గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఏకాక్షర చమత్కార శ్లోకము

జైశ్రీరామ్.

శ్లో.  దాదదో దుద్దదుద్దాదీ 
దాదదోదూదదీదదోః 
దుద్దాదం దదదే దుద్దే 
దాదాదద దదోऽదదః .

ప్రతిపదార్థ :
దాదదః =శ్రీ కృష్ణుడు,
దుద్దరుత=వరముల నన్నిటిని,
దాదీ=ఇచ్చువాడు,
దాదదః=పాపములను దహించు వాడు,
దదోః=దుష్టులను,
దూదదీ = శిక్షించు వాడు
దుద్దాదం = మంచి వారిని ,
దుద్దే = కాపాడుట యందు ,
దదదే = దీక్ష గలవాడు
దదోదదః = ధర్మాధర్మములను ,
దాదా = మిక్కిలిగా ,
ద ద = ధరించువాడు అనగా ధర్మమును ,అధర్మములోని ధర్మమును కాపాడు వాడు
భావం.
శ్రీకృష్ణుడు అన్ని వరాలను ఇచ్చేవాడు, పాపసంహారకుడు, పరిశుద్ధుడు, దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడేవాడు, ధర్మరక్షకుడు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.