గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఆగస్టు 2018, సోమవారం

రయలా,చరణసేవ,హంసయాన,నెడమ,పరంతప,రయజా,నాదను, ఉద్ధర,తనరు,దోషచైద,గమన,దయ్యాల,నీవీ,ఆశాళుర,కానని,నిరక్షర,నెయ్యంపు,గర్భ"-హొయలా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

రయలా,చరణసేవ,హంసయాన,నెడమ,పరంతప,రయజా,నాదను, ఉద్ధర,తనరు,దోషచైద,గమన,దయ్యాల,నీవీ,ఆశాళుర,కానని,నిరక్షర,నెయ్యంపు,గర్భ"-హొయలా"-వృత్తము.

రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-హొయలా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.త.న.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.8,16,20
ప్రాసనీమముగలదు.
ఓనమాలు రాకున్న!నోయ్యార మొలకబోసి!ఉద్ధరింప!నోట్ల ఓట్లు కొందురే!
కానరాని చైదాల!గయ్యాళితనము జూపి!గద్దెనెక్కి స్వార్ధ గమ్య మెంతురే!
దాన'-రక్ష సేయంగ!దయ్యాల సములనంగ?దద్దరిల్ల శాంతి"దండ"మేర్తురే!
నేను నాదనెండూహ!నెయ్యంబు నెడముజేయ!నిద్దురించుఖ్యాతి,నీతి భూతలిన్?

1.గర్భగత"-రయలా"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.ర.య.ల.గణములు.వృ.సం.75.ప్రాసగలదు.
ఓనమాలు రాకున్న!
కానరాని చైదాల!
దాన రక్ష సేయంగ!
నేను నాదనెండూహ!

2.గర్భగత"-చరణసేవ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.న.గల.గణములు.వృ.సం.189.ప్రాసగలదు.
ఒయ్యార మొలక బోసి!
గయ్యాళి తనము జూపి!
దయ్యాల సములనంగ?
నెయ్యంబు నెడము జేయ!

3.గర్భగత"-హంసయాన"-వృత్తము.
త్రిష్టుప్ఛందము.ర.జ.ర.లగ.గణములు.యతి.7,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఉద్ధరింప నోట్ల ఓట్లు కొందురే?
గద్దెనెక్కి స్వాగమ్మ్య మెంతురే?
దద్దరిల్ల శాంతి దండ మేర్తురే?
నిద్దురించు,ఖ్యాతి,నీతి భారతిన్!

4.గర్భగత"-నెడమ"-వృత్తము.
అతిశక్క్వరీఛందము.ర.య.య.న.జ.గణములు.యతి.8.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఓనమాలు రాకున్న! నొయ్యార మొలకబోసి!
కానరాని చైదాల!గయ్యాళి తనముసేయంగన
దాన రక్ష సేయంగ!దయ్యాల సములనంగ?
నేను నాదనెండూహ!నెయ్యంబు నెడము సేయ!

5.గర్భగత"-పరంతప"-వృత్తము.
ప్రతిష్టిఛందము.ర.ల.గణములు.వృ.సం.11.ప్రాసనీమముగలదు.
ఉద్ధరింప
గద్దెనిక్కి
దద్దరిల్ల
నిద్దురేల?

6.గర్భగత"-రయజా"-వృత్తము.
త్రిష్టుప్ఛందము.ర.య.జ.గల.గణములు.యతి.8,య్యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఓనమాలు రాకున్న ఉద్ధరింప!
కానరానిచైదాల!గద్దెనెక్కి!
దానరక్ష సేయంగ!దద్దరిల్ల!
నేను నాదనెండూహ!నిద్దురేల?

7.గర్భగత"-నాదను"-వృత్తము.
అతిధృతిఛందము.ర.య.జ.ర.భ.స.ల.గణములు.యతులు.8,12.
ప్రసనీమముగలదు.
ఓనమాలు రాకున్న!ఉద్ధరింప!నొయ్యారమొలకబోసి!
కానరాని చైదాల గద్దెనెక్కిగయ్యాళి తనము జూపి!
దాన రక్ష సేయంగ దద్దరిల్ల!దయ్యాల సములనంగ!
నేను నాదనెండూహ!నిద్దురేల? నెయ్యంబు నెడము సేయ!

8."-గర్భగత"-ఉద్దార"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.జ.ర.భ.స.జరర.లగ.గణములు.యతులు8,12,20
ప్రాసనీమముగలదు
ఓనమాలు రాకున్న!నుద్దరింప!నొయ్యార మొలకబోసి!నోట్ల ఓట్లు కొందురే?
కానరాని చైదాల!గద్దెనెక్కి !గయ్యాళితనముజూపి!స్వార్ధగమ్య మెంతురే!
దానరక్ష సేయంగ!దద్దరిల్ల!దయ్యాలసములనంగ!శాంతి దండ మేర్తురే!
నేను నాదనెండూహ!నిద్దురేల?నెయ్యంబు నెడము సేయ!ఖ్యాతి,నీతి, భూతలిన్?

9,గర్భగత"-తనరు"-వృత్తము.
జగతీఛందము.త.న.ర.జ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఒయ్యార మొలకబోసి!ఉద్ధరింప!
గయ్యాళి తనము జూపి!గద్దెనెక్కి!
దయ్యాల సములనంగ!దద్దరిల్ల!
నెయ్యంబు నెడము సేయ!నిద్దురేల?

10,గర్భగత"-దోషచైద"-వృత్తము.
అతిధృతిఛందము.ర.య.య.న.జ.ర.ల.గణములు.యతులు.8,16,
ప్రాసనీమముగలదు.
ఓనమాలు రాకున్న!నొయ్యార మొలకబోసి!ఉద్ధరింప!
కానరాని చైదాలగయయ్యాళి తనము జూపి!గద్దెనెక్కి!
దాన రక్ష సేయంగ!దయ్యాల సములనంగ!దద్దరిల్ల!
నేను,నాదనెండూహ!నెయ్యంబు నెడముసేయ!నిద్దురేల?

11.గర్భగత"-ఆగమన"-వృత్తము.
అతిధృతిఛందము.త.న.ర.జ.ర.జ.గ.గణముగణయతులు.9,15,
ప్రాసనీమముగలదు.
ఒయ్యార మొలకబోసి!ఉద్ధరింప!నోట్ల ఓట్లు కొందురే?
గయ్యాళితనము జూపి!గద్దెనెక్కి స్వార్ధ గమ్య మెంతురే
దయ్యాల సములనంగ!దద్దరిల్ల శాంతి దండ మేర్తురే!
నెయ్యంబు నెడముజేయ!నిద్దురించు ఖ్యాతి,నీతి భారతిన్!

12.గర్భగత"-దయ్యాల"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.న.ర.జ.ర.జ.త.ర.గల.గణములు.యతులు.9,13,18,ప్రాసనీమముగలదు
ఒయ్యార మొలక బోసి! ఉద్ధరింప!నోట్ల ఓట్లు కొందురే!ఓనమాలు రాకున్న!
గయ్యాళితనము జూపి!గద్దెనెక్కి!స్వార్ధ గమ్య మెంతురే!కానరాని చైదాల!
దయ్యాల సములనంగ!దద్దరిల్ల!శాంతి దండమేర్తురే!దాన రక్ష సేయంగ!
నెయ్యంబు నెడము జేయ!నిద్దురించు!ఖ్యాతి,నీతిభారతిం!నేను నాద నెండూహ!

13.గర్భగత"-నీవీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.య.జ.త.గణములు.యతులు.7,12.
ప్రాసనీమముగలదు.
ఉద్ధరింప నోట్ల ఓట్లు కొందురే!ఓనమాలు రాకున్న!
గద్దెనెక్కి స్వార్ధ గమ్య మెంతురే!కానరాని చైదాల!
దద్దరిల్ల శాంతిదండమమేర్తురే!దాన రక్ష  సేయంగ!
నిద్దురించు ఖ్యాతి,నీతిభారతిం!నేను నాదనెండూహ!


14.గర్భగత"-ఆశాళు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.య.జ.త.త.న.గల.గణములు.యతులు.7,12,19
ప్రాసనీమగలదు.
ఉద్ధరింప నోట్ల ఓట్లు కొందురే?ఓనమాలు రాకున్న!నొయ్యార మొలకబోసి!
గద్దెనెక్కి స్వార్ధ గమ్య మెంతురే!కానరాని చైదాల!గయ్యాళితనము జూపి!
దద్దరిల్ల శాంతి దండ మేర్తురే!దాన రక్ష సేయంగ!దయ్యాల సములనంగ?
నిద్దురించు ఖ్యాతి,నీతి,భారతిం!నేను నా దనెండూహ!నెయ్యంబు నెడము జేయ!

15.గర్భగత"-కానని"-వృత్తము.
అతిశక్వరీఛందము.త.న.ర.జ.త.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఒయ్యార మొలకబోసి ఓనమాలు రాకున్న!
గయ్యాళితనము జూపి కానరాని చైదాల!
దయ్యాల సములనంగ దాన రక్ష సేయంగ!
నెయ్యంబు నెడముజేయ నేను నాదనెండూహ !

16.గర్భగత"-నిరక్షర"-వృత్తము.
అతిధృతిఛందము.త.న.ర.జ.త.ర.ల.గణములు.యతులు.9,16.
ప్రాసనీమముగలదు.
ఒయ్యార మొలకబోసి ఓనమాలు రాకున్న!ఉద్ధరింప!
గయ్యాళితనము జూపి కానరాని చైదాల!గద్దె నెక్కి!
దయ్యాల సములనంగ దానరక్ష సేయంగ!దద్దరిల్ల!
నెయ్యంబు నెడము జేయ!నేను నాదనెండూహ!నిద్దురించు!

17.గర్భగత"-నెయ్యంపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.న.ర.జ.త.ర.జ.ర.లగ.గణములు.యతులు,9,16,20,
ప్రాసనీమముగలదు.
ఒయ్యార మొలకబోసి!ఓనమాలు రాకున్న!ఉద్ధరింప!నోట్ల ,ఓట్లు,కొందురే!.
గయ్యాళితనము జూపి!కానరాని చైదాల!గద్దె నెక్కి!స్వార్ధ గమ్య మెంతురే?
దయ్యాల సములనంగ!దానరక్ష సేయంగ!దద్దరిల్ల శాంతి దండ  మేర్తురే!
నెయ్యంబు నెడము జేయ!నేను,నా దనెండూహ!నిద్దురించు!ఖ్యాతి,నీతి భారతిన్?
స్వస్తి
మూర్తి.జుత్తాడ. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.