గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఆగస్టు 2018, సోమవారం

రక్షణ,భూతావాస,సదయా,తద్యశతా,చెన్నొదవు,పటుకృతి,సునామ్ని,ఔత్సాహీక,ఛందస్సంద్రమ,శ్రీవన్నెగర్భవిద్వన్మణిమయ వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

రక్షణ,భూతావాస,సదయా,తద్యశతా,చెన్నొదవు,పటుకృతి,సునామ్ని,ఔత్సాహీక,ఛందస్సంద్రమ,శ్రీవన్నెగర్భవిద్వన్మణిమయ వృత్తము.

రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

విద్వన్మణిమయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.య.స.స.త.న.న.స.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కోకొల్లలు ఛందాలను!కొన్నిటినే కొన్నారుదొలి!కువలయ కవు లానాడే?
వాకొన్నవి చాలందువె?వన్నెల శ్రీ వన్నెం గనగ!భవుసతి మురియంజేయం?
చేకొంటిని చేవంకృతి!చెన్నొదవంగొల్తుందొలిగ!శివసుతు గణపాధర్వున్!
వాకొందును భవ్యంబవ!పన్నునులే?వన్నెందనర!భవి కృతులకు నాందీయై!

1.గర్భగత"-రక్షణ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.య.లల.గణములు.వృ.సం.205.ప్రాసగలదు.
కోకొల్లలు ఛందాలను!
వాకొన్నవి చాలందువె?
చేకొంటిని చేవం కృతి!
వాకొందును భవ్యంబవ!

2.గర్భగత"-భూతావాస"-వృత్తము.
బృహతీఛందము.భ.మ.న.గణములు.వృ.సం.455.ప్రాసగలదు.
కొన్నిటినే!కొన్నారు దొలి!
వన్నెల శ్రీ వన్నెం గనగ!
చెన్నొదవం గొల్తుందొలిగ!
పన్నునులే!వన్నెందనర?

3.గర్భగత"-సదయా"-వృత్తము.
బృహతీఛందము.న.న.మ.గణములు.వృ.సం.64.ప్రాసగలదు.
కువలయ కవులానాడే!
భవు సతి మురియంజేయన్?
శివసుగణపాధర్వర్వున్?
భవికృతులకు నాందీయై!

4.గర్భగత"-తద్యశతా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.య.స.స.త.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కోకొల్లలు ఛందాలను !కొన్నిటినే?కొన్నారుదొలి!
వాకొన్నవి చాలందువె!వన్నెల శ్రీ వన్నెంగనగ?
చేకొంటిని చేవం కృతి!చెన్నొదవం గొల్తుం దొలిగ!
వాకొందును భావ్యంబవ!పన్నునులే వన్నెందనర!

5.గర్భగత"-చెన్నొదవు"--ఛందము.
ధృతిఛందము.భ.మ.న.న.న.మ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కొన్నిటినే!కొన్నారు దొలి!కువలయ కవు లానాడే!
వన్నెల శ్రీ వన్నెం గనగ!భవు సతి మురియంజేయన్?
చెన్నొదవం గొల్తును దొలిగ!శివ సుతుగణపాధర్వున్?
పన్నునులే?వన్నెందనర!భవి కృతులకు నాందీయై!

6.గర్భగత"పటుకృతి."-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.మ.న.న.న.మ.త.య.లల.గణములుయతులు.10,19
ప్రాసనీమముగలదు.
కొన్నిటినే కొన్నారిల!కువలయ కవు లానాడే?కోకొల్లలు ఛందాలను!
వన్నెల వన్నెంగనగ!భవు సతి మురియంజేయం?వాకొన్నవి చాలందువె?
చెన్నొదవం గొల్తును దొలిగ!శివసుతు గణపాధర్వుం!చేకొంటిని చేవం కృతి!
పన్నునులే!వన్నెం దనర!భవి కృతులకు నాందీయై!వాకొందును భావ్యంబవ!

7.గరృగత"-సునామ్ని"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.మ.త.య.లల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కులయ కవు లానాడే? కోకొల్లలు ఛందాలను!
భవు సతి మురియంజేయం!వాకొన్నవి చాలందువె?
శివ సుతు గణపాధర్వుం!చేకొంటిని చేవం కృతి!
భవి కృతులకు నాందీయై!వాకొందును భావ్యంబవ?

8.గర్భగత "-ఔత్త్సాహిక"-వృత్తము.
ఉత్కృతిఛందము,న.న.మ.త.య.స.స.త.లలగణములు.యతులు.10,18
కువలయ కవులానాడే?కోకొల్లలు ఛందాలను!కొన్నిటినే!కొన్నారు దొలి!
భవు సతి మురియంజేయం?వాకొన్నవి చాలందువె!వన్నెల వన్నెం!గనగ?
శివసుతు గణపాధర్వుం?చేకొంటిని చేవం కృతి!చెన్నొదవం గొల్తుం దొలిగ!
భవి కృతులకు నాందీయై!వాకొందును భావ్యంబవ!పన్నునులే?వన్నెందనర!

9,గర్భగత"-ఛందస్సంద్రమ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.మ.న.త.య.లల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసమమముగలదు.
కొన్నిటినే!కొన్నారు దొలి!కోకొల్లలు ఛందాలను!
వన్నెల వన్నెం గనగ!వాకొన్నవి చాలందువె?
చెన్నొదవం గొల్తుం దొలిగ!చేకొంటిం చేవంకృతి!
పన్నునులే!వన్నెం దనర!వాకొందును భావ్యంబవ!

10,గర్భగత"-శ్రీవన్నె"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.మ.న.త.య.న.న.స.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కొన్నిటినే!కొన్నారు దొలి!కోకొల్లలు ఛందాలను!కువలయ కవు లానాడే?
వన్నెల వన్నెం గనగ!వాకొన్నవి చాలందువె?భవు సతి మురియం జేయన్?
చెన్నొదవం గొల్తుం దొలిగ!చేకొంటిం!చేవం కృతి!శివ సుతు గణపాధర్వున్!
పన్నునులే?వన్నెందనర!వాకొందును!భావ్యంబవ!భవి కృతులకు నాందీయై!
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.