గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, డిసెంబర్ 2024, సోమవారం

ద్వితీయం సంస్కృత సమ్మేలనమ్...........2024 డిశంబరు 27 - 28 - 29 తేదీలలో.

0 comments

 జైశ్రీరామ్

జైహింద్.

ఉత్థానేన జయేత్తన్ద్రీం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. ఉత్థానేన జయేత్తన్ద్రీం  -  వితర్కం నిశ్చయాజ్జయేత్|

మౌనేన బహుభాష్యం చ  -  శౌర్యేణ చ భయం త్యజేత్||

(మహాభారతమ్)    

తే.గీ.  యత్న మున సోమరితనంబు నణచవచ్చు,

శాస్త్ర నిశ్చయము వితర్క జయమొసంగు,

మౌనముననతివాగుడు మాయమగును,

శౌర్యమున పిరికితనము చక్కఁ బాయు.

భావము.  ప్రయత్నం వలన సోమరితనాన్ని , శాస్త్రనిశ్చయం వలన 

విపరీతతర్కాన్ని , మౌనం వలన అతివాగుడును , శౌర్యం వలన భయాన్ని 

విడిచిపెట్టాలి.

జైహింద్.

22, డిసెంబర్ 2024, ఆదివారం

పురాణాల్లో ఉండే ప్రస్తుత నగరాలు.

0 comments

 జైశ్రీరామ్.

1. అంగ రాజ్యం - కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).

2. అశోకవనం (9-311-వ.) - సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

3. ఆయోధ్య (9-266-క.) - శ్రీరాముని జన్మస్థలం, - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

4. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

5. కారుష రాజ్యము - దంతవక్రుని రాజ్యం, (9-722-వ.) - దాంతియ జిల్లా, మధ్యప్రదేశ్.

6. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన (10.1-1639-ఉ.) స్థలం - గిర్నార్, గుజరాత్.

7. కిష్కింద - ఆంజనేయ పర్వతం, హనుమంతుడి జన్మస్థలం, (2) సుగ్రీవుని రాజ్యం, (3) ఋష్యమూక పర్వతం (9-271-వ. - తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర, కర్ణాటక

8. కుండినపురము - రుక్మిణిదేవి జన్మస్థలం, విదర్భ ముఖ్యపట్టణము, (10.1-1687-చ.) - కుండినపుర, మహరాష్ట్ర

9. కుంతి - పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు - గ్వాలియర్.

10. కుచేలుడు (10.2-965-సీ.) నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.

11. కోసలదేశం(9-362-ఆ.) - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

12. ఖాండవవనము / ఇంద్రప్రస్థము - పాండవుల రాజధాని, (1-361-క.) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.

13. గంగాసాగర్,- కపిల మహర్షి ఆశ్రమం, శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది (9-231-మ.), వెస్ట్ బెంగాల్

14. గంగోత్రి - భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం (9-230-వ.), ఉత్తరాఖండ్

15. చిత్రకూటం (9-267-క.) - సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

16. చేది రాజ్యము - శిశుపాలుని రాజ్యం, (10.1-1697-ఉ.) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.

17. జనమేజయుడు సర్పయాగం (12-26-వ.) చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.

18. జరాసంధ్ కీ ఆఖరా జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్. (10.2-718-వ.)

19. దండకారణ్యం (9-268-ఉ.) - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.

20. ద్వారక - శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరము (10.1-1615-వ.) - ద్వారక,గుజరాత్.

21. నిషాద రాజ్యం (10.2-348-ఉ.) నల మహారాజు రాజ్యం - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్.

22. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్.

23. నైమిశారణ్యం (1-39-వ.) వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు, పురాణాలు బోధించిన ప్రాంతం - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.

24. పంచవటి - శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం (9-269-సీ.) - నాసిక్, మహరాష్ట్ర.

25. పాంచాల దేశం - ద్రుపద మహారాజు రాజ్యం, (1-365-సీ.) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.

26. పాండవుల, లాక్షగృహ (3-14-క.) దహనం- వర్నాల్, హస్తినాపూర్.

27. ప్రతిష్టానపురము (9-32-వ.) పురూరవుని రాజధాని -ఝున్సి, అలహాబాద్.

28. ప్రభాస తీర్థం (11-87-సీ.) - శ్రీ కృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి జరిపిన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.

29. ప్రాగ్జ్యోతిష్యం - నరకాసురుని రాజధాని (10.2-156-వ.) - తేజ్ పూర్, అస్సాం.

30. మత్స్య దేశం (1-243-వ.) విరాట మహారాజు రాజ్యం -ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.

31. మద్ర దేశం - పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు, (3-62-మ.) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.

32. మధుర - కంసుని రాజధాని, (10.1-18-వ.) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.

33. మహావిష్ణువు గజేంద్రుడిని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం (8-42-మ.) - గజేంద్ర ధామ్, దేవ్ ధాం, మానససరోవరము దగ్గరలో, నేపాల్.

34. మహీష్మతి పురము (9-434-క.) - కార్తవీర్యార్జునుని రాజధాని -మహేశ్వర్, మధ్యప్రదేశ్

35. మహేంద్రము (5.2-55-వ.) అను పర్వతం , పరశురాముడు తపస్సు చేసిన స్థలం - పశ్చిమ ఒరిస్సా

36. మిథిల - సీతాదేవి పుట్టినిల్లు (9-372-వ.) - జనక్ పూర్, నేపాల్

37. వాల్మీకి ఆశ్రమం (9-346-సీ.) - సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరములోని బితూర్.

38. విదర్భ - రుక్మిణిదేవి తండ్రి రాజ్యం, (10.1-1687-చ.) - విదర్భ, మహరాష్ట్ర

39. విభీషణుడు రాముని శరణు కోరిన (9-289-వ.) స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.

40. విరాటనగరము - పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం (1-243-వ.) - విరాట్ నగర్,రాజస్థాన్

41. వ్రేపల్లె / గోకులం - (10.2-186-వ.) గోకుల్, మధుర దగ్గర.

42. శమంత పంచకము (9-487-వ.) పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో అయిదు మడుగులు నెలకొల్పిన చోటు మరియు భీముడు దుర్యోధనుని చంపిన చోటు - కురుక్షేత్రము దగ్గర, హర్యానా

43. శోణపురము - బాణాసురుడి రాజధాని (10.2-318-వ.) - సోనిత్ పూర్, అస్సాం.

44. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు (9-288-క.) - రామేశ్వరము,తమిళనాడు

45. సరయూ నది (9-211-చ.) - ఈ నదీ తీరములోనే అయోధ్య నిర్మితమైనది - ఘాఘర నది.

46. సాళ్వ రాజ్యం - జరాసంధుని మిత్రులలో ఒకడు సాళ్వ దేశపువాడు, (10.1-1682-మ.) - కురుక్షేత్రము దగ్గర.

47. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ,

48. హస్తినాపురము - కౌరవుల రాజధాని, పరీక్షిత్తుని రాజధాని, (1-78-వ.) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.

జైహింద్.

పితృభి స్తాడితో పుత్రః . ... మేలిమిబంగారం మన సంస్కృతి

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. పితృభి స్తాడితో పుత్రః ౹  -  శిష్యస్తు  గురు శిక్షితః  ౹     

ఘనాహతం సువర్ణం చ ౹  -  జాయతే జనమండనమ్౹౹

తే.గీ.  తల్లిదండ్రుల దండనవల్ల సంతు,

గురు సుశిక్షిత శిష్యుఁడు, నిరుపమముగ

భువి ఘనాహతమైనట్టి పుత్తడియును

కనగ జనమండనంబగు ఘనతరముగ.

భావము.  తల్లిదండ్రులచే దండింపఁబడు సంతానము,  గురువుచే 

శిక్షితుఁడయిన శిష్యుఁడు, అలంకారముగా చేయఁబడునప్పుడు 

సుత్తి దెబ్బలు తిన బంగారము సమాజములో అలంకారముగా అగుట నిశ్చయము.

జైహింద్.

అసమ్భావ్యం న వక్తవ్యం. ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అసమ్భావ్యం న వక్తవ్యం  -  ప్రత్యక్షమపి దృశ్యతే।

శిలా తరతి పానీయం  -  గీతం గాయతి వానరః॥             

తే.గీ.  వీటిలో రాయి తేలుట నీవు కనిన,

కోతి పాడుట వినినను నీతిఁ గనుము,

కంటికెదురిగా నీకది కనఁబడినను

పలుకఁబోకు మసంభవమ్ములను నీవు.

భావము.  నీవు ప్రత్యక్షంగా చూచినప్పటికీ అసంభవమైన వాటిని ఎన్నడూ 

ఇతరులతో చెప్పవద్దు.  నీటిపై రాయి తేలింది. కోతి పాటలు పాడింది' అంటే 

ఎవ్వరైనా నవ్వుతారేకాని నమ్మరు.

జైహింద్.

శ్రీ కుప్పా హైగ్రీవ వారి తండ్రిగారైన కుప్పా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

21, డిసెంబర్ 2024, శనివారం

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరుల 22వ శతావధాన మహాసాహితీవిన్యాసం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ప్రస్తావసదృశం వాక్యం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ప్రస్తావసదృశం వాక్యం  -  సద్భావసదృశం ప్రియమ్ ౹

ఆత్మశక్తిసమం కోపం యో  -  జానాతి స పండితః ౹౹

(చాణక్యనీతి ౧౪ - ౧౪)      

తే.గీ.  సమయమునకు తగిన మాట చక్కదనము,

మంచి భావనకు తగుచు మనెడి ప్రియము,

అవసరమున కోపించుట యనునవిగల

మనుఁజుడేపండితుండిల, మహితులార!

భావము.  సమయానికి తగినట్టుగా చూడండి.సద్భావనము ఉన్నట్టుగా 

ప్రియమైన పని, తన ఆత్మశక్తికి అనుగుణంగా ఉండే కోపం,వీటన్నింటిని 

తెలిసిన వ్యక్తి ఎవరు ఉంటారో అతనే పండితుడు.

జైహింద్.

ఆడుతూపాడుతూ పిల్లలకు నేర్పండి. ... ఆధ్యాత్మిక ప్రశ్నోత్తరములు.

0 comments

 జైశ్రీరామ్.

ఆడుతూపాడుతూ పిల్లలకు నేర్పండి.

1. భగవద్గీతను లిఖించినదెవరు?

=విఘ్నేశ్వరుడు.

2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?

= భీష్మ పర్వము.

3. గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?

=మార్గశిర మాసము.

4. గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?

=హేమంత ఋతువు.

5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వసంత ఋతువు.

6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?

=శ్రీకృష్ణుడు అర్జునునికి.

7. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?

=కురుక్షేత్ర సంగ్రామము.

8. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?

=కౌరవ పాండవులకు.

9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?

=అర్జునుడు.

10. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=సామవేదము.

11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?

=పాంచజన్యము.

12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?

=పద్దెనిమిది (18)

13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?

= వినోబా భావే.

14. “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

= మహాత్మా గాంధీ.

15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?

= సంజయుడు.

16. సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కుమారస్వామి.

17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?

=దేవదత్తము.

18. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?

= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)

19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?

=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

20. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= శ్రీరామచంద్రుడు.

21. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=అచ్యుత, అనంత, జనార్ధన.

22. భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=ధనుంజయ, పార్ధ, కిరీటి.

23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?

=గీతా గానం.

24. “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?

=ఎడ్విన్ ఆర్నాల్డ్.

25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?

=పౌండ్రము.

26. ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=శంకరుడు.

27. “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

=మహాత్మాగాంధీ.

28. భగవద్గీత ఏ వేదములోనిది?

=పంచమ వేదం-మహాభారతం.

29. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?

=11వ అధ్యాయము

30. ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=విష్ణువు

31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?

=అర్జున విషాద యోగము.

32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?

=పదివేలమంది.

33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?

=అనంతవిజయము.

34. భగవద్గీత  మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?

= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.

35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?

=సంజయుడు.

36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?

=దృష్టద్యుమ్నుడు.

37. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వజ్రాయుధము.

38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?

=వజ్ర వ్యూహం.

39. గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?

=భీష్ముడు.

40. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాసుకి.

41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= అనంతుడు.

42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?

=సుఘోషము.

43. అర్జునుని ధనస్సు పేరేమిటి?

=గాండీవము.

44. జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)


45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గంగానది.

46. ఆత్మ యెట్టిది?

=నాశరహితమైనది.

47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?

=నిష్కామ కర్మ.

48. మనుజునకు దేనియందు అధికారము కలదు?

=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)

49. అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?

=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

50. వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?

= రావిచెట్టు.

51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?

=ఆత్మ.

52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?

=మణిపుష్పకము.

53. ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?

=ఆత్మయందు.

54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?

=హనుమంతుడు.

55. పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గరుత్మంతుడు.

56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?

=తాబేలు.

57. కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?

=చేయుటయే మేలు.

58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?

=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

59. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?

=లోక క్షేమం కొరకు.

60. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కామధేనువు.

61. స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?

=స్వధర్మము.

62. పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?

=కామము చేత.

63. దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?

= కామము యొక్క ప్రేరణచే.

64. భగవంతుడెపుడు అవతరించును?

=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.

65. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ప్రహ్లాదుడు.

66. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= చిత్రరథుడు.

67. హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?

=జ్ఞానతపస్సు.

68. జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?

=పరమశాంతి.

69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?

=గాలిలేనిచోట గల దీపంతో.

70. ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?

=అభ్యాసము, వైరాగ్యము.

71. భయంకరమైన మాయను దాటుట ఎట్లు?

=భగవంతుని శరణుపొందుట వలన.

72. భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?

=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)

73. భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?

=అజ్ఞానులు.

74. విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?

=బ్రహ్మవిద్య.

75. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= భృగు మహర్షి.

76. బ్రహ్మవిద్యకు అర్హత యేమి?

=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

77. ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?

=పరమాత్మయందు.

78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?

=పరమాత్మయందు అనన్యభక్తిచే.

79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?

=భగవంతుని భక్తుడు.

80. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?

=సాక్షాత్తు పరమాత్మయే.

81. ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మనస్సు.

82. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మేరువు.

83. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=బృహస్పతి.

84. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=ఓం కారము.

85. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?

=జప యజ్ఞము.

86. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఐరావతము.

87. గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఉచ్ఛైశ్శ్రవసము.

88. శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?

= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)

89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= నారదుడు.

90. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కపిల మునీంద్రుడు.

91. భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?

= మోక్షసన్యాస యోగము.

92. లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కాలము.

93. జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మొసలి.

94. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?

= సత్త్వ, రజ, తమో గుణములు.

95. వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాయువు.

96. భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 35.

97. విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఆధ్యాత్మ విద్య.

98. రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాదము.

99. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= "అ"-కారము.

100. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?

= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

101. మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మార్గశిరము.

102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 20 (ఇరువది).

103. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 26 (ఇరువదియాఱు).

104. శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 6 (ఆఱు).

105. తపస్సులెన్ని రకములు?

= మూడు (శారీరక, వాచిక, మానసిక)

106. పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?

= మూడు (ఓమ్, తత్, సత్).

107. మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?

= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.

108. సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?

= వేదవ్యాసుడు.

జైహింద్.

20, డిసెంబర్ 2024, శుక్రవారం

కన్యాశుల్కం నాటకంపై బ్రహ్మశ్రీ పేరి రవికుమార్ గారి సమీక్ష సమాచారం పత్రికలో.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీ పేరి రవికుమార్.

చాలా చక్కని సమీక్ష చేసిన శ్రీ రవికుమార్ గారికి 
అభినందనపూర్వక ధన్యవాదములు.

జైహింద్.

న విత్తందర్శయేత్ప్రాజ్ఞః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  న విత్తందర్శయేత్ప్రాజ్ఞః - కస్య చిత్స్వల్పమప్యహో ౹

మునేరపి యతస్తస్య - దర్శనాచ్ఛలతేమనః ౹౹

తే.గీ. ధనమునించుకైననుగాని ధరను ప్రజకు

చూపుటొప్పదు ప్రాజ్ఞులు, సుగుణభాస!

ధనము కనినచో మునులకున్ దానిపైన

మనసు కలుగు చలించుచు, మాయణ్ జిక్కి.     

భావము.  తెలివయినవాఁడు ఎవరికీ కొంచం కూడా డబ్బుని చూపెట్టక్కూడదు.

 డబ్బుని చూసిన వెంటనే ముని మనస్సుకూడా చంచలంగా మారుతుంది.

జైహింద్.

19, డిసెంబర్ 2024, గురువారం

ఆరస్సెస్స్ ప్రార్ధన గీతం | RSS Prayer Song | Namaste Sada Vatsa...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మన అంజయ్యగౌడు అవధానికి ప్రసన్నభారతి ద్వారా జరగబోవు పురస్కారప్రదానము.

0 comments

 

జైశ్రీరామ్.
అవధాని బండకాడి అంజయ్య.
జైహింద్.

శ్రీ వాడ్రేవు వేంకట సత్య ప్రసాదు గారింట జరిగిన శ్రీ డా. అక్కిరాజు సుందరరామకృష్ణ గారి అష్టావధానము.

0 comments

జైశ్రీరామ్.

18-12-2024వ తేదీన మద్యాహ్నం 2గంటలకి 

శ్రీ వాడ్రేవు వేంకట సత్య ప్రసాదు  గారింట జరిగిన 

శ్రీ   డా. అక్కిరాజు సుందరరామకృష్ణ గారు  

సాధనావధానంలో పూరణ చేసిన పద్యములు.

సంచాలకులు గా 

శ్రీ ధూళిపాళ మహదేవమణిగారు నిర్వహించినారు.

ముఖ్య అతిథిగా  

చిత్రకవితా సమ్రాట్  శ్రీ చింతా రామ కృష్ణారావుగారు  అలరించారు

నిషిద్ధాక్షరి 

అవధాన రాజహంస  శ్రీ ముద్దురాజయ్య  గారు

అంశం- శ్రీలలితాంబికను వర్ణించాలి

శ్రీ(వ)ర(మ)యి(మ)ర(స)యి(గ)నాన్  (వ )శ్రీ (న) తోన్..

యార (య)భి(ద)నా(ద)టన్- మ(ద)రి-(మ)-రి-యా(ట)పీ(య)లున్ లే....

కందము

శ్రీరయి రయినాన్ శ్రీతో

యారభి నాటన్ మరిమరి యాపీలున్  లే

శౌరికి  పత్నివి నీవదె

మారుని మదిగన్నతల్లి మంగళ రూపా!

సమస్య 

శ్రీ  మాచవోలు శ్రీధర రావు గారు

పద్యమల్లుట సులభమ్ము పామరునకు

తే.గీ!

శారదాదేవి కృపయున్న చాలినంత

సరుకు లిచ్చును తప్పక చల్లగాను 

మాటనమ్ముర నాదహోమాచవోలు 

అమ్మ దయయున్న సత్యమ్ము నమ్ముమయ్య

*పద్యమల్లుట సులభమ్ము పామరునకు*

(ఆఖరి పాదమే సమస్య)

దత్తపది  

శ్రీ వేంకట స్వామిగారు

అంశం

ప్రేమ- అనే పదమునునాలుగు పాదాలలోనూ వుంచుతూ 

నాటి నేటి సినిమాలు.

ప్రేయసికి చాకు  చూపుట పిచ్చి ప్రేమ

పిచ్చిమాటలు  ప్రేలుట  వింత ప్రేమ

గుడిని తాళిని కట్టెడి గొప్ప ప్రేమ 

పాట పాడుట నానాడు ప్రేమ!!

వర్ణన 

శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి

అంశం- మార్గశీర్ష మాసమంచు నిపూలవానగా  మత్తచభంలో చెప్పాలి

అతివా! మార్గశిరంబె  మంచుగదటే ఖ్యాతిని గనెన్ గాదటే 

కుతుకం బొప్పగ విష్ణు పూజలను పెక్కుర్ సల్పరే మానినీ 

ప్రతిరోజున్ మరి సుప్రభాతములలో భక్త్యాత్ములై యెల్లరున్

సతమా మంచునె పాలుగా దలుచుచున్ చక్రిన్ గొల్వరే!!

కవితాగానం 

శ్రీక్రొవ్విడివెంకట రాజారావుగారు..

పౌరాణిక అంశాలని ప్రస్తావిస్తే ఆవధానిగారు  సందర్భోచితంగా పద్యాలని  అలవోకగాచెప్పారు

ఆశువు 

శ్రీ కవిశ్రీ సత్తిబాబుగారు

అంశం-కపట సన్యాసి విన్యాసం

(వీరు తమ అంశాన్ని పద్యంలో అడిగారు)

కలిని నెప్పుడైరి కపట సన్యాసులు 

వాణినాలయేడు క్షోణియందు 

నిజము చూడ భళిర! నేర్పు మీరంగను

నధిక గౌరవంబు ఖ్యాతి గనిరి!!

*ఆశువు-2

అంశం- మాయాజలధినిదాటాలంటే ఏమి చేయాలి?

ఆ.వె  మాయ సకల జగతి మాయరా నమ్మరా 

సత్యమిద్ది నమ్ముసత్తిబాబు

శ్రీ హరినిని భక్తి  సేవింప మెరుగురా

యిదియె మార్గమయ్య బుధవరేణ్య!!

ఆశువు-3

అంశం- కపటవిద్యాచరుడు

ఆ.వె!  బొబ్లుపెట్టి మెడను పూసదండలువేసి 

భక్తి పరుడు వోలె భావనమున

బ్రతుకు వాడెనిజము క్షితి పైన దొంగరా

సత్య మిద్దె నమ్ము సత్తి బాబు!!

ఛందోభాషణము 

శ్రీ ధనికొండరవిప్రసాదు గారు

1--నిధి సుఖమా? రాముని స

న్నిధి సుఖమా?

జ కవివర విను నిక్కంబిదిరా 

నిధి లేక బ్రతుకు గడుచున?

వ్యధపాలగు దలచిచూడ పండితవర్యా!!

ఆశువు-3

 అవధానమ్ముల కొన్ని చేసితిరి  కావ్య సృష్టిన్ చేసిరే?

భువిపై యాబది మూడు పుస్తకములన్ నే  పొల్పార నే వ్రాసితే 

స్తవనంబుల్ పలు చూపుచున్ వెల్గుగాక నవి మీ సామర్ధ్యమున్ జూపచున్ 

పవనాత్మజుడు నైనవాని కృపతో  భాసిల్లిడిన్ సోదరా!!

అప్రస్తుత ప్రసంగము 

శ్రీ సంచాలక చక్రవర్తి , ద్యుమణి  శ్రీకటకం వేంకటరామశర్మ గారు 

నిర్వహించినారు.

జైహింద్.

18, డిసెంబర్ 2024, బుధవారం

ఛందోభాషణం నాతో తమ్ముఁడు దత్తాత్రేయ ఎంతబాగా చేశాడో చూడండి.

0 comments

జైశ్రీరామ్.

 ఓం శ్రీమాత్రే నమః.🙏🏼

క్షిప్రావధాని శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ.

ఆర్యులారా!🙏🏼

👇🏼

ఛందోభాషణం నాతో తమ్ముఁడు దత్తాత్రేయ ఎంతబాగా చేశాడో చూడండి.౧.౩.పాదాలు నా పూరణ. ౨.౪. పాదాలు తమ్ముని పూరణ.

👇🏼

తరంగమాలిక ( రనరనరనర) యతి ౧ - ౭ - ౧౩.

👇🏼

పంచపాది వర భావనాధృతిని భవ్యమై తనరె సోదరా!

సంచితంబయిన సత్త్వసంపదలు సార్థకంబనెడు రీతిగా,

మంచిపద్యముగ మా సహోదరుఁడు మాకు నిచ్చె గద భారతీ!

మంచిమాత్రమిటు మానితంబుగను మాకొసంగెదరె, అన్నయా!

☝🏼

ఇలా నేను చెప్పగానే అలా తమ్ముఁడు చెప్పి నాపూరణ కోసం చూడ్డం నాకెంత ఆనందం కలిగించిందో మాటలలో చెప్పలేను. 

తమ్మునకు ఆ అమ్మ కటాక్షం నిరంతరం ఇలాగే ఉండి అందరికీ ఆదర్శంగా ఉండేలా చేస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను.🙏🏼

జైహింద్.

ఋణశేషోగ్ని శేషశ్చ. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఋణశేషోగ్ని శేషశ్చ  -  శత్రుశేషస్తథైవ చ !

పునః పునః ప్రవర్ధంతే - తస్మాచ్ఛేషం న రక్షయేత్!!

తే.గీ.  ఋణము, నగ్నిని, శత్రువున్, మనము మిగుల

నీయరాదెప్పుడిలనున మేయమైగుచు

వృద్ధిచెందుట జరుగును శ్రద్ధతోడ

శేషరహితముల్ గావించి భాసిలుమయ! 

భావము. ఋణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం మరల మరల ప్రవృద్ధమౌతాయి. 

అందువల్ల ఆమూడింటినీ మిగుల్చు కోరాదు.

జైహింద్.

సమస్య. *పద్యము పాతిపెట్టుడయ పండితలోకము సంతసించగన్.* దీనికి నా పూరణ.

1 comments

జైశ్రీరామ్. 

ఉ.  పద్యము హృద్యమై తనరి పామరపాళిని పండితాళిగా

సద్యశపూర్ణులైతనర చక్కఁగఁ జేయును, కావినన్ సదా

హృద్యముగా మనంబుల ననేకవిధంబుల నాటునట్లుగా

*పద్యము పాతిపెట్టుడయ పండితలోకము సంతసించగన్.*

మీరుకూడా పూరించి కామెంట్ చెయ్యండి.

జైహింద్.

అష్టావధానం/అవధాని శ్రీ మానేపల్లి నాగకుమార శర్మ గారు/ASHTAVADHANM/MANEPAL...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శ్రీ మానేపల్లి నాగకుమార శర్మ మరియు శ్రీ ఇలపావులూరి శేషశ్రీధర్ శర్మల యుగళ అవధానం/ఒంగోలు/

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

జిహ్వే! ప్రమాణం జానీహి. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  జిహ్వే! ప్రమాణం జానీహి  -  భోజనే భాషణేఽపి చ

అతిభుక్తి రతీవోక్తిః  -  సద్యః ప్రాణాపకారిణీ.

తే. పరిమితినిగను నాలుకా! భక్షణమున,

మాటలాడువిషయమున, మరచిపోకు,

మతిగ భుజియింప నారోగ్యమంరించు,

నతిగవాగున ప్రాణాలె యావిరగును.  

భావము.  ఓ నాలుకా! భోజనం విషయంలోనూ మాట్లాడే విషయంలోనూ 

పరిమితిని తెలుసుకో. అతిగా తినడం, అతిగా మాటలాడడం ప్రాణాలను తీస్తాయి.

జైహింద్.

17, డిసెంబర్ 2024, మంగళవారం

లోకరక్షక,దక్షక,జీవశక్తి ,శక్తిదారక,వేదగోచర,పరమా,చరితార్ధ,దీవర,మనోహర,దామ,భువనైక,వశీకర,ధ్యానతా,శోభాయక,గర్భ"కీర్తి దామ"వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి జుత్తాడ,,

0 comments

జైశ్రీరామ్.

భక్తి లోక రక్ష ముక్తిదమ్!భవ బంధ మోచనాన్వితమ్!పరమం బదే!జీవికిన్!
శక్తి,భుక్తి దక్షకం బదే!జవ సత్వ ధీ!మనోహరమ్!చరితార్ధ శోభా కరమ్!
భుక్తి జీవ శక్త ధ్యోతకమ్!భువనైక కీర్తి దామకమ్!పురుషోత్తమం!శ్రీకరమ్!
సూక్తి వేద గోచరంబగున్!సు వశీకరంబు ధ్యానతన్!సుర మోదకం!భాస్వకమ్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు26,అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

1,గర్భగత"లోక రక్షక"వృత్తము,

భక్తి లోక రక్ష ముక్తిదమ్!
శక్తి,భుక్తి దక్షకం బదే!
భుక్తి జీవశక్తి ధ్యోతకమ్!
సూక్తి,వేద గోచరంబగున్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును,

2,గర్భగత"దక్షక"వృత్తము,

భవ బంధ మోచ నాన్వితమ్!
జవ సత్వ ధీ మనోహరమ్!
భువ నైక కీర్తి దామకమ్!
సు వశీకరంబు ధ్యానతన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

3,గర్భగత"జీవ శక్తి"వృత్తము,

పరమం బదే?జీవికిన్!
చరితార్ధ శోభాకరమ్!
పురుషోత్తమం శ్రీకరమ్!
సుర మోదకం భాస్వకమ్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు"8"అక్షరము లుండును,

4,గర్భగత"శక్తి ధారక"వృత్తము,

భక్తి లోక రక్ష ముక్తిదమ్!భవ బంధ మోచ నాన్వితమ్!
శక్తి భుక్తి దక్ష కం బదే!జవ సత్వ ధీ!మనోహరమ్!
భుక్తి జీవ శక్తి ధ్యోతకమ్!భువనైక కీర్తి దామకమ్!
సూక్తి వేద గోచరం బగున్!సు వశీకరంబు ధ్యానతన్!

అణిమా"ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"వేదగోచర"వృత్తము,

భవ బంధ మోచ నాన్వితమ్!భక్తి లోక రక్ష!ముక్తిదమ్!
జవ సత్వ ధీ!మనోహరమ్!శక్తి భుక్తి దక్షకం బదే!
భువనైక కీర్తి దామకమ్!భుక్తి జీవ శక్తి ధ్యోతకమ్!
సు వశీకరంబు ధ్యానతన్!సూక్తి వేద గోచరంబగున్!

అణిమా"ఛందమునందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"పరమా"వృత్తము,

భక్తి లోక రక్ష!ముక్తిదమ్!పరమం బదే!జీవికిన్!
శక్తి భుక్తి దక్షకం బదే!చరితార్ధ శోభా కరమ్!
భుక్తి జీవ శక్తి ధ్యోతకమ్!పురు షోత్తమం!శ్రీ కరమ్!
సూక్తి వేద గోచరం బగున్!సుర మోదకమ్!భాస్వకమ్!

అణిమా"ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"చరితార్ధ"వృత్తము,

పరమం బదే!జీవికిన్!భక్తి లోక రక్ష!ముక్తిదమ్!
చరితార్ధ శోభాకరమ్!శక్తి భుక్తి దక్షకం బదే!
పురు షోత్తమం!శ్రీ కరమ్!భుక్తి జీవ శక్తి ధ్యోతకమ్!
సుర మోదకం!భాస్వకమ్!సూక్తి వేద గోచరం బగున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

8,గర్భగత"ధీ వర"వృత్తము,

భవ బంధ మోచ నాన్వితమ్!పరమం బదే!జీవికిన్!
జవ సత్వ ధీ మనోహరమ్!చరితార్ధ శోభాకరమ్!
భువ నైక కీర్తి దామకమ్!పురు షోత్తమం!శ్రీ కరమ్!
సు వశీకరంబు!ధ్యానతన్!సుర మోదకం!భాస్వకమ్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"మనోహర"వృత్తము,

పరమం బదే!జీవికిన్!భవ బంధ మోచనాన్వితమ్!
చరితార్ధ శోభాకరమ్!జవ సత్వ ధీ!మనోహరమ్!
పురు షోత్తమమ్!శ్రీ కరమ్!భువనైక కీర్తి దామకమ్!
సుర మోదకమ్!భాస్వకమ్!సు వశీకరంబు ధ్యానతన్!

అణిమా ఛందము నందలి"అత్యష్ట్"ఛందము లోనిది
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"దామ"వృత్తము

భవ బంధ మోచనాన్వితమ్!భక్తి లోక రక్ష ముక్తిదమ్!పరమం బదే!జీవికిన్!
జవ సత్వ ధీ!మనోహరమ్!శక్తి భుక్తి దక్షకం బదే?చరితార్ధ శోభాకరమ్!
భువనైక కీర్తి దామకమ్!భుక్తి జీవ శక్తి ధ్యోతకమ్!పురుషోత్తమం శ్రీ కరమ్!
సు వశీకరంబు ధ్యానతన్!సూక్తి వేద గోచరం బగున్!సుర మోదకం!భాస్వకమ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

11,గర్భగత"భువనైక"వృత్తము,

భక్తి లోక రక్ష ముక్తిదమ్!పరమం బదే!జీవికిన్!భవ బంధ మోచ నాన్వితమ్!
శక్తి ముక్తి దక్షకం బదే!చరితార్ధ శోభాకరమ్!జవ సత్వ ధీ!మనోహరమ్!
భుక్తి జీవ శక్తి ధ్యోతకమ్!పురు షోత్తమమ్!శ్రీ కరమ్!భువనైక కీర్తి దామకమ్!
సూక్తి వేద గోచరం బగున్!సుర మోదకమ్!భాస్వకమ్!సు వశీకరంబు ధ్యానతన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

12,గర్భగత"వశీకర"వృత్తము,

పరమం బదే!జీవికిన్!భక్తి లోక రక్ష!ముక్తిదమ్!భవ బంధ మోచనా న్వితమ్!
చరితార్ధ శోభాకరమ్!శక్తి ముక్తి దక్షకం బదే!జవ సత్వ ధీ!మనోహరమ్!
పురుషోత్తమం!శ్రీ కరమ్!భుక్తి జీవ శక్తి ధ్యోతకమ్!భువనైక కీర్తి దామకమ్!
సుర మోదకం భాస్వకమ్!సూక్తి వేద గోచరం బగున్!సు వశీకరంబు ధ్యానతన్!

అనిరుగజద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18;అక్షరములకు చెల్లును,

13,గర్భగత"ధ్యానతా"వృత్తము,

భవ బంధ మోచనాన్వితమ్!పరమం బదే!జీవికిన్!భక్తి లోక రక్ష!ముక్తిదమ్!
జవ సత్వ ధీ మనోహరమ్!చరితార్ధ శోభాకరమ్!శక్తి ముక్తి దక్షకం బదే!
భువనైక కీర్తి దామకమ్!పురుషోత్తమం శ్రీ కరమ్!భుక్తి జీవశక్తి ధ్యోతకమ్!
సు వశీకరంబు ధ్యానతన్!సుర మోదకం భాస్వకమ్!సూక్తి వేద గోచరం బగున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు;10,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"శోభాయక"వృత్తము,

పరమం బదే!జీవికిన్!భవ బంధ మోచనాన్వితమ్!భక్తి లోక రక్ష!ముక్తిదమ్!
చరితార్ధ శోభా కరమ్!జవ సత్వ ధీ!మనోహరమ్!శక్తి ముక్తి రక్షకం బదే!
పురుషోత్తమం శ్రీ కరమ్!భువ నైక కీర్తి దామకమ్!భుక్తి జీవ శక్తి ధ్యోతకమ్!
సుర మోదకమ్!భాస్వకమ్!సు వశీకరంబు!ధ్యానతన్!సూక్తి వేద గోచరంబగున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకుచెల్లును,

జైహింద్.

సమస్య. వినయము సాధుపుంగవుల వేదన పెంచుట విస్మయంబగున్. దీనికి నా పూరణ.

0 comments

 జైశ్రీరామ్.

చం.  అనయము సాధుపుంగవులకాశ్రయమిచ్చుచు సేవగొప్పగా

వినయముతోడ చేయనొక వేదవిదుండు భరింపరాని యా

వినయము తాళజాలమిని వేదనచెందిరి సాధుపుంగవుల్,

వినయము సాధుపుంగవుల వేదన పెంచుట విస్మయంబగున్.

జైహింద్.

16, డిసెంబర్ 2024, సోమవారం

లలితాచంద్రమౌలీశ్వర క్షేత్రము మిట్టపల్లి సిద్ధిపేట శతావధానం ధారణసభ. నిర్వహణ.... భక్తిసాధనం శ్రీపండరి రాధాకృష్ణమూర్తి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

2-మిట్టపల్లిలో శ్రీ లలితాచంద్రమౌలీశ్వర క్షేత్రము. లలితాదేవి విగ్రహప్రతిష్ఠ ఉత్సవాలు. భక్తిసాధనం పండరివారి కలలు పండిన శుభసమయం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సమస్య. ఆరని మంటలే మనకు హాయిని గొల్పును చిత్రమొప్పగా. నా పూరణ.

0 comments

 జైశ్రీరామ్.

ఉ.  ఘోరకలిప్రభావమున కూరుకుపోయినవారమైనచో

నేరచరిత్రకల్గి కననేరమినన్యుల మేలు, వారిలో

కూరిన వైరభావమున గొప్పగ రేగిన బంధుకోటిలో

నారని మంటలే మనకు హాయిని గొల్పును చిత్రమొప్పగా.

జైహింద్.

కర్పూరక్షారయోస్సామ్యం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  కర్పూరక్షారయోస్సామ్యం  -  రూపే స్యాన్న తు తద్రసేl

బాహ్యాకృతిర్భవేదేకో  -  నాన్ తః సదసతోర్గుణఃll

తే.గీ.  కప్పురమునుప్పు పోలికన్ గనగ నొకటె,

వాటి రుచులందు వేరుగా వరలుచుండు,

సుజన దుర్జనులొకపోల్కె చూడనొప్పి

యుండవచ్చు, గుణంబులా యుండవటుల.

భావము. ఉప్పు, కర్పూరము బయటకు చూడటానికి ఒకేవిధంగా ఉంటాయి. 

వాటి రుచులు మాత్రం వేరుగా ఉంటాయి. సజ్జనులు, దుర్జనులు 

బయటకు ఒకేవిధంగా ఉంటారు. వారి మనసులోని గుణం మాత్రం 

వేరుగా ఉంటుంది.

జైహింద్.

14, డిసెంబర్ 2024, శనివారం

ద్రోగ్ధవ్యం న చ మిత్రేషు. ... మేలిమిబంగరం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ద్రోగ్ధవ్యం న చ మిత్రేషు న విష్వస్తేషు కర్హిచిత్ ౹ 

యేషాం చాన్నాని భుంజీత యత్ర చ స్యాత్ ప్రతిశ్రయః ౹౹

(మహాభారతమ్ 3.154.13)

తే.గీ.  స్నేహితులయెడలను, విశ్వసించువారి

యెడల, మృష్టాన్న దాతల యెడల, తనకు

తానుగా నాశ్రయంబిచ్చు ధన్యులయెడ, 

ద్రోహమొనరింపరాదయా, దురితమొదవు.      

భావము.  మిత్రుల విషయములో, విశ్వాసం పెట్టుకున్నవారివిషయములో, 

ఎవరి అన్నము స్వీకరింతురో అటువంటి వారివిషయములో, మరియు 

తనకు తానుగా ఆశ్రయము ఇచ్చిన వారి విషయములో ద్రోహం 

ఎప్పటికీ చెయ్యరాదు.

జైహింద్.

తృణం బ్రహ్మవిదః స్వర్గః, ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః🙏🏻

శ్లో.  తృణం బ్రహ్మవిదః స్వర్గః,  -  తృణం శూరస్య జీవితమ్‌ |

జితాsక్షస్య తృణం నారీ,  -  నిఃస్పృహస్య తృణం జగత్‌ ||

తే.గీ.  దొడ్డ బ్రహ్మజ్ఞునకు దివి గడ్డిపరక,

చూడ ప్రాణంబు తృణమేను శూరునకును,

స్త్రీలు తృణమెన్న వరజితేంద్రియులకిలను,

తృణము విగతస్పృహులకెన్న సృష్టి, నృహరి!

భావము.  బ్రహ్మజ్ఞానికి స్వర్గం గడ్డిపరక. శూరునికి ప్రాణాలు తృణం. 

ఇంద్రియాలు జయించిన వానికి స్త్రీ తృణం. ఆశ లేనివానికి జగత్తు తృణం.

అమ్మ దయతో🙏🏻

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

చిన్నయసూరి జయంతి జరిపిస్తున్న వారసులు సూరి మహోదయులు.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

13, డిసెంబర్ 2024, శుక్రవారం

ఈ రోజు ప్రజాసంకల్పం దినపత్రికలో నా పద్యాలు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

28/11/2024 న సాయంత్రం 4. 00 గంటల నుండి 5.00 గంటల వరకు మియాపూర్ లో ఇష్టాగోష్టిగా జరిగిన శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ అష్టావధానం.

0 comments

జైశ్రీరామ్. 

ఇష్టాగోష్టిగా అవధానం 

28/11/2024 న సాయంత్రం 4. 00 గంటల నుండి 5.00 గంటల వరకు మియాపూర్ లోని

శ్రీ చింతా రామకృష్ణా రావు గారి స్వగృహంలో శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ  ఇష్టాగోష్టిగా క్షిప్రావధానం చేశారు. కేవీయన్ ఆచార్య  అవధానానికి సాక్షిగా,  సల్లేఖకులుగా వ్యవహరించారు. శ్రీ సంగనభట్ల నరసయ్య గారు అతిథిగా పాల్గొన్నారు. శ్రీ చింతా వారే ఒక్కో అంశాన్ని ఇచ్చి పూరించమన్నారు.

ముందుగా

1. నిషిద్ధాక్షరి. 

అమ్మ వారి ప్రార్థన 

శ్రీ (వ) య (న)ంబా(-)వి (జ) ద్యా(వ) ంబా

నీయా(శ)న (న)తి (త) ని (-)మ్ము (క) వే(గ) డ ని(న) త్యా - న న్నున్

శ్రీ యంబా విద్యాంబా!

నీయానతినిమ్ము వేడ నిత్యా ! నన్నున్

బాయక ప్రోచెడి జననివి

శ్రేయంబులు గూర్చుమమ్మ! చిత్సుధలొలుకన్

2. సమస్య.

కొడుకా రమ్మనుచు నతడు కోతిని బిలిచెన్.

విడువకు సజ్జన మైత్రిని

తడయక పినతండ్రి మాట తలదాల్చుమనెన్

వడి వాలియె రామునికిడ

కొడుకా రమ్మనుచు నతడు కోతిని బిలిచెన్.

(వాలి అంగదునితో..తన ప్రాణోత్క్రమణ సమయంలో అంటున్న మాటలు)

3. దత్తపది

అమ్మ,కమ్మ, బొమ్మ, రెమ్మ..ఉదయవర్ణన

దివ్య భానుండు మాయమ్మ తిలకమయ్యె!

కమ్మతెమ్మెరల్ వీచగా కమలమువిడె!

పొద్దుపొడుపున నీరూపు బొమ్మగట్టె,

రెమ్మ రెమ్మకు పూలిచ్చె కొమ్మటంచు

4. వర్ణన.

శ్రీ కృష్ణ ని వర్ణన 

విశ్వో త్పత్తికి హేతువు 

విశ్వమ్మును నిలిపి ప్రోచువిష్ణుం డతడే! 

శశ్వత్ సాధు మనంబుల 

నాశ్వాసించెడు వెలుంగు నచ్యుతు గొలుతున్.

5. న్యస్తాక్షరి.

వ ర దు డు 1,2,3,4, అక్షరాలలో వరుసగా నాలుగు పాదాలలో

గరుస్తుతి, తేటగీతి 

దలె భవబంధ సంగతుల్ ప్రబలమనుచు

మశాంతమ్ము జూపుచున్ వరలునెపుడు

తనదు జీవనమార్గమే దార్శనికము

వరదుడు గురువు నాకిడె పరమ సఖము.

( అవధానిగారు ఈ పద్యాలన్నీ ధారణ చేసినారు)

జరిగినదేమిటంటే.

ఎందరెందరికో అవధాన శిక్షణాశిబిరంలో 

ఎంతకాలంగానో శిక్షణనిప్పిస్తున్న దత్తాత్రేయశర్మచేత అవధానం చేయించాలనే కోరిక నాకు కలిగింది.

సోదరభావంతో నన్ను కలియుటకు దత్తాత్రేయ సహోదరుఁడు కేవీయన్. ఆచార్యతో మాయింటికిరడం ,అంతలోనే  డా.సంగంభట్ల నరసయ్యగారు కూడా అనుకోకుండా రావడం జరిగింది. ఇదే మంచి అదునుగా భావించి నేను దత్తాత్రేయకు చెప్పకుండానే ప్రశ్నలు సంధిస్తుంటే దత్తాత్రేయసమాధానాలు చెప్పడానికి ఉపక్రమించడంతో నేనన్నాను. ఇది అష్టావధానమని. అయ్యో నేను చేయలేనన్నయ్యా అని వారన్నప్పటికీ ప్రయత్నం మానలేనందున నేను ప్రశ్నలతో ముందుకు నడిపించ సాగాను. ఆద్యంతం  అద్భుతమైన పూరణలతో నా ప్రశ్నకలు దీటుగా సమాధానం చెప్పారు. అతి స్వల్ప సమయంలో ఈ అవధానం పరిసమాప్తమవడంతో ఇదిక్షిప్రావధానం దత్తాత్రేయావధాని నిర్వహించింది. అని ఆచార్యులవారు ప్రకటించారు. ఇది అత్యద్భుతంగా సాగింది.

ఇంతటి చక్కని అవకాశం ఈ త్రిమూర్తుల రాకతో నాకు లభించినందునకు నాకు చాలా ఆనందంగా ఉంది.

కం.  దత్తాత్రేయసహోదర!

తత్తరపాటొందకుండ తగునుత్తరముల్

బత్తినియొసగిరిక్షిప్రము

కొత్తింతయు కాదనునటు గొప్పగ మీరల్.

అంటూ ప్రశంసలందఁజేశాను.

నా దత్తసహోదరుఁడు ఒక్కొక్కటిగా అవధానాలు చేయుచూ చక్కగా శతవధానములు త్వరత్వరగా పూర్తిచేసి నాకు మన మియాపూర్ మిత్రమండలికి ఆనందం కలిగించాలని, కన్నకలలు పండించాలని ఆశిస్తున్నాను.

జైహింద్.

12, డిసెంబర్ 2024, గురువారం

కొట్టే కోటారావే - గట్టిగ పెద్దన కవిత నగణ్య సుగతిలో - నిట్టే చదివిరి చూడుడు, - గట్టుతనయ యేలునితనిఁ గలకాలంబున్.

0 comments

 జైశ్రీరామ్.

సన్మిత్రులు శ్రీ కోటారావు పెద్దన ఉత్పలమాలిక ధారణ చేసి ఔరా అనిప్రశంసలందుకొన్న సన్నివేశం.
మైత్రీభావంతో సహృదయులైన చోడవర సుజనులైన నా మిత్రులు, పూజ్య మెరుగుమిల్లి వేంకటేశ్వరులు, న శిష్యుఁడు ప్రసాద్ ప్రత్యేకించి కోటారావుగారి దర్శనం చేసుకొని పొంగిపోతున్న అపురూప సన్నివేశం.
అందరికీ నా అభినందనలు.

జైహింద్.

ధర్మో మాతా పితా చైవ, ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ధర్మో మాతా పితా చైవ

ధర్మో బంధుః సుహృత్తథా।

ధర్మః స్వర్గస్య సోపానం

ధర్మాత్ స్వర్గ మవాప్యతే ॥

(చాణక్య నీతి)

తే.గీ. ధర్మమే తల్లి, తండ్రియు ధర్మమేను,

ధర్మమే సఖుఁడెన్నగా మర్మరహిత!

ధర్మమే మెట్లు దివిఁ జేర, తరచి చూడ,

ధర్మమున స్వర్గమొదవును, ధాత్రిజులకు.

భావము.  ధర్మమే తల్లి, తండ్రి, బంధువు, మంచి కోరే మిత్రుడు. 

ధర్మమే స్వర్గానికి సోపానం. ధర్మము వలననే స్వర్గాన్ని సంప్రాప్తిస్తుంది.

జైహింద్. 

నతథేచ్ఛన్తి కల్యాణాన్. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  నతథేచ్ఛన్తి కల్యాణాన్ - పరేషాం వేదితుం గుణాన్

యథేషాం జ్ఞాతుమిచ్ఛన్తి - నిర్గుణ్యం పాపచేతసః.

(విదుర నీతి)

తే.గీ.  పరుల దుర్గుణ గణనకు పాపి యెపుడుఁ

జూపు నాసక్తి నిజమిది, చూతుముకద,

పరుల సుగుణ సద్గణనమే వాని మదికి

రాదు, చిత్రంబిదేకదా, ప్రాజ్ఞులార!

భావము.  పాపాత్ములు ఇతరుల దుర్గుణములను తెలుసు కొనుటకు ఎంతగా 

ఆసక్తి గలవారగుదురో అంతగా వారి సద్గుణములను అన్వేషించుటకు మాత్రం 

ఆసక్తులు కానేరరు.

జైహింద్.

11, డిసెంబర్ 2024, బుధవారం

హిందూ సంప్రదాయ వివాహ ప్రక్రియ.

0 comments

జైశ్రీరామ్. 

హిందూ సంప్రదాయ వివాహ ప్రక్రియ 

 వరుసగా జరగాల్సిన 54 క్రతువులు 

1. కన్యావరణం:

2. పెళ్ళి చూపులు

3. నిశ్చితార్థం:

4. అంకురార్పణం:

5. స్నాతకం:

6. సమావర్తనం:

7. కాశీయాత్ర:

8. మంగళస్నానాలు:

9. ఎదురుకోలు:

10. వరపూజ:

11. గౌరీపూజ:

12. పుణ్యాహవాచనం:

13. విఘ్నేశ్వరపూజ:

14. రక్షా బంధనం:

15. కొత్త జంధ్యం వేయడం:

16. గౌరీ కంకణ దేవతాపూజ:

17. కౌతుక ధారణ:

18. కంకణ ధారణ:

19. మధుపర్కము:

20. వధువును గంపలో తెచ్చుట:

21. తెరచాపు

22. మహా సంకల్పం:

23. కన్యాదానం:

24. వధూవరుల ప్రమాణములు:

25.సుముహూర్తం-జీలకర్ర-బెల్లం:

26. స్వర్ణ జలాభిషేకం:

27. చూర్ణిక:

28. వధూవర సంకల్పం:

29. యోక్త్రధారణం:

30. మాంగల్య పూజ:

31. మాంగల్య ధారణ:

32. అక్షతలు-తలంబ్రాలు:

33. బ్రహ్మముడి:

34. సన్నికల్లు తొక్కడం:

35. కాళ్లు తొక్కించడం:

36. పాణి గ్రహణం:

37. సప్తపది:

38. లాజహోమం:

39. యోక్త్రవిమోచనం:

40. స్థాళీపాకం:

41. ఉంగరాలు తీయడం:

42. బొమ్మని అప్పగింత:

43. నాగవల్లి:

44. ధ్రువనక్షత్రం:

45. అరుంధతి నక్షత్ర దర్శనం:

46. అప్పగింతలు:

47. అత్తమామలకు వధువు పూజ:

48. ఫలప్రదానం:

49. పానుపు:

50. మహదాశీర్వచనం:

51. వధువు గృహప్రవేశం:

52. కంకణ విమోచన:

53. గర్భాదానం:

54. పదహారు రోజుల పండుగ


 హిందువుల పెళ్లి తంతులో తారసపడే ఘటనలు. మనం పురోహితుల వారిని 

తొందరపెడితే, కొన్ని జరగవు. వారి పని వారిని చేయనీయండి.. 

ఫోటోగ్రాఫర్ ని వీటిలో దూరనీయకండి..

జైహింద్.

10, డిసెంబర్ 2024, మంగళవారం

చిన్నికృష్ణుని అల్లరి చూడాల్సిందే మరి!#srikrishna#శ్రీకృష్ణ#bulusuaparna...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

స్వాతంత్ర్యం వచ్చినప్పుడే పాకిస్తాన్ హిందూస్థాన్ గా విడిపోయాం. మనది హిందూస్థాన్.

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

8, డిసెంబర్ 2024, ఆదివారం

కారణాన్మిత్రతాం యాతి, ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  కారణాన్మిత్రతాం యాతి  -  కారణాదేతి శత్రుతాం ౹

తస్మాన్మిత్రత్వమేవాత్ర - యోజ్యం, వైరంనధీమతా.     

తే.గీ.  కారణముచేతసన్మైత్రి కలుగ వచ్చు,

కారణముననే వైరమున్ గలుగవచ్చు,

మైత్రినేకోరఁ దగునిల మహితులెపుడు,

వైరదూరంబుగానుండి వరలుటొప్పు.      

భావము.  ఏదైనా విషయముతో స్నేహం అయ్యి ఉండవచ్చు.అలాగే 

ఏదో కారణంతో శత్రుత్వం అయ్యి ఉండవచ్చు.అందువల్ల వివేకశాలి అయినవాడు 

స్నేహాన్ని వృద్ధి చేసుకోవాలే కానీ శత్రుత్వాన్ని కాదు.

జైహింద్. 

ఐఐటి విద్యార్థి అవధాన కళా కౌముది నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అష్టావధానము.

0 comments

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః🙏🏼

నేను ప్రారంభిస్తూ చెప్పిన పద్యము.
పంచమ పాద గోపన, భావ గోపన  చిత్ర ఉత్పలమాల.
👇🏼
శ్రీగణమైన యీ సభను, శ్రీవర సాహితి జిల్గు లీనుతన్.
శ్రీగురుపాళి దర్పిలఁగ శ్రీకర  సంహిత నాన్ మనీషులున్
వే గణుతింప, బత్తులు నివే కవి సత్కృతు లంచనన్ సన
చ్ఛ్రీ గుణుఁ డైన నీతఁ డు వచించి రయంబున, వెల్గు సత్ ప్రభన్.
🙏🏼
గోపనముగనున్న పంచమ పాదము.
👇🏼
శ్రీగుణుడై/న దత్తుఁడు/ను, శ్రీకర /సాహితు వె/ల్గు నీ సభన్./


జైహింద్.

7, డిసెంబర్ 2024, శనివారం

అష్టావధాని అవధానకిశోరం నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అష్టావధానము ఈ రోజు కూకట్ పల్లిలో.07 - 12 - 2024.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.


6, డిసెంబర్ 2024, శుక్రవారం

దుంపెట నారసింహ శతకమునందలి పద్మబంధ సీసము. ప్రాచీకవి. సేకరణ చిత్ర నిర్మాణము సమర్పణ బ్రహ్మశ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.



3, డిసెంబర్ 2024, మంగళవారం

భక్తిసాధనం శతాంశ పూరణలో 20 వర్ణనలు. శ్రీ పండరివారి కృషికి జోహార్లు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

'ధ్రువంతే రాజావరుణో. (ఋగ్వేద /10వమండలం/173వ సూక్తము/5వ మంత్రము.) ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

మం.  'ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతి:

ధ్రువంత ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతాం ధ్రువమ్".

(ఋగ్వేద /10వమండలం/173వ సూక్తము/5వ మంత్రము.)

తే.గీ.  వరుణ రాజు స్థిరంబుగా వరలుగాక,

వర నృహస్పతి స్థిరుఁడయి ప్రబలు గాక,

యింద్రుఁడునునగ్ని, స్థిరమునునెనయుగాక,

రాజ్యమును సుస్థిరమునిల్పి రక్షనిడుత.

భావము.  వరుణ రాజు స్థిరుడు అగును గాక. బృహస్పతి దేవత స్థిరుడు అగునుగాక. 

ఇంద్రాగ్నులు స్థిరులై రాజ్యమును స్థిరముగ పోషింతురుగాక. ప్రభుత్వం 

పంచభూతము లంతటి స్థిరం కావాలి.

జైహింద్.

త్రిభిఃవర్షైః త్రిభిర్మాసైః, ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  త్రిభిఃవర్షైః త్రిభిర్మాసైః - త్రిభిఃపక్షైః త్రిభిర్దినైః |

అత్యుత్కటైః పుణ్యపాపైః - ఇహైవ ఫలమశ్నుతే ||

తే.గీ.  కలియుగంబున చేసెడి కర్మఫలము

మూడు వత్సరములలోనొ, మూడు నెలల

లోనొ, మూడుపక్షములందొ, గాన  ననుభ

వించుదుము దినత్రయమందొ, విశ్వభాస!

భావము.  ఈ కలియుగంలో మనం చేసే పాపపుణ్యముల స్వభావాన్ని అనుసరించి 

వాటి ఫలములను మూడు సంవత్సరాలు, మూడు నెలలు, మూడు పక్షాలు 

లేదా మూడు దినములలో అనుభవిస్తాము.

జైహింద్.

2, డిసెంబర్ 2024, సోమవారం

హరవిలాసము - పరిచయం పుస్తకావిష్కరణ సభలో నా పద్యపఠనము.

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

భక్తిసాధనం నిర్వాహకులు శ్రీ పండరి రాధాకృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

0 comments

 మంత్ర పుష్పంలో అంతరిక్షం - 2-- ఆర్. శర్మ దంతుర్తి

భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదనీ, మన మనసులోనే ఉన్న భగవంతుణ్ణి చూడాలంటే అంతర్దృష్టి ఉంటే చాలనీ క్రితం నెల లో ప్రచురించబడిన మంత్రపుష్పం మొదటి భాగంలో చూసాం. మరి ఆ అంతర్దృష్టి వచ్చే దారిలో మనం దేహం చాలిస్తే, మన భూమి మీద మనుగడ కుదరకపోతే ఏం చేయాలో ఈ రెండో భాగమైన యోపాం పుష్పం మనకి దిశానిర్దేశం చేస్తున్నట్టూ మనం గమనించవచ్చు.


యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి

చంద్రమా వా అపాం పుష్పమ్ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి

య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


ఎవరైతే జలముని పుష్పంగా తెలుసుకుంటున్నాడో, ఎవరైతే చంద్రుడే ఈ భూమిమీద జలాలకి ఆథారభూతుడిగా తెలుసుకుంటున్నారో వారు మంచి యువతులని కలవాడు, మంచి సంతానం కలవాడు అవుతున్నాడు. అంటే మొదట భూమి మీద మనుగడకి కారణం నీరు కనక ఆ నీరు చంద్రుడివల్ల సాథ్యమైంది. అలా చంద్రుడు కారణం అని తెలుసుకుంటే ముందు ముందు ప్రజోత్పత్తికీ, మనుషుల మనుగడకీ మంచిది. కుటుంబ వృధ్ధికి/మరో జన్మలో బ్రహ్మాన్ని తెలుసుకునేదానికీ కారణం ఇదే.


అగ్నిర్వా అపామాయతనం, ఆయతనవాన్ భవతి

యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


నీరు అయ్యాక చూడవల్సింది నిప్పు. అగ్ని ఈ జలాలకి ఆథారం. అలాగే జలాలకి అగ్ని ఆథారం అవుతూ రెండూ పరస్పరాథారాలవుతున్నాయి. మనకి తెలిసిన కొత్త పరిశోధనలలో కూడా ఇదే చెప్పేది. మొదట్లో ఈ భూమిమీద నీరు తప్ప ఏమీ ఉండేది కాదు. తర్వాత ప్రాణికోటి నీటిమీదనుంచి భూమిమీదకి వచ్చింది. దశావతారాల్లో చెప్పినట్టూ మొదట్లో జలచరాలు, తర్వాత మెల్లిగా ఒక్కో జీవరాశి వృధ్ధి చెందుతూ ఇప్పుడు మనుషుల్లా అయ్యాక దశావతారం చివరిలో పై లోకాలకి కల్కి తన గుర్రంమీద తీసుకెళ్తాడని కధనం అనుకుంటే, తెలిసేదేమంటే రాబోయే రోజుల్లో అంతరిక్షంలోకి మన ప్రయాణం తప్పనిసరి. మనం వాడే పదార్ధాలవల్లా, వ్యర్ధాలవల్లా ఈ భూమి నాశనం అయితే ఇంక మిగిలేది ఏమీ ఉండదు కనక అంతరిక్షం లోకి చూసుకోవాలి. అలా పైకి చూసినపుడు మనకి కావాల్సిందేమిటి? నీరు, అందులో ఉన్న ఉదజని, ప్రాణవాయువుల వల్లే మనం నిప్పుకూడా తయారు చేసుకోవచ్చని మనం చదువుకునే కొత్త శాస్త్రం కూడా ఘోషించేది. అందువల్ల రాబోయే మంత్రంలో చెప్పేది వాయువు గురించి.


వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి

యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


నీటికి ఆధారమైనది వాయువు. అందువల్ల నీరు, ప్రాణవాయువు ఒకదానికొకటి పరస్పరాధారితాలు అని తెలుసుకున్నవాడే ఉత్కృష్టపదం ఎరిగినవాడు. ఇక్కడ మనకి తెలిసేదేమంటే, ఉదజని ఒక్కటే ఉంటే చాలదు. ప్రాణవాయువు ఉండాలి మనం వెదికే అంతరిక్షంలో. ఆ ప్రాణవాయువు, నీరు, ఒకదానికొకటి ఆధారితం.


అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి

యోముష్య తపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపోవా అముష్య తపత ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


నీటికి ఉన్న ప్రాధాన్యత చెప్పారు కనక ఇప్పుడు ఆ నీటికి ఆధారితం అయిన సూర్యుడి గురించి చెప్తున్నారు. అంటే మనం బతకగలగాలంటే మనకో వెలుగు ఇచ్చే నక్షత్రం అవసరం. అదే మనకి వెలుగూ, మనకి కావాల్సిన ప్రాణవాయువూ, ఉదజనీ, వీటివల్ల కలిగే నీరు లభించేది. ఇవన్నీ ఒకదానికొకటి పరస్పరాధారితాలు.


చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి

యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


సూర్యుడికెంత ప్రాముఖ్యతో చంద్రుడికి కూడా అదే ప్రాముఖ్యత ఉన్నట్టు, చంద్రుడి వల్లే మనకి సముద్రంలో ఆటుపోట్లు కలుగుతున్నట్టూ తెలుసు. అందువల్ల నక్షత్రం ఒకటి ఉండాలి, వాయువు ఉండాలి, ఉదజని ఉండాలి అని చెప్పాక, ఫలానా భూమిలా బతికే గ్రహం ఉండాలంటే దానిక్కావాల్సిన చంద్రుడు లాంటి ఉపగ్రహం కూడా ఉండాలి మనిషి మనుగడకి. అందువల్ల ఇందులో చెప్పేదేమంటే చంద్రుడు, నీరూ పరస్పరాధారితాలు. ఇది తెలుసుకున్నవారు చక్కని ఉనికిపట్టుగలవారవుతున్నారు.


నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి

యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపో వై నక్షత్రాణామాయతనమ్ ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


ఇప్పటివరకూ చదివినది చూస్తే మనకి కావాల్సినది ఓ గ్రహ మండలం, ఒక మంచి సూర్యుడు, ఒక చంద్రుడు, అగ్ని, వాయువు, నీటిని కలిగించే ఉదజని, ప్రాణవాయువు అనేవి. మరి వీటినెక్కడ చూడడం అంతరిక్షంలో? ఇప్పుడు చెప్పేది, నక్షత్రాలకేసి దృష్టి సారించమని. మనకున్న ఈ సూర్యుడివంటి నక్షత్రాలకేసి చూడాలి. ఆ నక్షత్రాలూ, నీరూ పరస్పరాధారితాలు అని తెలుసుకున్నవారే ముక్తిపదం పొందగలుగుతున్నారు.


పర్జన్యో వా అపామాయతనమ్ ఆయతనవాన్ భవతి

యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపో వై పర్జన్యస్యాయతనమ్ ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


సరే ఇప్పుడు మనం చూడాల్సింది నక్షత్రాలకేసి కదా మరి అవెక్కడున్నాయి? సూర్యుడు కేంద్రంగా ఉన్న మనం మనకున్న నవగ్రహాలూ, గ్రహమండలం దాటి బయటకెళ్ళాలి. ఆ బయటకి ఎంతదూరం వెళ్ళాలనేది ఈ మంత్రం చెపుతోంది. మేఘాలు దాటాలి. మేఘం అంటే మనకి కనిపించే వర్షించే మేఘం అనుకుంటే ఈ వర్షించే మేఘాలు మన వాతావరణం దాటితే ఉండవు కదా, మరెలా? అందువల్ల మేఘం అంటే మన గ్రహమండలం దాటాక ఉండేదేమిటా అని ఆలోచిస్తే మనకి తెలిసేది ‘క్యూపర్ బెల్ట్’ అనే అనేకానేక కలశాలతో చుట్టూరా కప్పుకున్న మేఘం. అది దాటితే గ్రహాంతరాళంలో ఉన్న మిగతా నక్షత్రాలకి వెళ్లవచ్చన్నమాట. అందువల్ల ఈ పర్జన్యం తెలుసుకున్నవాడే ముక్తికి దగ్గిరౌతున్నాడు. మరి అక్కడకి వెళ్లడం ఎలాగయ్యా అనేది తర్వాతి మంత్రం చెపుతోంది.


సంవత్సరో వా అపామాయతనమ్ ఆయతనవాన్ భవతి

యస్సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపో వై సంవత్సరస్యాయతనమ్ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోప్సు నావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్ఠతి


వెళ్ళేదూరం అతి ఎక్కువకాబట్టి వెయ్యిమైళ్ల వేగంతో వెళ్ళినా అంత దూరం వెళ్ళడానికి మనకి ఆయుర్దాయం చాలదు. అందువల్ల కాంతివేగంతో వెళ్ళాలిట. అలా కొలిచే దూరాన్నే మనం కాంతిసంవత్సరం అంటున్నాం కాబట్టి ఈ మంత్రం చెప్పే సంవత్సరం, కాంతి సంవత్సరం అనుకుంటే నీటికి ఆధారితమైన నక్షత్రాలకి వెళ్ళే కాంతిసంవత్సరాన్ని ఎరిగినవాడే బాగా ఎరుక తెల్సినవాడు.


కిం తద్విష్ణోర్బల మాహుః కాదీప్తిః కింపరాయణం

ఏకో యద్ధారయద్దేవః రేజతీ రోదసీ ఉభే


అందువల్ల ఒక్కో నక్షత్రం వెదుకుకుంటూ ఈభూమి పోయినా భగవంతుణ్ణి తెలుసుకునేవరకూ మనుగడ సాగించాలి. మరి ఈ భగవంతుడి భూమ్యాకాశాలలో ఉన్నాడా లేకపోతే మనం సృష్టించుకున్న భగవంతుడు ఈ భూమిమీదేనా ఉండేది అనే ప్రశ్నకి సమాథానం ఈ మంత్రం.  రోజతీ, రోదసీ లలో ఉండే భగవంతుడు భూమ్యాకాశాలని భరించగలిగేవాడు. మరి అతనికెలా ఇటువంటి తేజస్సు ఎలా సాథ్యమౌతోంది?


వాతాద్విష్ణోర్బల మాహుః అక్షరాద్దీప్తిః రుచ్యతే

త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్తమమ్


వాయువువల్ల బలం, శాశ్వతుడు కనక తేజస్సు కలుగుతున్నాయి. త్రిపాదాద్విభూతి, మూడు అంశాల వల్ల ఈ భూమ్యాకాశాలనీ అంతరిక్షాన్నీ భరించగలుగుతున్నాడు. అలా భరించగలుగుతున్నాడు కనక భగవంతుడొక్కడే ఉత్తముడు.


రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమోవయం వై

స్రవణాయకుర్మహే సమే కామాన్ కామకామాయ

మహ్యం  కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరా

య వై స్రవణాయ మహారాజాయ నమః


మనకి ఏం చేయాలో తెలిసింది కానీ మనం చేసే ఈ పనులు, మన మనుగడకి కనుక్కో బోయే మరో భూమీ మనకి సులభంగా దొరుకుతాయా? మనం చేసే ప్రయత్నాలు చేసాక అవి ఫలించడానికి శరణు అనడం తప్ప మనం ఏం చేయగలం? అందువల్ల ఈ ప్రార్థన ఇప్పుడు – పరమోత్కృష్టమైన భగవంతుడు విశేషశ్రవణ శక్తి ఉన్నవాడు కనక మన కోరికలు తీర్చుగాక. విశేషశ్రవణ శక్తి ప్రస్తావన ఎందుకంటే ఆయనెక్కడో విశ్వాంతరాళంలో ఉన్నా ఆయనకి చీమ చిటుక్కుమన్నా వినిపించగలదు. అందువల్ల మనం శరణువేడేది ఆయనకి తెలిసి తీరుతుంది.


ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా

ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమః

అన్తశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు


ప్రణవాక్షరమైన ఓం అనేది గ్రహ నక్షత్రమండలాలు తిరుగుతుంటే వచ్చే శబ్దం అనుకున్నాం కనక అలా గ్రహగతులు దాటాక ప్రణవప్రతిపాదితమైనదే బ్రహ్మ, అదే వాయువు, అదే ఆత్మస్వరూపం, అదే సత్యం, అదే సర్వానికీ ఆధారభూతమై ఉంది. అనేక భూతాలలో అంతస్వరూపంగా నిబిడీకృతమై ఉన్న దానికి నమస్కారం.


త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమిన్ద్రస్త్వగ్ం రుద్రస్త్వంవిష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః

త్వం తదాప ఆపోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్


భగవంతుణ్ణి ఏ రూపంలో కొలిచినా, ఎలాగ ఊహించుకున్నా, ఈ ఓంకారానికి కారణమైన పరమేశ్వరుడైనవాడూ, యజ్ఞరూపుడైనవాడూ, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపుడూ అందరూ ఒకరే.


ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్

బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్


ఈశానుడనే పేరుతో సర్వ విద్యలకీ కారణమైనవాడు – సర్వవిద్యలూ మరో భూమి వెతుక్కోవడంలో సాయపడతాయి కాబట్టి, ప్రాణికోటికి అథిపతీ అయిన పరమాత్మ మనలని అనుగ్రహించుగాక.


తద్విష్ణో పరమం పదగ్ం సదా పశ్యన్తి సూరయః  దివీవ చక్షు రాతతమ్

తద్విప్రాసో విపన్వవో జాగృదాం సస్సమిన్దతే విష్ణోర్య త్పరమం పదమ్


పండితులు, అంటే ఋషులైనవారు ఇక్కడే తమ హృదయంలో కనుకొన్న భగంతుణ్ణి తాము దర్శించిన జ్ఞానం వల్ల కన్నులకి కట్టినట్టూ దర్శించగలుగుతున్నారు. అంటే ఈ భూమిమీదో, అంతరిక్షంలో మనం కనుక్కోబోయే మరోచోటో మొత్తానికి భగవంతుణ్ణి దర్శించగలిగేది మాత్రం, మొదట్లో చెప్పినట్టు మన హృదయంలోనే.


ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళమ్, ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమోనమః

ఓమ్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్


మోక్షపదంలో ఉండేవాడూ, కృష్ణవర్ణంలో ఉండేవాడూ, పరబ్రహ్మమూ అయిన భగవంతుడికి నమస్కారం. ఇది మనం చేసే పనులకి శక్తి ఇవ్వడానికీ, శరణువేడే దారిలో చేసే మరో ప్రార్థన. అయితే ప్రతీ మనిషి తలొక విధంగా ప్రార్ధన చేస్తాడు కనక ఎవరెలా చేసినా మొత్తానికి మనసు ముఖ్యంగానీ రూపురేఖలూ రంగులు ముఖ్యం కాదనీ ఎవరెలా ప్రార్థన చేసినా భగవంతుడు ఒకడేననీ చెప్పేది చివరి మంత్రం.


ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి


ఆకాశంలోంచి కిందపడే నీరు ఏ విధంగా అయితే సముద్రాలకి చేరుతోందో అదే విధంగా ఏ దేవుడికి నమస్కారం పెట్టినా అది ఒకే భగవంతుణ్ణి చేరుతోంది.


మొత్తానికి మనకి తెలిసేదేమంటే భగవంతుణ్ణి దర్శించడానికి మనం చూడవల్సినది ఒకటే దారి – మన మనసులోకి. అది కష్టం కనకా, మన ఆయుర్దాయం చాలదు కనకా అలా ప్రయత్నాలు చేస్తూ ఒక జన్మ తర్వాత మరో జన్మ ఎత్తున్నప్పుడు ఈ భూమి మీద మనుగడ కష్టం కనక వేరే చోటు వెతుక్కోవడం తప్పనిసరి. వేరే గ్రహగతుల్లోకి వెళ్ళినా, భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం అనన్య శరణాగతీ, అంతర్దృష్టీ. నాన్యపంథా విద్యతే అయనాయ – ఈ దారి తప్ప ఎంత, ఎవరు, ఎలా, ఎక్కడ గింజుకున్నా, వేరు దారి లేదు.


***సమాప్తం***