గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఫిబ్రవరి 2018, సోమవారం

నిజభక్తి,ఘననిధి,విభూతిదా,గర్భ దిగ్గజ వృత్తము. రచన;-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
నిజభక్తి,ఘననిధి,విభూతిదా,గర్భ దిగ్గజ వృత్తము.
                                               రచన;-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.
                                                                       జుత్తాడ.

దిగ్గజ వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.ర.న.మ.జ.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కరముం!దేశ విభూతిదుల్కదలు సైన్యంబెంచగా!కనగా!నిజమైనభక్తుల్!
నిరవద్యుల్గుణశీలురుం!నిధులువారే!యిబ్భువిం!నినదించువరాలసొత్తుల్!
పరపీడందొలగింపగా!వదలకం!పోరాడుచున్బ్రణుతింగనువార లెంచన్!
వరదాలం!సృజియింతురే!పదిలసంస్కారంబునం!వరలంఘనకీర్తివంతుల్!

1.గర్భగత"-విశ్వసౌఖ్య"-వృత్తము.
బృహతీఛందము.స.భ.ర.గణములు.వృ.సం.180.ప్రాసగలదు.
కరముం!దేశవిభూతిదుల్.
నిరవద్యుల్గుణ శీలురున్!
పరపీడందొలగింపగా!
వరదాలం!సృజియింతురే!

2.గర్భగత"-మార్గగామినీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.మ.లగ.గణములు.వృ.సం.72.ప్రాసగలదు.
కదలు సైన్యంబెంచగా!
నిధులు!వారే యిబ్భువిన్!
వదలకం!పోరాడుచున్!
పదిలసంస్కారంబునన్!

3.గర్భగత"-శాసయా"-వృత్తము
బృహతీఛందము.స.స.య.గణములు.వృ.సం.92.ప్రాసగలదు.
కనగా!నిజమైన!భక్తుల్!
నినదించు!వరాల!సొత్తుల్!
ప్రణుతింగనువారలెంచన్!
వరలం!ఘనకీర్తివంతుల్!

4.గర్భగత"-రక్షణీవృత్తము.
అత్యష్టీఛందము.స.భ.ర.న.మ.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కరముం!దేశవిభూతిదుల్కదలుసైన్యంబెంచగా!
నిరవద్యుల్గుణశీలురుం!నిధులు వారే!యిబ్భువిన్!
పరపీడం!దొలగింపగా!వదలకం!పోరాడుచున్!
వరదాలం!సృజియింతురే!పదిల సంస్కారంబునన్!

5.గర్భగత"-నిధీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.మ.జ.జ.జ.గగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కదలు సైన్యంబెంచగా!కనగా!నిజమైన భక్తుల్!
నిధులు!వారే!యిబ్భువిం!నినదించు వరాలసొత్తుల్!
వదలకం!పోరాడుచుం!ప్రణుతింగనువార లెంచన్!
పదిల సంస్కారంబునం!వరలం!ఘన కీర్తి వంతుల్!

6.గర్భగత"-సేనావాహినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.జ.జ.జ.త.త.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కదలు సైన్యంబెంచగా!కనగా!నిజమైన!భక్తుల్కరముం!దేశవిభూతిదుల్!
నిధులు!వారే!యిబ్భువిం!నినదించువరాలసొత్తుల్నిరవద్యుల్గుణశీలురున్!
వదలకం!పోరాడుచుం!ప్రణుతింగనువారలెంచం!పరపీడందొలగింపగా!
పదిల!సంస్కారంబునం!వరలం!ఘనకీర్తివంతుల్వరదాలంసృజియింతురే!

7.గర్భగత"-వరాలప్రోవు"-వృత్తము.
ధృతిఛందము.స.స.య.స.భ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కనగా!నిజమైన!భక్తుల్కరముం!దేశవిభూతిదుల్!
నినదించు!వరాలసొత్తుల్నిరవద్యుల్గుణశీలురున్!
ప్రణుతిన్గనువారలెంచం  పరపీడం  దొలగింపగా!
వరలంఘనకీర్తివంతుల్వరదాలం!సృజియింతురే!

8.గర్భగత"-నిజభక్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.య.స.భ.ర.న.మ.లగ.గణములు.యతులు.10.19.
ప్రాసనీమముగలదు.
కనగా!నిజమైనభక్తల్కరముం!దేశవిభూతిదుల్కదలు!సైన్యంబెంచగా!
నినదించు!వరాల సొత్తుల్నిరవద్యుల్గుణశీలురుం!నిధులువారే!యిబ్భువిన్!
ప్రణుతింగనువారలెంచం పరపీడన్దొలగింపగా! వదలకం! పోరాడుచున్!
వరలం!ఘనకీర్తివంతుల్వరదాలం!సృజియింతురే! పదిలసంస్కారంబునన్!

9.గర్భగత"-ఘననిధి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.మ.జ.య.స.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కదలు!సైన్యంబెంగా!కరమున్దేశ!విభూతిదుల్!
నిధులు!వారే!యిబ్భువిం!నిరవద్యుల్గుణశీలురున్!
వదలకం!బోరాడుచు న్పరపీడన్దొలగింపగా!
పదిల!సంస్కారంబునన్వరదాలం! సృజియింతురే!

10.గర్భగత"-విభూతిదా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.జ.య.స.జ.జ.జ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కదలు!సైన్యంబెంచగా!కరమున్దేశ!విభూతిదుల్కనగా!నిజమైన!భక్తుల్!
నిధులు!వారే!యిబ్భువిం!నిరవద్యుల్గుణశీలురుంనినదించువరాలసొత్తుల్!
వదలకంబోరాడుచున్పరపీడందొలగింపగా!ప్రణుతిన్గనువారలెంచన్!
పదిలసంస్కారంబులనన్వరదాలం!సృజియింతురే!వరలం!ఘనకీర్తివంతుుల్

ఇట్లు.
తమవిశ్వసనీయుడు.
వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.