గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఆగస్టు 2018, మంగళవారం

వరదామద్వయ,గతికా,విభుతి,సన్నిజాలద్వయ,దుర్గుణ,సనాతన,అతిక్రమ,విశేషిత,నీరజ రజ ,నీతివినా,అక్రమ, జీవసాగర, నీచకారక ,ప్రీతికాగ,కారక రాలిక,తృష్ణావర్త,నిరంజనీ,గమిలేని,కుయోధన,గర్భ"తమ తమాళీద్వయ వృత్తములు.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ.

జైశ్రీరామ్.
వరదామద్వయ,గతికా,విభుతి,సన్నిజాలద్వయ,దుర్గుణ,సనాతన,అతిక్రమ,విశేషిత,నీరజ రజ ,నీతివినా,అక్రమ, జీవసాగర, నీచకారక ,ప్రీతికాగ,కారక రాలిక,తృష్ణావర్త,నిరంజనీ,గమిలేని,కుయోధన,గర్భ"తమ తమాళీద్వయ వృత్తములు.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ.

       "-  తమ తమాళీ ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.స.న.జ.న.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.6,11,20,
ప్రాసనీమముగలదు.
సమ న్యాయము!సమధర్మము! సమాజ స్థాపనమ్ము!సాగె వీడి భూమినిన్?
తమిదీరగ తమవారికి!తమ,తమాళి శ్రీలు నాయె!దాగె నీచ సంస్కృతిన్?గమియించెను కమనీయత!క్రమత లేక కామిదాన!కాగె ప్రీతి చిచ్చునన్?
కమలాలయ!గమి లేదిక?గమము చేర నోపదాయె?గాగ నింపు ధోరణిన్?

2.
సమధర్మము!సమన్యాయము!సమసమాజ స్థాపనమ్ము!సాగె వీడి భూమినిన్
తమవారికి!తమిదీరగ!తమ,తమాళి శ్రీలు నాయె!దాగె నీచ సంస్కృతిన్?
కమనీయత!గమియించెను!క్రమత లేక కామిదాన!కాగె ప్రీతి చిచ్చునన్?
గమిలేదిక?కమలాలయ!గమము చేర నోపదాయె? గాగ నింపు ధోరణిన్?

1.గర్భగత"-వరదామ "-ద్వయ వృత్తములు.
సుప్రతిష్టాఛందము.స.లల.గణములు.వృ.సం.28.ప్రాసగలదు.
1.సమ న్యాయము!.                  2.సమ ధర్మము!
    తమి దీరగ!.                              తమ వారికి!
   గమియించెను!                          కమనీయత!
   కమలాలయ!                            గమి లేదిక?

2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
సమ సమాజ స్థాపనమ్ము!
తమ,తమాళి శ్రీలు నాయె!
క్రమత లేక కామిదాన!
గమము చేర నోప దాయె?

3.గర్భగత"-విభూతి"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.ర.జ.గ.గణములు.వృ.సం.43.ప్రాసగలదు.
సాగె వీడి భూమినిన్?
దాగె నీచ సంస్కృతిన్?
కాగె ప్రీతి  చిచ్చునన్!
గాగ నింపు ధోరణిన్!

4,గర్భగత"-సన్నిజాల"ద్వయ వృత్తములు.
పంక్తిఛందము.స.న.జ.ల.గణములు.యతి.6.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.సమ న్యాయము!సమ ధర్మము!
   తమి దీరగ !తమవారికె!
   గమియించెను!కమనీయత!
  కమలాలయ!గమి లేదిక?

2.సమ ధర్మము!సమ న్యాయము!
   తమ వారికె!తమి దీరగ!
   కమనీయత!గమియించెను?
   గమి లేదిక?కమలాలయ!

5.గర్భగత"-దుర్గుణ"-వృత్తము.
అతిధృతిఛందము.స.న.జ.న.జ.ర.ల.గణములు.యతి.11.వ.యక్షరము
ప్రాసనీమముగలదు..
సమ న్యాయము!సమ ధర్మము!సమ సమాజ స్థాపనమ్ము!
తమి దీరగ !తమ వారికె!తమ,తమాళి శ్రీలు నాయె!
గమియించెను!కమనీయత!క్రమత లేక కామిదాన!
కమలాలయ!గమి లేదిక?గమము చేర నోపదాయె?

6.గర్భగత"-సనాతన"-వృత్తము.
శక్వరీఛందము.స.న.స.జ.గల.గణములు.యతి.6.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు 
సమ ధర్మము!సమ సమాజ స్థాపనమ్ము!
తమవారికె?తమ తమాళి శ్రీలు నాయె?
కమనీయత క్రమత లేక కామిదాన!
గమి లేదిక?గమము చేర నోపదాయె?


7,గర్భగత"-అతిక్రమ"-వృత్తము.
ప్రకృతిఛందము.స.న.స.జ.ర.జ.ర.గణములు.యతులు.6,15.
ప్రాసనీమముగలదు.
సమ ధర్మము!సమ సమాజ స్థాపనమ్ము!సాగె వీడి భూమినిన్?
తమ వారికె?తమ తమాళి శ్రీలు నాయె?దాగె నీచ సంస్కృతిన్!
కమనీయత!క్రమత లేక కామిదాన!కాగె ప్రీతి చిచ్చునన్?
గమిలేదిక? గమము చేర నోపదాయె?గాగ నింపు ధోరణిన్?

8.గర్భగత"-విశేషిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.స.జ.ర.జ.ర.స.లల.గణములు.యతులు.6,15,22.
ప్రాసనీమముగలదు.
సమధర్మము!సమసమాజ స్థాపనమ్ము!సాగె వీడి భూమినిం?సమన్యాయము
తమ వారికె!తమ తమాళి శ్రీలు నాయె?దాగె నీచ సంస్కృతిం!తమి దీరగ!
కమనీయత!క్రమత లేక?కామిదాన!కాగె ప్రీతి చిచ్చునం?గమియించెను!
గమి లేదిక?గమము చేర నోపదాయె?గాగ నింపు ధోరణిం?కమలాలయ!

9.గర్భగత"-నీరజ రజ"-వృత్తము.
అష్టీఛందము.న.ర.జ.ర.జ.గ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సమ సమాజ స్థాపనమ్ము!సాగె వీడి భూమినిన్?
తమ తమాళి శ్రీలు నాయె!దాగె నీచ సంస్కృతిన్?
క్రమత లేక!కామిదాన కాగె ప్రీతి చిచ్చునన్?
గమముచేర నోపదాయె?గాగ నింపు ధోరణిన్?

10,గర్భగత"-నీతివినా"-వృత్తము.
ప్రకృతిఛందము.న.ర.జ.ర.జ.భ.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సమసమాజ స్థాపనమ్ము!సాగె వీడి భూమినిం!సమ న్యాయము?
తమ తమాళి శ్రీలు నాయె?దాగె నీచ సంస్కృతిం?తమి దీరగ!
క్రమత లేక కామిదాన !కాగె ప్రీతి చిచ్చునం?గమియించెను!
గమము చేర నోపదాయె?గాగ నింపు ధోరణిం!కమలాలయ!

11.గర్భగత"-అక్రమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.భ.భ.స.లల.గణములు.యతులు.10,17.
ప్రాసనీమముగలదు.
సమసమాజ స్థాపనమ్ము!సాగె వీడి భూమినిం?సమన్యాయము!సమధర్మము
తమ తమాళి శ్రీలు నాయె? దాగె నీచ సంస్కృతిం!తమి దీరగ!తమ వారికె?
క్రమత లేక కామిదాన!కాగె ప్రీతి చిచ్చునం!గమియించెను!కమనీయత?
గమము చేర నోపదాయె!గాగ నింపు ధోరణిం!కమలాలయ!గమి లేదిక?

12.గర్భగత"-జీవసాగర"-వృత్తము.
జగతీఛందము.ర.జ.ర.భ.గణములు.యతి.8,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సాగె వీడి భూమినిం? సమ న్యాయము!
దాగె నీచ సంస్కృతిం!తమి దీరగ!
కాగె ప్రీతి చిచ్చునం గమియించెను!
గాగ నింపు ధోరణిం?కమలాలయ!

13.గర్భగత"నీచ కారక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.భ.స.లల.గణములు.యతి.8,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సాగె వీడి భూమినిం?సమ న్యాయము !సమ ధర్మము!.
దాగె నీచ సంస్కృతిం!తమి దీరగ!తమ వారికె?
కాగె ప్రీతి చిచ్చునం!గమియించెను!కమనీయత!
గాగ నింపు ధోరణిం?కమలాలయ!గమి లేదిక?

14.గర్భగత"-ప్రీతి కాగె"-వృత్తము.
ఉత్కృతిఛందము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.భ.స.న.స.జ.గల.గణములు.యతులు8,18.

ప్రాసనీమముగలదు.

సాగెవీడి భూమినిం!సమన్యాయము!సమధర్మము!సమసమాజ!స్థాపనమ్ము
దాగె నీచ సంస్కృతిం!తమిదీరగ!తమవారికె?తమ తమాళి శ్రీలు నాయె?
కాగె ప్రీతి చిచ్చునం!గమియించెను!కమనీయత!క్రమత లేక కామిదాన!
గాగ నింపుధోరణిం?కమలాలయ!గమి లేదిక?గమము చేర నోపదాయె!


15.గర్భగత"-కారక"-వృత్తము.
అతిధృతిఛందము.స.న.జ.న.జ.ర.ల.గణములు.యతులు.6,11,

ప్రాసనీమముగలదు.

సమ.ధర్మము!సమన్యాయము!సమసమాజ స్థాపనమ్ము!
తమ వారికె?తమిదీరగ!తమ తమాళి శ్రీలు నాయె?
కమనీయత గమియించెను!క్రమత లేక కామిదాన!

గమిలేదిక?కమలాలయ!గమము చేర నోపదాయె?


16.గర్భగత"-రాలిక"-వృత్తము.
అతిధృతిఛందము.న.ర.జ.స.న.జ.ల.గణములు.యతులు.10,15.

ప్రాసనీమముగలదు.

సమసమాజ!స్థాపనమ్ము!సమధర్మము!సమన్యాయము!
తమ తమాళి శ్రీలు నాయె!తమ వారికె?తమిదీరగ?
క్రమత లేక కామిదాన!కమనీయత గమియించెను!
గమము చేర నోపదాయె?గమి లేదిక?కమలాలయ!

17.గర్భగత"-తృష్ణావర్త"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.న.జ.స.ర.లగ.గణములు.యతులు.10,20,

ప్రాసనీమముగలదు.

సమసమాజసస్థాపనమ్ము!సమధర్మము!సమన్యాయము!సాగె వీడి భూమినిన్?
తమతమాళి శ్రీలు నాయె!తమవారికె?తమిదీరగ!దాగె నీచ సంస్కృతిన్?
క్రమత లేక కామిదాన!కమనీయత గమియించెను!కాగె ప్రీతి చిచ్చునన్!
గమము చేర నోపదాయె?గమి లేదిక?కమలాలయ!గాగ నింపు ధోరణిన్!

18.గర్భగత"-నిరంజనీ"-వృత్తము.
అష్టీఛందము.ర.జ.భ.జ.ర.ల.గణములు.యతి.8,వ.యక్షరము.

ప్రాసనీమముగలదు.

సాగె వీడి భూమినిం?సమ సమాజ స్థాపనమ్ము?
దాగె నీచ సంస్కృతిం?తమ తమాళి శ్రీలు నాయె?
కాగె ప్రీతి చిచ్చునం! క్రమత లేక కామిదాన!
గాగ నింపు ధోరణిం!గమము చేర నోపదాయె?

19.గర్భగత"-గమిలేని"-వృత్తము.
ప్రకృతిఛందము.ర.జ.భ.జ.ర.న.భ.గణములు.యతి.8,వ.యక్షరము.

ప్రాసనీమముగలదు.

సాగె వీడి భూమినిం?సమ సమాజ స్థాపనమ్ము!సమధర్మము?
దాగె నీచ సంస్కృతిం?తమ తమాళి శ్రీలు నాయె?తమ వారికె!
కాగె ప్రీతి చిచ్చునం!క్రమత లేక కామిదాన!కమనీయత!
గాగ నింపు ధోరణిం?గమము చేర నోపదాయె?గమి లేదిక?

20.గర్భగత"-కుయోద్ధన"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.జ.ర.న.భ.స.లల.గణములు.యతులు.8,17;

ప్రాసనీమముగలదు.

సాగె వీడి భూమినిం?సమసమాజ స్థాపనమ్ము!సమధర్మము!సమన్యాయము
దాగె నీచ సంస్కృతిం?తమ తమాళి శ్రీలు నాయె?తమవారికె?తమిదీరగ!
కాగె ప్రీతి చిచ్చునం!క్రమత లేక కామిదాన!కమనీయత!గమియించెను!
గాగ నింపు ధోరణిం?గమముచేర నోపదాయె!గమిలేదిక!కమలాలయ!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.