గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఫిబ్రవరి 2018, ఆదివారం

గతికా,సమాశ్రీ,మత్తరజినీ,భావినీ,యతిర్నవసుగంధి,నియమ,సునీతినీ,సద్విశాల,నెడదనిడు,శోభకా, గర్భ కీర్తిగామినీవృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
గతికా,సమాశ్రీ,మత్తరజినీ,భావినీ,యతిర్నవసుగంధి,నియమ,సునీతినీ,సద్విశాల,నెడదనిడు,శోభకా, గర్భ కీర్తిగామినీవృత్తము.  రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                        జుత్తాడ.
కీర్తిగామినీ వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
పెదవిదాటు మాటలెల్ల!పృధ్వి దాటునంచు నెంచి!పేరుగాంచు మార్గమెంచుమా!
సుధలుచింద మేలుగూర్ప!సద్విభూత శాంతి గూర్చు!చూరగొమ్మ!సర్వసామ్యమున్!
సదమలంపు మార్గమెంచి!సద్వరాశ దీప్తి నింపు!సారమెంచి!మాటలాడుమా!
సొదలు దూరమౌచు మెల్గు!సద్విశాలభావజాల!సూరివౌదువీవు భూతలిన్! 


1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
పెదవిదాటు మాటలెల్ల!
సుథలు చింద మేలుగూర్ప!
సదమలంపు మార్గమెంచి!
సొదలు దూరమౌచు మెల్గు!

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
పృధ్వి దాటునంచు నెంచి!
సద్విభూత శాంతి గూర్చు!
సద్వరాశ!దీప్తి వెల్గు!
సద్విశాల !భావజాల!

3.గ్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
పేరుగాంచు మార్గమెంచుమా!
చూరగొమ్ము సర్వసామ్యమున్!
సారమెంచి మాటలాడుమా!
సూరివౌదువీవు!భూతలిన్!

4.గర్భగత"-భావినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
పెదవిదాటు మాటలెల్ల!పృధ్వి దాటునంచు నెంచి!
సుథలు చింద మేలుగూర్ప!సద్విభూత శాంతిగూర్చు!
సదమలంపు మార్గమెంచి!సద్వరాశ దీప్తి  వెల్గు!
సొదలు దూరమౌచు మెల్గ!సద్విశాల భావ జాల!

5.గర్భగత"-యతిర్నవ సుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పృధ్విదదాటు నంచు నెంచి!పేరుగాంచు మార్గ మెంచుమా!
సద్విభూత శాంతి గూర్చు!చూరగొమ్ము!సర్వసామ్యమున్!
సద్వరాశ!  దీప్తివెల్గు!సారమెంచి మాటలాడుమా!
సద్విశాల! భావజాల!సూరివౌదు వీవు భూతలిన్!

6.గర్భగత"-నియమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
పృధ్విదాటునంచునెంచి!పేరుగాంచు మార్గమెంచుమా!పెదవిదాటు
మాటలెల్ల!
సద్విభూత శాంతిగూర్చు!చూరగొమ్ము సర్వసామ్యముం!సుథలు చింద
మేలు గూర్ప!
సద్వరాశ దీప్తి వెల్గు!సారమెంచి మాటలాడుమా!సదమలంపు మార్గ
మెంచి!
సద్విశాల భావజాల!సూరివౌదు వీవు భూతలిం!సొదలు దూరమౌచు
మెల్గ!

7.గర్భగత"-సునీతినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పేరుగాంచు మార్గ మెంచుమా!పెదవిదాటు మాటలెల్ల!
చూరగొమ్ము సర్వ సామ్యముం!సుధలు చింద మేలుగూర్ప!
సారమెంచి మాటలాడుమా!సదమలంపు మార్గమెంచి!
సూరివౌదు వీవు భూతలిం!సొదలు దూరమౌచు మెల్గ!

8.గర్గభత "-సద్విశాల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
పేరుగాంచు మార్గమెంచుమా!పెదవిదాటు మాటలెల్ల!పృధ్విదాటునంచు!
నెంచి!
చూరగొమ్ము!సర్వసామ్యముం!సుథలుచింద మేలు గుర్ప!సద్విభూత
శాంతి గూర్చు!
సారమెంచి!మాటలాడుమా!సదమలంపు మార్గమెంచి!సద్వరాశ!దీప్తివెల్గు!
సూరివౌదువీవు!భూతలిం!సొదలుదూరమౌచు మెల్గ!సద్విశాలభావజాల!

9.గర్భగత"-నెడదనిడు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.జ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పృధ్విదాటునంచునెంచి!పెదవిదాటు మాటలెల్ల!
సద్విభూత శాంతి గూర్చు!సుథలు చింద మేలుగూర్ప!
సద్వరాశ!దీప్తి వెల్గు!సదమలంపు మార్గమెంచి!
సద్విశాలభావజాల!సొదలు దూరమౌచు మెల్గ!

10.గర్భగత"-శోధకా"-వృత్తము
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
పృధ్విదాటునంచునెందాపెదవిదాటు మాటలెల్ల!పేరుగాంచు!మార్గమెంచుమా!
సద్విభూతశాంతిగూర్చు!సుథలుచింద!మేలుగూర్ప!చూరగొమ్ము
సర్వ సౌఖ్యమున్!
సద్వరాశ!దీప్తివెల్గు!సదమలంపు మార్గమెంచి!సారమెంచి!మాటలాడుమా!
సద్విశాల!భావజాల!సొదలుదూరమౌచు మెల్గ!సూరివౌదువీవు!భూతలిన్!
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
అంతటి మహనీయ మూర్తికృషికి శిరసాభి వందనములు
ఆంధ్రామృతం శ్రీ చింతా సోదరులు ధన్యులు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పాండితీ స్రష్ట శ్రీ వల్లభవఝులవారి కీర్తి చంద్రికలు అంబరవీధుల్లో విహరించాలని ఆ వాగ్దేవికి నమస్కరిస్తూ .
నమోస్తు దేవీ నమోస్తు .
శ్రీ చింతా సోదరులు తనబ్లాగు ద్వారా కురిపించిన ఈ అమృతవర్షము నందు ధన్యత నొందితిమి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.