గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఆగస్టు 2020, సోమవారం

విశ్వసౌఖ్య, తారాడు జీవా,వాచాలతా,స్వభావనా ,ఉత్తమ,తత్వ మారయా,ప్రామాణ్య,మద్వర,ధన్యజీవ,తద్యశ,గర్భ"-శివు ధృగ్గోచర"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల అంరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
విశ్వసౌఖ్య, తారాడు జీవా,వాచాలతా,స్వభావనా ,ఉత్తమ,తత్వ మారయా,ప్రామాణ్య,మద్వర,ధన్యజీవ,తద్యశ,గర్భ"-శివు ధృగ్గోచర"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల అంరసింహ మూర్తి. జుత్తాడ.
                         
"-శివు ధృగ్గోచర"-వృత్తము..
ఉత్కృతిఛందము.స.భ.ర.త.త.మ.మ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.

శివు ధృగ్గోచర భాగ్యుకున్!జీవంబు ధన్యంబు నౌగా!శ్రీమంతంబౌ!జన్మ  జాగృతిన్!
భవ దూరంబవ కీర్తిలున్!భావాశ్రి తేజస్సుథాశృల్!ప్రామాణ్యంబుల్విజ్ఞ తంబులౌ!
జవనాశ్వంబులు కోర్కెలున్!జావాహిరీ!భా ప్రభాశుల్!సౌ మందారంబుల్   సుథా వళుల్!
దివి సౌఖ్యంబుకు సాటియే?దేవాది దేవా!వరాంబుల్!ధీమంతం బేర్చున్  సు రోచిషుల్!              
అర్ధములు.
జావాహిరీ=రత్నపు సొమ్ములు(రత్నాభరణములు),సు రోచిషుల్=
మంచి కాంతులు.
1.గర్భగత"-విశ్వసౌఖ్య"-వృత్తము.
బృహతీఛందము.స.భ.ర.గణములు.వృ.సం.180.
ప్రాసనియమము కలదు.
శివు ధృగ్గోచర భాగ్యుకున్!
భవ దూరంబవ కీర్తిలున్!
జవ నాశ్వంబులు కోర్కెలున్!
దివి సౌఖ్యంబుకు సాటియే?
2.గర్భగత"-తారాడు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.త.గగ.గణములు.వృ.సం.37.
ప్రాసనియమము కలదు.
జీవంబు ధన్యంబు నౌ గా!
భావాశ్రి తేజస్సుథా శృల్!
జావాహిరీ భా ప్రభాళుల్!
దేవాది దేవా వరాంబుల్!
3.గర్భగత"-వాచాలతా"-వృత్తము.
బృహతీఛందము.మ.త.ర.గణములు.వృ.సం.161.
ప్రాసనియమము కలదు.
శ్రీమంతంబౌ!జన్మ జాగృతిన్!
ప్రామాణ్యంబుల్విజ్ఞతంబు లౌ!
సౌ మందారంబుల్!సుథా వళుల్!
ధీమంతం బేర్చున్!సు రోచిషుల్!
4.గర్భగత"-స్వభావనా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.ర.త.త.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శివు ధృగ్గోచర భాగ్యుకున్!జీవంబు ధన్యంబు నౌగా!
భవ దూరంబవ!కీర్తిలున్!భావాశ్రి తేజస్సుథా శృల్!
జవనాశ్వంబులు కోర్కెలున్! జావాహీరీ భా ప్రభాళుల్!
దివి సౌఖ్యంబుకు సాటియే?దేవాది దేవా!వరాంబుల్!
5.గర్భగత"-ఉత్తమ"-వృత్తము.
అత్యష్టీఛందము.త.త.మ.మ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవంబు ధన్యంబు నౌగా!శ్రీమంతంబౌ జన్మ జాగృతిన్!
భావాశ్రీ తేజస్సుథా శృల్!ప్రామాణ్యంబుల్విజ్ఞతంబౌ!
జావాహిరీ భా ప్రభాళుల్!సౌ మందారంబుల్!సుథావళుల్!
దేవాది దేవా వరాంబుల్!ధీమంతం బేర్చున్!సురోచిషుల్!
6.గర్భగత"-తత్వమారయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.త.మ.మ.ర.జ.య.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవంబు ధన్యంబు నౌగా!శ్రీమంతంబౌ జన్మ జాగృతిన్!శివు ధృగ్గోచర   భాగ్యుకున్!
భావాశ్రీ తేజస్సుథా శృల్!ప్రామాణ్యంబుల్వి జ్ఞతంబౌ!భవ దూరంబవ! కీర్తిలున్!    
జావాహిరీ భా ప్రభాళుల్!సౌమందారంబుల్సుథా వళుళ్!జవనాశ్వంబులు కోర్కెలున్!
దేవాది దేవా!వరాంబుల్!ధీమంతం బేర్చున్!సురోచిషుల్!దివి సౌఖ్యంబుకుసాటియే?
                                                                         
7.గర్భగత"-ప్రామాణ్య"-వృత్తము.
ధృతిఛందము.మ.త.ర.స.భ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శ్రీమంతంబౌ!జన్మ జాగృతిన్!శివు ధృగ్గోచర భాగ్యుకున్?
ప్రామాణ్యంబుల్విజ్ఞతంబౌ!భవ దూరంబవ కీర్తిలున్!
సౌ మందారంబుల్సుధావళుల్!జవనాశ్వంబులు కోర్కెలున్!
ధీమంతంబేర్చున్!సు రోచిషుల్!దివి సౌఖ్యంబుకు సాటియే?
8.గర్భగత"-మద్వర"-వృత్తము.
ఉత్కృతి ఛందము.మ.త.ర.స.భ.ర.త.త.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శ్రీమంతంబౌ!జన్మ జాగృతిన్!శివు ధృగ్గోచర భాగ్యుకున్?జీవంబు ధన్యంబు నౌగా?
ప్రామాణ్యంబుల్విజ్ఞతంబౌ!భవ దూరంబవ!కీర్తిలున్!భావాశ్రీ తేజస్సుథాశృల్!
సౌ మందారంబుల్సుథా వళుల్!జవనాశ్వంబులు కోర్కెలున్?జావాహిరీభా ప్రభాళుల్!
ధీమంతంబేర్చున్!సురోచిషుల్దివి సౌఖ్యంబుకు సాటియే?దేవాది దేవా!వరాంబుల్!
9.గర్భగత"-ధన్యజీవ"-వృత్తము.
అత్యష్టీచందమచంత.త.త.య.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవంబు ధన్యంబు నౌగా?శివు ధృగ్గోచర భాగ్యుకున్?
భావాశ్రీ తేజస్సుథా శృల్!భవ దూరంబవ కీర్తిలున్!
జావాహిరీ భా ప్రభాళుల్!జవనాశ్వంబులు కోర్కెలున్?
దేవాది దేవా!వరాంబుల్సురోచిషుల్దివి సౌఖ్యంబుకు సాటియే?
10,గర్భగత"-తద్యశ"-వృత్తము.
ఉత్కృతి ఛందము.త.త.త.య.స.య.మ.ర.లగ.గణములు.యతులు.
9,18,ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవంబు ధన్యంబు నౌగా?శివు ధృగ్గోచర భాగ్యుకున్?శ్రీమంతంబౌ!జన్మ జాగృతిన్!
భావాశ్రీ తేజస్సుథా శృల్!భవ దూరంబవ!కీర్తిలున్ప్రామాణ్యంబుల్!  విజ్ఞతంబౌ!
జావాహిరీ భా ప్రభాళుల్!జవనాశ్వంబులు కోర్కెలున్? సౌమందారంబుల్సుథా వళుల్!
దేవాది దేవా!వరాంబల్సురోచిషుల్దివి సౌఖ్యంబుకు సాటియే?ధీమంతం బేర్చున్!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.