గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, సెప్టెంబర్ 2020, గురువారం

భారవాహ,నరమేథా,భరాస,స్వార్ధతా,చెరజేర్చు,దిట్టతా,జెట్టితనం,భీతచేష్టనా,తగనా,తగునొకో,గర్భ"-నీతిచేపు"-వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ

జైశ్రీరామ్.
భారవాహ,నరమేథా,భరాస,స్వార్ధతా,చెరజేర్చు,దిట్టతా,జెట్టితనం,భీతచేష్టనా,తగనా,తగునొకో,గర్భ"-నీతిచేపు"-వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.
                           
"-నీతిచేపు"-వృత్తము.
ఉత్కృతి ఛందము.భ.ర.ర.స.భ.త.స.జ.లగ.గణములు.యతులు,10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాపుల చేష్టలం భీతిలన్!పరమాత్మా!తగునొకో?పట్టును జూప వేమి?హరా!
తాపమునొందెనే?లోకమున్!తరుగేదీ?చెడునకున్!తట్టుకొనంగ లేదిలయున్!
తీపి కబుర్ల నాశాంతమున్!స్థిరధర్మంబు వెడలెన్!దిట్టతనంబు మాయ గనెన్!
చేపుమి నీతినిన్!దైవమా!చెర జేర్చన్వలె చెడున్!జెట్టిగ దీర్చు ధర్మ మిలన్!
1.గర్భగత"-భారవాహ"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.ర.గణములు.వృ.సం.157.
ప్రాసనియమభు కలదు.
పాపుల చేష్టలం భీతిలన్!
తాపము నొందెనే?లోకమున్!
తీపి కబుర్ల నాశాంతమున్!
చేపుమి!నీతినిన్!దైవమా!
2.గర్భగత"-నరమేథా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.భ.లగ.గణములు.వృ.సం.116.
ప్రాసనియమము కలదు.
పరమాత్మా!తగునొకో?
తరుగేదీ?చెడునకున్!
స్థిర ధర్మంబు వెడలెన్!
చెర జేర్చన్వలె!చెడున్!
3.గర్భగత"-భరాశా"-వృత్తము.
బృహతీఛందము.స.భ.య.స.జ.లగ.గణములు.వృ.సం.215.
ప్రాసనియమము కలదు.
పట్టును జూపవేమి?హరా!
తట్టు కొనంగ లే దిలయున్?
దిట్టతనంబు మాయ గనెన్!
జెట్టిగ దీర్చు ధర్మ మిలన్!
4.గర్భగత"-స్వార్ధతా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.ర.స.భ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాపుల చేష్టలం భీతిలన్!పరమాత్మా తగు నొకో?
తాపము నొందెనే!లోకమున్!తరుగేదీ?చెడునకున్!
తీపి కబుర్ల నాశాంతమున్!స్థిర ధర్మంబు వెడలెన్!
చేపుమి నీతినిం!దైవమా!చెర జేర్చన్వలె!చెడున్!
5.గర్భగత"-చెరజేర్చు వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.య.స.జ.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరమాత్మా!తగునొకో?పట్టును జూపవేమి?హరా!
తరుగేదీ?చెడునకున్!తట్టు కొనంగ లేదిలయున్?
స్థిర ధర్మంబు వెడలెన్!దిట్ట తనంబు!మాయ గనెన్!
చెర జేర్చన్వలె!చెడున్!జెట్టిగ దీర్చు ధర్మ మిలన్!
6.గర్భగత"-దిట్టతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.య.స.జ.య.య.య.లగ.గణములు.యతులు.
9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
పరమాత్మా!తగునొకో?పట్టును జూపవేమి?హరా!పాపుల చేష్టలం భీతిలన్!
తరుగేదీ?చెడునకున్తట్టు కొనంగ లేదిలయున్?తాపము నొందెనే!లోకమున్?
స్థిర ధర్మంబు వెడలెన్!దిట్టతనంబు మాయగనెన్!తీపి కబుర్ల నాశాంతమున్!
చెర జేర్చన్వలె చెడున్!జెట్టిగ దీర్చు ధర్మ మిలన్!చేపుమి నీతినిం !దైవమా!
7.గర్భగత"-జెట్టితనం"-వృత్తము.
ధృతిఛందము.భ.ర.స.భ.ర.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పట్టును జూపవేమి?హరా!పాపుల చేష్టలం భీతిలన్!
తట్టు కొనంగ లేదిలయున్?తాపము నొందెనే!లోకమున్!
దిట్టతనంబు మాయ గనెన్!తీపి కబుర్ల నాశాంతమున్?
జెట్టిగ దీర్చు ధర్మ మిలన్!చేపుమి నీతినిం!దైవమా!
8.గర్భగత"-భీత చేష్టనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.స.భ.ర.ర.స.భ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పట్టును జూపవేమి?హరా!పాపుల చేష్టలం భీతిలన్!పరమాత్మా!తగునొకో?
తట్టుకొనంగ లేదిలయున్?తాపమునొందెనే!లోకమున్!తరుగేదీ?చెడునకున్!
దిట్టతనంబు మాయగనెన్!తీపికబుర్ల నాశాంతమున్!స్థిరధర్మంబు వెడలెన్!
జెట్టిగ దీర్చు ధర్మమిలన్!చేపుమి నీతినిం!దైవమా!చెర జేర్చన్వలె చెడున్!
9.గర్భగత"-తగని"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.య.స.య.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరమాత్మా!తగునొకో?పాపుల చేష్టలం భీతిలన్!
తరుగేదీ?చెడునకున్!తాపము నొందెనే!లోకమున్!
స్థిర ధర్మంబు వెడలెన్!తీపి కబుర్ల నాశాంతమున్!
చెర జేర్చన్వలె చెడున్!చేపుమి నీతినిం దైవమా!
10,గర్భగత"-తగునొకో"-వృత్తము.
ఉత్కృతి ఛందము.స.భ.య.స.య.య.స.జ.లగ.గణములు.యతులు9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరమాత్మా!తగునొకో?పాపుల చేష్టలం భీతిలన్!పట్టును జూపవేమి?హరా!
తరుగేదీ!చెడునకున్?తాపమునొందెనే!లోకమున్!తట్టు కొనంగ లేదిలయున్
స్థిర ధర్మంబు వెడలెన్!తీపి కబుర్ల నాశాంతమున్!దిట్టతనంబు మాయ గనెన్
చెర జేర్చన్వలె!చెడున్!చేపుమి నీతినిం దైవమా!జెట్టిగ దీర్చు ధర్మమిలన్!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.