జైశ్రీరామ్.
రజినీకరప్రియ,కల్పద్రుమ,యతిర్నవసుగంధినీ,కొంగుబంగరు గర్భ
గిరివరదమవృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
గిరివరదమవృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కొంగు బంగరంబు నట్లుగా!కోరినిల్చె దేవతాళి!కొండకోనలందదేలనో?
భంగపాటు తాళజాలకన్!పౌర నీతి నెత్తిజూపి!బండలంట!జేయునూహలన్!
శృంగభంగమందనేలనన్?జీరలేక!వీరిచేష్ట!చెండనెంచి!మంచిగూర్పగన్!
రంగరించి శాంతమేర్చగన్!రౌరవాదులేర్ప!నిల్చె!రండటంచు!నీతినేర్పగన్!
1.గర్భగత"-మత్తరజినీవృత్తద్వయము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
1కొంగుబంగరంబు నట్లుగా! 2.కొండకోనలందదేలనో?
భంగపాటు తాళజాలకన్! బండలంటజేయు!నూహలన్!
శృగభంగమందనేలనన్! చెండనెంచి!మంచిగూర్పగన్!
రంగరించి!శాంత మేర్చగన్! రండటంచు!నీతినేర్పగన్!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
కోరినిల్చె!దేవతాళి!
పౌరనీతి!నెత్తిజూపి!
జీరలేక! వీరిచేష్ట!
రౌరవాదులేర్ప నిల్చె!
3.గర్భగత"-రజోరంజిత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10.,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కొంగు బంగరంబు నట్లుగా! కోరినిల్చె!దేవతాళి!
భంగపాటు తాళ జాలకన్!పౌర నీతి నెత్తిజూపి!
శృంగభంగమందనేలనన్?జీరలేక!వీరిచేష్ట!
రంగరించి!శాంతమేర్చగన్!రౌరవాదు లేర్ప నిల్చె!
4.గర్భగత"-యతిర్నవరజనీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కోరి నిల్చె!దేవతాళి!కొండకోనలందదేలనో?
పౌరనీతి నెత్తిజూపి!బండలంట!జేయు నూహలన్!
జీరలేక!వీరి చేష్ట!చెండనెంచి!మంచి!గూర్పగన్!
రౌరవాదు లేర్ప నిల్చె!రండటంచు!నీతి నేర్పగన్!
5.గర్భగత"-దివివర్గ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.త.జ.ర.లగ.గణములు.యతులు.9,18,.
ప్రాసనీమముగలదు.
కోరినిల్చె!దేవతాళి!కొండకోనలందదేలనో?కొంగుబంగరంబు!నట్లుగా!
పౌరనీతి!నెత్తిజూపి!బండలంజేయు నూహలం!భంగపాటు!తాళజాలకన్!
జీరలేక!వీరిచేష్ట!చెండనెంచి!మంచిగూర్పగన్!శృంగభంగమంద!నేలనన్?
రౌరవాదులేర్ప నిల్చె!రండటంచు!నీతినేర్పగన్!రంగరించి!శాంతమేర్చగన్!
6.గర్భగత"-రజనీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కొండకోనలందదేలనో?కొంగు బంగరంబునట్లుగా!
బండలంజేయునూహలం!భంగపాటు!తాళజాలకన్!
చెండనెంచి!మంచిగూర్పగం!శృంగ భంగమందనేలనన్?
రండటంచు!నీతి నేర్పగం!రంగరించి!శాంతమేర్చగన్!
7.గర్భగత"-కల్పద్రుమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.రర.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కొండకోనలందదేలనో?కొంగుబంగరంబునట్లుగా!కోరినిల్చె!దేవతాళి!
బండలంజేయు నూహలం!భంగపాటు!తాళజాలకం!పౌరనీతి నెత్తిజూపి!
చెండనెంచి!మంచిగూర్పగన్!శృంగభంగమందనేలనం?జీరలేక!వీరిచేష్ట!
రండటంచు!నీతినేర్పగం!రంగరించి!శాంతమేర్చగం!రౌరవాదులేర్పనిల్చె!
8.గర్భగత"-యతిర్నవసుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కోరినిల్చె!దేవతాళి!కొంగుబంగరంబునట్లుగా!
పౌరనీనెత్త్తిజూపి!భంగపాటు!తాళజాలకన్!
జీరలేక!వీరిచేష్ట!శృంగభంగమంద!నేలనన్?
రౌరవాదులేర్ప నిల్చె!రంగరించి!శాంతమేర్చగన్!
9.గర్భగత"-కొంగుబంగరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కోరినిల్చె!దేవతాళి!కొంగుబంగరంబు!నట్లుగా!కొండకోనలందదేలనో?
పౌరనీతి!నెత్తిజూపి!భంగపాటు!తాళజాలకం!బండలంజేయునూహలన్!
జీరలేక!వీరిచేష్ట!శృంగభంగమందనేలనం?చెండనెంచి!మంచిగూర్పగన్!
రౌరవాదులేర్ప!నిల్చె!రంగరించి!శాంతమేర్చగం!రౌరవాదులేర్ప!నిల్చె!
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అద్భుతమైన ఈ ఛందోమహా సముద్రం లో ఓలలాడిస్తున్న శ్రీ వల్లభవఝులవారి ప్రతిభ శ్లాఘనీయము. అమృతమయమైన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.