గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2020, ఆదివారం

శ్రీవేంకటేశ్వర “గోపుర” బంధ శార్దూలము. రచన. శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ

జైశ్రీరామ్.
శ్రీవేంకటేశ్వర “గోపుర” బంధ శార్దూలము.  రచన. శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ
శ్రీగోవింద పదాశ్రయాంకిత హృదశ్రీ  నర్పణన్ జేయగన్
శ్రీగోవింద పదాలఁ బల్కుచు నగశ్రీ నెక్కి సోపానముల్
శ్రీగోవింద సమాహ్వఘోషణములన్ శ్రీవేంకటేశా! మమున్
శ్రీగోవింద! మురారి! కావగ రమశ్రీతోడ రావే! హరీ!

ఇంత చక్కగా వ్రాసిన ప్రియ సహోదరులకు
అభినందనలతో పూర్వక ఆశీస్సులు.

అన్నను మించు తమ్ముఁడని హాయిగనందరు చెప్పునట్లుగా
మన్ననలందు తీరున సమంచితరీతిని బంధపద్యమున్
క్రన్నన వ్రాసినట్టి గుణగణ్య సహోదర సంతసంబయెన్.
పన్నుగ వేంకటేశ్వరుఁడు భాసిలఁజేయును మిమ్ము బ్రేమతోన్.

ప్రేమతో
చింతా రామకృష్ణారావు.

జైహింద్.
Print this post

1 comments:

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

అన్నగారికి పాదాభివందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.