గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2020, సోమవారం

దేవనింద,సింహరేఖ,రస,వీలవని,హరాయుధ,నేల నేలు,రసోపరి, రసమెయీ,జీవనాశృల్,గర్భ"-మేల్కోరు,వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
దేవనింద,సింహరేఖ,రస,వీలవని,హరాయుధ,నేల నేలు,రసోపరి, రసమెయీ,జీవనాశృల్,గర్భ"-మేల్కోరు,వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                   
"-మేల్కోరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.ర.ర.త.మ.జ.జ.గగ.గణములు.,యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నేల నేల!జనం కావలెన్?నింగిజేర!జీవనాశృల్!నీ వదెవ్వరి?నేలెదెంచన్!
వీలు లేదు!పరార్థంబుకున్?బెంగనిండె!లోకమెల్లన్!వేవురున్బ్రతికున్న  చాలున్?          
చీలనీకు?సుహృద్భావనన్!శృంగ భంగమే!యదెంచన్?జీవ రక్షణ మోక్ష  దామమ్!
కూల జేయు కరోనా"-న్వడిన్!కొంగు బంగరం బదే నౌ?కోవ త్రెంచక మించి  మంచిన్!
                                                                             
1.గర్భగత"-దేవనింద"-వృత్తము.
బృహతీఛందము.ర.స.ర.గణములు.వృ.సం.155.
ప్రాసనియమము కలదు.
నేల నేల?జనం కావలెన్!
వీలులేదు? పరార్థంబుకున్!
చీలనీకు?సుహృద్భావమ్!
కూల జేయు!కరోనాన్? వడిన్!
2.గర్భగత"-సింహరేఖ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గగ.గణములు.వృ.సం.43.
ప్రాసనియమము కలదు.
నింగి జేర!జీవనాశృల్!
బెంగ నిండె!లోకమెల్లన్!
శృంగ భంగమే!యదెంచన్?
కొంగు బంగరం బదే!నౌ!
3.గర్భగత"-రస"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
నీవదెవ్వరి?నేలె దెంచన్!
వేవురున్!బ్రతికున్న చాలున్!
జీవ రక్షణ మోక్షదామమ్!
కోవ త్రెంచక !మించి మంచిన్!
4.గర్భగత"-వీలవని"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.ర.ర.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నేల నేల?జనం కావలెన్!నింగి జేర జీవనాశృల్?
వీలు లేదు పరార్థంబుకున్?బెంగ నిండె!లోక మెల్లన్?
చీల నీకు సుహృద్భావమ్!శృంగభంగ మెంచ నౌనే?
కూలజేయు"-కరోనాన్!వడిన్!కొంగు బంగరం బదే!నౌ!
5.గర్భగత"-హరాయుథ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.మ.జ.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగి జేర జీవనాశృల్!నీ వదెవ్వరి నేలె దెంచన్?
బెంగనిండె!లోక మెల్లన్?వేవురున్?బ్రతికున్న చాలున్!
శృంగభంగ మెంచ నౌనే?జీవ రక్షణ మోక్షదామమ్!
కొంగు బంగరం బదే?నౌ!కోవ త్రెంచకు మించి మంచిన్?
6.గర్భగత"-నేల నేలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.మ.జ.జ.మ.జ.య.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగి జేర!జీవనాశృల్!నీ వదెవ్వరి?నేలె దెంచన్!నేల నేల!జనం కావలెన్!
బెంగనిండె!లోక మెల్లన్?వేవురున్!బ్రతికున్న చాలున్?వీలు లేదు?పరా ర్థంబుకున్?            
శృంగ భంగ మెంచనౌనే?జీవ రక్షణ మోక్ష ధామమ్!చీల నీకు? సు హృ ద్భావమ్!    
కొంగు బంగరం బదే?నౌ! కోవ త్రెంచకు!మించి మంచిన్?కూలజేయు  కరోనాన్వడిన్!
                                                                       
7.గర్భగత"-రసోపరి"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.ర.స.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీ వదెవ్వరి?నేలె దెంచన్!నేల నేల?జనం కావలెన్!
వేవురున్!బ్రతి కున్న చాలున్?వీలు లేదు!పరార్థంబుకున్?
జీవ రక్షణ మోక్ష దామమ్!చీలనీకు!సుహృద్భావమ్!
కోవ త్రెంచకు!మించి మంచిన్?కూల జేయు!కరోనాన్వడిన్!
8.గర్భగత"-రసమెయీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.ర.ర.జ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీ వదెవ్వరి?నేలె దెంచన్!నేల నేల!జనం కావలెన్!నింగి జేర!జీవనాశృల్!
వేవురు న్బ్రతి కున్న!చాలున్?వీలు లేదు?పరా ర్థంబుకున్!బెంగ నిండె లోక మెల్లన్?
జీవరక్షణ మోక్షదామమ్!చీలనీకు!సుహృద్భావమ్!శృంగ భంగ మెంచ   నౌనే?        
కోవ త్రెంచకు!మించి మంచిన్?కూల జేయు కరోనా న్వడిన్!కొంగు బంగరం బదే?నౌ!
                                                                   
9.గర్భగత"-కోవత్రెంచు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.మ.జ.య.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగి జేర జీవనాశృల్!నేల నేల!జనం కావలెన్!
బెంగ నిండె!లోక మెల్లన్?వీలు లేదు!పరార్థంబుకున్?
శృంగ భంగ మెంచ నౌనే?చీలనీకు!సుహృద్భావమ్!
కొంగు బంగరం బదే?నౌ!కూలజేయు కరోనా న్వడిన్!
10,గర్భగత"-జీవనాశృల్"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.మ.జ.య.య.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగి జేర జీవనాశృల్!నేల నేల జనం కావలెన్?నీ వదెవ్వరి?నేలె దెంచన్!
బెంగ నిండె!లోక మెల్లన్?వీలు లేదు?పరార్థంబుకున్!వేవురున్?బ్రతి  కున్న చాలున్!    
శృంగ భంగ మెంచ నౌనే?చీల నీకు!సుహృద్భావమ్!జీవ రక్షణ మోక్ష   దామమ్!                
కొంగు బంగరం బదే?నౌ! కూల జేయు కరోనా"-న్వడిన్!కోవ త్రెంచకు?  మించి మంచిన్!
                                                               
 స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.