గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఆగస్టు 2020, శనివారం

వందే భారతమాతరమ్.

వందే భారతమాతరమ్.


శ్రీమద్భారత మాత సంతతిగ భాసింపంగ యోగంబు నా
శ్రీమన్మంగళ శ్రీనృసింహవిభు నాశీర్వాద సద్భాగ్యమే
బ్రేమన్ గొల్పును, స్వార్థహీనమతులే విశ్వేశ్వరాధీనులే
శ్రీమన్మంగళ భారతాంబకు శుభశ్రీసంపదల్ నిత్యమున్.
బలిదానంబులనేకులిద్ధరణికై ప్రఖ్యాతిగా చేయగా
తొలగెన్ భారత మాత సంకెలలు. మాధుర్యంపు సత్ స్వేచ్ఛయే
కలిగెన్. భారత జాతి సంతతి మహత్కార్యంబు సాధించె, నీ
స్థలియే విశ్వమునందు పూజ్య గుణ సంస్థానంబు, భాస్వంతమున్.
గీతామాత జనించె నీ ధరణినే, గీర్వాణు లిద్ధాత్రిపై
ఖ్యాతిన్ మెల్గగ నిచ్చగింత్రు సతము, కాంక్షింతు రీ నేలపై
ప్రీతిన్ బారెడి సన్నదీనదములన్ బ్రీతాత్ములై మున్గగా.
మాతా! భారత సత్సుధాకలిత! ప్రేమన్ బ్రోవుమా భక్తులన్.

జైహింద్.
సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.