గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

రజత్రయ,చతురజా,దుర్మదాశ్రి,బిళ్హరీ, గర్భ సౌధామినీవృత్తము. రచన:-శ్రీ వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
రజత్రయ,చతురజా,దుర్మదాశ్రి,బిళ్హరీ, గర్భ సౌధామినీవృత్తము.
                                             రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                       జుత్తాడ.

సౌధామినీవృత్తము.
ఉత్కృతిఛందము,ర.జ.భ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఎంచనేల?దుర్మదాన!ఇలాతలంబు నీదు సొత్తె!ఏరి పారవేయకేరినిన్!
పంచవేల?మంచికొంత!ఫలాములౌదు!తిండి లేక!పౌరుషంబు!పాపమోపునే!
దంచ!కీర్తి దోషమోపు!దళారి గాకు!పాపమోపు!దారిజూపు!సాటివారికిన్!
సంచితార్ధ!పుణ్యుడౌమఙ!చలించు మంచి మార్గ మందు!చేరుకొమ్మమోక్షసౌధమున్!

1.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
ఎంచవేల?దుర్మదాన!
పంచవేల?మంచి కొంత!
దంచ కీర్తి!దోషమోపు!
సంచితార్ధ!పుణ్యుడౌమ!

2.గర్భగత"-మోహినీ ప్రియ"-వృత్తము.
బృహతీఛందము.జ.ర.జ.గణములు.వృ.సం.342.ప్రాసగలదు.
ఇలాతలంబు!నీదు సొత్తె?
ఫలాము లౌదు!తిండి లేక!
దళారి గాకు!పాపమోపు!
చలించు!మంచి మార్గమందు!

3.గర్భగత"-మత్తరజనీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
ఏరి పారవేయ కేరినిన్!
పౌరుషంబు పాపమోపునే!
దారి జూపు సాటివారికిన్!
చేరుకొమ్మ!మోక్ష సౌధమున్!

4.గర్భగత"-ఫలాముల"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.ర.జ.గల.గణములు.యతి9.వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
ఎంచవేల?దుర్మదాన!యిలాతలంబు!నీదు సొత్తె!.
పంచవేల?మంచి కొంత!ఫలాము లౌదు!తిండి లేక!
దంచ కీర్తి దోషమోపు!దళారి గాకు!పాపమోపు!
సంచితార్ధ పుణ్యు డౌమ!చలించు మంచి మార్గమందు!

5.గర్భగత"-పరిహారిణీ"-వృత్తము.
ధృతిఛందము.జ.ర.జ.ర.జ.ర.గణములు.యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఇలా తలంబు!నీదు సొత్తె?యెంచి పారవేయ కేరినిన్!
ఫలాము లౌదు తిండి లేక!పౌరుషంబు!పాపమోపునే!
దళారి గాకు!పాప మోపు!దారిజూపు సాటి వారికిన్!
చలించు మంచి మార్గమందు!చేరుకొమ్మ!మోక్షసౌధమున్!

6.గర్భగత"-రజోరంజిత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ఏరి పారవేయ కేరినిన్!యెంచవేల?దుర్మదాన!
పౌరుషంబు!పాపమోపునే!పంచవేల?మంచి కొంత!
దారిజూపు!సాటివారికిన్!దంచ కీర్తి దోషమోపు!
చేరుకొమ్మ మోక్షసౌధమున్!సంచితార్ధ!పుణ్యుడౌమ!

7.గర్భగత"-రజత్రయ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఏరి పారవేయ కేరినిన్!యిలాతలంబు!నీదు సొత్తె?
పౌరుషంబు!పాపమోపునే!పలాములౌదు!తిండి లేక!
దారిజూపు!సాటివారికిన్!దళారి గాకు!పాపమోపు!
చేరుకొమ్మ!మోక్ష సౌధమున్!చలించు మంచి మార్గమందు!

8.గర్భగత"-చతురజా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.జ.ర.జ.ర.ర.జ.గల.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఇలాతలంబు!నీదుసొత్తె!యేరిపారవేయ కేరినిన్!యెంచవేల?దుర్మదాన!
ఫలాములౌదు!తిండి లేక పౌరుషంబు!పాపమోపునే!పంచవేల?మంచికొంత
దళారిగాకు!పాపమోపు!దారిజూపుసాటివారికిన్!దంచ!కీర్తిదోషమోపు!
చలించు!మంచిమార్గమందు!చేరుకొమ్మ!మోక్షసౌధమున్!సంచితార్ధ!
పుణ్యుడౌమ!

9.గర్భగత"దుర్మదాశ్రి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.భ.ర.జ.గల.గణములు.యతులు.10.18.
ప్రాసనీమముగలదు.
ఏరిపారవేయ కేరినిన్!యెంచనేల?దుర్మదాన!యిలాతలంబు!నీదు!సొత్తె!
పౌరుషంబు!పాపమోపునే!పంచవేల?మంచికొంత!ఫలాములౌదు!తిండిలేక
దారిజూపు!సాటివారికిన్!దంచ!కీర్తిదోషమోపు!దళారిగాకు!పాపమోపు!చేరుకొమ్మ!మోక్షసౌధమున్!చలించు!మంచిమార్గమందు!సంచితార్ధ!
పుణ్యుడౌమ!

10.గర్భగత"-బిళ్హరీ"-వృత్తము. 
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఏరి పారవేయకేరినిం!ఇలాతలంబు!నిదుసొత్తె!యెంచవేల?దుర్మదాన!
పౌరుషంబు!పాపమోపునే!ఫలాములౌదు!తిండిలేక!పంచవేల?మంచికొంత
దారిజూపు!సాటివారికిన్!దళారిగాకు!పాపమోపు!దంచకీర్తి!దోషమోపు!
చేరుకోమ్మ!మోక్షసౌధమున్!చలించుమంచిమార్గమందు!సంచితార్ధ!
పుణ్యుడౌమ!
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.       
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గర్భగత " సమాశ్రీ ,మోహినీప్రియ , మత్తరజనీ , వృత్తములు కొంచము తేలికగా నున్నవి. నాబోటి వారికి ప్రయత్నించ వచ్చునేమో అన్నట్టుగా ,శ్రీ వల్లభవఝులవారికి కృతజ్ఞతలు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.