గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఆగస్టు 2018, గురువారం

శ్రీ వల్లభేయఛందోమథనము(నూతనఛందములు)సృజనాత్మక గర్భ కవితా శ్రవంతి. పై "అవధాన శారదా" శ్రా భద్రం వేణు గోపాలాచార్యులు.గారి అభిప్రాయము.

జైశ్రీరామ్.
శ్రీ వల్లభేయఛందోమథనము(నూతనఛందములు)సృజనాత్మక గర్భ కవితా శ్రవంతి. పై
"అవధాన శారదా" శ్రా భద్రం వేణు గోపాలాచార్యులు.గారి అభిప్రాయము.
                           **ప్రస్తుతి**                           
కం.జుత్తాడ వ్యాసమౌనిని
చిత్తమ్మున నిలిపి కలము చేతం బూనెన్!
మొత్తముగా శ్రీ గణపతి
చిత్తము నలరించి బుధుల చిత్తమెలర్చున్!
ఈ ఆశువు బ్రహ్మశ్రీ నరసింహ మూర్తి గారి "-వల్లభేయఛందోమథనాంతర్గత
--"సృజనాత్మక గర్భ కవితా స్రవంతి"-పొత్తము నెత్తమ్మి వలె పరిమళించు
నపుడు,చేత కలమూని సాక్షాత్ గణపయ్య వల్లభవఝలవారి యిష్టదైవంగా, సమిష్టిగా, సుష్టుగా, విశిష్టంగా ప్రస్తారగ్రంధాన్ని విస్తరించడంలో నాలుగు చేతులా ఛందోకేళీవిలాసాన్ని ప్రసరించారు.
సారస్వత సాహిత్య నందనోద్యానంలో ఎన్నో పరిమళించిన పుష్ప సౌందర్యాలున్నాయి.సాహిత్యంలో సాగర మథనం చేసిన ఎందరో కవులు న్నారు.కాని ఛందోప్రస్థారం నుంచి బహురూపకంగా విస్తరించుకొని వస్తున్న వృత్తాలు కోకొల్లలు.ఇదొక శాస్త్రము.దీనిపై కృషి చేసిన వారు చాలా తక్కువే.ఛందోప్రస్థార మనే మాట నేనెన్నడడూ పుటలలో  చూడలేదు. ఆప్రయత్నమూ,చేయలేదు.అదృష్టము అనే మాటకు అర్ధము కనబడినది, ఎదురుపడి లభించడమే!అదృష్టము.అది శ్రీ మూర్తి గారి వల్ల నాకు మూర్తి మంత మయింది.ప్రస్థారంలో వారు అనేక కోణాలను దర్శింప జేసారు.ఏకాక్షర ప్రస్థారంతో ప్రారంభించిన వీరి ఛందో ప్రస్థార గమనము 26 అక్షరాల విశ్వ రూపానికి వెన్ను తట్టింది.ఇంతటి కార్యం ఒక వ్యక్తికిసాధ్యమేనా!అనిపించింది.ప్రస్తారం వేయడం ఒక ఎత్తు,సోదాహరణంగా ఆవృత్తాలలో పద్యం కూర్చడం మరొక ఎత్తు. పద్యంలో సామాజిక, సమకాలీన,సంస్కార భావాలతో పాటు భక్తి,నీతి,అంశాలను కుదువ బెట్టి మనకందించడం ఒక అద్భుతం అనిపిస్తుంది.ఈ పద్యాలలో అక్కడక్కడా చిత్ర బంధ కవిత్వాన్ని ప్రవేశబెట్టారు. అక్షరాలలో  నిక్షిప్తం చేసిన ఆ అక్షర కుక్షి వేద గణపతి జుత్తాడ వారి హృదయంలో "లక్ష్మీ గణపతి"యై అక్షర క్రీడ ఛందో బద్ధంగా ప్రారంభించారు. వీరి పద్యాలు క్రొత్త వృత్తాలను,పద్య రచయితలకు అందిస్తున్నారు.
"ఆంధ్రామృతం"-లో (కవయిత్రి.పావులూరి సుప్రభ గారు,
శ్రీ హరి వి.యస్.ఎన్.మూర్తిగారు,
శ్రీ కందుల వరప్రసాద్ గారు.
శ్రీ పొలిమేర మల్లేశ్వర రావు గారు
మున్నగు రచయితలు స్ఫందనను,తెలియ జేస్తూ పద్యాలను కుమ్మరిస్తున్నారు.గర్భ కవిత్వాలకు పెద్దపీట వేస్తున్నారు.బంధ కవిత్వ బాణీలను అందంగా అందిస్తున్నారు.ఇంతటి మహత్కార్యము జరగడానికి ఆ సింహ గర్జనే కారణం అన్నాడు ఓ కవి.మేఘం ఉరిమిందా! నెమలి నాట్యం చేస్తుంది.సింహం గర్జిస్తే!వనం పరుగు లిడుతుంది.నరసింహం గారు కలం కదిపితే అటు మయూరాలు,ఇటు కవి సింహాలు కూడా ఛందోవనంలో ఒక నవ్య అనుభూతిని మనకు కలిగిస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇలాఇలా యెంతమందికో  మార్గ నిర్దేశం చేస్తున్న,శ్రీవల్లభ వఝల వారు పట్టాలు ఇవ్వక పోయినా!డాక్టరేట్.వారి పుస్తకాలను,వారి సాహిత్యాన్ని పరిశోధన చేస్తే ఎన్నో డాక్టరేట్ లను మనం పొందొచ్చు.హిమోత్పర్వతం క్రిందకు ఒంగదు.శివుని ఆరాదిధించే!ఆ హిమనగ నాధుని చెంత,చింతలన్నిఆవల బెట్టి  సారస్వత కృషీవలునిగా సాగుతున్న మూర్తి గారు నిగర్వి, వినయ శీలి.ఒక్క మాటలో చెప్పాలంటే వారొక ఆదర్శం.భావి తరాలకుఒక మణిదీపం.
స్వస్తి.
తేదీ.8.8.2018.                                                    
ఇట్లు,
అష్టావధాని,అవధాన శారదా
భద్రం వేణుగోపాలాచార్యులు.
విశ్రాంత ప్రధానోపాధ్యాయులు.
నాయుడు మాష్టారు వీధి.గణేష్నగర్,                                                                                                
ఆముదాలవలస.
శ్రీకాకుళం జిల్లా-532185.
సెల్.9440414397.                  
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.