గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2020, బుధవారం

రామజన్మభూమి అయోధ్యలో రామాలయ శంకుస్థాపన సందర్భముగా..శ్రీరామజయమ్.

జైశ్రీరామ్.
శ్రీరామజన్మభూమి అయోధ్యలో రామాలయ శంకుస్థాపన సందర్భముగా..శ్రీరామజయమ్.

శ్రీరామా! రఘువంశజా! భవహరా! సీతామనో నాయకా!
నీ రమ్యాక్షరనామమే వర శుభానీకంబు కల్గించునే,
శ్రీరామా యనిపల్కినన్ వినిన మా చింతల్ విడన్ జేయునే
మారామింతయు లేనివాడవగుచున్ మారామ! మమ్మేలుమా.

కూర్మినయోధ్యలోన వెలుఁగుల్విరజిమ్మఁగ  రమ్ము సీతతో
ధర్మము నాల్గుపాదముల ధక్షుఁడవై నడువంగ చేయుమా.
మర్మవిదూరులన్ సుగుణమాన్యులఁ గావుమ నిత్యమిద్ధరన్,
ధార్మికులందునుండి వరధర్మమునే పరిరక్ష సేయుమా.

జైశ్రీరామ! జయంబు ధర్మవశమై సత్యంబునే నిల్పెనే,
సుశ్రేయంబులె మమ్ము నీదు కృపచే శోభించగా చేరునే
విశ్రాంతిని విడి నిన్ను కొల్చునటులన్ బ్రీతిన్ మమున్ జేయుమా,
యశ్రద్ధన్ విడఁ జేసి చేతనమునే యాత్మన్ సదా నిల్పుమా.

జైశ్రీరామ్,
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.