గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఆగస్టు 2020, మంగళవారం

రక్షక,మత్తరజినీ,జ్ఞానినా,దుష్కర,నీచసంస్కృతి,సుష్టభూతి,భూమికా,అశృధారా,సుజీవనా,ప్రాణహాని,గర్భ"-కలినైజ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
రక్షక,మత్తరజినీ,జ్ఞానినా,దుష్కర,నీచసంస్కృతి,సుష్టభూతి,భూమికా,అశృధారా,సుజీవనా,ప్రాణహాని,గర్భ"-కలినైజ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                       
"-కలినైజ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.మ.య.జ.ర.య.న.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ముష్కరులున్!దుర్మార్గులున్!ముష్టిఘాత,ప్రాణ.హానులై?మోము నశృధార ముంచిరే?
దుష్కరత న్మర్ధింపగాన్?దుష్ట చర్య నీచ సంస్కృతిన్?ధూమ భ్రమకాగ్ని జ్వాలయై?
పుష్కరమా?భీతావహమ్!పుష్టికాదు?కీచ కృత్యమే!భూమినిక!శాంతి లేదయెన్?
సుష్కమయెన్?స్వాతంత్రమున్!సుష్టభూతి!కష్ట మేర్చెలే?సోమ మిదె? కల్యు గంబునన్!
                                                                 
అర్ధములు:-
సోమ మిదె=పరాక్రమ మిదియే?ధూమ భ్రమకాగ్నిజ్వాల=కారుచిచ్చు,

1.గర్భగత"-రక్షక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.మ.లగ.గణములు.వృ.సం.71.
ప్రాసనియమము కలదు.
ముష్కరులున్?దుర్మార్గులున్?
దుష్కరతన్?మర్ధింపగాన్?
పుష్కరమా?భీతావహమ్?
సుష్కమయెన్!స్వాతంత్రమున్?
2.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
ముష్టిఘాత!ప్రాణ హానులై!
దుష్ట చర్య నీచ సంస్కృతిన్?
పుష్టికాదు! కీచకత్వమే?
సుష్ట భూతి!కష్ట మేర్చెలే?
3.గర్భగత"-జ్ఞానినా"-వృత్తము.
బృహతీఛందము.భ.జ.ర.గణములు.వృ.సం.175.
ప్రాసనియమము కలదు.
మోము నశృధార!ముంచిరే?
ధూమ భ్రమకాగ్ని జ్వాలయై?
భూమి నిక!శాంతి లేదయెన్?
సోమ మిదె?కల్యుగంబునన్!
4.గర్భగత"-దుష్కర"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.మ.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ముష్కరులున్?దుర్మార్గులున్?ముష్టిఘాత,ప్రాణ హానులై?
దుష్కరత న్మర్ధింపగాన్? దుష్ట చర్య!నీచ సంస్కృతిన్?
పుష్కరమా?భీతావహమ్!పుష్టి కాదు!నీచ కృత్యమే?
సుష్క మయెన్?స్వా తంత్రమున్!సుష్ట భూతి!కష్ట మేర్చెలే?
5.గర్భగత"-నీచ సంస్కృతి"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.జ.ర.గణములు.యతి,10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ముష్టిఘాత!ప్రాణ హానులై?మోము నశృధార!ముంచిరే?
దుష్ట చర్య నీచ సంస్కృతిన్?ధూమ భ్రమకాగ్ని జ్వాలయై?
పుష్టికాదు!నీచ కృత్యమే?భూమి నిక!శాంతి లేదయెన్?
సుష్ట భూతి!కష్ట మేర్చెలే?సోమ మిదె?కల్యుగంబునన్!
6.గర్భగత"-సుష్ట భూతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.జ.ర.భ.మ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ముష్టిఘాత!ప్రాణహానులై!మోము నశృధార ముంచిరే?ముష్కరులున్?దుర్మార్గులున్?
దుష్టచర్య!నీచ సంస్కృతిన్?ధూమ భ్రమకాగ్ని జ్వాలయై?దుష్కరతన్?మర్ధింపగాన్?
పుష్టికాదు!నీచకృత్యమే?భూమి నిక శాంతి లేదయెన్?పుష్కరమా?భీతావహమ్?
సుష్ట భూతి కష్ట మేర్చెలే?సోమ మిదె?కల్యుగంబునన్!సుష్క మయెన్?స్వాతంత్రమున్!
7.గర్భగత"-భూమికా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.జ.ర.భ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మోము నశృధార ముంచిరే?ముష్కరులున్,దుర్మార్గులున్?
ధూమ భ్రమకాగ్ని!జ్వాలయై?దుష్కరతన్?మర్ధింపగాన్?
భూమినిక!శాంతి లేదయెన్?పుష్కరమా?భీతావహమ్!
సోమ మిదె?కల్యుగంబునన్!సుష్క మయెన్?స్వాతంత్రమున్?
8.గర్భగత"-అశృధారా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.జ.ర.భ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మోము నశృధార ముంచిరే?ముష్కరులున్,దుర్మార్గులున్?ముష్టి ఘాతప్రాణ హానులై?
ధూమ భ్రమకాగ్ని జ్వాలయై!దుష్కరతన్?మర్ధింపగాన్?దుష్ట చర్యసంస్కృతిన్?
భూమి నిక శాంతి లేదయెన్?పుష్కరమా?భీతాహవమ్?పుష్టి కాదు!నీచ కృత్యమే?
సోమ మిదె?కల్యుగంబునన్!సుష్క మయెన్!స్వాతంత్రమున్?సుష్ట భూతి కష్ట మేర్చెలే?
9.గర్భగత"-సుజీవనా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.భ.మ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ముష్టిఘాత!ప్రాణ హానులై?ముష్కరులున్?దుర్మార్గులున్?
దుష్ట చర్య సంస్కృతిన్?దుష్కరతన్?మర్ధింపగాన్?
పుష్టికాదు!నీచ కృత్యమే?పుష్కరమా?భీతాహవమ్?
సుష్ట భూతి!కష్ట మేర్చెలే?సుష్కమయెన్!స్వాతంత్రమున్?
10,గర్భగత"-ప్రాణహాని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.మ.య.న.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ముష్టిఘాత!ప్రాణహానులై?ముష్కరులున్!దుర్మార్గులున్?మోము నశృధార ముంచిరే?
దుష్ట చర్య సంస్కృతిన్?దుష్కరతన్!మర్ధింపగాన్?ధూమ భ్రమకాగ్నిజ్వాలయై?
పుష్టికాదు!నీచ కృత్యమే?పుష్కరమా?భీతాహవమ్?భూమి నిక శాంతి లేదయెన్?
సుష్ట భూతి!కష్ట మేర్చెలే?సుష్కమయెన్!స్వాతంత్రమున్?సోమ మిదె! కల్యుగంబునన్?
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.