జైశ్రీరామ్.
ఆర్తిహర,భూజావర,మూర్ఖతా,తపిత,జడ్డిచింత్య,జడతత్వ,అసమర్ధతా,సారిజా,సుగమ్యతా,అపాత్రతా,గర్భ"-సుభిక్షుక"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.
"-సుభిక్షుక"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.భ.ర.ర.స.జ.జ.య.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అపాత్ర దానము దానమే?అడ్డ గోలగు దోపిడౌ!అసమర్ధత చేకూర్చుటే!
శపింత్రు దివ్యులు దోషులన్!జడ్డి చింత్యము స్వార్థమే?స్వ సమర్ధన మూర్ఖమౌ?
కపాల భిక్షుకు డుగ్రుడౌ!గడ్డు రోజుల తీరిదే?కసి పెంచుట తప్పే యగున్!
తపించు ముక్తికి సఖ్యతన్!దడ్డు తత్వము మానుడీ!దస దానకు చోటీయకన్?
అర్థములు:-
దడ్డు తత్వము=దిగంబరత్వము,దసదానకు=మూర్ఖత్వానికి,
భావము:-అపాత్రదానము దానముకాదు.అది అడ్డ గోలుగు సంపాదనమే!
జనుల నసమర్ధుల చేయరాదు.దోషులను దేవతలు శపింతురు.జడ్డి చింతనము,స్వార్ధమే యనిపించుకొనును.తనను తాను సమర్ధించు కొనుట
మూర్ఖత్వమే యగును.కపాలేశ్వరు డాగ్రహించును.గడ్డు రోజుల తీరీ
విధముగనే యుండును.కసిపెంపు చర్యలు తప్పే యగును.సత్య మార్గాన
ముక్తికై తపించుము.గుట్టు గుమ్యము లేని దిగంబరత్వమును మాన
వలెను.మూర్ఖత్వానికి చోటీయకుము.
1.గర్భగత"-ఆర్తిహర"-వృత్తము.
బృహతీఛందము.జ.భ.ర.గణములు.వృ.సం.182.
ప్రాసనియమము కలదు.
అపాత్ర దానము దానమే?
శపింత్రు దివ్యులు దోషులన్!
కపాల భిక్షుకు డుగ్రుడౌ?
తపించు ముక్తికి సఖ్యతన్!
2.గర్భగత"-భూజావర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.123.
ప్రాసనియమము కలదు.
అడ్డ గోలగు దోపిడౌ!
జడ్డి చింత్యము స్వార్థమౌ?
గడ్డు రోజులు తీరిదే?
దడ్డు తత్వము మానుడీ!
3.గర్భగత"-మూర్ఖతా"-వృత్తము.
బృహతీఛందము.స.స.ర.గణములు.వృ.సం.152.
ప్రాసనియమము కలదు.
అసమర్ధత చేకూర్చుటే?
స్వ సమర్థన మూర్ఖంబగున్!
కసి పెంచుట తప్పే యగున్!
దస దానకు చోటీయకన్!
4.గర్భగత"-తపిత"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.భ.ర.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అపాత్ర దానమ దానమే?అడ్డు గోలగు దోపిడౌ?
శపింత్రు దివ్యులు దోషులన్?జడ్డి చింత్యము స్వార్థమౌ?
కపాల భిక్షకు డుగ్రుడౌ!గడ్డు రోజుల తీరిదే?
తపించు ముక్తికి సత్యతన్?దడ్డు తత్వము మానుడీ!
5.గర్భగత"-జడ్డిచింత్య"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.జ.జ.య.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అడ్డ గోలగు దోపిడౌ?అసమర్ధత చేకూర్చుటే?
జడ్డిచింత్యము స్వార్ధమౌ?స్వ సమర్ధన మూర్ఖంబగున్?
గడ్డు రోజుల తీరిదే?కసి పెంచుట తప్పేయగున్!
దడ్డు తత్వము మానుడీ!దస దానకు చోటీయకన్!
6.గర్భగత"-జడుతత్వ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.జ.య.జ.ర.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అడ్డ గోలగు దోపిడౌ?అసమర్థత చేకూర్చుటే!అపాత్ర దానము దానమే?
జడ్డి చింత్యము స్వార్థమౌ?స్వ సమర్ధన మూర్ఖంబగున్?శపింత్రు దివ్యులు దోషులన్!
గడ్డు రోజులు తీరిదే?కసి పెంచుట తప్పే యగున్!కపాల భిక్షకు డుగ్రుడౌ?
దడ్డు తత్వము మానుడీ!దస దానకు చోటీయకన్తపించు ముక్తికి సత్యతన్?
7.గర్భగత"-అసమర్ధతా"-వృత్తము.
ధృతిఛందము.స.స.ర.భ.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అసమర్ధత చేకూర్చుటే?అపాత్ర దానము దానమే?
స్వ సమర్ధన మూర్ఖంబగున్?శపింత్రు దివ్యులు దోషులన్!
కసి పెంచుట తప్పే యగున్!కపాల భిక్షుకు డుగ్రుడౌ!
దస దానకు చోటీయకన్? తపించు ముక్తికి సత్యతన్!
8.గర్భగత"-సారిజా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.ర.జ.భ.ర.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అసమర్ధత చేకూర్చుటే?అపాత్ర దానము దానమే?అడ్డ గోలగు దోపిడౌ?
స్వ సమర్ధన మూర్ఖంబగున్!శపింత్రు దివ్యులు దోషులన్?జడ్డి చింత్యము స్వార్ధమౌ?
కసి పెంచుట తప్పే యగున్?కపాల భిక్షుకు డుగ్రుడౌ?గడ్డు రోజుల తీరిదే?
దస దానకు చోటీయకన్?తపించు ముక్తికి సఖ్యతన్!దడ్డు తత్వము మానుడీ!
9.గర్భగత"-సుగమ్యతా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.జ.ర.స.లగ.గణములు.యతి,9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అడ్డ గోలగు దోపిడౌ?అపాత్ర దానము దానమే?
జడ్డి చింత్యము స్వార్ధమౌ?శపింత్రు దివ్యులు దోషులన్?
గడ్డు రోజుల తీరిదే? కపాల భిక్షుకు డుగ్రుడౌ!
దడ్డు తత్వము మానుడీ!తపించు ముక్తికి సఖ్యతన్!
10,గర్భగత"-అపాత్రతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.ర.స.జ.జ.య.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అడ్డ గోలగు దోపిడౌ?అపాత్రదానము దానమే?అసమర్ధత చేకూర్చుటే?
జడ్డి చింత్యము స్వార్ధమౌ?శపింత్రు దివ్యులు దోషులన్?స్వ సమర్థన! మూర్ఖంబగున్?
గడ్డు రోజుల తీరిదే?కపాల భిక్షుకు డుగ్రుడౌ!కసి పెంచుట తప్పేయగున్!
దడ్డు తత్వము మానుడీ!తపించు ముక్తికి సఖ్యతన్!దస దానకు చోటీయకన్?
జైహింద్
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.