గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

మత్తరజినీద్వయ,సమానీ,వసుగంథి,యతిర్నవసుగంథి ద్వయ,కొంగుబంగరు ద్వయ,రజినీకర ప్రియ,కల్పద్రుమ, గర్భ"-గిరివరదమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
మత్తరజినీద్వయ,సమానీ,వసుగంథి,యతిర్నవసుగంథి ద్వయ,కొంగుబంగరు ద్వయ,రజినీకర ప్రియ,కల్పద్రుమ, గర్భ"-గిరివరదమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.
                         
"-గిరివరదమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తుచ్ఛ దృష్టి శల్య మైతివే!తోయజాక్షి!భూవరామ!తూగలేక!వీగె నీతియున్!
మచ్చు కేని మంచి లేదయెన్?మాయ నిండె నెల్ల చూడ!మాగె కీర్తి కల్యుగంబునన్!
రచ్చ కీడ్చి చంపి సత్యమున్!రాయసంబు తాండవింప!రాగ ద్వేష భావ
పూర్ణతన్!
మచ్చ తెచ్చి పిట్టి నారిలన్!మాయగాండ్ర మాప వేల?మా'-గరీయతంబు
జూపుమా!
అర్ధములు;-
ధృష్టి=దిట్టతనము,తుచ్ఛ=నీచమైన,

1.గర్భగత"-మత్తరజినీ ద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
1.తుచ్ఛ దృష్టి శల్య మైతివే!              2.తూగ లేక వీగె నీతియున్!
   మచ్చుకేని మంచి లేదయెన్?            మాగె కీర్తి కల్యుగంబునన్!
   రచ్ఛ కీడ్చి చంపి సత్యమున్!            రాగ ద్వేష భావ పూర్ణతన్!
   మచ్చ తెచ్చిపెట్టి నారిలన్!              మా'-గరీయతంబు జూపుమా!
2.గర్భగత"-సమానీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.107.
ప్రాసనియమము కలదు.
తోయజాక్షి భూ వరామ!
మాయ నిండె నెల్ల చూడ!
రాయసంబు తాండవింప!
మాయగాండ్ర మాప వేల?
3.గర్భగత"-రసగంథి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తుచ్ఛ ధృష్టి శల్యమైతివే?తోయజాక్షి భూ వరామ!
మచ్చుకేని మంచి లేదయెన్?మాయ నిండె నెల్ల చూడ!
రచ్చకీడ్చి చంపి సత్యమున్!రాయసంబు తాండవింప!
మచ్చ తెచ్చిపెట్టి నారిలన్!మాయగాండ్ర మాపవేల?
4.గర్భగత"-యతిర్నవ సుగంథి ద్వయ వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
తోయజాక్షి భూ వరామ!తూగ లేక వీగె నీతియున్?
మాయనిండె నెల్ల!చూడ!మాగె కీర్తి కల్యుగంబునన్?
రాయసంబు తాండవింప!రాగ ద్వేషభావ పూర్ణతన్!
మాయగాండ్ర మాప వేల?మా'-గరీయతంబు జూపుమా!
2.
తోయ జాక్షి భూ వరామ!తుచ్ఛ ధృష్టి శల్య మైతివే?
మాయ నిండె నెల్ల!చూడ!మచ్చు కేని మంచి లేదయెన్?
రాయసంబు తాండవింప!రచ్చ కీడ్చి చంపి సత్యమున్!
మాయ గాండ్ర మాప వేల?మచ్చ తెచ్చిపెట్టినా రిలన్?
5.గర్భగత"-కొంగుబంగరు ద్వయ,వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
తోయజాక్షి భూ వరామ!తూగ లేక వీగె నీతియున్?తుచ్ఛ ధృష్టి శల్యమైతివే?
మాయ నిండె నెల్లచూడ!మాగెకీర్తి కల్యుగంబునన్?మచ్చుకేని!మంచిలేదయెన్?
రాయసంబు తాండవింప!రాగ ద్వేషభావ పూర్ణతన్?రచ్చకీడ్చి చంపిసత్యమున్!                
మాయగాండ్ర మాపవేల?మా'-గరీయంబు జూపుమా!మచ్చ తెచ్చిపెట్టినారిలన్?
2.
తోయజాక్షి భూవరామ!తుచ్ఛ దృష్టి శల్యమైతివే?తూగలేక వీగెనీతియున్?
మాయ నిండె నెల్లచూడ!మచ్చుకేని మంచి లేదయెన్?మాగె కీర్తికల్యుగంబునన్!
రాయసంబు తాండ వింప!రచ్చ కీడ్చి చంపి సత్యమున్?రాగ ద్వేషభావ పూర్ణతన్?
మాయగాండ్ర మాప వేల?మచ్చతెచ్చి పెట్టిని రిలన్?మా'-గరీయంబు
జూపుమా!
6.గర్భగత"-రజినీకర ప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తూగ లేక వీగె నీతియున్?తుచ్ఛ ధృష్టి శల్య మైతివే?
మాగె కీర్తి కల్యుగంబునన్!మచ్చు కేని మంచి లేదయెన్?
రాగ ద్వేష భావ పూర్ణతన్?రచ్చ కీడ్చి చంపి సత్యమున్?
మా'-గరీయంబు జూపుమా!మచ్చ తెచ్చి పెట్టి నిరిలన్?
7.గర్భగత"-కల్పద్రుమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19
ప్రాసనియమము కలదు.వృ.సం.
తూగలేక?వీగె నీతియున్!తుచ్ఛ ధృష్టి శల్య మైతివే?తోయజాక్షి భూవరామ!
మాగె కీర్తి కల్యుగంబునన్!మచ్చుకేని మంచి లేదయెన్?మాయ నిండెనెల్ల చూడ!
రాగ ద్వేషభావ పూర్ణతన్?రచ్చ కీడ్చి చంపి సత్యమున్?రాయసంబుతాండవింప!
మా'-గరీయంబు జూపుమా!మచ్చశతెచ్చి పెట్టినారిలన్?మాయ గాండ్రమాప వేల?
  జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.