గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఆగస్టు 2018, గురువారం

వరదయా,మోహినీ,రక్షిత,పరాత్పర,నేపార,,మదెంచు,ఉదయ,కర్మణీ,బిగిసడలు,వ్రజా,తద్వర,తరింపు,జతసృజ,జతసుజనా,కృతకర్మ,నిర్విరామ,సుధర్మ,మగధీర,పాఠసుగోస్థనీ,అనిశ్చిత,మగటిమి,రాయల,తగనొప్పు,లీలయా,అవని,ధర్మాచర,గర్భ"-చిరామయ"-వృత్తము.(నక్షత్రమాల)రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
వరదయా,మోహినీ,రక్షిత,పరాత్పర,నేపార,,మదెంచు,ఉదయ,కర్మణీ,బిగిసడలు,వ్రజా,తద్వర,తరింపు,జతసృజ,జతసుజనా,కృతకర్మ,నిర్విరామ,సుధర్మ,మగధీర,పాఠసుగోస్థనీ,అనిశ్చిత,మగటిమి,రాయల,తగనొప్పు,లీలయా,అవని,ధర్మాచర,గర్భ"-చిరామయ"-వృత్తము.(నక్షత్రమాల)రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-చిరామయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.న.భ.జ.త.త.జ.గగ.గణములు.యతులు.8,16,22.
ప్రాసనీమముగలదు.
తను వశాశ్వతంబు!తగనొప్ప నుదయించి!ధర్మంబు పాఠించు!ధరాతలానన్?
మనుము కీర్తి నెంచి!మగధీర వరదాల!మర్మంబు లేకుండ! మరింత మేలై?
ధనము కర్మతబ్బు!తగురీతి నడు మంచి!ధర్మంబు నేపార!తరింపు గల్గున్!
పెనుగులాట మాను!బిగిలేని నడకేల?పేర్మిం గడింపంగ!విరించి మెచ్చున్?

1.గర్భగత"-వరదయా"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.న.ర.ల.గణములు.వృ.సం.88.ప్రాసగలదు.
తను వశా శ్వతంబు
మనుము కీర్తి నెంచి!
ధనము కర్మ తబ్బు!
పెనుగులాట మాను!

2.గర్భగత"-మోహినీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.న.గల.గణములు.వృ.సం.188.ప్రాసగలదు.
తగనొప్ప నుదయించి!
మగధీర  !వరదాల!
తగురీతి నడు మంచి!
బిగిలేని  నడకేల?

3.గర్భగత"-రక్షిత"-వృత్తము.
గాయిత్రీఛందము.త.త.గణములు.వృ.సం.37.ప్రాసగలదు.
ధర్మంబు పాఠించు
మర్మంబు లేకుండ?
ధర్మంబు నేపార
పేర్మిం గడింపంగ!

4.గర్భగత"-పరాత్పర"-వృత్తము.
సుప్రతిష్టాఛందము.జ.గగ.గణములు.వృ.సం.6.ప్రాసగలదు.
ధరా! తలానం!
మరింత మేలై!
తరింపు గల్గం!
విరించి మెచ్చున్!

5.గర్భగత"-నేపారు"-వృత్తము.
అతిశక్వరీఛందము.న.ర.న.భ.జ.గణములు.యతి.8.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తను వశాశ్వతంబు!తగ నొప్ప నుదయించి!
మనుము కీర్తి నెంచి ! మగధీర   వరదాల!
ధనము కర్మ తబ్బు!తగు రీతి నడుమంచి!
పెనుగులాట మాను !బిగి లేని   నడ కేల?

6.గర్భగత"-మదెంచు"-వృత్తము.
ప్రకృతిఛందము.న.ర.న.భ.జ.త.తగణములలు.యతి.8,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తను వశాశ్వతంబు!తగ నొప్ప నుదయించి!ధర్మంబు పాఠించు
మనుము కీర్తి  నెంచి! మగ ధీర వర దాల!  మర్మంబు లేకుండ?
ధనము కర్మ తబ్బు!తగు రీతి నడు మంచి!ధర్మంబు నేపార!
పెనుగు లాట మాను!బిగి లేని నడకేల?  పేర్మిం గడింపంగ!

7.గర్భగత"-ఉదయ"-వృత్తము.
శక్వరీఛందము.స.న.ర.ర.గల.గణములు.యతి.9,వ.య్షరము.
ప్రాసనీమముగలదు.
తగ నొప్ప నుదయించి !ధర్మంబు పాఠించు!
మగధీర వరదాల !మర్మంబు లేకుండ?
తగు రీతి నడు మంచి!ధర్మంబు నేపార!
బిగిలేని నడ కేల?  పేర్మిం గడింపంగ?

8.గర్భగత"-కర్మణీ"-వృత్తము.
అతిధృతిఛందము.స.న.ర.ర.భ.ర.గ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తగ నొప్ప నుదయించి ధర్మంబు పాఠించు ధరా తలానం!
మగధీర వరదాల!మర్మంబు లేకుండ?మరింత మేలై!
తగురీతి నడు మంచి!ధర్మంబు నేపార!తరింపు గల్గున్?
బిగి లేని నడ కేల?పేర్మిం గడింపంగ! విరించి మెచ్చున్!

9.గర్భగత"-బిగిసడలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.ర.ర.భ.ర.భ.జ.గగుగణములు.యతులు.9,15,20.
ప్రసనీమముగలదు.
తగనొప్ప నుదయించి!ధర్మంబు పాఠించు,ధరాతలానం తను వశాశ్వతంబు!
మగధీర వరదాల !మర్మంబు లేకుండ?మరింత మేలై!మనుము కీర్తి నెంచి!
తగురీతి నడుమంచి!ధర్మంబు నేపార!తరింపు గల్గుం!ధనము కర్మ తబ్బు!
బిగిలేని నడకేల?పేర్మిం గడింపంగ!విరించి మెచ్చుం!పెనుగులాట మాను!

10,గర్భగత"-వ్రజా"-వృత్తము.
త్రిష్టుప్ఛందము.త.త.జ.గగ.గణములు.యతి.7.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ధర్మంబు పాఠించు ధరా తలానన్!
మర్మంబు లేకుండ మరింత మేలై!
ధర్మంబు నేపార తరింపు గల్గున్?
పేర్మిం గడింపంగ విరించి మెచ్చున్!

11.గర్భగత"-,తద్వర"-వృత్తము.
ధృతిఛందము.త.త.జ.త.స.ర.గణములు.యతి.7.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధర్మంబు పాఠించు!ధరాతలానం!తను వశాశ్వతంబు?
మర్మంబు లేకుండ!మరింత మేలై!మనుము కీర్తి నెంచి!
ధర్మంబు నేపార!తరింపు గల్గుం!ధనము కర్మ తబ్బు!
పేర్మిం గడింపంగ!విరించి మెచ్చుం!పెనుగు లాట మాను!

12.గర్భగత"-తరింపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.త.జ.త.స.ర.స.న.గల.గణములు.యతులు.7,12.
ప్రాసనీమముగలదు.
ధర్మంబు పాఠించు ధరాతలానం!తను వశాశ్వతంబు?తగనొప్ప నుదయించి!
మర్మంబు లేకుండ!మరింత మేలై!మనుము కీర్తినెంచి!మగధీర వరదాల!
ధర్మంబు నేపార!తరింపు గల్గుం!ధనము కర్మ తబ్బు!తగురీతి నడు మంచి!
పేర్మిం గడింపంగ!విరించి మెచ్చుం!పెనుగులాట మాను!బిగి లేని నడకేల?

13.గర్భగత"-జతసృజ"-వృత్తము.
జగతీఛందము.జ.త.స.జ.గణములు.యతి.6,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.వృ.సం.
ధరాతలానం!తను వశాశ్వతంబు?
మరింత మేలై?మనుము కీర్తి నెంచి!
తరింపు గల్గుం?ధనము కర్మ తబ్బు!
విరించి మెచ్చుం!పెనుగు లాట మాను!

14.గర్భగత"-జతసుజనా"-వృత్తము.
కృతిఛందము.జ.త.స.జ.స.న.గల.గణములు.యతి.13.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ధరాతలానం?తను వశాశ్వతంబు?తగ నొప్ప నుదయించి!
మరింత మేలై!మనుము కీర్తి నెంచి!మగధీర  వరదాల?
తరింపు గల్గుం?ధనము కర్మ తబ్బు!తగు రీతి నడు మంచి?
విరించి మెచ్చుం?పెనుగులాట మాను!బిగి లేని నడకేల?

15.గర్భగత"-కృతకర్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.త.స.జ.స.న.ర.ర.గల.గణములు.యతులు.6,13,21.
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధరాతలానం!తనువశాశ్వతంబు?తగనొప్ప నుదయించి!ధర్మంబు పాఠించు!
మరింత మేలై!మనుము కీర్తినెంచి!మగధీర వరదాల!మర్మంబు లేకుండ?
తరింపు గల్గుం!ధనము కర్మతబ్బు!తగురీతి నడు!మంచి!ధర్మంబు నేపార
విరించి మెచ్చుం?పెనుగులాట మాను!బిగిలేని నడకేల ?పేర్మిం గడింపంగ!

16.గర్భగత"-నిర్విరామ"-వృత్తము
అతిశక్వరీఛందము.స.న.భ.స.జ.గణములు.యతి9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.
తగనొప్ప నుదయించి! తనువశాశ్వతంబు?
మగధీర వరదాల! మనుము కీర్తి నెంచి!
తగు రీతి నడు మంచి!ధనము కర్మ తబ్బు!
బిగి లేని నడకేల?పెనుగులాట మాను!

17.గర్భగత"-సుధర్మ"-వృత్తము.
ప్రకృతి ఛందము.స.న.భ.స.జ.త.త.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.
తగనొప్ప నుదయించి!తనువశాశ్వతంబు!ధర్మంబు పాఠించు!
మగ ధీర వరదాల!మనుము కీర్తి నెంచి!మర్మంబు లేకుండ?
తగురీతి నడు మంచి!ధనము కర్మ తబ్బు!ధర్మంబు నేపార!
బిగి లేని నడకేల?పెనుగులాట మాను!పేర్మిం గడింపంగ?

18.గర్భగత"-మగధీర"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.భ.స.జ.త.త.జ.గగ.గణములు.యతులు.9,16.
ప్రాసనీమముగలదు.వృ.సం.
తగనొప్ప నుదయించి!తను వశాశ్వతంబు!ధర్మంబు పాఠించు!ధరా తలానన్?
మగధీర!వరదాల!మనుము కీర్తి నెంచి!మర్మంబు లేకుండ!మరింత మేలై!
తగురీతి నడు మంచి!ధనము కర్మతబ్బు?ధర్మంబు నేపార!తరింపు గల్గన్?
బిగిలేని నడకేల?పెనుగులాట మాను!పేర్మింగడింపంగ?విరించి మెచ్చున్?

19.గర్భగత"-పాఠవ"-వృత్తము.
అతిజగతీఛందము.త.త.న.ర.ల.గణములు.యతి.7,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధర్మంబు పాఠించు! తనువశాశశ్వతంబు?
మర్మంబు లేకుండ!మనుము కీర్తి నెంచి?
ధర్మంబు నేపార! ధనము కర్మ తబ్బు?
పేర్మి గడింపంగ?పెనుగులాట మాను!

20.గర్భగత"గోస్థనీ"-వృత్తము.
ప్రకృతిఛందము.త.త.న.ర.న.భ.జ.గణములు.యతులు.7,14.
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధర్మంబు పాఠించు!తనువశాశ్వతంబు?తగ నొప్ప నుదయించి?
మర్మంబు లేకుండ!మనుము కీర్తి నెంచి?మగధీర వరదాల?
ధర్మంబు నేపార!ధనము కర్మ తబ్బు?తగు రీతి నడు మంచి!
పేర్మి గడింపంగ?పెనుగులాట మాను!బిగి లేని నడకేల?

21.గర్భగత"-అనిశ్చిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.త.న.ర.న.భ.జ.జ.గగ.గణములు.యతులు.7,14,20,
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధర్మంబు పాఠించు!తను వశాశ్వతంబు?తగ నొప్ప నుదయించి!ధరాతలానన్!
మర్మంబు లేకుండ!మనుము కీర్తినెంచి?మగధీర వరదాల?మరింత మేలై!
ధర్మంబు నేపార!ధనము కర్మ తబ్బు!తగురీతి నడు మంచి!తరింపు గల్గున్?
పేర్మింగడింపంగ?పెనుగులాట మాను!బిగిలేని నడకేల?విరించి మెచ్చున్!

22.గర్భగత"-మగతన"-వృత్తము.
అతిజగతీఛందము.జ.త.జ.స.ల.గణములు.యతి.6,వయక్షరము.
ప్రాసనీమము గలదు.వృ.సం.
ధరాతలానం తగ నొప్ప నుదయించి?
మరింత మేలై! మగధీర వరదాల!
తరింపు గల్గుం?తగురీతి నడు మంచి!
విరించి మెచ్చుం?బిగిలేని నడకేల?

23.గర్భగత"-రాయల"-వృత్తము.
అతిధృతిఛందము.జ.త.జ.సఅతిధృతిగణములు.యతులు7,14.
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధరాతలానం!తగ నొప్ప నుదయించి! ధర్మంబు పాఠించు?
మరింత మేలై!మగధీర వరదాల?మర్మంబు లేకుండ?
తరింపు గల్గుం?తగురీతి నడు మంచి!ధర్మంబు నేపార!
విరించి మెచ్చుం! బిగి లేని నడకేల?పేర్మిం గడింపంగ?

24.గర్భగత"-తగనొప్పు"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.త.జ.స.ర.య.న.డ.గల.గణములు.యతులు6,14,20
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధరాతలానం?తగనొప్ప నుదయించిధర్మంబు పాఠించు?తను వశాశ్వతంబు!
మరింత మేలై!మగధీర వరదాల?మర్మంబు లేకుండ?మనుము!కీర్తి నెంచి!
తరింపు గల్గుం?తగురీతి నడుమంచి!ధర్మంబు నేపార!ధనము కర్మ తబ్బు!
విరించి మెచ్చుం?బిగి లేని నడకేల?పేర్మిం గడింపంగ?పెనుగులాట మాను?

25.గర్భగత"-లీలయా"-వృత్తము.
త్రిష్టుప్ఛందము.జ.మ.ర.గల.గణములు.యతి.6,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధరాతలానం?ధర్మంబు పాఠించు?
మరింత మేలై!మర్మంబు లేకుండ?
తరింపు గల్గుం!ధర్మంబు! నేపార!
విరించి మెచ్చుం?పేర్మిం గడింపంగ?

26.గర్భగత"-అవని"-వృత్తము.
అతిధృతిఛందము.జ.మ.ర.భ.జ.స.ల.గణములు.యతులు.6,12
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధరా తలానం?ధర్మంబు పాఠించు?తగనొప్ప నుదయించి!
మరింత మేలై!మర్మంబు లేకుండ?మగ ధీర వరదాల!
తరింపు గల్గుం?ధర్మంబు నేపార!తగురీతి నడు మంచి?
విరించి మెచ్చుం?పేర్మిం గడింపంగ?బిగిలేని నడకేల?

27.గర్భగత"-ధర్మాచర"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.మ.ర.భ.జ.స.న.జ.గల.గణములు.యతులు.6,12,20.
ప్రాసనీమముగలదు.
ధరాతలానం?ధర్మంబు పాఠించు?తగనొప్ప నుదయించి!తను వశాశ్వతంబు?
మరింత మేలై?మర్మంబు లేకుండ!మగధీర వరదాల!మనుమ కీర్తి నెంచి?
తరింపు గల్గుం?ధర్మంబు నేపార!తగు రీతి నడు మంచి!ధనము కర్మతబ్బు?
విరించి మెచ్చుం!పేర్మింగడింపంగ!బిగిలేని నడకేల?పెనుగులాట మాను.
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.