గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2018, గురువారం

నేనెందు,గతికా,సుజీవనా,పరుగిడు,చేష్టిత,రాయంచ,భ్రమిక,విహంగ,మూర్తిమంత,పరమందు,గర్భ"-విలాపినీ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

నేనెందు,గతికా,సుజీవనా,పరుగిడు,చేష్టిత,రాయంచ,భ్రమిక,విహంగ,మూర్తిమంత,పరమందు,గర్భ"-విలాపినీ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-విలాపినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.భ.స.జ.భ.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
భ్రమలదేలు రాయంచ!పరుగులెత్తె నాకసాన!పరమంబు నందదాయెనే!
కుమిలి పోవ లాభంబె?కొరవి గాని చేష్ట లేల?గురి పెంచి మ్రొక్క మోక్షమౌ?
తమము వీడి లోకాన!తరతమాలు నెంచి మెల్గు!తరుగోని దీక్ష సాయతన్!
గమిని జేర కాంక్షించు!కరటు మాని నీతిబోధ! కరి మోక్షదుండు కావగన్!

1.గర్భగత"-నేనెందు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.గల.గణములు.వృ.సం.152.ప్రాసగలదు.
భ్రమలదేలు రాయంచ!
కుమిలిపోవ లాభంబె?
తమమువీడి లోకాన!
గమిని జేర కాంక్షించు!

2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
పరుగు లెత్తె నాకసాన!
కొరవిగాని చేష్ట లేల?
తరతమాలు నెంచి మెల్గు!
కరటుమాని నీతిబోధ!

3.గర్భగత"-సుజీవనా"-వృత్తము.
బృహతీఛందము.స.జ.ర.గణములు.వృ.సం.172.ప్రాసగలదు.
పరమంబు నంద దాయెనే!
గురిపెంచి మ్రొక్క మోక్షమౌ!
సరివారి మేలు సాయమౌ!
కరి మోక్షదుండు కావగన్!

4.గర్భగత"-పరుగిడు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.భ.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భ్రమల దేలు రాయంచ పరుగు లెత్తె నాకసాన!
కుమిలిపోవ లాభంబె కొరవిగాని చేష్ట లేల?
తమమువీడి లోకాన తరతమాలు నెంచి మెల్గు!
గమినిజేర కాంక్షించు కరటుమాని నీతి బోధ!

5.గర్భగత"-చేష్టిత"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.స.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పరుగు లెత్తె నాకసాన! పరమంబు నంద దాయెనే?
కొరవి గాని చేష్ట లేల?గురిపెంచి మ్రొక్కు మోక్షమౌ!
తర తమాలు నెంచి మెల్గు !తరుగోని దీక్ష సాయతన్?!
కరటు మాని నీతి బోధ! కరి మోక్షదుండు కావగన్?

6.గర్భగత"-రాయంచ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.జ.ర.న.ర.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
పరుగులెత్తె నాకసాన!పరమంబు నందదాయెనే!భ్రమలదేలు రాయంచ!
కొరవిగాని చేష్టలేల? గురిపెంచి మ్రొక్కు మోక్షమౌ!కుమిలిపోవ లాభంబె!
తరతమాలునెంచి మెల్గు!తరుగోని దీక్ష సాయతం!తమము వీడి లోకాన!కరటు మాని నీతి బోధ! కరిమోక్షదుండు కావగం!గమిని జేర కాంక్షించు!

7.గర్భగత"-భ్రమిక"-వృత్తము.
అత్త్యష్టీఛందము.స.జ.ర.న.ర.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పరమంబు నంద దాయెనే!భ్రమలదేలు రాయంచ!
గురిపెంచి మ్రొక్కు మోక్షమౌ!కుమిలిపోవ లాభంబె!
తరుగోని దీక్ష సాయతం!తమము వీడి లోకాన!
కరిమోక్షదుండు కావగం!గమిని జేర కాంక్షించు!

8.గర్భగత"-విహంగ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.ర.న.ర.భ.స.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
పరమంబు నంద దాయెనే!భ్రమలదేలు రాయంచ!పరుగు లెత్తె నాకసాన!
గురిపెంచి మ్రొక్కు మోక్షమౌ!కుమిలిపోవ లాభంబె!కొరవిగాని చేష్ట లేల?తరుగోని దీక్ష సాయతం!తమము వీడి లోకాన!తరతమాలు నెంచి మెల్గు! 
కరి మోక్షదుండు కావగం!గమిని జేర కాంక్షించు! కరటు మాని నీతిబోధ!

9.గర్భగత"-మూర్తిమంత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.న.ర.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పరుగులెత్తె నాకసాన!భ్రమలదేలు రాయంచ!
కొరవిగాని చేష్ట లేల?కుమిలిపోవ లాభంబె?
తరతమాలు నెంచి మెల్గు!తమమువీడి లోకాన!
కరటు మాని నీతి బోధ!గమిని జేర కాంక్షించు!

10.గర్భగత"-పర మందు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.భ.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
పరుగులెత్తె నాకసాన! భ్రమల దేలు రాయంచ!పరమంబు నందదాయెనే?
కొరవిగాని చేష్ట లేల?కుమిలిపోవ లాభంబె?గురి పెంచి మ్రొక్కుమోక్షమౌ!
తరతమాలు నెంచి మెల్గు!తమము వీడి లోకాన!తరుగోని దీక్ష సాయమౌ!
కరటు మాని నీతి  బోధ!గమిని జేర కాంక్షించు!కరి మోక్షదుండు కావగన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.