గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, సెప్టెంబర్ 2020, సోమవారం

జరాశ్రీ,సమానీ,మత్తరజినీ,కాచు దేవరా,మింటినంటు,ప్రాణాంతక,నిటారు, పట్టిత్రిప్పు,బెట్టుతప్పి,అజేయ,గర్భ"-పరాపకార"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
జరాశ్రీ,సమానీ,మత్తరజినీ,కాచు దేవరా,మింటినంటు,ప్రాణాంతక,నిటారు, పట్టిత్రిప్పు,బెట్టుతప్పి,అజేయ,గర్భ"-పరాపకార"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                             
"-పరాపకార"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.స.ర.య.జ.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరాపకార చింతనులే!పట్టి త్రిప్పి భూ చక్రమున్!పాప పంకిలాన నెట్టిరే?
నిరాశ గూర్చె లోకమునే!నిట్టనిల్వు ఖాజేయుచున్!నీపయిం దురాన నిల్చిరే!
కరాళ నాగబారిపడెన్!కట్టు దప్పి ప్రాణాంతమై!కాపు కాయు దిక్కు దైవమున్!
బిరాన గావరావె?శివా!బెట్టు జూపవేమి?హరా!వేపి తించు నుండి రిద్ధరన్!
1.గర్భగత"-జరాశ్రీ"-వృత్తము.
బృహతీఛందము.జ.ర.స.గణములు.వృ.సం.214.
ప్రాసనియమము కలదు.
పరాపకార చింతనులే!
నిరాశ గూర్చె లోకమునే!
కరాళ నాగ బారి పడెన్!
బిరాన గావ రావె?శివా!
2.గర్భగత"-సమానీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.లగ.గణములు.వృ.సం.107.
ప్రాసనియమము కలదు.
పట్టి త్రిప్పి భూ చక్రమున్!
నిట్ట నిల్వు ఖా జేయుచున్!
కట్టు దప్పి ప్రాణాంతమై!
బెట్టు జూప వేమి?హరా!
3.గర్భగత"-మత్త రజినీ"-వృత్తము.
బృహతీఛందము:-ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
పాప పంకిలాన నెట్టిరే!
నీపయిం దురాన నిల్చిరే!
కాపుకాయు దిక్కు దైవమున్!
వేపి తించు నుండి రిద్ధరన్!
4.గర్భగత"-కాచుదేవరా"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.స.ర.జ.లగ.గణములు.యతి,10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం
పరాపకార చింతనులే!పట్టి త్రిప్పి భూచక్రమున్!
నిరాశ గూర్చె!లోకమునే!నిట్ట నిల్వు ఖా జేయుచున్!
కరాళ నాగ బారి పడెన్!కట్టు దప్పి ప్రాణాంతమై!
బిరాన గావ రావె?శివా!వేపి తించు నుండి రిద్ధరన్!
5.గర్భగత"-మింటినంటు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియముము కలదు.వృ.సం.
పట్టిత్రిప్పి భూ చక్రమున్!పాప పంకిలాన నెట్టిరే!
నిట్ట నిల్వు ఖా జేయుచున్!నీ పయిం దురాన నిల్చిరే!
కట్టదప్పి ప్రాణాంతమై!కాపుకాయు దిక్కు దైవమున్!
బెట్టు జూప వేమి?హరా!వేపి తించు నుండి రిద్ధరన్!
6.గర్భగత"-ప్రాణాంతక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.య.జ.ర.జ.ర.జ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పట్టి త్రిప్పి భూచక్రమున్!పాప పంకిలాన నెట్టిరే!పరాపకార చింతనులే!
నిట్టనిల్వు ఖాజేయుచున్!నీపయిం దురాన నిల్చిరే!నిరాశ గూర్చె లోకమునే!
కట్టుదప్పి ప్రాణాంతమై!కాపు కాయుదిక్కు దైవమున్!కరాళ నాగబారి పడెన్!
బెట్టు జూప వేమి?హరా!వేపి తించు నుండి రిద్ధరన్!బిరాన గావరావె?శివా!
7.గర్భగత"-నిటారు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.జ.ర.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాప పంకిలాన నెట్టిరే!పరాపకార చింతనులే!
నీపయిం దురాన నిల్చిరే!నిరాశ గూర్చె లోకమునే!
కాపు కాయు దిక్కు దైవమున్!కరాళ నాగ బారి పడెన్!
హరా!వేపి తించు నుండి రిద్ధరన్!బిరాన గావరావె?శివా!
8.గర్భగత"-పట్టి త్రిప్పు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.స.ర.జ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాప పంకిలంబు నెట్టిరే!పరాపకార చింతనులే!పట్టి త్రిప్పి భూచక్రమున్!
నీపయిం దురాన నిల్చిరే!నిరాశ గూర్చె!లోకమునే!నిట్టనిల్వు ఖాజేయుచున్!
కాపుకాయు దిక్కు దైవమున్!కరాళ నాగబారి పడెన్!కట్టు దప్పి ప్రాణాంతమై!
హరా!వేపితించు నుండి రిద్ధరన్!బిరానగావరావె!శివా!బెట్టుజూపవేమి?హరా
9.గర్భగత"-బెట్టుతప్పి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పట్టిత్రిప్పి భూచక్రమున్!పరాపకార చింతనులే!
నిట్టనిల్వు ఖాజేయుచున్!నిరాశ గూర్చె లోకమునే!
కట్టుదప్పి ప్రాణాంతమై!కరాళ నాగబారి పడెన్!
బెట్టుజూపవేమి?హరా!బిరాన గావరావె! శివా!
10,గర్భగత"-అజేయ"-వృత్తము
ఉత్కృతి ఛందము.ర.జ.జ.ర.జ.య.జర.లగ.గణములు.యతులు9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పట్టి త్రిప్పి భూచక్రమున్!పరాపకార చింతనులే!పాపపంకిలంబు నెట్టిరే!
నిట్టనిల్వు ఖాజేయుచున్!నిరాశ!గూర్చె!లోకమునే!నీపయిం దురాననిల్చిరే!
కట్టుదప్పి ప్రాణాంతమై!కరాళనాగ బారి పడెన్!కాపుకాయు దిక్కు దైవమున్!
బెట్టుజూపవేమి!హరా!బిరానగావ రావె!శివా!హరా!వేపి తించునుండిరిద్ధరన్!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.