గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఆగస్టు 2020, బుధవారం

అనఘా,మత్తరజినీద్వయ,బ్రహ్మసూక్త,జ్ఞాన కీర్తనా,సదావంద,రజరోన్నయ, యోగ సాధనా,కీర్తనీయ,బుద్ధిచైద,గర్భ"-చతుర్మతీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల సరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
అనఘా,మత్తరజినీద్వయ,బ్రహ్మసూక్త,జ్ఞాన కీర్తనా,సదావంద,రజరోన్నయ, యోగ సాధనా,కీర్తనీయ,బుద్ధిచైద,గర్భ"-చతుర్మతీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల సరసింహ మూర్తి. జుత్తాడ.
                         

"-చతుర్మతీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.త.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.షం.
చతుర బుద్ధి చైదముల్!సదానంద జ్ఞాన కీర్తనల్!సత్య ధర్మ యోగ  సాధ్యముల్?
స్మృతి విరాట్సమంబులౌ!చిదానంద బ్రహ్మ సూక్తముల్!స్థిత్యమౌచు! మోక్షమీయుగా!
ప్రతిన నిల్పు ధీ దితుల్!ప్రదోషంబు లంట వెన్నడున్?రత్యధీన దైవ   చింతనన్!
బ్రతుకు ధర్మ మార్గ మౌ!వదాన్యుండ వౌదు!మానవా!ప్రత్యనీక మంట దెత్తరిన్?
                                                             
ప్రత్యనీకము=రిపు సైన్యము,విఘ్నము.

1.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.
ప్రాసనియమము కలదు.
చతుర బుద్ధి చైదముల్!
స్మృతి విరాట్సమంబులౌ!
ప్రతిన నిల్పు ధీ దితుల్!
బ్రతుకు ధర్మ మార్గమౌ!
2.గర్భగత"-మత్త రజినీద్వయ"-వృత్తములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
1.సదానంద జ్ఞాన కీర్తనల్.!              2.సత్య ధర్మ యోగ సాథ్యముల్?
   చిదానంద బ్రహ్మ సూక్తముల్!           స్థిత్య మౌచు!మోక్షమీయగా!
   ప్రదోషంబు లంట వెన్నడున్?            రత్యధీన దైవ చింతనన్?
   వదాన్యుండ వౌదు!మానవా!             ప్రత్యనీక మంట దెత్తరిన్?
3.గర్భగత"-బ్రహ్మ సూక్త"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.త.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చతుర బుద్ధి చైదముల్!సదానంద జ్ఞాన కీర్తనల్!
స్మృతి విరాట్సమంబులౌ!చిదానంద బ్రహ్మ సూక్తముల్!
ప్రతిన నిల్పు ధీ దితుల్!ప్రదోషంబు లంట వెన్నడున్?
బ్రతుకు ధర్మ మార్గమౌ!వదాన్యుండ వౌదు!మానవా!
4.గర్భగత"-జ్ఞాన కీర్తనా"-వృత్తము.
ధృతిఛందము.య.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సదానంద జ్ఞాన కీర్తనల్!సత్య ధర్మ యోగ సాధ్యముల్?
చిదానంద బ్రహ్మ సూక్తముల్!స్థిత్యమౌచు!మోక్ష మీయగా!
ప్రదోషంబు లంట వెన్నడున్?రత్యధీన దైవ చింతనన్?
వదాన్యుండ వౌదు!మానవా!ప్రత్యనీక మంట దెత్తరిన్?
5.గర్భగత"-సదానంద"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.ర.ర.జ.ర.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సదానంద జ్ఞాన కీర్తనల్!సత్య ధర్మ యోగ సాధ్యముల్?చతుర బుద్ధి చైదముల్!
చిదానంద బ్రహ్మ సూక్తముల్!స్థిత్య మౌచు!మోక్ష మీయగా!స్మృతి విరాట్స మంబులౌ!
ప్రదోషంబు లంట వెన్నడున్?రత్యధీన దైవ చింతనన్?ప్రతిన నిల్పు ధీదితుల్!
వదాన్యుండ వౌదు!మానవా!ప్రత్యనీక మంట దెత్తరిన్?బ్రతుకు ధర్మ మార్గమౌ!
                                                                           
6.గర్భగత"-రజరోన్నర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సత్య ధర్మ  యోగ సాధ్యముల్?చతుర బుద్ధి చైదముల్!
స్థిత్య మౌచు!మోక్ష మీయగా!స్మృతి విరాట్సమంబులౌ!
రత్యధీన దైవ చింతనన్?ప్రతిన నిల్పు ధీ దితుల్!
ప్రత్యనీక మంట దెత్తరిన్?బ్రతుకు ధర్మ మార్గమౌ!
7.గర్భగత"-యోగ సాధనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.త.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సత్య ధర్మ యోగ సాధ్యముల్?చతుర బుద్ధి చైదముల్!సదానంద జ్ఞాన కీర్తనల్!
స్థిత్య మౌచు!మోక్ష మీయగా!స్మృతి విరాట్సమంబులౌ!చిదానంద బ్రహ్మసూక్తముల్!
రత్యధీన దైవ చింతనన్?ప్రతిన నిల్పు ధీ దితుల్!ప్రదోషంబు లంట వెన్నడున్?
ప్రత్య నీక మంట దెత్తరిన్?బ్రతుకు ధర్మ మార్గమౌ!వదాన్యుండ వౌదు!మానవా!
                                                                           
8.గర్భగత"-కీర్తనీయ"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.ర.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సదానంద జ్ఞాన కీర్తనల్!చతుర బుద్ధి చైదముల్!
చిదానంద బ్రహ్మ సూక్తముల్!స్మృతి విరాట్సమంబులౌ!
ప్రదోషంబు లంట వెన్నడున్?ప్రతిన నిల్పు ధీ దితుల్!
వదాన్యుండ వౌదు!మానవా!బ్రతుకు ధర్మ మార్గమౌ!
9.గర్భగత"-బుద్ధిచైద"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.ర.న.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.షం.
సదానంద జ్ఞాన కీర్తనల్!చతుర బుద్ధి చైదముల్!సత్య ధర్మ యోగ  సాధ్యముల్?
చిదానంద బ్రహ్మ సూక్తముల్!స్మృతి విరాట్సమంబులౌ!స్థిత్య మౌచు! మోక్షమీయగా!
ప్రదోషంబు లంట వెన్నడున్?ప్రతిన నిల్పు ధీ దితుల్!రత్యధీన దైవ చింతనన్?
వదాన్యుండ వౌదు!మానవా! బ్రతుకు ధర్మ మార్గమౌ!ప్రత్యనీక మంట  దెత్తరిన్?
                                                                       
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.