గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సూక్తి,చిత్రపద,జరాశ్రి,తృటిని,త్యాజ్యతా,తురాయినా,మూర్ఖతా,భూషణా,భూషలు,కటుతర,గర్భ"-పరమొందు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
సూక్తి,చిత్రపద,జరాశ్రి,తృటిని,త్యాజ్యతా,తురాయినా,మూర్ఖతా,భూషణా,భూషలు,కటుతర,గర్భ"-పరమొందు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.
                       
"-పరమొందు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.ర.భ.భ.త.ర.య.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కటుతర మూర్ఖ సంకటుల్!కళ్ళెముబట్ట హయంబుల్!కరోన రోగబారి పడున్!
పటుతర భాగ్య భూషలున్!పళ్ళెము జేర్చి విడంగన్!పరంబు నొంద జాలు నొకో?
తృటిని హరించు రోజులన్!తృళ్ళుతనంబది పోవున్!తురాయి తుల్యమౌ! నిలలోన్!
పిటమునె జేరు తీరగున్!వెళ్ళును సంపద లెల్లన్!బిరాన త్యాజ్యుడౌ సిరుల్!
పిటము=గుడిసె

1.గర్భగత"-సూక్తి"-వృత్తము.
బృహతీఛందము.న.జ.ర.గణములు.వృ.సం.176.
ప్రాసనియమము కలదు.
కటుతర మూర్ఖ సంకటుల్!
పటుతర భాగ్య భూషలున్!
తృటిని హరించు రోజులన్?
పిటమునె జేరు తీరగున్!
2.గర్భగత"-చిత్రపద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.భ.గగ.గణములు.వృ.సం.55.
ప్రాసనియమము కలదు.
కళ్ళెము బట్ట హయంబుల్!
పళ్ళెము జేర్చి విడంగన్
తృళ్ళుతనంబది పోవున్!
వెళ్ళును సంపద లెల్లన్!
3.గర్భగత"-జరాశ్రి"-వృత్తము.
బృహతీఛందము.జ.ర.స.గణములు.వృ.సం.214.
ప్రాసనియమము కలదు.
కరోన రోగ బారి పడున్!
పరంబు నొంద జాలునొకో?
తురాయి తుల్య మౌ!నిలలోన్!
బిరాన త్యాజ్యుడౌ!సిరులున్!
4.గర్భగత"-తృటిని"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.ర.భ.భ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వో.సం.
కటుతర మూర్ఖ సంకటుల్!కళ్ళెము బట్ట హయంబుల్!
పటుతర భాగ్య భూషలున్!పళ్ళెము జేర్చి విడంగన్!
తృటిని హరించు రోజులన్?తృళ్ళు తనంబది పోవున్!
పిటమున జేరు తీరగున్!వెళ్ళును సంపద లెల్లన్!
5.గర్భగత"-త్యాజ్యతా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.త.ర.జ.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కళ్ళెము బట్ట హయంబుల్!కరోన రోగబారి పడున్!
పళ్ళెము జేర్చి విడంగన్!పరంబు నొంద జాలునొకో?
తృళ్ళు తనంబది పోవున్!తురాయి తుల్యమౌ!నిలలోన్!
వెళ్ళును సంపద లెల్లన్!బిరాన త్యాజ్యుడౌ!సిరులున్!
6.గర్భగత"-తురాయినా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.ర.జ.జ.న.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కళ్ళెముబట్టి హయంబుల్!కరోన రోగబారి పడున్!కటుతర మూర్ఖ సంకటుల్!
పళ్ళెము జేర్చి విడంగన్!పరంబు నొంద జాలునొెకో?పటుతర భాగ్య భూషలున్!
తృళ్ళుతనంబది పోవున్!తురాయి తుల్యమౌ!నిలలోన్!తృటిని హరించు రోజులన్?
వెళ్ళును సంపద లెల్లన్!బిరాన త్యాజ్యుడౌ సిరులున్!పిటమున జేరు తీరగున్!
7.గర్భగత"-మూర్ఖతా"-వృత్తము.
ధృతిఛందము.జ.ర.స.న.జ.ర.గణములు యతి 10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరోన బారిపడున్!కటుతర మూర్ఖ సంకటుల్!
పరంబు నొంద జాలునొకో?పటుతర భాగ్యభూషలున్?
తురాయి తుల్యమౌ!నిలలోన్!తృటిని హరించు రోజులన్?
బిరాన త్యాజ్యుడౌ!సిరులున్!పిటమున జేరు తీరగున్!
8.గర్భగత"-భూషణా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.స.న.జ.ర.భ.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరోన రోగబారి పడున్!కటుతర మూర్ఖ సంకటుల్!కళ్ళెము బట్టి హయంబుల్!
పరంబు నొంద జాలునొకో?పటుతర భాగ్యభూషలున్!పళ్మెము జేర్చి విడంగన్?
తురాయి తుల్యమౌ!నిలలోన్!తృటిని హరించు రోజులన్!తృళ్ళు తనంబది పోవున్!
బిరాన త్యాజ్యుడౌ!సిరులన్! పిటమున జేరు తీరగున్!వెళ్ళును  సంపద లెల్లన్!
9,గర్భగత"-భూషలు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.త.న.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
   ప్రాసనియమము కలదు.వృ.సం.
కళ్ళెముబట్టి హయంబుల్!కటుతర మూర్ఖ సంకటుల్!
పళ్ళెము జేర్చి విడంగన్!పటుతర భాగ్య భూషలున్!
తృళ్ళుతనంబది పోవున్తృటిని హరించు రోజులన్!
వెళ్ళును సంపద లెల్లన్? పిటమున జేరు తీరగున్!
10,గర్భగత"-కటుతర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.త.న.ర.జ.ర.జ.లగ.గణములు.యతులు.9,18.
పూరాసనియమము కలదు.వృ.సం.
కళ్ళెము బట్టి హయంబుల్!కటుతర మూర్ఖ సంకటుల్కరోన రోగ బారిపడున్!
పళ్ళెము జేర్చి విడంగన్!పటుతర భాగ్య భూషలున్!పరంబు నొంద జాలునొకో?
తృళ్ళుతనంబది పోవున్! తృటిని హరించు రోజులన్!తురాయి తుల్యమౌ!నిలలోన్!
వెళ్ళును సంపద లెల్లన్? పిటమున జేరు తీరగున్!బిరాన  త్యాజ్యుడౌ!సిరులన్!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.