గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2020, సోమవారం

మాతృనిందా,చిత్రపద,వినుత,పూజిత,మేఘశ్యామ,మూలాధార,జగదాధార,సుస్వరా,రసవత్,దుందుభిస్వన,గర్భ"-శంఖారావ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
మాతృనిందా,చిత్రపద,వినుత,పూజిత,మేఘశ్యామ,మూలాధార,జగదాధార,సుస్వరా,రసవత్,దుందుభిస్వన,గర్భ"-శంఖారావ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.                       

"-శంఖారావ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.య.భ.భ.త.స.త.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సారముగల రామ నామమ్!చారు సుశీల మనోజ్ఞమ్!జగతి కాధారం! మహత్వమ్!
పారము పురుషార్థ దామమ్!వారిద శ్యాముని రామమ్!భగవతీ కంఠో పహారమ్!
పూరిత వర శంఖ నాధమ్!భూరి గుణాల వరామమ్!పొగడికం జేయంగ!దివ్యుల్!
తీరని తనివెంచు మోయీ!తేరది జీవ సరాగమ్!తెగువ జూపంగల్గు! సౌఖ్యమ్!
1.గర్భగత"-మాతృనిందా"-వృత్తము.
బృహతీఛందము.భ.స.య.గణములు.వృ.సం.95,
ప్రాసనియమము కలదు.
సారముగల రామ నామమ్!
పారము పురుషార్థ దామమ్!
పూరిత వర శంఖ నాథమ్!
తీరని తని వెంచుమోయీ?
2.గర్భగత"-చిత్రపద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.భ.గగ.గణములు.వృ.సం.55.
ప్రాసనియమము కలదు.
చారు సుశీల మనోజ్ఞమ్!
వారిద శ్యాముని రామమ్!
భూరి గుణాల వరామమ్!
తేరది జీవ సరాగమ్!
3.గర్భగత"-వినుత"-వృత్తము.
బృహతీఛందము.న.మ.య.గణములు.వృ.సం.72.
ప్రాసనియమము కలదు.
జగతి కాధారమ్!మహత్వమ్!
భగవతీ కంఠోప హారమ్!
పొగడికం జేయంగ దివ్యుల్!
తెగువ జూపం! గల్గు సౌఖ్యమ్!
4.గర్భగత"-పూరిత"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.య.భ.భ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సారముగల రామ నామమ్!చారు సుశీల మనోజ్ఞమ్!
పారము పురుషార్థ దామమ్!వారిద శ్యాముని రామమ్!
పూరిత వర శంఖ నాధమ్!భూరి గుణాల వరామమ్!
తీరని తనివెంచు మోయీ!తేరది!జీవ సరాగమ్!
5.గర్భగత"-మేఘశ్యామ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.త.స.త.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చారు సుశీల మనోజ్ఞమ్!జగతి కాధారమ్!మహత్వమ్!
వారిద శ్యాముని రామమ్!భగవతీ!కంఠోప హారమ్!
భూరి గుణాల వరామమ్!పొగడికం జేయంగ దివ్యుల్!
తేరది!జీవ సరాగమ్!తెగువ జూపం గల్గు సౌఖ్యమ్!
6.గర్భగత"-మూలాధార"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.త.స.త.మ.న.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చారు సుశీల మనోజ్ఞమ్!జగతి కాధారమ్!మహత్వమ్!సారముగల రామ నామమ్!
వారిద శ్యాముని రామమ్!భగవతీ కంఠోప హారమ్!పారము పురుషార్థ దామమ్!
భూరి గుణాల వరామమ్!పొగడికం జేయంగ దివ్యుల్!పూరిత వర శంఖ నాధమ్!
తేరది జీవ సరాగమ్!తెగువ జూపం గల్గు సౌఖ్యమ్!తీరని తనివెంచు మోయీ!
7.గర్భగత"-జగదాధార"-వృత్తము.
ధృతిఛందము.న.మ.య.భ.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగతి కాధారమ్!మహత్వమ్!సారముగల రామ నామమ్!
భగవతీ కంఠోప హారమ్!పారము పురుషార్థ దామమ్!
పొగడికం జేయంగ దివ్యుల్!పూరిత వర శంఖ నాధమ్?
తెగువ జూపం గల్గు సౌఖ్యమ్!తీరని తనివెంచు మోయీ!
8.గర్భగత"-సుస్వరా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.య.భ.స.య.భ.భ.గగ.గణములు.యతులు.10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
జగతి కాధారమ్!మహత్వమ్!సారముగల రామ నామమ్!చారు సుశీల మనోజ్ఞమ్!
భగవతీ కంఠోప హారమ్!పారము పురుషార్ధ దామమ్!వారిద శ్యాముని రామమ్!
పొగడికం జేయంగ దివ్యుల్!పూరిత వర శంఖ నాథమ్!భూరి గుణాల వరామమ్!
తెగువ జూపం గల్గు సౌఖ్యమ్!తీరని తని వెంచు మోయీ!తీరదె!జీవ సరాగమ్!
9,గర్భగత"-రసవత్"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.మ.న.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చారు సుశీల మనోజ్ఞమ్!సారము గల రామ నామమ్!
వారిద శ్యాముని రామమ్!పారము పురుషార్థ దామమ్!
భూరి గుణాల వరామమ్!పూరిత వర శంఖ నాథమ్!
తీరదె జీవ సరాగమ్!తీరని తనివెంచు మోయీ!
10,గర్భగత"-దుందుభీస్వన"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.మ.న.జ.త.స.త.గగ.గణములు.యతులు 9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చారు సుశీల మనోజ్ఞమ్!సారము గల రామ నామమ్!జగతి కాధారమ్! మహత్వమ్!
వారిద శ్యాముని రామమ్!పారము పురుషార్థ దామమ్!భగవతీ కంఠోప హారమ్!
భూరి గుణాల వరామమ్!పూరిత శంఖ నాధమ్!పొగడికం జేయంగ దివ్యుల్!
తీరదె జీవ సరాగమ్!తీరని తనివెంచు మోయీ!తెగువ జూపం గల్గు సౌఖ్యమ్!
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.