గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2020, సోమవారం

మానస,కాలాశ్రీ,మదినిండు,తద్వయమా,మసిమా,దుష్ప్రభా,అబ్బుర,భాముల,అసంభవ,ఘాతుకా,గర్భ"-శ్రీజప"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్
మానస,కాలాశ్రీ,మదినిండు,తద్వయమా,మసిమా,దుష్ప్రభా,అబ్బుర,భాముల,అసంభవ,ఘాతుకా,గర్భ"-శ్రీజప"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.  జుత్తాడ.     
                       
"-శ్రీపద"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.య.య.మ.స.మస.స.లగ.గణములు.యతులు.10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
రాబంధుల కేదీ?కరోనా!రామా!ఘాతుక చర్యేగా?రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?
శ్రీబంధపు తీరే!యదేమో?క్షేమం లేదిల!సర్వేశా?శ్రీ జిగె!దోష మన న్వలెన్?
సేబాసన!జీవింప రేలన్?శ్రీమంతంబవ!రా వేగన్!శ్రీజప ధన్యత శోభిలన్?
బాబా విక!నీవే?మహేశా!భాముల్బాపుమి!శ్రీకంఠా!భాజన నీదే!నుమాధవా!
అర్ధములు:-
భాజన=రక్షించే బాధ్యత,నుమాధవ=పార్వతీశ్వరా,శ్రీజప=లక్ష్మీదేవియొక్క జపము,బాబా=తండ్రి,సేబాసన=వల్లెయనగ,శ్రీజిగె=లక్ష్మీ సంపన్నతే,
రాబంధులు=చనిపోయిన శునకములను పీకి తిను,(దుర్మార్గపు జీవులు),
భాజన నీదే!నుమాధవా=రక్షించు బాధ్యత నీదే పార్వతీశ్వరా,
భాజన నీదేను మాధవా=రక్చే బాధ్యత నీదే సుమా!లక్ష్మీపతీ,

1.గర్భగత"-మానస"-వృత్తము.
బృహతీఛందము.త.య.య.గణములు.వృ.సం.77.
ప్రాసనియమము కలదు.
రాబంధుల కేదీ?కరోనా!
శ్రీబంధపు తీరే!యదేమో?
సేబాసన!జీవింప రేలన్?
బాబా విక నీవే!మహేశా?
2.గర్భగత"-కాలాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.స.గగ.గణములు.వృ.సం.25.
ప్రాసనియమము కలదు.
రామా!ఘాతుక చర్యేగా?
క్షేమం!లే దిల!సర్వేశా?
శ్రీమంతంబవ!రా వేగన్?
భాముల్బాపుమి!శ్రీకంఠా!
3.గర్భగత"-మదినిండు"-వృత్తము.
బృహతీఛందము.మ.భ.ర.గణములు.వృ.సం.177.
ప్రాసనియమము కలదు.
రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?
శ్రీ జిగె!దోష మన న్వలెన్?
శ్రీజప ధన్యత శోభిలన్?
భాజన నీదే?నుమాధవా!
4.గర్భగత"-తద్వయమా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.య.య.మ.స.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాబంధుల కేదీ?కరోనా!రామా!ఘాతుక చర్యేగా?
శ్రీబంధపు తీరే!యదేమో?క్షేమం లేదిల?సర్వేశా!
సేబాసన!జీవింప రేలన్?శ్రీమంతంబవ!రా వేగన్?
బాబా!విక నీవే?మహేశా!భాముల్బాపుమి!శ్రీకంఠా!
5.గర్భగత"-మసద్వయా"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.స.మ.స.స.లగ.గణములు.యతి,9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రామా!ఘాతుక చర్యేగా?రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?
క్షేమం లేదిల!సర్వేశా?శ్రీ జిగె!దోష మన న్వలెన్?
శ్రీమంతంబవ!రా వేగన్?శ్రీజప ధన్యత శోభిలన్?
బాముల్బాపుమి!శ్రీకంఠా!భాజన నీదే?నుమాధవా!
6.గర్భగత"-దుష్ప్రభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.స.మ.స.స.య.భ.త.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రామా!ఘాతుక చర్యేగా?రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?రా బంధుల కేదీ?
                                                                                     కరోనా!
క్షేమం!లేదిల!సర్వేశా?శ్రీజిగె!దోష మన న్వలెన్?శ్రీబంధపు తీరే!యదేమో?
శ్రీమంతంబవ!రా వేగన్?శ్రీజప ధన్యత శోభిలన్?సేబాసన!జీవింప రేలన్?
భాముల్బాపుమి!శ్రీకంఠా!భాజన నీదే?నుమాధవా!బాబా విక నీవే!మహేశా!
7.గర్భగత"-అబ్బుర"-వృత్తము.
ధృతిఛందము.మ.భ.ర.త.య.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?రాబంధుల కేదీ?కరోనా!
శ్రీజిగె!దోష మన న్వలెన్?శ్రీబంధపు తీరే!యదేమో?
శ్రీ జప ధన్యత శోభిలన్?సేబాసన!జీవింప రేలన్?
భాజన నీదే?నుమాధవా!బాబా విక నీవె?మహేశా!
8.గర్భగత"-భాముల"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.భ.ర.త.య.య.మ.స.లగ.గణములు.యతులు.10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?రా బంధుల కేదీ?కరోనా!రామా!ఘాతుక చర్యేగా?
శ్రీ జిగె!దోష మన న్వలెన్?శ్రీబంధపు తీరే!యదేమో?క్షేమం!లేదిల?సర్వేశా!
శ్రీ జప ధన్యత!శోభిలన్?సేబాసన!జీవింప రేలన్?శ్రీమంతంబవ!రా వేగన్?
భాజన నీదే?నుమాధవా!బాబా విక నీవే?మహేశాెభాముల్బాపుమి!శ్రీకంఠా!
9.గర్భగత"-అసంభవ"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.స.మ.భ.త.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రామా!ఘాతుక చర్యేగా?రాబంధుల కేదీ?కరోనా!
క్షేమం!లేదిల?సర్వేశా!శ్రీబంధపు తీరే!యదేమో?
శ్రీమంతంబవ!రా వేగన్?సేబాసన!జీవింప రేలన్?
భాముల్బాపుమి!శ్రీకంఠా!బాబా విక నీవే?మహేశా!
10,గర్భగత"-ఘాతుక"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.స.మ.భ.త.మ.స.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రామా!ఘాతుక చర్యేగా?రాబంధుల కేదీ?కరోనా!రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?
క్షేమం లేదిల?సర్వేశా!శ్రీబంధపు తీరే!యదేమో?శ్రీ జిగె!దోష మన న్వలెన్?
శ్రీమంతంబవ!రా వేగన్?సేబాసన!జీవింప రేలన్?శ్రీజప ధన్యత శోభిలన్?
భాముల్బాపుమి!శ్రీకంఠా!బాబా విక నీవే?మహేశా!భాజన నీదే నుమాధవా!
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.