గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

వాదనా,ఉషశ్రీ,భూవిలాప,తరగని,మలజాలని,నమసా,బ్రతుకుజీవా,భూతలి,నిరనద్య,పరమాన్న,గర్భ"-శక్త్యుక్త"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.జుత్తాడ.

 జైశ్రీరామ్.
వాదనా,ఉషశ్రీ,భూవిలాప,తరగని,మలజాలని,నమసా,బ్రతుకుజీవా,భూతలి,నిరనద్య,పరమాన్న,గర్భ"-శక్త్యుక్త"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.జుత్తాడ.
                           
"-శక్త్యుక్తతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.మ.స.స.మ.త.స.త.లగ.గణములు.యతులు.10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
పాలూ అన్నం పత్యంబనగా!పరమాన్నం తింటావేమీ?బ్రతుక లేవే?
భూతలినిన్!
తేలెన్నీ తెల్వెంతో?వటువా!తిరు నామాలే!దక్కున్లే?దివుర జ్ఞానం!
శోభిదమా?
నీలో శక్తిం యుక్తిం గనవా!నిరవద్యుండౌమా?జ్ఞానీ!నివసితాల
న్వీడకుమా!
తాళం గొట్టే నీతిన్విడుమా!తరగొందన్నీ తిన్నిత్యమ్!దవళమౌ!
                                                                  సత్యంబమరన్!
అర్ధములు:-
దివురు=ఒప్పు,నిరవద్యుడు=దోషరహితుడు,
1.గర్భగత"-వాదనా"-వృత్తము.
బృహతీఛందము.మ.మ.స.గణములు.వృ.సం.193.
ప్రాసనియమము కలదు.
పాలూ అన్నం పత్యం బనగా!
తేలెం నీ తెల్వెంతో? వటువా!
నీలో శక్తిం యుక్తిం గనవా?
తాళం గొట్టే!నీతిన్విడుమా!
2.గర్భగత"-ఉషశ్రీ"-వృత్తము
అనుష్టుప్ఛందము.స.మ.గగ.గణములు.వృ.సం.4,
ప్రాసనియమము కలదు.
పరమాన్నం తింటావేమీ?
తిరు నామాలే!దక్కున్లే?
నిరవద్యుం డౌమా!జ్ఞానీ!
తరుగొందన్నీతిన్నిత్యమ్!
3.గర్భగత"-భూవిలాప"-వృత్తము.
బృహతీఛందము.న.మ.సనగణములు.వృ.సం.200,
ప్రాసనియమము కలదు.
బ్రతుక లేవే?భూ తలినిన్!
దివుర జ్ఞానం దీపిదమౌ!
నివసితాలం!వీడకుమా!
ధవళమౌ!స్వచ్ఛం బమరన్!
4.గర్భగత"-తరగని"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.మ.స.స.మ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాలూ అన్నం పత్యంబనగా!పరమాన్నం తింటా వేమీ?
తేలెం నీతెలి వెంతో?వటువా!తిరు నామాలే!దక్కున్లే?
నీలో శక్తిం యుక్తిం గనవా?నిరవద్యుం డౌమా!జ్ఞానీ!
తాళం గొట్టే నీతిం విడుమా!తరుగొంద న్నీతిం!నిత్యమ్!
5.గర్భగత"-మనజాలని"-వృత్తము.
అత్యష్టీఛందము.స.మ.త.స.త.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరమాన్నం తింటావేమీ? బ్రతుక లేవే?భూతలినిన్?
తిరు నామాలే!దక్కు న్లే?దివుర జ్ఞానం దీపిదమౌ?
నిరవద్యుండౌమా?జ్ఞానీ!నివసితాలం వీడకుమా!
తరు గొందన్నీతిం నిత్యమ్!ధవళమౌ!స్వచ్ఛంబమరన్?
6.గర్భగత"-నమసా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.మ.త.స.త.య.మ.త.లగ.గణములు.యతులు.
9,18,ప్రాసనియమము కలదు.వృ.సం.
పరమాన్నం తింటా వేమీ?బ్రతుక లేవే?భూతలినిన్!పాలూ అన్నం
పత్యంబనగా?
తిరు నామాలే!దక్కు న్లే?దివుర జ్ఞానం దీపిదమౌ?తేలెం!నీతెల్తోవెంతో
వటువా?
నిరవద్యుం డౌమా!జ్ఞానీ?నివసితాలం వీడకుమా!నీలో శక్తిన్యుక్తిం
గనవా?
తరుగొందన్నీతిం నిత్యం!ధవళమౌ!సత్యం బమరన్?తాళం గొట్టే నీతిం
విడుమా!
7.గర్భగత"-బ్రతుకుజీవా"-వృత్తము.
ధృతిఛందము.న.మ.స.మ.మ.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
బ్రతుక లేవే?భూతలినిన్?పాలూ అన్నం పత్యంబనగా?
దివుర జ్ఞానం దీపిదమౌ!తేలెం నీతల్వెంతో? వటువా!
నివసితాలం వీడకుమా!నీలో శక్తిం యుక్తిం గనవా!
ధవళమౌ!సత్యంబమరన్?తాళం గొట్టే నీతిం విడుమా!
8.గర్భగత"-భూతలి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.స.మ.మ.స.స.మ.గగ.గణములు.యతులు.
10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
బ్రతుక లేవే?భూతలినిం పాలు అన్నం పత్యం బనగా?పరమాన్నం
తింటావేమీ?
దివుర జ్ఞానం దీపిదమౌ?తేలెం నీతెల్వెంతో?వటువా!తిరు నామాలే!
దక్కున్లే!
నివసితాలం వీడకుమా!నీలో శక్తిం యుక్తిం గనవా?నిర వద్యుండౌమా!
జ్ఞానీ?
ధవళమౌ!సత్యంబమరన్?తాళం కొట్టే!నీతిం విడుమా! తరుగొందన్నీతిం
నిత్యమ్!
9.గర్భగత"-నిరవద్య"-వృత్తము.
అత్యష్టీఛందము.స.మ.మ.మ.త.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరమాన్నం తింటావేమీ?పాలూ అన్నం పత్యంబనగా!
తిరు నామాలే!దక్కున్లే?తేలెం!నీతెలివెంతో?వటువా!
నిరవద్యుండౌమా!జ్ఞానీ?నీలో శక్తిం యుక్తిం గనవా?
తరుగొందన్నీతిం నిత్యం!తాళం కొట్టే!నీతిం విడుమా!
10,గర్భగత"-పరమాన్న"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.మ.మ.మ.త.జ.స.త.లగ.గణములు.యతులు.
9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
పరమాన్నం తింటావేమీ?పాలూ అన్నం పత్యంబనగా!బ్రతుక లేవే భూతలినిన్?
తిరునామాలే!దక్కున్లే?తేలెం!నీ తెలివెంతో?వటువా!దివుర జ్ఞానం దీపిదమౌ?
నిర వద్యుండౌమా!జ్ఞానీ?నీలో శక్తిం యుక్తిం గనవా?నివసితాలం వీడకుమా!
తరుగొందన్నీతిం నిత్యం!తాళం కొట్టే!నీతిం విడుమా!ధవళమౌ! స్వచ్ఛం బమరన్!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.