమందు...
అవధాని శ్రీ చింతావారు, కార్యక్రమం నడిపించిన అవధాని శ్రీకందిశంకరయ్యగారు, పృచ్ఛకమహాశయులు, అందరూ సన్మాన పాత్రులే.
💐💐🙏🙏🙏💐💐అవధాని శ్రీయుతులు చింతా రామకృష్ణులవారికి ఈ పద్యరూప పురస్కారం...

*సంతసమనియెన్ శారద*

*చింతారాముల వధాన చిత్రపు సరళిన్*

*సాంతము (శాంతము) గావిని,  భేషని*

*వంతను పాడిరి ముదమున పండితవర్యుల్*

డా. మునిగోటి సుందర రామ శర్మ, మదనపల్లె.🌹👏🌹
[24/04, 5:13 pm] పంచాంగం సత్యమ్: గురువుగారు అద్భుతం మీకు శుభాకాంక్షలు 


దత్తపది :నా పూరణ

హంత
ముంత
వింత
చింత

పై పదాలను ఉపయోగిస్తూ 
కరోనాకాలంలో నిర్మానుష్యమైన తిరుమలలో  స్వామివారి మనోగతాన్ని ఉత్పలమాలలో
మాల వేసిననేను. 
🌹🙏

హంత యిదేమి చిత్రమొ! సహాయము కోరగ రారదేలనో
ముంతడు మల్లెపూవులను ముద్దుగ కొప్పున జుట్టియాడరే
వింతగ తోచుచుండె వినువీధుల మానవ కోటిలేరటన్
చింతన జేయుచుండెగద శ్రీహరి  భక్తుల రాకకోసమై.
🌹🙏🌹🙏🌹🙏🌹
[24/04, 5:14 pm] +91 99489 48787: శంకరా భరణం సమూహం లో అవధాన సప్తాహంలో భాగంగా నేడు అవధానం చేసిన అవధాని చింతా రామకృష్ణారావు గారికి అభినందనలతో......



ఏ మా వేగము సామీ
నీ మహి నిన్నందుకోగ నెవరికి సాధ్యం
బేమా పదముల విరుపులు
రామా మా వందనంబు రమణీయముగన్!!

చుక్కల దొరయా శశియే
చక్కని వెన్నెలలనొసగి సాగినవిధమున్!
చక్కటి విందై మాకై 
మక్కువ గలిగించె మీదు మధురపు పల్కుల్!!

అంబటి భాను ప్రకాశ్
9948948787.
[24/04, 5:14 pm] +91 94409 03363: మత్తేభవిక్రీడితము
పరుగెత్తించిరి పృచ్ఛకోత్తముల మీవాగ్ధాటి నందంగ వే
గిరమౌ రీతి వధాన మైనదని నే కీర్తింతు సద్భక్తి సుం
దరమౌ మేటి వధాన దాతలగు చింతారామకృష్ణాఖ్యులన్
శిరమున్ వంచి నమస్కరింతునిల నాశీర్వాదముల్ పొందగన్

✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
[24/04, 5:14 pm] +91 98493 32496: అవధాన వరేణ్యులు శ్రీ చింతా రామకృష్ణారావు గారికి వందన శతములు! 🙏🙏🙏💐💐💐

అద్భుతమైన అవధానము! అవాక్కయ్యే వేగము! ఆశుకవి అన్నది సార్ధక నామధేయము ! ఇంత మంచి అవధానాన్ని వీక్షించే అవకాశం కలిగించిన గురువర్యులు శ్రీ శంకరయ్యగారి ఋణం తీర్చుకోలేనిది. పృచ్ఛకులంతా చక్కని ప్రశ్నలడిగి అవధానాన్ని రక్తికట్టించారు!! అందరికీ  
వందనములు! 💐💐💐🙏🙏🙏

చింతావారిట కడు ని
శ్చింతగ పద్యములనల్లి చిత్రపురీతిన్
సంతోషము బంచె పలుకు
బంతి రసన నాట్యమాడ బ్రహ్మయెయనగా! 

మరొక్కమారు ధన్యవాదములతో! 🙏🙏🙏

పరీక్షలో తెలివైన విద్యార్ధి సమయముండగానే జవాబులు పూర్తి
చేస్తే అయ్యవారు ఛాయిస్ లేకుండా అన్ని ప్రశ్నలూ వ్రాయమన్నట్టు, అవధానిగారికి గురువుగారు అదనంగా ఒక ఆశువును, చిత్రాన్ని యిచ్చారు! 😊🙏💐
[24/04, 5:15 pm] +91 94915 62006: *మహద్భాగ్యము*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
నేటి అవధాన సంచాలకులు గురువులు కందిశంకరవరేణ్యులకు
గౌరవనీయ ప్రాశ్నికులందరకు
అవధానపూజ్యులకు


సంతసమాయెనునేడిట
చింతావారలవధానచిత్రముగనగన్
యెంతటిభాగ్యంబిదియో
పంతులుగారుమనసారవందనములివే
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డా.పూర్ణకృష్ణ
[24/04, 5:15 pm] +91 6300 474 467: *నేటి మన శంకరాభరణం వాట్సాప్ సమూహములో బ్రహ్మశ్రీ చింతారామకృష్ణారావు గారి ఆష్టావధానము , బ్రహ్మశ్రీ కందిశంకరయ్య గారి సంచాలకత్వమ్ము లో విజయవంతమైనందున వారిరువురి విద్వత్కవివరేణ్యులను అభివర్ణిస్తూ ప్రశంసా పద్యాలు!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
*01*

*తే.గీ.*

*చిత్రకవనము జెప్పెడి శ్రీయుతుండు*
*తెలుగునాచార్యవరులైన ధీవరుండు*
*పలుశతక కావ్యములనెన్నొ వెలువరించి*
*ఆశు కవిచక్రవర్తిగానలరుచుండె!!!*

*02* 

*తే.గీ.*

*ఒక్కదినములో శతకమ్మునక్కజముగ*
*చంద్రమౌళీశ్వరస్వామి చరితగూర్చి*
*పద్యములువ్రాసె పట్టుతో ప్రథితయశుడు*
*రామకృష్ణకవివరుండ ప్రేమనతులు!!!*

*03*

*తే.గీ.*

*నేటి యవధాన యజ్ఞమ్ము నియతితోడ*
*జరిపి హాస్యమ్ము పండించి  జయమునందె*
*పద్యసాహిత్యముకు తాను పాటుపడుచు*
*కవులకునుస్ఫూర్తి నింపుచు కదులుచుండె!!!*


*04*

*తేటగీతిమాలిక*

*శంకరాభరణము కందిశంకరయ్య*
*ననుచు మీపేరు మార్మోగె నవనిపైన*
*పలుసమస్యలనెన్నెన్నొ బ్లాగునందు*
*నిచ్ఛదీరగ కవులకునిచ్చుచుండి*
*పద్యసేద్యమ్ము గావించె పరమజ్ఞాని!!!*
*వాణి మీయందునందుండి భాగ్యమలర*
*నిండు నవధానములు జేయుచుండె నిపుడు!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
*మీ కట్టరంజిత్ కుమార్*
[24/04, 5:15 pm] +91 98490 82669: అవధాని శ్రీ చింతా రామకృష్ణారావు  గారికి వందనములు. నిర్వాహకులు,  పృచ్ఛకకవిమిత్రులకు, పాఠకులకు శుభాభినందనలు . అవధానంలో సాంకేతికంగా చిక్కులు తప్ప ధారాళంగా హృద్యంగా సాగింది. అందరికీ నమస్సులు.
[24/04, 5:19 pm] +91 95100 79281: నేటి అవధానం బహు చక్కగా జరిగింది శ్రీ చింతా రామ కృష్ణా రావు గారిచే....
వారికి నా చిరు కానుక ఇస్తున్నా....

 కందం

చింతగ మారె వివాహము
చింతాక్రాంతుల స్మరణము చిన్మయ భక్తిన్
చింతయె పితృయుగములకున్
రంతిలు వేల్పుల ప్రతీతి రామున్ కృష్ణున్.
 
✍  అయ్యలసొమయాజుల సుబ్బారావు....
[24/04, 5:19 pm] +91 95383 68333: కం: 

చింతా వారీ దినమున
చింతయు లేకనె పదముల చిత్రము గూర్చన్
అంతా ఇంతా !  యన తన 
చింతన మవధానమందు చిందులు వేసెన్

వై. చంద్రశేఖర్
[24/04, 5:20 pm] Asnreddy Hyd: నేనిచ్చిన సమస్యకు నాపూరణ
సమస్య: చినవాడే నను చేర్చు స్వర్గమునకున్ చేయంగ నారాధనల్ 
మ: అనయమ్మున్ మదినమ్మినాడ హరి నేనత్యంత నెయ్యమ్ముతో
     మనుచుంటిన్ దయకల్గునంచుభువి సమ్మానమ్ముతో నెప్పుడున్
     ఘనుడౌ తామరకంటి శౌరి నళినీగర్భుండు గోసంతుఁ గా
     చినవాడే నను చేర్చు స్వర్గమునకున్ చేయంగ నారాధనల్
అసనారె
[24/04, 5:21 pm] +91 98668 47579: పృచ్ఛకుల ప్రశ్నల శరపరంపరను సవ్యసాచి రీతినెదుర్కొని సమయపాలనము గావించి అవధానమును విజయవంతము జేసిన "చింతా రామకృష్ణ"వర్యులకు, అప్రస్తుత ప్రసంగంలో "గట్టిబాబు" విట్టుబాబు గారికి, ఇతర పృచ్ఛకవరేణ్యులకు ,గురువులు కంది శంకరులకు అభినందన చందనాలతో 👏💐💐💐
చింత వారివధానము చిత్ర గతిన...
సాగె నేడురుచిని జూడ చక్కనైన..,,
చింతకాయపచ్చడిరీతి చింత దీర్చె....
సాహితీ ప్రియుల మనముల్ సంత సింప...
--అందరికీ నమస్సులతో 🙏
[24/04, 10:36 pm] Rama Krishna Rao: భల్లూరి ఉమాదేవి.👇🏼

అవధాని శ్రీ చింతా రామకృష్ణారావు గారి కి పృచ్ఛకులకు శుభాభివందనములు.చక్కని అవధానం తో అలరించారు. అవధానం జరిగేటప్పుడు చూసే భాగ్యం లేకపోవడం విచారం కల్గిస్తుంది.
ఒక్క దినంలోనే శతకం రాసిన కవిఅవధానం ఒక్క దినం లోనే శతకం రాసిన మరొక కవి సంచాలకత్వం 
రమణీయం కమనీయం
[24/04, 11:09 pm] Rama Krishna Rao: మాడుగుల మరళీధర్.
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*******చింతా వారికీ జై*******

కందం:-
********
చింతా వారీ విధముగ
పొంతన కలిగిన కవితలు పూరించంగా
వింతగ వినువారి మనసు
చింతలు దొలగించగలిగె చేతములలరెన్.*
౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿
[24/04, 11:10 pm] Rama Krishna Rao: 🙏నమస్కారమండి అవధాని గారు మీ 
అవధానం విన్న నా స్పందన.

చింతారామకవీంద్రచిత్రకవితాక్షిప్రోక్తిధారాసుధీ
మంతంబై విలసిల్లె నవ్యకృతమై మాన్యావధానమ్ము  క
వ్వింతై ధారణధోరణీఘటితనిర్భిన్నస్ఫురద్రమ్యవి
క్రాంతంబై యెదలోన వెల్లివిరిసెన్ కావ్యప్రభాభాసమై.

కంజర్ల రామాచార్య
వనస్థలిపురము
[25/04, 7:49 am] Rama Krishna Rao: శ్రీయుతులు 
చింతారామకృష్ణారావుగారికి
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
హయజవమున మృదుమధు రస
మయమయి కలగళములురుచి
                 మయమయికదలెన్
నయమయివధానసభను,హృ
దయములు 'చింతా'కవీశ!
                 తనిసెముదమునన్!
[25/04, 7:49 am] Rama Krishna Rao: ☝🏽తొగట సురేషు బాబు
[25/04, 7:51 am] Rama Krishna Rao: వాట్సప్ అవధానమును వేగంగా పూర్తిస్థాయిలో విజయవంతం గావించిన అవధానవర్యులు శ్రీ చింతా రామకృష్ణ రావు గారికి, కందిశంకర గురువుగార్కి, పృచ్ఛకాగ్రగణ్యులకు అభినందనలు.

*చింతావారీ దినమున*
*కాంతులతో వెలగినారు కవిసంఘములో*
*నంతా శంకర లీలయె*
*వింతగ నవధానమిట్లు వేడుక జేసెన్.*

-గంగాపురం యజ్ఞభగవాన్
[25/04, 2:37 pm] Rama Krishna Rao: 🌹నమః సభాయై 🌹
అవధానిగారికి నమస్సులు.సంచాలకులు,సభాధ్యక్షులు మురళి గారికి, పృచ్ఛక కవి పండితులకు నమస్సులు. 
ప్రత్యేకించి మాన్యశ్రీ 
కంది శంకరయ్య గారికి నమస్సులు. 

నా అంశం:-న్యస్తాక్షరి
--------------------------
 
నేటి కరోనా వ్యాధిని గురించి తెలియజేస్తూ ఉత్పలమాలలో ఒక పద్యాన్ని చెప్పండి 
🌹🙏
ఒకటవపాదం.. 6అక్షరం.."రో"

రెండవ పాదం...16అక్షరం.."గ"

మూడవ పాదం... 7అక్షరం...."మి"

నాల్గవ పాదం... 13అక్షరం..."లన్"
🌹🙏🌹
మాయని మాయరోగమిది మానవజాతిని మాయఁ జేయగా
శ్రేయములెల్ల మాపి మన చిన్మయ భావన గణ్యమౌసుధీన్
ప్రాయమెరుంగలేమియయిపట్టి జనాళికి కీడు చేయుచున్
న్యాయముతప్పి రెచ్చెనిది హా! కనులన్ గని బాపుమీశ్వరా🙏🏻
[25/04, 6:41 pm] Rama Krishna Rao: మిత్రులు రామకృష్ణారావు గారికి ..
హార్దికాభినన్దనలు .
మీ  అవధానం ఉల్లాసంగా   ఉత్సాహంగా  సాగిపోయింది . అందరూ  అభినందించారు . సంతోషం .                                                           కం. చింతా !ఆశూక్తిగరు                                   త్మంతా! స్నేహ హిమవంత! మధురస మధుర 
స్వాంతా! కవన గగన భా            
స్వంతా! వినుతింతు  నిన్ను  సద్గుణవంతా!   
శుభాభినందనలతో              
నరాల  రామా రెడ్డి ,
ప్రొద్దుటూరు.
24 - 4 - 2020
[25/04, 6:44 pm] Rama Krishna Rao: శ్రీ చింతా వారికి వేవేల నమస్సులు 🙏 🙏
మీ oneline అవధానము.. మహోన్నతము.. గా అందరినీ అలరించినది..
ధన్యాహ గురువు గారు.
 🙏 🙏 🙏 🙏
చావలి బాలకృఫ్ణవేణి.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.