గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఉత్సుక,సద్వృత్త,చెల్లగు,సౌరభ్య,సంప్రాప్త,విందొందు,చేకొను,భవాజ్ఞ,ధన్యచేతనా,మందారసుమ,గర్భ"-నుతశ్రీ"-వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
ఉత్సుక,సద్వృత్త,చెల్లగు,సౌరభ్య,సంప్రాప్త,విందొందు,చేకొను,భవాజ్ఞ,ధన్యచేతనా,మందారసుమ,గర్భ"-నుతశ్రీ"-వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.జుత్తాడ.
                         
 "-నుతశ్రీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.త.స.రమ.స.లగ.గణములు,యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మాత నుతాశ్రిత పాదముల్?మందార సుమ సౌరభ్యముల్!మాకే!దక్కు నుమాధవా!
చేతన ధన్యత గూర్చుతన్?చిందించు హృది శోభాయమై!చీకూ చింతలు దూరమౌ!
ప్రీతిని బ్రోచుత!కీర్తిలన్?విందొందు భవు నాజ్ఞాపనన్!వ్రేకానంబన బోకుమా?
శ్రీతప ధన్యత మేలిలన్?చెందున్వరదముల్?కామ్యముల్?చేకూరున్దివి సౌఖ్యముల్?
                                                                       
అర్ధములు;
వ్రేకానంబున=భారమున,దక్కును మాధవా=దక్కును విష్ణువా,
దక్కు నుమాధవా=దక్కును పార్వతీశ్వరా!
1.గర్భగత"-ఉత్సుక"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.ర.గణములు.వృ.సం.183.
ప్రాసనియమము కలదు.
మాత నుతాశ్రిత పాదముల్?
చేతన ధన్యత గూర్చుతన్?
ప్రీతిని బ్రోచుత!కీర్తిలన్?
శ్రీతప ధన్యత మేలిలన్?
2.గర్భగత"-సద్వృత్త"-వృత్తము.
బృహతీఛందము.త.స.ర.గణములు.వృ.సం.157.
ప్రాసనియమము కలదు.
మందార సుమ సౌరభ్యముల్!
చిందించు హృది శోభాయమై!
విందొందు భవు నాజ్ఞాపనన్!
చెందున్వరదముల్!కామ్యముల్?
3.గర్భగత"-చెల్లగు"-వృత్తము.
అనుష్టుష్ఛందము.మ.స.లగ.గణములు.వృ.సం.89,
ప్రాసనియమము కలదు.
మాకే!దక్కు నుమాధవా!
చీకూ చింతలు దూరమౌ?
వ్రేకానంబన బోకుమా?
చేకూరున్దివి సౌఖ్యముల్?
4.గర్భగత"-సౌరభ్య"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.త.స.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మాత!నుతాశ్రిత పాదముల్?మందార సుమ సౌరభ్యముల్!
చేతన ధన్యత గూర్చుతన్?చిందించు హృది శోభాయమై!
ప్రీతిని బ్రోచుత!కీర్తిలన్?విందొందు భవు నాజ్ఞాపనన్?
శ్రీతప ధన్యత!మేలిలన్?చిందున్వరదముల్?కామ్యముల్!
5.గర్భగత"-సంప్రాప్త"-వృత్తము.
అత్యష్టీఛందము.త.స.ర.మ.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మందార సుమ సౌరభ్యముల్!మాకే!దక్కును మాధవా!
చిందిచు హృది శోభాయమై!చీకూ చింతలు దూరమౌ?
విందొందు భవు నాజ్ఞాపన్?వ్రేకానం బన బోకుమా?
చిందున్వరదముల్?కామ్యముల్!చేకురున్దివి సౌఖ్యముల్?
6.గర్భగత"-విందొందు"-వృత్తము.
ఉత్కృతి ఛందము.త.స.ర.మ.స.య.స.స.లగ.గణములు.యతులు.10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
మందార సుమ సౌరభ్యముల్!మాకే!దక్కును మాధవా!మాత నుతాశ్రితపాదముల్?
చిందించు హృది శోభాయమై!చీకూ చింతలు దూరమౌ?చేతన ధన్యత  గూర్చుతన్?
విందొందు భవు నాజ్ఞాపన్?వ్రేకానం బన బోకుమా?ప్రీతిన్ బ్రోచుత! కీర్తిలన్?
చిందున్వరదముల్?కామ్యముల్!చేకురున్దివి సౌఖ్యముల్?శ్రీతప ధన్యత మేలిలన్?
                                                                         
7.గర్భగత"-చేకొను"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.స.య.స.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మాకే!దక్కును మాధవా!మాత నుతాశ్రిత పాదముల్?
చీకూ చింతలు దూరమౌ?చేతన ధన్యత గూర్చుతన్?
వ్రేకానంబున బోకుమా?ప్రీతిన్బ్రోచుత కీర్తిలన్?
చేకురున్దివి సౌఖ్యముల్?శ్రీతప ధన్యత మేలిలన్?
8.గర్భగత"-భవాజ్ఞ"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.స.య.స.స.య.భ.య.లగ.గణములు.యతులు.9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
మాకే!దక్కు నుమాధవా!మాతా నుతాశ్రిత పాదముల్?మందార సుమ సౌరభ్యముల్!
చీకూ చింతలు దూరమౌ?చేతన ధన్యత కూర్చుతన్?చిందించు హృది శోభాయమై!
వ్రేకానంబున బోకుమా?ప్రితిన్బ్రోచుత కీర్తిలన్?విందొందు భవు నాజ్ఞాపనన్?
చేకురున్దివి సౌఖ్యముల్?శ్రీతప ధన్యత మేలిలన్?చిందుం వరదముల్ కామ్యముల్?
                                                                       
9,గర్భగత"-ధన్యచేతనా"-వృత్తము.
ధృతిఛందము.త.స.ర.భ.భ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మందార సుమ సౌరభ్యముల్!మాతా నుతాశ్రిత పాదముల్?
చిందించు హృది శోభాయమై!చేతన ధన్యత కూర్చుతన్?
విందొందు భవు నాజ్ఞాపనన్?ప్రీతిన్బ్రోచుత కీర్తిలన్?
చిందుం వరదముల్!కామ్యముల్?శ్రీతప ధన్యత మేలిలన్?
10,గర్భగత"-మందార సుమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.స.ర.భ.భ.ర.మ.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మందార సుమ సౌరభ్యముల్!మాత నుతాశ్రిత పాదముల్?మాకే!దక్కును  మాధవా!
చిందించు హృది శోభాయమై!చేతన ధన్యత కూర్చుతన్?చీకూ!చింతలు  దూరమౌ?
విందొందు భవు నాజ్ఞాపనన్?ప్రీతిన్బ్రోచుత కీర్తిలన్?వ్రేకానంబున బోకుమా?
చిందున్వరదముల్!కామ్యముల్?శ్రీతప ధన్యత మేలిలన్?చేకురున్దివ్య  సౌఖ్యముల్?
                                                                             
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.