గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2018, ఆదివారం

వీనియా,సమాశ్రీ,కామాతి,పరాధీన,పాలిపోవు,జాలమేల,తాడినీడ,బుద్బుద,సామదేల,నిరాధార గర్భ"-నిరంజన"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
వీనియా,సమాశ్రీ,కామాతి,పరాధీన,పాలిపోవు,జాలమేల,తాడినీడ,బుద్బుద,సామదేల,నిరాధార గర్భ"-నిరంజన"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-నిరంజన"-వృత్తము.
ఉత్కృతిఛందము..య.స.న.ర.జ.ర.ర.న.లగ.గణములు.యతులు.10,18,
ప్రాసనీమముగలదు.
నిరాధార నిరంజనుడ!నేల వీడి సామదేల?నీజన్మ నీటి బుడగరా!
పరాధీన మదేలనయ?పాలు తాడి క్రింద ద్రావ!వాజమ్మ గాకు చరితలో!
పరందాము దలంచ వయ?పాలిపోవు జీవితంబు!ప్రా జన్మ పాప మెరుగవే?
సరాగాల రమంబుగన!జాలమేల?నెంచు మంచి!సౌజన్యుడౌదు శుభగతన్?

1.గర్భగత"-వీనియా"-వృత్తము
బృహతీఛందము.య.స.న.గణములు.వృ.సం.506.ప్రాసగలదు.
నిరాధార నిరంజనుడ!
పరాధీన మదేల నయ?
పరందాము తలంచ వయ!
సరాగాల రమంబు గన!

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాస గలదు.
నేల వీడి సామదేల?
పాలు తాడి క్రింద ద్రావ!
పాలిపోవు జీవితంబు!
జాలమేల?మెంచు మంచి!

3.గర్భగత"-కామాతి"-వృత్తము.
బృహతీఛందము.త.భ.స.గణములు.వృ.సం.245.ప్రాసగలదు.
నీజన్మ నీటిబుడగరా!
వాజమ్మ గాకు చరితలో?
ప్రాజన్మ పాప మెరుగవే!
సౌజన్యుడౌదు? శుభగతన్

4.గర్భగత"-పరాధీన"-వృత్తము.
అత్యష్టీఛందము.య.స.న.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నిరాధార నిరంజనుడ!నేలవీడి సామదేల?
పరాధీన మదేల?నయ!పాలు తాడి క్రింద ద్రావ!
పరందాము తలంచ వయ!పాలిపోవు జీవితంబు!
సరాగాల రమంబు గన!జాలమేల?నెంచు మంచి!

5.గర్భగత"-పాలిపోవు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.న.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాస నీమముగలదు.
నేల వీడి సామదేల?నీ జన్మ నీటి బుడగరా!
పాలు తాడి క్రింద ద్రావ!వాజమ్మగాకు?చరితలో?
పాలిపోవు జీవితంబు!ప్రాజన్మ పాప మెరుగవే!
జాల మేల?నెంచు మంచి!సౌజన్యుడౌదు శుభగతన్?

6.గర్భగత"-జాలమేల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.న.జ.భ.జ.లల.గణములు.యతులు.9,18,
ప్రాసనీమముగలదు.
నేలవీడి సామదేల?నీజన్మ నీటి బుడగరా!నిరాధిర నిరంజనుడ!
పాలు తాడి క్రింద ద్రావ!వాజమ్మ గాకు చరితలో?పరాధీన మదేలనయ?
పాలిపోవు జీవితం!ప్రాజన్న్మ పాప మెరుగవే!పరందాము తలంచ వయ?
జాలమేల!నెంచు మంచి!సౌజన్యుడౌదు శుభగతం?సరాగాల రమంబుగన!

7.గర్భగత"-తాడినీడ"-వృత్తము.
ధృతిఛందము.త.భ.స.య.స.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీజన్మ నీటి బుడగరా!నిరాధార నిరంజనుడ?
వాజమ్మ గాకు చరితలో?పరాధీన మదేలనయ?
ప్రాజన్మ పాప మెరుగవే!పరందాము తలంచ వయ!
సౌజన్యుడౌదుశుభగతం!సరాగాల రమంబుగన!

8.గర్భగత"-బుద్బుదా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.భ.స.య.స.న.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
నీజన్మ నీటిబుడగరా!నిరాధార నిరంజనుడ?నేలవీడి సామదేల?
వాజమ్మగాకు చరితలో?పరాధీన మదేల నయ?పాలు తాడిక్రింద ద్రావ?
ప్రాజన్మ పాప మెరుగవే!పరందాము తలంచవయ!పాలిపోవు!జీవితం!
సౌజన్యుడౌదు శుభగతం!సరాగాల రమంబుగన!జాలమేల?నెంచుమంచి!

9.గర్భగత"-సామదేల"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.త.జ.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నేలవీడి సామదేల?నిరాధార నిరంజనుడ?
పాలుతాడి క్రింద ద్రావ?పరాధీన మదేల?నయ!
పాలిపోవు జీవితం!పరందాము దలచ వయ!
జాలమేల !నెంచుమంచి!సరాగాల రమంబుగన?

10.గర్భగత"-నిరాధార"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.త.జ.స.ర.న.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ప్రాసనీమముగలదు.
నేలవీడి సామదేల?నిరాధార నిరంజనుడ?నీజన్మ నీటి బుడగరా?
పాలు తాడిక్రింద ద్రావ?పరాధీన మదేలనయ?వాజమ్మగాకు చరితలో!
పాలిపోవు జీవితం!పరందాము దలంచవయ?ప్రాజన్మ పాప మెరుగవే?
జాలమేల?నెంచుమంచి!సరాగాల రమంబుగన!సౌజన్యుడౌచు శుభగతన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.