గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఫిబ్రవరి 2018, మంగళవారం

తప్పుటూహ, కూయిడు, నిస్సార, గర్భ మాపటూహా వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
తప్పుటూహ, కూయిడు, నిస్సార, గర్భ మాపటూహా వృత్తము.
రచన:- వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
మాపటూహావృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.భ.న.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
దాలిగుంట శ్వానమట్ల!తప్పువల్లెవేసి!నిశల!తలపరే!తెల్లవారగన్!
మేలుమాని కీడు సేయ!మెప్పుగోరి!గొప్పయనగ!మెలికయై!మాన్యదూరతన్!
చాలినంత!మేతమేసి!చప్పనైన కూతలలరి!జలగలై!పీల్చ రక్తమున్!
తేలియాడ!న్యాయమౌనె?తెప్పగాల్చు!రీతి సబబె?తిలకులే!భూమియందునన్

1.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
దాలిగుంట!శ్వానమట్ల!
మేలుమాని!కీడుసేయ!
చాలినంత!మేతమేసి!
తేలియాడ!న్యాయమౌనె?

2.గర్భగత"-సాదృశీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.న.గణములు.వృ.సం.491.ప్రాసగలదు.
తప్పువల్లెవేసి!నిశల!
మెప్పుగోరి!గొప్పయనగ!
చప్పనైన కూతలలరి!
తెప్పగాల్చు రీతి సబబె?

3.గర్భగత"-న్యూనభావ"-వృత్తము.
బృహతీఛందము.న.త.ర.గణములు.వృ.సం.168.ప్రాసగలదు.
తలపరే! తెల్లవారగన్!
మెలికయై! మాన్య దూరతన్!
జలగలై!పీల్చ !రక్తమున్!
తిలకులే?భూమియందునన్!

4.గర్భగత"-మెలిజీవన"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.భ.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
దాలిగుంట!శ్వానమట్ల!తప్పువల్లెవేసి నిశల!
మేలుమాని!కీడుసేయ!మెప్పుగోరి!గొప్పయనగ!
చాలినంత!మేతనంది!చప్పనైన!కూత లలరి!
తేలియాడ!న్యాయమౌనె?తెప్పగాల్చునీతి!సబబె?

5.గర్భగత"-తలపుల"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.న.న.తర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తప్పు వల్లెవేసి నిశల!తలపరే!తెల్లవారగన్!
మెప్పుగోరి!గొప్పయనగ!మెలికయై!మాన్య దూరతన్!
చప్పనైన!కూత లలరి!జలగలై!పీల్చ రక్తమున్!
తెప్పగాల్చు!రీతి సబబె?తిలకులే?భూమియందునన్!

6.గర్భగత"-మేలువినా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.న.న.త.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
తప్పువల్లెవేసి!నిశల!తలపరే!తెల్లవారగం!దాలిగుంట!శ్వానమట్ల!
మెప్పుగోరి!గొప్పయనగ!మెలికయై!మాన్యదూరతం!మేలుమాని!కీడుసేయ!
చప్పనైన!కూతలలరి!జలగలై!పీల్చ!రక్తముం!చాలినంత!మేతనంది!
తెప్పగాల్చుతీరు!సబబె?తిలకులే?భూమియందునం!దేలియాడ!న్యాయమౌనె?

7.గర్భగత"-తేలియాడ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.త.ర.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తలపరే!తెల్లవారగం!దాలిగుంట!శ్వానమట్ల!
మెలికయై!మాన్యదూరతం!మేలుమాని!కీడుసేయ!
జలగలై!పీల్చ రక్తముం!చాలినంత!మేతనంది!
తిలకులే?భూమియందునం!దేలియాడ!న్యాయమౌనె?

8.గర్భగత"-తప్పుటూహా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.త.ర.ర.జ.ర.జ.భ.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
తలపరేతెల్లవారగం!దాలిగుంట శ్వానమట్ల!తప్పువల్లెవేసి!నిశల!
మెలికయై!మాన్యదూరతం!మేలుమాని!కీడుసేయ!మెప్పుగోరి!గొప్పయనగ!
జలగలై!పీల్చరక్తముం!చాలినంత!మేతనంది!చప్పనైన!కూతలలరి!
తిలకులే?భూమియందునం!దేలియాడ!న్యాయమౌనె?తెప్పగాల్చురీతిసబబె!

9.గర్భగత"-కూయిడు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.న.ర.జ.గల.గణములు.యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తప్పువల్లెవేసి!నిశల! దాలిగుంట!శ్వానమట్ల!
మెప్పుగోరి!గొప్పయనగ!మేలుమాని!కీడుసేయ!
చప్పనైన!కూతలలరి!చాలినంత!మేతనంది
తెప్పతెప్పగాల్చురీతి!సబబె?తేలియాడ!న్యాయమౌనె?

10.గర్భగత"-నిస్సార"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.న.ర.జ.భ.స.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
తప్పువల్లెవేసి!నిశల!దాలిగుంట!శ్వానమట్ల!తలపరే!తెల్లవారగన్!
మెప్పుగోరిగొప్ప్పయనగ!మేలుమాని!కీడుసేయ!మెలికయైమాన్యదూరతన్!
చప్పనైన!కూతలలరి!చాలినంతమేతనంది!జలగలై!పీల్చ రక్తమున్!
తెప్పగాల్చురీతి!సబబె?తేలియాడన్యాయమౌనె!తిలకులేభూమియందునన్!
స్మూవ్ర్తస్తి.. 
జుత్తాడ. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" దాలిగుంట శ్వానమట్లు , తప్పువల్లె వేసి నిశల , తలపరే తెల్లవారగన్ , మొదలగు పద్యము లన్నియు అలతి అలతి పదములతో సులభ గ్రాహ్యముగా నున్నవి . శ్రీ వల్లభవఝులవారి ప్రతిభ అనన్యం . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.