గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఆగస్టు 2018, ఆదివారం

కందద్వయ,కందళీ,గతిమా,సిరినిలయ,మాదక,మలిజన్మ,కనలేని,చెల్లునే, కలికావర,శాసని,కలివీడు,గర్భ"-ఘనచంపక"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
కందద్వయ,కందళీ,గతిమా,సిరినిలయ,మాదక,మలిజన్మ,కనలేని,చెల్లునే, కలికావర,శాసని,కలివీడు,గర్భ"-ఘనచంపక"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

"-ఘనచంపకము"-
ఉత్కృతిఛందము.న.జ.భ.స.స.జ.స.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.వృ.సం.
కనులుండి గానవేమిటి?ఘనుడేనని!తృళ్ళ నౌనె?కలి కావరతం సదా!
మనసుండి మన్ననేదిర?మన నేల నదెంచవేల?మలిజన్మ  గతిం  నరా!
ధనముండి ధర్మమేదిర?ధన గర్వము హేయమంచు తలపంగ వలెం భువిన్?
ఘనకీర్తి మార్గ మెంచుమి! కను సర్వము క్షేమ మంద!కలి వీడు మదిం!ఘనా!
నేల=భూమి,ఎందులకు?
1.గర్భగత"-కందద్వయ"-వృత్తములు.
1,కం .కనులుండి కాన వేమిటి?
ఘను డేనని?తృళ్ళ నౌనె? కలికావరతన్!
మనసుండి మన్ననేదిర?
మననేల? నదెంచవేల? మలిజన్మగతిన్?
2.కం.ధనముండి ధర్మ మేదిర?
ధన గర్వము హేయ మంచు తలపంగ వలెన్?
ఘన కీర్తి మార్గ మెంచుమి!
కను సర్వము క్షేమమంద!కలి' వీడు మదిన్!

2.గర్భగత"కందళీ"-వృత్తము.
బృహతీఛందము.స.జ.భ.గణములు.వృ.సం.428.ప్రాసగలదు.
కనులుండి గాన వేమిటి?
మనసుండి మన్ననేదిర?
ధనముండి ధర్మ మేదిర?
ఘనకీర్తి  మార్గ మెంచుమి!

3.గర్భగత"-గతిమా"-వృత్తము.
బృహతీఛందము.స.స.జ.గణములు.వృ.సం.348.ప్రాసగలదు.
ఘను డేనని తృళ్ళ నౌనె?
మన నేల నదెంచ వేల?
ధన గర్వము హేయమంచు!
కను సర్వము క్షేమ మంద!

4.గర్భగత"-సిరినిలయా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.లగ.గణములు.వృ.సం.92.ప్రాసగలదు.
కలి కావరతం సదా!
మలి జన్మ గతిం నరా!
తలపంగ వలెం భువిన్?
కలి వీడు మదిం ఘనా!

5.గర్భగత"-మాదక"-వృత్తము.
ధృతిఛందము.స.జ.భ.స.స.జ.గణములు.యతి,10,వ.యక్షరము.
ప్రాస నీమముగలదు.
కనులుండి కాన వేమిటి?కలి కావరతం సదా!
మనసుండి మన్న నేదిర?మలిజన్మ గతిం నరా!
ధనముండి ధర్మమేదిర?తలపంగ వలెం భువిన్!
ఘనకీర్తి మార్గ మెంచుమి!కలీ వీడు మదిం ఘనా!

6.గర్భగత"-మలిజన్మ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.జ.స.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసీమముగలదు..
ఘను డేనని తృళ్ళ నౌనె?కలి కావరతన్!సదా!
మన నేల!నదెంచ వేల?మలి జన్మ గతిం?నరా!
ధన గర్వము హేయ మంచు!తలపంగవలెం!భువిన్?
కను సర్వము క్షేమ మంద!కలి వీడు మదిం ఘనా?

7..గర్భగత"-కనవేమి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.స.స.జ.జ.రలల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
ఘను డేనని తృళ్ళ నౌనె?కలి కావరతం?సదా!కనులుండి!కానవేమిటి?
మన నేల నదెంచ వేల?మలి జన్మగతిం నరా!మనసుండి మన్న నేదిర?
ధన గర్వము హేయ మంచు!తలపంగ వలెం భువిం!ధనముండి ధర్మమేదిర?
కను సర్వము క్షేమ మంద!కలి వీడుమదిం ఘనా!ఘన కీర్తిమార్గ మెంచుమి!

8.గర్భగత"-చెల్లునే"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.జ.జ.ర.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కలి కావరతం సదా! కనులుండి గాన వేమిటి?
మలి జన్మ గతిం నరా!మనసుండి మన్న నేదిర?
తలపంగ వలెం భువిం!ధనముండి ధర్మ మేదిర?
కలి వీడు మదిం ఘనా!ఘన కీర్తి మార్గ మెంచుమి!

9.గర్భగత"-కలికావర"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.జ.ర.న.జ.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కలి కావరతం సదా!కనులుండి కానవేమిటి? ఘను డేనని తృళ్ళనౌనె?
మలి జన్మ గతిం నరా!మనసుండి మన్న నేదిర?మన నేల నదెంచ వేల?
తలపగ వలెం భువిం?ధనముండి ధర్మ మేదిర?ధన గర్వము హేయమంచు!
కలి వీడు మదిం ఘనా!ఘన కీర్తి మార్గ మెంచుమి!కను సర్వము క్షేమమంద?

10,గర్భగత"-శాసని"-వృత్తము.
ధృతిఛందము.స.స.జ.స.జ.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఘను డేనని తృళ్ళ నౌనె?కనులుండి కాన వేమిటి?
మన నేల నదెంచ వేల?మనసుండి మన్న నేదిర?
ధన గర్వము హేయ మంచు!ధనముండి ధర్మ మేదిర?
కను సర్వము క్షేమ మంద!ఘనకీమార్ర్గ మెంచుమి!

11.గర్భగత"-కలివీడు"-వృత్తము.
ఉత్కృతి ఛందము.స.స.జ.స.జ.భ.స.స.లగ.గణములు.యతులు.10,19,
ప్రాసనీమముగలదు.
ఘనుడేనని!తృళ్ళ నౌనె?కనులుండి కాన వేమిటి?కలి కావరతం సదా!
మన నేల నదెంచ వేల?మనసుండి మన్ననేదిర?మలి జన్మ గతిం నరా!
ధన గర్వము హేయమంచు!ధనముండి!ధర్మ మేదిర?తలపగవలెం!భువిన్?
కను సర్వము క్షేమమంద!ఘన కీర్తి మార్గ మెంచుమి!కను సర్వమ క్షేమమంద!
స్వస్తి.
తమవిశ్వసనీయుడు.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.