గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఫిబ్రవరి 2018, సోమవారం

ముకుళిత,గర్భ బుధామోదినీవృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
ముకుళిత,గర్భ బుధామోదినీవృత్తము.
                                              రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                      జుత్తాడ.

బుధామోదినీవృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.భ.భ.ర.స.ర.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ముకుళిత!పద్మ మియ్యది!మోదమునన్ప్రభాకరతన్మూర్తిదమై!వికసించున్
సకలమునీశ్వరేచ్ఛయె!సాధకశోధకంబులగున్!స్వార్తిని!బాపి!సుభూతిన్!
ప్రకటిత!ఛందచందము!వాదిలనేరకన్నిలుచున్వర్తిలు!భావితరంబున్!
కకవికలంద!నేరునె?కాదనకన్బుధాళి!గనున్!కార్తికవాసి!వరానన్!

1.గర్భగత"-చంప"-వృత్తము.
బృహతీఛందము.న.జ.భ.గణములు.వృ.సం.432.ప్రాసగలదు.
ముకుళిత!పద్మ మియ్యది!
సకలము!నీశ్వరేచ్ఛయె!
ప్రకటిత!ఛంద!చందము!
కకవిక లంద నేరునె?

2.గర్భగత"-భరసా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.స.గణములు.వృ.సం.215.ప్రాసగలదు.
మోదమునం!ప్రభాకరతన్!
 సాధక!శోధకంబు లగున్!
వాదిలనేరకం!నిలుచున్!
కాదనకం!బుధాళి!కనున్!

3.గర్భగత"-కావలి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.భ.గగ.గణములు.వృ.సం.51.ప్రాసగలదు.
మూర్తిదమై!వికసించున్!
స్వార్తిని!బాపి!సుభూతిన్!
వర్తిలు!భావి! తరంబున్!
కార్తిక!వాసి!వరానన్!

4.గర్భగత"-నిలయ"-వృత్తము.
ధృతిఛందము.న.జ.భ.భ.ర.స.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ముకుళిత!పద్మమియ్యది!మోదమునం!ప్రభాకరతన్!
సకలము!నీశ్వరేచ్ఛయె?సాధక!శోధకంబులగున్!
ప్రకటిత!ఛంద!చందము!వాదిల!నేరకం!నిలుచున్!
కకవిక లంద నేరునె?కాదనకం!బుధాళి!గనున్!

5.గర్భగత"-భవిష్య"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.స.ర.భ.గగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మోదమునం!ప్రభాకరతం!మూర్తిదమై!వికసించున్!
సాధక!శోధకంబు!లగుం!స్వార్తిని బాపిసుభూతిన్!
వాదిల!నేరకం!నిలుచుం!వర్తిలు!భావితరంబున్!
కాదనకం!బుధాళి!గనుం!కార్తికవాసి!వరానన్!

6.గర్భగత"-ముదకరి"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.స.ర.భ.త.న.ర.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
మోదమునం!ప్రభాకరతం!మూర్తిదమై!వికసించుం!ముకుళిత!పద్మమియ్యది?
సాధక!శోధకంబులగుం!స్వార్తిని బాపి!సుభూతిం!సకలము!నీశ్వరేచ్ఛయె?
వాదిలనేరకం!నిలుచుం!వర్తిలు!భావితరంబుం!ప్రకటిత!ఛంద!చందము!
కాదనకం!బుధాళి!గనుం!కార్తిక వాసి!వరానం!కకవిక!లంద!నేరునె?

7.గర్భగత"-కార్తిక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.భ.త.న.ర.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మూర్తిదమై!వికసించుం!ముకుళిత!పద్మ  మియ్యది!
స్వార్తిని బాపి!సుభూతిం!సకలము!నీశ్వరేచ్ఛయె?
వర్తిలు భావి తరంబుం!ప్రకటిత!ఛంద చందము!
కార్తిక!వాసి!వరానం!కకవిక లంద నేరునె?

8.గర్భగత"-ప్రమోదక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.భ.త.న.ర.స.స.జ.లగ.గణములు.యతులు.9,18.
మూర్తిదమైవికసించుం!ముకుళిత!పద్మమియ్యది!మోదమునం!ప్రభాకరతన్!
స్వార్తిని బాపి!సుభూతిం!సకలము!నీశ్వరేచ్ఛయె?సాధక!శోధకంబులగున్!
వర్తిలు!భావి తరంబుం!ప్రకటిత!ఛంద చందము!వాదిలనేరకం!నిలుచున్!
కార్తిక వాసి!వరానం! కకవిక లంద నేరునె?కాదనకం!  బుధాళి!గనున్!

9.గర్భగత"-గుంభిత"-వృత్తము.
ధృతిఛందము.భ.ర.స.న.జ.భ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు
మోదమునం!ప్రభా కరతం!ముకుళిత!పద్మమియ్యది!
సాధక!శోధకంబులగుం!సకలము!నీశ్వరేచ్ఛయె?
వాదిల నేరకం!నిలుచుం!ప్రకటిత!ఛంద!చందము!
కాదనకం!బుధాళి!గనుం?కకవిక లంద!నేరునె?

10.గర్భగత"-ముకుళిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.స.న.జ.భ.ర.భ.గగ.గణములు.యతులు.10,19.
మోదమునం!ప్రభాకరతం!ముకుళిత!పద్మమియ్యది!మూర్తిదమైవికసించున్!సాధక!శోధకంబులగుం!సకలము!నీశ్వరేచ్ఛయె!స్వార్తిం!బాపి!సుభూతిన్!
వాదిలనేరకం!నిలుచుం!ప్రకటిత!ఛందచందము!వర్తిలు!భావి తరంబున్!
కాదనకం!బుధాళిగనుం? కకవికలంద!నేరునె?కార్తిక వాసి వరానన్!
 స్వస్తి.
మూర్తి.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గర్భగత వృత్తములు రసరమ్యముగా నున్నవి శ్రీ వల్లభవఝుల వారికి ధన్య వాదములు . శ్రీ చింతా సోదరులకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.