గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2018, గురువారం

మరాళగమన,పరమాత్మ, గర్భ మథుసూదనవృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
మరాళగమన,పరమాత్మ, గర్భ మథుసూదనవృత్తము.
  రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
   జుత్తాడ.
మథుసూదనవృత్తము.
ఉత్కృతిఛందము.ర.భ.న.భ.న.న.న.న.లగ.గణములు.యతులు.10.18.
ప్రాసనీమముగలదు.
క్రొత్తఛందంబుల నడక!కూరిమి దరినిలిచి!కొదువ గనని తెఱగున్!
చిత్తముంనిల్పి పరముడు!శ్రీరమణి,హరియును!సుధలు కురియ భువిన్!
మత్త శ్లేషార్ధ ప్రణవము! మారరిపు డుమ,కను!మధుర తమర భువిలోన్!
పొత్తు నింపొత్త నమరుత!భూరి విరచిత కృతి!బుధులు మురిసి తరియన్!

1.గర్భగత"-భూతి"-వృత్తము.
బృహతీఛందము.ర.భ.న.గణములు.వృ.సం.499.ప్రాసగలదు.
క్రొత్తఛందంబుల నడక!
చిత్తముం నిల్పి పరముడు!
మత్త శ్లేషార్ధ ప్రణవము!
పొత్తు నింపొత్త నమరుత!

2.గర్భగత"-పశుపతి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.న.లల.గణములు.వృ.సం.255.ప్రాసగలదు.
కూరిమి దరి నిలిచి!
శ్రీరమణి, హరియును!
మార రిపు డుమ,కను!
భూరి విరచిత కృతి!

3.గర్భగత"-వినయశ"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం.256.ప్రాసగలదు.
కొదువ గనని తెఱగున్!
సుధలు కురియ భువినిన్!
మథుర తమర భవిలోన్!
బుధులు మురిసి తరియన్!

4.గర్భగత"-ఇంపొత్తు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.భ.న.భ.న.లల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
క్రొత్త ఛందంబుల నడక!కూరిమి దరి నిలిచి!
చిత్తముంనిల్పి!పరముడు!శ్రీరమణి హరియును!
మత్త శ్లేషార్ధ ప్రణవము!మార రిపుడుమ,కను!
పొత్తు నింపొత్త నమరుత!భూరి విరచిత కృతి!

5.గర్భగత"-చతుర్నభ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.న.న.న.న.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కూరిమి దరి నిలిచి!కొదువ గనని తెఱగున్!
శ్రీరమణి,హరియును!సుధలు కురియ భువినిన్!
మార రిపు డుమ కను! మధుర తమర భువిలోన్!
భూరి విరచిత కృతి!బుధులు మురిసి తరియన్!

6.గర్భగత"-మథులిక"-వృత్తము.
ధృతిఛందము.న.న.స.ర.భ.న.గణములు.యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కొదువ గనని తెఱగున్! క్రొత్త ఛందంబుల నడక!
సుధలు కురియ భువినిన్! చిత్తముంనిల్పి పరముడు!
మథుర తమర భవిలోన్! మత్త శ్లేషార్ధ ప్రణవము!
బుధులు మురిసి తరియన్!పొత్తునమరుత!

7.గర్భగత"-అనురాగ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.న.స.య.న.లల.గణములు.యతి9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కూరిమి దరి నిలిచి!క్రొత్తఛందంబుల నడక!
!శ్రీరమణి,హరియును!చిత్తముంనిల్పి పరముడు!
మారరిపు డుమ కను!మత్త శ్లేషార్ధ ప్రణవము!
భూరి విరచిత కృతి!పొత్తు నింపొత్తు నమరుత!

8.గర్భగత"-విన్యాస"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.స.య.న.న.న.న.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కూరిమి దరినిలిచి!క్రొత్త ఛందంబుల నడక!కొదువ గనని తెఱగున్!
శ్రీరమణి,హరియును!చిత్తముం నిల్పి పరముడు!సుధలు కురియ భువినిన్ !
మార రిపు డుమ కను!మత్తశ్లేషార్ధ ప్రణవము!మథుర తమర భవిలోన్!
భూరి విరచిత కృతి!పొత్తు నింపొత్తు నమరుత!బుధులు మురిసి తరియన్!

9.గర్భగత"-మరాళ గమన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.ర.భ.న.భ.న.లల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కొదువ గనని తెఱగున్! క్రొత్త ఛందంబుల నడక!కూరిమి దరి నిలిచి!
సుధలు కురియ భువినిన్! చిత్తముంనిల్పి పరముడు!శ్రీరమణి,హరియును!
మథుర తమర భవిలోన్! మత్త శ్లేషార్ధ ప్రణవము! మార రిపు డుమ కను!
బుధులు మురిసి తఱియన్!పొత్తు నింపొత్తు నమరుత!భూరి విరచిత కృతి!

10.గర్భగత"-పరమాత్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.న.న.న.య.య.న.లల.గణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
కూరిమి దరి నిలిచి!కొదువ గనని తెఱగున్!క్రొత్త ఛందంబుల నడక!
శ్రీరమణి,హరియును!సుధలు కురియ భువినిన్!చిత్తముంనిల్పి పరముడు!
మారరిపు డుమ కను!మథురతమర!భవిలోన్!మత్త శ్లేషార్ధ ప్రణవము!
భూరి విరచిత కృతి! బుధులు మురిసి తఱియన్!పొత్తు నింపొత్తు నమరుత
 స్వస్తి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సరస్వతీ పుత్రులకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.