గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఫిబ్రవరి 2018, గురువారం

బాల-రత్నాలు. .. .. .. శ్రీ వల్లభ,

 జైశ్రీరామ్.
బాల-రత్నాలు.
వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.
1.సరసిజవృత్తము.
బృహతీఛందము.
న.య.స.గణములు.ప్రాసగలదు.వృ.సం.208.
చదువున పోటీ పడుమా!
మదమతులం!జేరకుమా!
పదపడి!విద్యార్జనమే!
పదిలము!గూర్చుస్సుగుణా!
2.నిదర్శనావృత్తము.
బృహతీఛందము.
భ.భ.భ.గణములు. ప్రాసగలదు.వృ.సం.439.
తుచ్ఛపు బుద్ధులననొప్పక!
కచ్ఛిత మొప్పెడి జీవన!
నచ్చును మెచ్చును దైవము!
ముచ్చటదౌనుర!బాలక!
3.నిదర్శనావృత్తము.
బృహతీఛందమ.
భ.భ.భ.గణములు.ప్రాసగలదు. వృ.సం.439.
దైవపు భక్తియు కావలె!
కావలె దాతకు నీవియు!
నీవియు సర్వద కావదె!
కావదె ధర్మము బాలక!
4.నిదర్శనావృత్తము.
బృహతీఛందము.                                        
భ.భ.భ.గణములు.ప్రాసగలదు. వృ.సం.439. 
నొద్దుగ బుద్ధిగ శుద్ధిగ!
శుద్ధిగ జీవన భద్రత!
బద్ధత గూర్చు నదద్దిర!
అద్దిర కీర్తిలు బాలక!
5.వారుణీవృత్తము.
బృహతీఛందము.న.జ.స.గణములు.ప్రాసగలదు.వృ.సం.240.
కుదువగ బెట్టిన ధనం!
కొదువయినం సరె! పదే!
బదులుకు! బోకుమి! గుణా!
కుదువగు!కీర్తి! ధరలోన్!
6.సమయావృత్తము.
బృహతీఛందము.స.మ.య.గణములు.ప్రాసగలదు.వృ.సం.68.
చదువే!తల్లీదండ్రటంచున్!
చదువే!సర్వంబంచు!నెంచన్!
పదిలంబౌ!జీవంబౌ!గాదే!
కొదువేదీ!విజ్ఞాన బాలా!
7.వీక్షితవృత్తము.
బృహతీఛందము.న.స.య.గణములు.ప్రాసగలదు.వృ.సం.96.
అరిషడుల!నంటనీకన్!
పరుషములు!దూరమోపన్!
కరమరుదు!జ్ఞాన! కీర్తుల్!
సరళతగ!నొప్పు!బాలా!
8.తావి వృత్తము.
బృహతీఛందము.న.జ.య.గణములు.ప్రాసగలదు.వృ.సం.112.
దివిజుల!గొల్వుమి!భక్తిన్!
ప్రవచనముల్విను!రక్తిన్!
శివమగు!మార్గము!మేలౌ!
చవటల!చేరకు!బాలా!
శివమగు=శాంతమగు.
9.బదరికావృత్తము.
బృహతీఛందము.భ.స.భ.గణములు.ప్రాసగలదు.వృ.సం.415.
సాధనమునజేకకూరును!
బాధిల పడ నేలా? మేథకు
మేథకుపదునేర్పవలెన్!
శోధన!నిధివై!బాలక!
10.నిదర్శనావృత్తము.
బృహతీఛందము.భ.భ.భ.గణములు.ప్రాసగలదు.వృ.సం.439.
మాయకు!దూరము నుండుమి!
మాయయె!కీర్తిని!మాపును!
మాయను!మెచ్చకు!బాలక!
మాయమ!రక్షను!కోరుమి!
మాయమ=లక్ష్మీ దేవి.
11.చర్వితవృత్తము.
శక్వరీఛందము.న.స.జ.జ.గల.గణములు.వృ.సం.11,104.
ప్రాసనీమముగలదు.
కలిసితిరుగాడు!కష్టసుఖాలు రెండు
చలిత గతులంది!సర్వుల చేరుచుండు!
వలనుపడదయ్య!బాలక!మార్చివేయ!
తెలిసి!భవితెంతొ!తెల్విగ!దీర్చుకొమ్మ!
12.తేజశ్రీవృత్తము.
బృహతీఛందము.భ.జ.త.గణములు.ప్రాసగలదు.వృ.సం.303.
వీలుపడినంత!సాయంబు!
చాలుననువర్కు!భుక్తంబు!
మేలుగలిగించు!కార్యాలు!
లాలితములౌను!విద్యార్ధి!
13.నరసావృత్తము.
బృహతీఛందము.న.ర.స.గణములు.ప్రాసగలదు.వృ.సం.216.
పరుల !నెత్తిజూపకుమా!
పరమ!పాపమౌను!సుమా!
ధరను!మేలు!చేయవలెన్!
వరదయాల!బాలుడనన్!
14.హరిద్రావృత్తము.
బృహతీఛందము.భ.న.స.గణములు.ప్రాసగలదు.వృ.సం.253.
విద్యనొసగు!గురుడుతా!
సద్యశ!వరదుడుగదే!
విద్య!వినయ మొసగురా!
సద్యశమును!గనుగుణా!
15.రసయావృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.ప్రాసగలదు.వృ.సం.91.
కొక్కురోయని!కోడి కూయన్!
చక్కునం!దెలివొందు మయ్యా!
టక్కుపెట్టక!నిత్యకృత్యాల్!
మక్కువం!గడతేర్చు మయ్యా!
16.రసయావృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.ప్రాసగలదు.వృ.సం.91.
పుస్తకంబులు!పట్టిచేతన్!
ప్రస్తుతించెడి!పాఠశాలన్!
నిస్తులంబగు!విద్య!నేర్వం
మస్తునౌ!భవి!జీవితంబున్!
17.ధారావృత్తము.
బృహతీఛందము.ర.స.జ.గణములు.ప్రాసగలదు.వృ.సం.347.
మంచిబాలుర!స్నేహమంది!
పెంచి!దేశపు!ఖ్యాతి!నెంతొ!
కాంచు!భాగ్యము!లోకమందు!
మించుజ్ఞానిగ!కీర్తినందు!
18.రసయావృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.ప్రాసగలదు.వృ.సం.91.
భావి!జ్యోతులు!బాలురయ్యా!
తావియౌ!రతనాల రాశులు!
శ్రీవరాసులు!శోభ తారల్!
శ్రీవరుండనిశంబు!కాచున్!
స్వస్తి.
వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝులవారి బాల రత్నాల వృత్త సంపద అద్భుతముగా నున్నది .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.