గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2017, గురువారం

ఈ రోజు పరమ పవిత్రమయిన గీతా జయంతి ఈ సందర్భముగా మీ అందరికి నా శుభాకాంక్షలు.

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ రోజు పరమ పవిత్రమైన గీతా జయంతి.
ఈ సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. 
 శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్.
గీతా కల్పతరుం వందే.
ఆ శ్రీకృష్ణ భగవానుఁడు లోకముననుగ్రహించ తలచి అర్జునునికె బోధ చేస్తున్న నెపమున 
మనకొఱకు శ్రీమద్భగవద్గీతను బోధించియున్నాఁడు. 
ఆపరమాత్మ ఆనందమయ దృష్టి మన అందరిపైనా ప్రసరించి జ్ఞానామృతమందించ్గాక అని మనస్రా కోరుకొనుచు, భక్తాగ్రగణ్యులైన మీ అందరికి శుభాకాంక్షలు తెలియఁ జేయుచున్నాను. 
జైహింద్. 

29, నవంబర్ 2017, బుధవారం

ఈ నాటి అవధానులలో పిన్న వయస్కుఁడయిన తాతా సందీప్ శర్మ ప్రతిభను చూడఁగలరు.

5 comments

  జైశ్రీరామ్.
ఆర్యులారా! 
శ్రీ వాణీ ప్రసాద లబ్ధ యైన నా సహోదరి 
ఉన్నత పాఠశాల తెలుఁగు ఉపాధ్యాయురాలు అయిన
 శ్రీమతి తాతా పార్వతి 
గారి పౌత్రుఁడు.
ఈ నాటి అవధానులలో పిన్న వయస్కుఁడు. 
చిరంజీవి తాతా శ్రీనివాస రమా సత్య సందీప్ శర్మ .MSc.,
జననము. తే.14-06-1994.
ఈ చిరంజీవి డాధూళిపాళ మహదేవమణి గారి వద్ద అవధాన విద్యనభ్యసించి ఇంత వరకు 23 అష్టావధానములు
ఒక ద్విగుణీకృత అష్టావధానౌ చేసి ఇంత చిన్న వయస్సులొనే
 తన అవధాన గురువులచే సత్కృతుఁడయ్యెను
అంతే కాదు
డా.గరికిపాటి నరసింహారావుగారు స్వయంగా సరస్వతీమాత ముద్రిక గల స్వర్నాంగుళీకాన్ని ఇతనికి అలంకరించారు.
ఇంకా
 అవధాని శ్రీ కడిమెళ్ళ ప్రసాద్ గారి చేత సత్కరించారు.
 జేసీఐ రాజమండ్రీ వారి చేత,
 నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్ ట్రష్టు వారిచేత సత్కృతులందుకొనెను.
  ప్రస్తుత 25వ అష్టావధానమును
25-11-2017న శ్రీ విరించిగారి ఇంట వారి అబ్బాయి వివాహము సందర్భముగా ఏర్పాటుచేయగా
అక్కడ నిరుపమానంగా చేసి అందరి మన్ననను పొందెను.

ఈ సభ నా సంచాలకత్వములో జరిగినది.
 సమస్యాపూరణ పృచ్ఛకులు శ్రీ మాచవో లు శ్రీధరరావు గారు
“బడియే చెఱసాల కేగు బాటను గొలుపున్ ”
అని ఈయగా
గుడి కట్టక గోపన్నయె 

వడి వడిగా పోగు జేయ వరహాలెలమిన్
జడుడగు తానీషా ఏ
ల్బడియే చెఱసాల కేగు బాటను గొలుపున్ !
అని సునాయాసంగా పూరించి తన అవధాన పటిమను చాటుకొని అందరినీ ఆశ్చర్యచకితులను చేసెను.
దత్తపది శ్రీఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఇవ్వగా  
సునాయాసంగా పూరించెను.
ఈ విధముగా ఎనమండుగురు పృచ్ఛకుల ప్రశ్నలకు చక్కగా సమధానములు చెప్పుచూ 
తన సమయ స్ఫూర్తిని కనఁబరెచెను.
ఈ అవధానము సుసంపన్నము చేసి
నిర్వాహకులైన శ్రీ విరించి గారిచే సత్కృతులందుకొనెను.
మన భాగ్యబగరమున జరుగుచున్న ప్రపంచ తెలుఁగు మహా సభలలో కూడా ఈ చిరంజీవికి సముచిత అవకాశమునివ్వఁ గలిగిరేని  అతని ప్రజ్ఞాపాటవములతో 
ప్రపంచ తెలుఁగు మహాసభకే వన్నె తేగలఁడనుటలో ఏమాత్రమూ సందేహము లేదు.
ఈ చిరంజీవి మీ అందరి ఆశీస్సులతో తన అవధానపాటవముతో ప్రపంచ భాషలలోనే మన తెలుఁగు అమోఘమైనదిగా తప్పక నిరూపించఁగలఁడు. వీనికి ఆ శారదాంబ కటాక్షం మీ అందరి ఆశీస్సులద్వారా లభింపఁ గలదని ఆశించుచున్నాను.
జైహింద్. 

28, నవంబర్ 2017, మంగళవారం

శ్రీ హరి వీయస్సెన్ మూర్తి బంధకవి కృత శంఖబంధ ఆటవెలది

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి బంధకవి కృత శంఖబంధ ఆటవెలది నాశ్వాదించండి.
 శ్రీ హరి వీయస్సెన్ మూర్తి బంధకవి కృత శంఖబంధ ఆటవెలది
శంఖబంధము
ఆటవెలది
(సామాజికాంశము)
(ఆధారము - వల్లభవఝలవారి గ్రంథము)
భారతంబు నందు వారను వీరను
భేదభావ మరయ తరగ దవుర
సమత మమత తోడ చరియించ మానవుల్
సౌఖ్య భాగ్య మెందు సతత మందు.
స్వస్తి.
హరి వీయస్సెన్ మూర్తి.
శ్రీ హరి వీయస్సెన్ మూర్తి గారికి అభినందనలు. 
జైహింద్.

27, నవంబర్ 2017, సోమవారం

తేదీ : 26-11-2017 ఆదివారము సమయం : 4.00 నజరిగిన అవధాని : "అవధానిరత్న", సాహిత్య శిరోమణి డా.మాడుగుల అనిలకుమార్ గారి అష్టావధానము

1 comments

 జైశ్రీరామ్.
అష్టావధాన కార్యక్రమము.
స్థలం : శ్రీ శారదా శంకర మఠం, అనంతపురము తేదీ : 26-11-2017 ఆదివారము 
సమయం : 4.00 కు జరిగినది.
https://www.facebook.com/panchangam.satyam/videos/1951159648477312/
అధ్యక్షులు - త్రిభాషావధాని బ్రహ్మ శ్రీ డా.జోస్యుల సదానందశాస్త్రి గారు
అవధాని : 

"అవధానిరత్న", సాహిత్య శిరోమణి డా.మాడుగుల అనిలకుమార్ గారు
నిషిద్ధాక్షరి :-
ర (రకార, రేఫ), త, న (నకార, దృతాలు)
ణ, శ, స, వ అనే అక్షరాలు మూడు పాదాలలో రాకుండా శారదాదేవిని స్తుతించాలి.
చదువులయమ్మా కొలుచగ
మదిలో జేయంగ ధీధి మహి మణిమయమై
మదిలో ముదముగ పదమిడి
పదలముగాజేరరావె
ప్రార్థింతునినున్||
దత్తపది :-
ధనము, ధనము, ధనము, ధనము
అనే పదాలతో మీకిష్టమైన విషయాన్ని వర్ణించండి.
ధనము ధనమటంచు ధరణిలో జనులెల్ల
ధనము వెంటఁబడగ తగునదెట్లు?
జ్ఞానధనము కూడ కావలెననిఁ దల్ప
బోధనమ్ముసరిపోవుఁ ధరణి.
సమస్య :- అరచేతికి పండ్లు వచ్చి యతివను కరచెన్ ||
సరుకులు, కదళీఫలములు
వెరువక కొనిపోవుచున్న భీరువునుఁ గనన్
ధర కోతి పట్టి లాగగ
నరచేతికి పండ్లు వచ్చి యతివను కరచెన్ ||
వర్ణన :- సీతాదేవి కనపడలేదని హనుమంతుడు ఆత్మహత్య చేసుకోబోతాడు. పరీక్షలలో సఫలము కాక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని వర్ణించండి.
ధరణీపుత్రిక కానకన్ హనుమ అత్యంతంబు దుఃఖంబుతో
మరణింపంగఁదలంచుటౌర తగునే మాహాత్మ్యముల్ వీడుటల్
ధరణిన్ ఛాత్రులు ఆత్మహత్యపరులై దైన్యంబుగాఁ జచ్చుటల్
పరువున్ బోవును తల్లిదండ్రులకు సంభావింప దుఃఖంబగున్ ||
ఆశువులు :-
1.శ్రీ భారతీ తీర్థ స్వాముల వారిని
ప్రార్థించాలి.
శ్రీమత్ శృంగగిరీంద్ర పీఠనిలయా శ్రీ భారతీతీర్థ స్వా
మీ మీదౌ పదపంకజభ్రమరమై మిమ్మే స్మరింపంగ సం
క్షేమంబుల్ సమకూర్చరే అరుగవే క్లేశంబులూహింపమా
వ్యామోహంబునశింపజేయు
మనుచున్ ప్రార్థించెదన్ భక్తితో ||
2. అవధానానికి వచ్చిన మిత్రబృందాన్ని శ్రీనివాసుడు ఆశీర్వదిస్తున్నట్లుగా వర్ణించాలి.
ప్రేముడి మిత్రుబృందమలరించెడునంచవధానకార్యమి
ట్లామడలెన్నొ దాటుచు ప్రయాణముజేసి కనంగ వచ్చిరే
నీ మహిమాన్వితంబయిన నేత్రయుగాబ్జమునందుఁ గాంచుచున్
సేమమునిమ్ము వీరలకు శ్రీయుత తిర్పతి వేంకటేశ్వరా||
వ్యస్తాక్షరి :-
స కిం సఖా సాధు న శాస్తి యోధిపం.
//ఓం తత్సత్//
అవధానివరేణ్యులకు అభినందనలు.
జైహింద్.

26, నవంబర్ 2017, ఆదివారం

పావులూరి సుప్రభ విరచిత స్వ రకల్పిత డిండిమము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి పావులూరి సుప్రభ విరచిత స్వరకల్పిత డిండిమమునవలోకించండి.
స్వరకల్పిత డిండిమ బంధము 
కవయిత్రి పావులూరి సుప్రభ విరచితరకల్పిత డిండిమము
కం
రావే వరమతి దాయిని
శ్రీవాణి కృపారసార్ద్ర చేతము తోడన్‌
నీవే గతియని నమ్మితి
శ్రీ విద్యనొసంగి నాకు శ్రియమిడవమ్మా
స్వస్తి.
సుప్రభ
10-26-2017
 స్వరకల్పిత డిండిమము రచించిన కవయిత్రి సుప్రభగారికి అభినందనలు.
జైహింద్.

25, నవంబర్ 2017, శనివారం

శ్రీ కందుల వరప్రసాదు బంధకవి కృత కుండలి నాగ బంధ కందము.

3 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ కందుల వరప్రసాదు బంధకవి కృత కుండలి నాగ బంధ కందమును చూచి, మీ అమూల్యమైన అభిప్రాయంతో పాటు అభినందనలు కూడా మీరు తెలియఁజేయఁగలరనిఆశించుచున్నాను.
ఇక చూడండి.
శ్రీ కందుల వరప్రసాదు బంధకవి కృత కుండలి నాగ బంధ కందము

కం. నారద సేవిత హరి మరి
కోరి వనజనయన నిలచె కూరిమి నొందన్
జేరితి నీదరి ధీరా
పారా! ఘనవరధర నిల పంకజ నయనా!

ఈ రచనకు స్ఫూర్తి నిచ్చిన వారికెల్లను వందనములు. ముఖ్యంగా
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారికి , శ్రీ కంది శంకరయ్య గారికి శ్రీ చింతా రామక్రుష్ణారావు గారికి , శ్రీమతి సుప్రభ గారికి , శ్రీ మూర్తి గారికి ధన్యవాదములతో.
స్వస్తి.
కందుల వరప్రసాద్.
కుండలి నాగ బంధ కందరచయిత శ్రీ ప్రసాదు గారికి నా అభినందనలు.
జైహింద్.

24, నవంబర్ 2017, శుక్రవారం

అష్టావధానము. .. .. .. తేదీ.25 - 11 - 2017. అవధాని చి.తాతా సందీప్ శర్మ. M.Sc.,

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
బ్రహ్మశ్రీ వేంకట సోమయాజుల ఆంజనేయ శర్మ (విరించి) శ్రీమతి భారతీ దంపతుల పుత్ర రత్నము
చి.యసస్వి ఆత్రేయకు చి.శారదతో వివాహము 
సందర్భముగా జరుగనున్న
అష్టావధానము.
ప్రస్తుతమున్న అవధానులలో అతి పిన్న వయస్కుఁడు రాజమహేంద్రవరమునకు చెందిన 
చి.తాతా సందీప్ శర్మ.
అవధానాద్భుత బోధనాగురువు 
బ్రహ్మశ్రీ ధూళిపాళ మహదేవమణి మహనీయుని శిష్యకోటిలో ఒకఁడు.

జననము. తే.14 - 06 - 1994.
తూర్పు గోదావరి జిల్లా లోని కోరుకొండ, రాజమహేంద్రవరములలో ప్రాథమిక విద్యాభ్యాసము సాగినది. 
2015లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము నుండి బీఎస్సీ - బయోటెక్నాలజీ పట్టభద్రులయిరి. 
2017లో ఆంధ్ర విశ్వకళా పరిషత్ విశాఖపట్టణము నుండి ఎమ్మెస్సీ - బయోటెక్నాలజీ పట్టా పొందినారు..

చిన్నతనంలో నాయనమ్మ కీ.శే.
తాతా పార్వతమ్మ (విశ్రాంత తెలుగు పండితురాలు) ప్రోత్సాహంతో పద్యరచన ప్రారంభించిరి. 

పద్యకళాతపస్వి శ్రీ ధూళిపాళ మహదేవమణి గారి శిష్యరికంలో అవధాన విద్య నేర్చుకొని, 

తొలి అవధానాన్ని డిగ్రీ చవుతున్న రోజుల్లో 
నన్నయ సారస్వత పీఠం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిరి. 

ఇప్పటి వరకు ఒక ద్విగుణీకృత అష్టావధానముతో కలిపి 24 అష్టావధానాలు చేసిరి.

ఈ చిరంజీవి 25 వ అవధానము
తే. 25 - 11 - 2017 న ఉదయం గం.11 ల నుండి
టెలిఫోన్ కాలనీ కమ్యూనిటీహాల్, 
జ్ఞాన సరస్వతీ దేవాలయం ప్రక్కన 
రోడ్ నెం.1.
టెలిఫోన్ కాలనీ,
ఆ.కె.పురం,
హైదరాబాదు 500102,
లో జరుగనున్నది.
చరవాణి సంఖ్య. 8 6 3 9 8 9 9 1 8 1.  //  .8 5 2 2 9 3 5 5 3 0.
ఆంధ్రామృత పాన లోలురందరూ ఆహ్వానితులే.

జైహింద్.

శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ కవి కృత ఆందోళికా బంధ సీసము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ కవి కృత ఆందోళికా బంధ సీసము తిలకించండి.



ఆందోళికా బంధ సీసము (దేవి స్తుతి) 
శ్రీ మాత, కాలిక, శ్రీ గౌరి, మారి, గిరిజ, రంభ ,లంభ ,శాంభవి, చల, జ్వాల, లలన, రామ,
రమ,హైమవతి, దుద్దురా, శివానీ,శ్రీనగజ, యచలజ, సతి,కాళి, హిండి
శారద,నగజాత, చండి,చర్చ,పరుల, కౌశికి, దేవేశి,గట్టుపట్టి
శాకిని, యాదవి, శాంభవి ,పాటల,కమలాలయ, యమల, కలిమి చెలియ,
రమ్య వదన, విశాలాక్ష్మి, రక్షి, జలధి
జ, సిరి, వాక్కాంత, భారతి, చపల, దక్ష
దనయ, సీత, సనాతని, తల్లి తల్లి ,
కరుణతో జూచుచూ ,నన్ను గాచ వలయు.
స్వస్తి.
పూసపాటి కృష్ణ సూర్యకుమార్
కవిగారికి అభినందనలు.
జైహింద్.

23, నవంబర్ 2017, గురువారం

శ్రీ హరి వీయెస్సెన్ మూర్తి కవి కృత శంఖ బంధ కందము

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయెస్సెన్ మూర్తి కవి కృత శంఖ బంధ కందమును తిలకించండి.

శంఖ బంధము కందము.
(ఆధారము – తెలుగులో చిత్రకవిత్వము)
రామ రఘువంశసోమా
శ్రీమదమేయ కరుణాఢ్య చిద్గుణ ధామా
క్షేమద సుందరనామా
భూమిన్ నీదయను మేము పొందగ లేమా.
స్వస్తి.
హరివీయెస్సెన్మూర్తి.
కవిగారికి అభినందనలు.
జైహింద్.

22, నవంబర్ 2017, బుధవారం

ద్వినాగ బంధం కందము. శ్రీ కందుల వరప్రసాద్ కవి కృతము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ కందుల వరప్రసాద్ కవి కృత ద్వినాగ బంధం కందమునవలోకించి ఆనందించి, అభినమ్దించండి.
.
ద్వినాగ బంధం కందము. 
ధనవనమున జనవనమున
ధనమన ఘనమను, ఘనమన ధనమను మనసా!
ఘనధనమున మన మన మున
కొన కనకన మను ధనమన గొన కొను మనసా!
స్వస్తి.
వరప్రసాద్.
సహృదయ కవికి నా అభినందనలు.
జైహింద్.

21, నవంబర్ 2017, మంగళవారం

అరిషడ్వర్గములు. .. .. .. రచన. బ్రహ్మశ్రీ వల్లభవఝల నరసింహమూర్తికవి.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! అరిషడ్వర్గమును గూర్చి వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి విరచించిన కందములందములనానందముగ చూడుడు..
                   
1.కం. కామంబనగా!కోరిక
         కామంబే!నాశమేర్చు!కర్మల నెలవై!
         క్షేమంబోపని కామము
         రామంబా?కాదు కాదు!రాజీవాక్షా!

2.కం. క్రోధము!తగ దెవ్వరికిని!
         శోధింపగ!దుష్కృతముల!దామంబగుచున్!
          బాధించు!పరుల!స్వేచ్ఛను!
          రాధేయా!మము!కనంగ!రావా!కృష్ణా!

3.కం. లోభము!జీవన!నరకము!
          భీభత్సపు!గురిని !జిక్కి!భీతిల!జేయున్!
         శోభిత కీర్తి!నశించును!
         శోభాయక కీర్తనలను ! సుగుణత గనుమా!

4.కం. మోహము మోహిత వరమై
           శ్రీహరి!గని మెచ్చునటుల! జీవన సరళిన్!
          ద్రోహపు చింతన మానుచు
          శ్రీహరి!హరయనగ!రక్ష చేకురు!నరుడా!

5.కం. మదమది!భవిత!వినాశము
          ముదమొదవు!మదము!శుభగము! మోక్షము!నిచ్చున్!
          మద'--పర సమ్మోహిని
          సదనంబవ!మెదలుగాదె?స్వార్ధము! నరుడా!

6.కం. కుత్సిత!మత్సర!భావము!
         సత్సంగము!చేరనీదు?చతురిమ!చెరచున్!
         వత్సా! సత్యము! మరువకు!
        తత్సామ్యము !కనవశంబె?ధాత్రీ తలమున్!

        స్వస్తి.
           వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.
          కవికి అభినందనలు
          జైహింద్.

20, నవంబర్ 2017, సోమవారం

శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారిచే రచింపఁబడిన మహానాగబంధము

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! మీరు తిలకించండి
పండిత ప్రకాండులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారిచే రచింపఁబడిన
 ‘చిత్రభారతము’ కావ్యం భీష్మపర్వము నుండి
వినూత్న మహానాగబంధము” 
సీ.శ్రీమహావిష్ణుని సిద్ధసంకల్పు స
ర్వంసహానన్తర్ధవర్ధమాను
మానుతు ధర్ము ధర్మాధ్యక్షు నందనం
దాదిత్యు గోవిందు నావిలాసు
వాసవు సత్యు నిర్వాణు సాణుశ్రీశు
భాను చలాచలమానవిశ్వ
శాశ్వతైకవ్యాస సాధ్యర్తు గోప్త గ
దాధరు ధన్యదు ధామ సామ
గీ.శ్రీరమేశుని సువ్యాసు శ్రీనిలయు ని
యుక్తు సుశ్రద్ధధానతాసక్తు దిశు మ
హామఖాధ్యక్షు వాయువాహను సురమ్యు
భక్తభద్రదు ప్రేముడిన్ ముక్తి గనుమ.
స్వస్తి.
ఏల్చూరి మురళీధరరావు.
 నాగబంధ సీసమున ఇంత నైపుణ్యమును చూపిన 
శ్రీ మురళీధరరావు గారిని 
మనసారా అభినందించుచున్నాను
లీలఁగ నేలుచూరి మురళీధర రావు మహాకవీంద్రులీ
జాడను చిత్రభారతము చక్కగ వ్రాసిరి. నాగబంధమున్
చాలఁగ మెత్తురందరు. లసత్కమనీయ కవిత్వ మార్గమం
దేలిక వీరు. వీనిఁ బరమేశ్వరుఁడేలుత నిత్యమున్ గృపన్. 
జైహింద్.

19, నవంబర్ 2017, ఆదివారం

అష్టావధానము. .. .. .. తేదీ.25 - 11 - 2017. అవధాని చి.తాతా సందీప్ శర్మ. M.Sc.,

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా!
బ్రహ్మశ్రీ వేంకట సోమయాజుల ఆంజనేయ శర్మ (విరించి) శ్రీమతి భారతీ దంపతుల పుత్ర రత్నము
చి.యసస్వి ఆత్రేయకు చి.శారదతో వివాహము 
సందర్భముగా జరుగనున్న
అష్టావధానము.
ప్రస్తుతమున్న అవధానులలో అతి పిన్న వయస్కుఁడు రాజమహేంద్రవరమునకు చెందిన 
చి.తాతా సందీప్ శర్మ.
అవధానాద్భుత బోధనాగురువు 
బ్రహ్మశ్రీ ధూళిపాళ మహదేవమణి మహనీయుని శిష్యకోటిలో ఒకఁడు.

జననము. తే.14 - 06 - 1994.
తూర్పు గోదావరి జిల్లా లోని కోరుకొండ, రాజమహేంద్రవరములలో ప్రాథమిక విద్యాభ్యాసము సాగినది. 
2015లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము నుండి బీఎస్సీ - బయోటెక్నాలజీ పట్టభద్రులయిరి. 
2017లో ఆంధ్ర విశ్వకళా పరిషత్ విశాఖపట్టణము నుండి ఎమ్మెస్సీ - బయోటెక్నాలజీ పట్టా పొందినారు..

చిన్నతనంలో నాయనమ్మ కీ.శే.
తాతా పార్వతమ్మ (విశ్రాంత తెలుగు పండితురాలు) ప్రోత్సాహంతో పద్యరచన ప్రారంభించిరి. 

పద్యకళాతపస్వి శ్రీ ధూళిపాళ మహదేవమణి గారి శిష్యరికంలో అవధాన విద్య నేర్చుకొని, 

తొలి అవధానాన్ని డిగ్రీ చవుతున్న రోజుల్లో 
నన్నయ సారస్వత పీఠం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిరి. 

ఇప్పటి వరకు ఒక ద్విగుణీకృత అష్టావధానముతో కలిపి 24 అష్టావధానాలు చేసిరి.

ఈ చిరంజీవి 25 వ అవధానము
తే. 25 - 11 - 2017 న ఉదయం గం.11 ల నుండి
టెలిఫోన్ కాలనీ కమ్యూనిటీహాల్, 
జ్ఞాన సరస్వతీ దేవాలయం ప్రక్కన 
రోడ్ నెం.1.
టెలిఫోన్ కాలనీ,
ఆ.కె.పురం,
హైదరాబాదు 500102,
లో జరుగనున్నది.
చరవాణి సంఖ్య. 8 6 3 9 8 9 9 1 8 1.  //  .8 5 2 2 9 3 5 5 3 0.
ఆంధ్రామృత పాన లోలురందరూ ఆహ్వానితులే.

జైహింద్.

18, నవంబర్ 2017, శనివారం

రాట్న బంధ కందము . రచన. కవయిత్రి పావులూరి సుప్రభ.

1 comments



జైశ్రీరామ్.
ఆర్యులారా! 
కవయిత్రి సుప్రభ గారు  రాట్న బంధ కందము నందంగా ఎలా వ్రాసారో చూడండి. అభినందించండి.

రాట్న బంధ కందము 
చారుమతీ ! సామవినుత!
సారస్వత, సుభగ రూప, స్వరసామ్రాజ్ఞీ!
వేరెవరె వేడుకొనఁగా
నారయ సర్వమ్ము నీవెగా! వరవరదా!
స్వస్తి.
సుప్రభ
11-07-2017
కవయిత్రికి అభినందనలు.
జైహింద్.

17, నవంబర్ 2017, శుక్రవారం

హోమగుండ జ్వాలాముఖమున దర్శనమిచ్చిన జగన్మాత ఓంకారము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
జుత్తాడ గ్రామమున 
శ్రీ ఉమామల్లేశ్వర స్వామివారి దేవళమున,
కార్తీకమాసము పర్వదినములందు 
ఆలయ ప్రధాన అర్చకులు 
బ్రహ్మశ్రీ వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి వారి
ఆధ్వర్యములో
ప్రతిదినము జరిపింప బడుచున్న 
రుద్రహోమమునుండి
వెలువడిన చిత్రములు. 
13-11-2017 న హోమ జ్వాలలో దర్శనమిచ్చిన 
జగన్మాత స్వరూపము అచ్చటి భక్తులను ఆశ్చర్య చకితులను చేసినది 
మీరునూ దర్శింపుడు.
పై జ్వాలా చిత్రమున కానవచ్చు చిత్రమును పోలిన చిత్రము..
అటులనే
14-11-2017 న ద్ర్శనమిచ్చిన ఓంకారము.
తెలుపు రంగులో దర్శనమిస్తున్న ఓంకారము గుర్తు.
మహిమాన్వితుఁడయిన పరమాత్మ చిత్రములను గుర్తించుటకు మనమేధస్సు ఏమాత్రము సరిపోవును? 
శివాయ నమః.
జైహింద్.

నాగద్వయ బంధ కందము. .. .. .. శ్రీ పొలిమేర మల్లేశ్వరరావు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నాగద్వయ బంధ కందమును శ్రీ పొలిమేర మల్లేశ్వరరావు విరచిచినవిధము బాగుంది చూడండి.
నాగద్వయ బంధ కందము

మొదటి రెండు పాదములు "ప్రియురాలు" 
తరువాత రెండు పాదములు "ప్రియుడు" పలికినట్లు వ్రాయబడినది. 

కం. మామ! బ్రమ వీడ లేకన్
నీ మదిలోన మెదులు నిజ నిజమును నేనే! 
భామ! శ్రమ మేడ లేకన్
ఆమెగ లోని మనసు గను అనుఁగును నేనే!
స్వస్తి.
పొలిమేర మల్లేశ్వరరావు.
చి. మల్లేశ్వర రావుకు అభినందనలు.
జైహింద్.

15, నవంబర్ 2017, బుధవారం

కోట శర్మ విరచిత ఖడ్గబంధము. .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
కోట శర్మ విరచిత ఖడ్గబంధమునవలోకింపుడు.
కం.
హరహర! శరణ్య! భవహర!
సురగణ వినుత! భుజగధర! శుభకర! పరమే
శ్వర! గిరివర! పరమ పురుష!
శరణు దురిత హర! హరినుత! శశిధర కనరా!
స్వస్తి.
కోట శర్మ.
కవిగారికి అభినందనలు.
జైహింద్.

14, నవంబర్ 2017, మంగళవారం

శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృత ఖడ్గబంధ కందము. .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృత ఖడ్గబంధ కందమవలోకించండి.

ఖడ్గ బంధ కందము.
అరకొర కారణములతో
నిరతము సురవరుల గొల్వనేరని వానిన్
సురుచిర మగు స్థిరయశ మది
ధర నమరుట జరుగబోవ దరయగ నెందున్.
స్వస్తి.
హ.వేం. స. నా మూర్తి
శ్రీ హరివియస్సెన్ మూర్తి బంధకవికి అభినందనలు.
జైహింద్.

13, నవంబర్ 2017, సోమవారం

కవయిత్రి పావులూరి సుప్రభ కృత ఖడ్గ బంధ కందము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!  కవయిత్రి పావులూరి సుప్రభ కృత ఖడ్గ బంధ కందము తిలకించండి.
కృత ఖడ్గ బంధ కందము
బిరబిర సారస నయనా
కరుణను బరుగెత్తనిమ్ము కమనీయముగా
మురువగు బంధములందున
వరదాయిని పల్కులంచుఁ బ్రజ మెచ్చు నుడుల్‌
స్వస్తి.
సుప్రభ
11-01-2017
బంధ కవయిత్రి పావులూరి సుప్రభ గారికి అభినందనలు.
జైహింద్.

12, నవంబర్ 2017, ఆదివారం

కవయిత్రి పావులూరి సుప్రభ విరచిత పద్మ బంధ తేటగీతి.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి పావులూరి సుప్రభ విరచిత పద్మ బంధ తేటగీతినవలోకించండీ.
షట్పత్ర పద్మ బంధము
తే.గీ
జేల నందింతు నీకిదే శ్రీమదంబ
చేరవచ్చి మన్నించిన చెల్మి నీది
హేలగాఁ బల్కి పల్కించు శీలమౌను
నిత్యమిత్తు జేలిట్టులె నీరజాక్షి
సుప్రభ
11-03-2017
 బంధ కవయిత్రి సుప్రభగారికి 
అభినందనలు.
జైహింద్.

11, నవంబర్ 2017, శనివారం

షట్పత్ర పద్మ బంధ తేటగీతి (శ్రీ శ్రీనివాసా జే) శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృతము.

1 comments

  జైశ్రీరామ్
ఆర్యులారా!.శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృత పద్మబంధ తేటగీతినవలోకించండి.

షట్పత్ర పద్మ బంధ తేటగీతి
(శ్రీ శ్రీనివాసా జే)
శ్రీలు గోరను సత్యమ్ము శ్రీనివాస!
నీదు భృత్యుని నన్నింత మోదమిచ్చి 
వాకు లందించి నిత్యమ్ము సాకు మయ్య 
దేవ! నీకు జేయందు నో దివ్యదేహ!
మూర్తి కవిగార్కి అభినందనలు.
జైహింద్.

10, నవంబర్ 2017, శుక్రవారం

మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు. .. .. .. బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! మనము గుర్తించవలసిన విషయము చూడండి. 
మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు.   ..   ..   ..   బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.
నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?
క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.
1.అక్షరలక్ష:ఈ గ్రంథం ఒక ఎన్‌సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.
2.శబ్దశాస్త్రం:రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.
3.శిల్పశాస్త్రం:రచయిత కశ్యపముని.ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి.ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు,మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.
4.సూపశాస్త్రం:రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు,పిండివంటలు,తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి,ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.
5.మాలినీ శాస్త్రం:రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.
6.ధాతుశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.మిశ్రలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.
7.విషశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.
8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం): రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి.సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు.ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.
9.మల్లశాస్త్రం: రచయిత మల్లుడు.వ్యాయామాలు,ఆటలు,వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.
10.రత్నపరీక్ష: రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం,బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.
11.మహేంద్రజాల శాస్త్రం:సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.
12.అర్థశాస్త్రం:రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.
13.శక్తితంత్రం: రచయిత అగస్త్యముని.ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం ఇందులోని భాగమే.
14.సౌధామినీకళ:రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.
15.మేఘశాస్త్రం: రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.
16.స్థాపత్యవిద్య:అదర్వణవేదం లోనిది.ఇంజనీరింగ్,ఆర్కితెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.
ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సాముద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?
వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​.
స్వస్తి.
చొప్పకట్ల సత్యనారాయణ.
ఇంత చక్కని విషయమును వివరించి సూచించిన శ్రీ సత్యనారాయణ గారికి అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్. 

9, నవంబర్ 2017, గురువారం

అనంతపురంలో అష్టావధానం. అవధాని. బ్రహ్మశ్రీ మాడుగుల అనిల్ కుమార్.

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభాకాంక్షలు.
.నేర్పరి చూడ మాడుగు లనిల్ సుకుమారుఁడు పండితుండు. తా
నోర్పుగ బోధనన్ గరుపు నొప్పుగ సత్పరి వృద్ధి సేయుచున్
దర్పమొకింత లేక కవితా మహితాత్ముల గౌరవించు రా
మార్పణమంచు సత్ఫలము నర్పణ సేసెడి సద్వధానియౌన్.

అట్టి మహనీయుని అవధానం తప్పక చూడండి.
ఈ అవధాన కార్యక్రమం నిరుపమానంగా సంపన్నమవాలని మనసారా కోరుకొంటూ నిర్వాహకులకు, అవధాని గారికి, పృచ్ఛకాళికి సంచాలకులకు, సభాసదులకు శుభకాంక్షలు ముందుగానే తెలియఁ జేస్తున్నాను.
జైహింద్.

8, నవంబర్ 2017, బుధవారం

జ్ఞాన ప్రదాతలు సప్తఋషులు . . . శ్రీ జాజి శర్మ. (06 - 11 - 1948)

2 comments

జైశ్రీరామ్.
70 వ పుట్టిన ఓజు జరుపుకొనిన
 శ్రీ జాజి శర్మ గారికి
శుభాకాంక్షలు.
జ్ఞాన ప్రదాతలు సప్తఋషులు
మన దేశమే ఒక ''ఋషి పీఠం'', విశ్వగురుపీఠం. ప్రపంచం కళ్లు తెరవక ముందే జ్ఞానతేజం వెల్లివిరిసింది. సమగ్ర విజ్ఞానం, సర్వశాస్త్రాలు ఇక్కడ శోభిల్లాయి. భారతదేశ మంటేనే వెలుగుపై మక్కువ చూపే దేశమని అర్థం అనగా- భారతదేశంలోని అక్షరాలను విడగొట్టి చూస్తే- 'భా' -- అనగా వెలుగు లేదా జ్ఞానము, 'రత'ము అంటే ఇష్టము అని అర్థం.
ఒక దీపం మరో దీపాన్ని, ఆ దీపం మరి కొన్ని దీపాలను వెలిగిస్తుంది, ఇది పరంపరగా కొనసాగుతుంది. చీకటిని పారదోలేది వెలుగు. ఆజ్ఞాన తిమిరాన్ని దూరం చేసేది జ్ఞానజ్యోతి. అది నిరంతరం గురువు నుంచి శిష్యునికి పరంపరగా కొనసాగుతూ ఉంటుంది. ''ఆదిగురువు'' భగవంతుడు. ఆ తేజోదీపం నుంచి మన వరకూ జ్ఞానాన్ని అందించిన పరంపరయే ఋషిపరంపర.
ఋషి అనగా ఋతము వైపు పయనించువాడు. ఋతము అంటే పరమ సత్యమును తెలియజేయు విజ్ఞానం. తపన చేత, తపస్సు చేత అట్టి జ్ఞానాన్ని పొంది, దానిని జగతికి అందించిన వారు ఋషులు. వేదం మొదలుకుని సర్వ భారతీయ శాస్త్రజ్ఞానం వీరు మనకందించిన జ్ఞాననిధి.
ఆధునిక శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలను కేవలం భౌతిక విషయ సృష్టికే పరిమితం చేస్తే ఆనాటి ఋషులు భౌతికాతీత విషయాలను (సృష్టిలోని మూల సత్యాలను) ఇంద్రియాతీతమైన ప్రజ్ఞతో తపోబలంతో, నిస్వార్థంగా, జగతికి అందించారు.
ఈ ఋషి పరంపరలో అగ్రగణ్యులు సప్తఋషులు; వారు నేటికీ తేజోస్వ రూపాలుగా, నక్షత్ర రాశిలో మనకు దర్శనమిస్తారు. ప్రతినిత్యం వీరిని స్మరించటం, భారతీయులు ఆనవాయితీ.
1. ఆగస్త్య మహర్షి, 2. అత్రి మహర్షి, 3. అంగీరస మహర్షి, 4. కశ్యప మహర్షి, 5. భృగు మహర్షి, 6. వశిష్ట మహర్షి, 7. విశ్వామిత్ర మహర్షి వీరిని సప్త ఋషులంటారు. కానీ ఈ పేర్ల విషయంలో పలు వివాదాలున్నాయి. వేరు వేరు సప్తఋషుల పేర్లు కనిపిస్తాయి.
1ఆగస్త్య మహర్షి
వశిష్ట మహర్షి సోదరుడు . లోకహితం కోరి దేవతలు వేడుకొనగా వారి కోసం సముద్రాన్ని 'ఔపోసన'పట్టిన వాడు. అగస్త్యుడు శ్రీరామునికి వనవాస కాలంలో పంచవటిలో నివసించమని సూచించి కొన్ని ధనుర్భాణాలను కూడా ప్రసాదించిన వాడు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'ఆదిత్య హృదయం' అనే సూర్యస్తోత్రాన్ని, రామునికి ఉపదేశించాడు.
దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ప్రసిద్ధి గాంచిన 'సిద్ధ వైద్యానికి' మూల పురుషుడు ఆగస్త్యుడు. ఇతను రచించిన శక్తిమంత్రము / శక్తిసంహిత/ ఆగస్త్య సంహిత గ్రంధాలలో 'విద్యుత్‌ శక్తి' గురించి, దానిని తయారు చేసే విధానం గురించి వివరింపబడింది. ధనుర్విద్యా రహస్యాలు, ఇతర విద్యలు కూడా దీనిలో ఉన్నాయి.
2. అత్రి మహర్షి,
సప్త ఋషులలో అత్రి మహర్షి ఒకడు. అత్రి మహర్షి అనసూయ భర్త. ఇతను బ్రహ్మ మానసపుత్రుడు. సృష్టి నిర్మాణంలో బ్రహ్మకు సహాయపడిన దివ్య పురుషుడు. త్రిమూర్తులను పసిపాపలుగా చేసి, మాతృభావంతో వారికి అతిథ్యం ఇచ్చింది తపో నిష్టురాలైన అనసూయ. సీతా రామ లక్ష్మణులకు అతిథ్యమిచ్చిన వాడు అత్రి మహర్షి, ఋగ్వేదంలో అత్రి సంహితను ఉపదేశించిన మంత్రద్రష్ఠ. ఆత్రేయ ధర్మశాస్త్రం / ఆత్రేయ స్మృతి అన్నది చాలా ప్రసిద్ధి గల ధర్మశాస్త్ర గ్రంథం. నేటికీ చాలామంది దీనిని పాటిస్తున్నారు. అత్రి మహర్షి కృషి యుగాలు గడిచినా ఇంకా నిలిచి ఉంది.
3. అంగీరస మహర్షి
ఈయన కూడా బ్రహ్మ మానస పుత్రుడు. తన తప:శక్తితో ఈ సృష్ఠి నిర్మాణంలో బ్రహ్మకు సహాయపడ్డాడు. ఇతను కర్ధమ ప్రజాపతి కుమార్తె శ్రద్ధను వివాహ మాడాడు. ఈ అంగీరస వంశం ఎంతగానో వృద్ధి చెందింది. అగ్నికి బదులుగా అతని కార్యం నిర్వహించిన సమర్ధుడు అంగీరస మహర్షి. అంగీరస స్మృతి అనే ధర్మశాస్త్రం లోకమున ప్రసిద్ధి గాంచినది. అంగీరసుడు ఆధర్వణ వేద మంత్రాలకు ద్రష్ట, ఉపనిషత్తులలో అంగీరస ప్రస్తావన ఉంది. అంగీరసుడు ఓంకార రహస్యాలను ముండకోపనిషత్తునందు వివరించాడు. సప్తఋషులలో ఒకడైన అంగీరసుడు సప్త ఋషి మండలంలో తేజోరూపంతో మనలను అనుగ్రహిస్తూ ఉంటాడు.
4. భృగు మహర్షి
బ్రహ్మ హృదయం నుంచి జనించినవాడు భృగువు. నవబ్రహ్మలలో ఒకనిగా ప్రసిద్ధి చెందాడు. భృగు వంశ మూలపురుషుడు.
ఇతను కర్ధమ ప్రజాపతి కుమార్తె ఖ్యాతిని వివాహమాడాడు. యాగఫలాన్ని పొందగల వారిని ఎంచుకొనుటకు త్రిమూర్తులను పరీక్షింపవచ్చి శివునికి లింగాకృతినీ, బ్రహ్మకు గుడిలేని శాపమునూ ఇచ్చి విష్ణువును భూలోకానికి రప్పించిన వాడు. హరిని యాగఫలకర్తగా నిర్ణయించిన తపస్సంపన్నుడు.
భృగుమహర్షి 'జ్యోతిష్య శాస్త్రసారం' రచించాడు. భరధ్వాజునికి సృష్టి రహస్యాలు బోధించాడు. పరశురాముడు శివుని మెప్పించి 'భార్గవాస్త్రం' సంపాదించడానికి ఉపదేశమిచ్చిన వాడు భృగువు.
ధర్మశాస్త్ర సూక్ష్మాలను ఎందరో మహర్షులకు బోధించిన భృగుమహర్షి ప్రాత:స్మరణీయుడు.
5. కశ్యప మహర్షి
ఇతను సప్త ఋషులలో ఒకడు. ఇతను మారీచ మహర్షి పుత్రుడు. కశ్యపవంశ మూలపురుషుడు. ఇతను దక్ష ప్రజాపతి కుమార్తెను వివాహమాడెను. ద్వాదశ ఆదిత్యులను, హిరణ్యాక్ష, హిరణ్య కశ్యపులను, కద్రువ నాగులను, రాహువును, గంధర్వులను, క్రోధమును, గోగణములను, బ్రాహ్మణులను, మేనకాది అప్సరసలను, సిద్ధులను, చంద్రాది దేవతలకు కశ్యపుడు తండ్రిగా జన్మలనిచ్చి సృష్టి ధర్మాన్ని కొనసాగించాడు. ''కశ్యపి'' అనే గంగను భువికి తీసుకుని వచ్చినవాడు. కశ్యప మహామునికి 'వామనుడు' కూడా జన్మించాడు. కశ్యపుని పేరు మీద 'శిల్పశాస్త్రం ఉంది. దీనిలో రాజభవనాలు, దేవాలయాలు, సభామందిరాలు మొదలైన వాని నిర్మాణ సంగతులు. వాస్తుశాస్త్ర రీతులు ఉన్నాయి.
6. వశిష్ట మహర్షి
ఇతను బ్రహ్మ మానసపుత్రుడు. ఇక్ష్వాకుల కుల గురువు. వశిష్టుని సతీమణి మహస్వాధ్వి అరుం ధతి. ఇతడు రామునికి 'యోగ వాశిష్టము' బోధించాడు. ఇది 'గీత' వంటిది. చాలా ప్రసిద్ధి గాంచినది. వశిష్ట స్మృతి, మను స్మృతి తరువాత అంత గొప్పది. క్షత్రియుడైన విశ్వామిత్రుని రాజర్షిగా, బ్రహ్మర్షిగా తీర్చిదిద్దినవాడు. బ్రహ్మతేజో సంపన్నుడు. నవబ్రహ్మలలో ఒకడు. సప్త ఋషులలో ఆరాధ్యనీయుడు వశిష్ఠుడు.
7. విశ్వామిత్ర మహర్షి
విశ్వామిత్రుడు తొలిగా క్షత్రియుడు, రాజు. వశిష్టునితో తలపడి, ఎదురు నిలిచి బ్రహ్మ ఋషి కావాలనే తలంపుతో మహాతపస్సు చేసి బ్రహర్షిగా ఎదిగిన వాడు. విశ్వామిత్రుని గాథ మనకు సదా స్ఫూర్తినిస్తుంది. ప్రతి ఓటమిని ఒక విజయంగా మార్చుకుని సప్త ఋషులలో ఒకనిగా నలిచిన ధీశాలి. విశ్వామిత్రుని చరిత, సాధారణ రాజు ఆధ్యాత్మికంగా ఎదగడానికి బ్రహర్షిగా నిలవడానికి పడిన తపన సప్త ఋషి మండలంలో నిలువ గలగిన సంకల్ప బలం యుగయుగాలకు అందరికి స్ఫూర్తినిచ్చే దివ్యగాథ.
రామునికి శస్త్రవిద్యలను నేర్పించిన వాడు, దుష్టశిక్షణ కోసం రామ లక్ష్మణులను వినియోగించినవాడు. హరిశ్చంద్రుని సత్యశీలత జగతికి చాటినవాడు. త్రిశంకు సృష్టి అనే సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహర్షి విశ్వామిత్రుడు. హైందవ జాతి నిత్యం స్మరించే 'గాయత్రి' మంత్రం ప్రసాదించినది విశ్వామిత్రుడే.
ఈ సప్త ఋషులు మనకు సదా రక్షగా నిలిచి మన బుద్ధిని ప్రేరేపించి, మనలను సన్మార్గాలలో నడుపుదురు గాక!
ఎందరో మహర్షులు, వారందించిన విజ్ఞానం అనంతం, వారి విశ్వకళ్యాణ భావం, సంకల్పశుద్ధి జగతిని సదా రక్షించుగాక!
వాల్మీకి, వ్యాసుడు రామాయణ, భారత్రగంథాలు రచించారు. వ్యాసభగవానుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు. అష్టాదశ పురాణాలను రచించాడు.
స్వస్తి.
మంచిమంచి విషయ పరిజ్ఞానాన్ని పాఠకులలో పెంచుచున్న 
శ్రీ జాజి శర్మ గారికి ధన్యవాదములు.
జైహింద్.

7, నవంబర్ 2017, మంగళవారం

ఓంకార నాగ బంధము కందము. .. .. .. రచన. కవయిత్రి పావులూరి సుప్రభ.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
ఓంకార నాగబంధము
బింకంబగు కందమందు బిగియించిరి. శ్రీ
శాంకరి కృపచే సుప్రభ.
ఇంకా ఆలస్యమేల యిది చదువుఁడయా!
ఓంకార నాగ బంధము కందము. 
రచన. కవయిత్రి పావులూరి సుప్రభ.
పలుకులు మురిపెంబిడు గద
పలికించిన సదయవగుచు బంధకవితకై
తెలుపుదు వెంటనె తెరపై
కలవాణియె రాల్చెనంచు కమలజు రాణీ

తెలుగులో చిత్రకవిత్వము అను గ్రంథములో పేర్కొనబడిన మూడు మాంగళిక బంధములలో మూడవది., చివరిది. మిగిలిన రెండు శ్రీబంధము, శ్రీకారబంధము కొద్ది రోజుల క్రితము చూపించబడినవి.
ఇది కూడ చాల సులభమయిన బంధమే. బంధకవితలు ( (ఆకార నియమ చిత్రములు) కూర్చుటకు ఉత్సాహమున్నవారు యత్నించవచ్చు.
స్వస్తి.
సుప్రభ
కవయిత్రికి అభినందనలు.
జైహింద్.

6, నవంబర్ 2017, సోమవారం

ప్రస్తుతము శని సంచారము. మనపై దాని ప్రభావము. .. .. .. బ్రహ్మశ్రీ కేబీయన్ శర్మ.

1 comments

జై శ్రీరామ్.
ఆర్యులారా! ప్రస్తుతము శని గ్రహము ఏయే రాశులవారికి  ఏయే స్థానాలలో ఉన్నదో ఆ విధంగా ఉండుటవలన కలుగు శుభాశుభములేమిటో బ్రహ్మశ్రీ కేబీయన్ శర్మగారు ఈ క్రింది విధంగా వివరించుతూ దోష పరిహారాన్ని కూడా చక్కగా సూచిచించియున్నారు.. చూచి శోభస్కర మార్గానువర్తులగుదురని ఆసించుచు, బ్రహ్మశ్రీ కేబీయన్ శర్మగారికి ధన్యవాదములు తెలియఁజేయుచున్నాను.

శని గ్రహము
తేది 26 అక్టోబర్ 2017, గురువారం నుండి  వృశ్చిక రాశి వదిలి ధనుస్సు రాశిలోకి మారుతున్నాడు. తద్వారా   మేషాది 12 రాశులవారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం.

శనీశ్వరుడు స్వతహాగా మంచివాడే. కానీ జోతిష్య శాస్త్రం ప్రకారం పాప గ్రహంగా పిలువబడుతున్నాడు.

శనికి  3 -6-11 స్థానాలు ఆయనకు  శుభ స్థానాలు.

అలాగే శనికి 1 - 2 - 4 - 7 - 8 - 12 స్థానాలు అశుభ స్థానాలు.

మన రాశి నుండి శని ఉన్న రాశికి లెక్కించగా వచ్చే సంఖ్యని బట్టి మన రాశికి శని శుభుడా లేక అశుభుడా అని తెలుసుకోవాలి.

*ఏయే రాశివారికి శని ఏయే స్థానాలలో ఉన్నాడో కింద గమనించండి*

*1 ♈ మేషం* :   *9 వ స్థానం*

*2 ♉ వృషభం* :  *8 వ స్థానం*

*3 ♊ మిధునం* : *7 వ స్థానం*

*4 ♋ కర్కాటకం* : *6 వ స్థానం*

*5 ♌ సింహం* :    *5 వ స్థానం*

*6 ♍ కన్య*      :      *4  వ స్థానం*

*7 ♎ తుల*  :    *3 వ స్థానం*

*8 ♏ వృశ్చికం*   :  *2 వ స్థానం*

*9 ♐ ధనుసు*  : *1 వ స్థానం*

*10 ♑ మకరం* : *12 వ స్థానం*

*11 ♒ కుంభం*  : *11 వ స్థానం*

*12 ♓ మీనం*  : * 10 వ స్థానం*

పై పట్టికను బట్టి  తుల కర్కాటక కుంభ రాశివారికి శని స్వర్ణ పాదంతో సంచరించడం వలన  శుభుడుగా ఉన్నాడు.                                                                                                                                     వృషభం -  మిధునం -  కన్య -  వృశ్చికం -  ధనుస్సు - మకర రాశులవారికి శని లోహ పాదంతో సంచరిస్తాడు కావున ఈ రాశుల వారికి మంచిది కాదు.
*వృశ్చికం -  ధనుస్సు - మకర రాశులవారికి ఏలినాటి శని* జరుగుతున్నది.
తక్కిన రాశులవారికి శని వలన ఎలాంటి శుభాశుభ ఫలాలు ఉండవు.

*శని బాగుగా లేనివారు ఈ కింది స్తోత్రం పారాయణం చేయడం మంచిది*

*శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)*

నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ |
నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ || ౧ ||

నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ |
నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక || ౨ ||

నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః |
నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః || ౩ ||

నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే |
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే || ౪ ||

నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః |
నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే || ౫ ||

సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే |
అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే || ౬ ||

నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః |
తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ || ౭ ||

జ్ఞాన చక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే |
తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్ || ౮ ||

దేవాసురమనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః |
త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే || ౯ ||

బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః |
రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః || ౧౦ ||

త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః |
ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః || ౧౧ ||

*శని త్రయోదశి రోజున
అలాగే
శనివారం నియమం
మరియూ
త్రయోదశి,అమావాస్య
తిధులలో
అలాగే
ప్రతిరోజు
శనీశ్వర స్వామి కి ప్రీతి గల
" తైలాభిషేకం"
శని జపం , స్వామి వారి దర్శనం
రుద్రాభిషేకం చేసుకోవడం వలన శని బాధలు తగ్గును. మంచిది*

తూ#గో , మందపల్లి గ్రామం లో గల శ్రీమందేశ్వర శనీశ్వర స్వామి వారి ఆలయ దర్శనం ,తైలాభిషేకం జరిపించుకోవడం వలన శనిగ్రహ శాంతి , శుభం కలుగును*
స్వస్తి.
జైహింద్.

5, నవంబర్ 2017, ఆదివారం

శ్రీ పొలిమేర మల్లేశ్వరరావు కవి విరచించిన నాగ శ్రీ బంధ కందము

3 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! మన సాహితీ బంధువు శ్రీ పొలిమేర మల్లేశ్వరరావు కవి విరచించిన 

నాగ శ్రీ బంధ కందము 
చక్కగా ఉన్నది. చూడఁగలరు.
మా స్వగ్రామము(గవరపేట)లో ప్రతీ దీపావళికి గౌరిదేవిని మా దేవాలయము నందు ప్రతిష్టించి, ఒక మాసము అమ్మవారు మా పురజనుల పూజలందుకొనును. ఇటువంటి గవరపేటలందు సంబరాలు(క్షణములు) అంబరాన్ని అంటుతాయి.
శ్రీకారబంధము

కం. శ్రీ గౌరి! హృదయ శంకరి
గా, గాంధర్వి! దయతోడఁ గాంచుము తల్లీ!
యీ గవరపేట లందు స్వ
రాగాల క్షణము లిడుదుము, ప్రణయము నందున్!
స్వస్తి.
పొలిమేర మల్లేశ్వరరావు.
బంధకవితాభిలాషులగు శ్రీ మల్లేశ్వరులకభినందనలు.
జైహింద్.

4, నవంబర్ 2017, శనివారం

బంధ కవి శ్రీ హరి వీయస్సెన్మూర్తి విరచిత లింగ బంధ సీసమాలిక.

2 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! బంధ కవి శ్రీ హరి వీయస్సెన్మూర్తి విరచిత లింగ బంధ సీసమాలికలో శివ ప్రార్థన అత్యద్భుతము. 
తప్పక మీరు మెచ్చే రచన. చూడగలరు.
లింగ బంధ సీసమాలిక
(శ్రీ పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గారి రచనను చదువుట వలన కలిగిన స్పూర్తితో చేసిన అభ్యాసము. వారికి ధన్యవాదములు)
లింగ బంధ శివ ప్రార్థన
సీసమాలిక
శంకర! స్మరహర! సన్నుతుల్ దేవర! భవదావసంహార! వందనంబు 
పరమాత్మ! దుర్వారపాపబంధుర మైన విశ్వమున్ రక్షించు శాశ్వత! హర!
అలనాడు సాగర మందు కన్పించగా రయమున విషమును త్రాగి రక్ష
చేసినాడవు గాదె! చిద్రూప! భూతేశ! నావార లెవరయ్య నీవు దప్ప 
మాటి మాటికి నన్ను మన్నించవే యంచు రమణీయ గుణధామ! శ్రమను నీకు 
కల్గ జేయుచునుంటి కైలాసగిరివాస! సంసారమను ఘోర సాగరమున 
మునిగియుండుటచేత ననురక్తితో జూచి సేవకుండను గాన జేరదీసి 
యాగ్రహించక గావు మయ్య నీవని యందు నేర మెంచక సత్య నిష్ఠ జూపి 
చంద్రశేఖర! మారసంహార! యీశ్వరా! సర్వార్థ సుఖదాత! శర్వ! రుద్ర!
పార్వతీ వల్లభా! భాగ్యకారక! భర్గ! ప్రమథాధిపతి! రమ్ము ప్రణతులయ్య!
మునిజనసురవంద్య! ఘనమోదకారక! యురగహారము లంది వరదుడ వయి 
ధరణిని సతతంబు స్థిరసుఖంబులు గూర్చి పరిరక్షణము చేయు భవహర! శివ!
తేటగీతి
దేవ! నినుగొల్తు నిరతంబు నిష్ఠతోడ 
కలుషసంహర! సత్యంబు పలుకుచుంటి 
సంపదలు గోర సజ్జన సంగమంబు 
కలుగు గతి జూపి సరసంపు పలుకు లిడుము.
స్వస్తి.
హరి వీయస్సెన్మూర్తి.
                                                                చూచారు కదా.
ఈ బంధకవి కలమున మరిన్ని బంధకవితలు వెలసి పాఠకాళికి అచ్చెరువు కలిగించేటంతటి మహాద్భుతముగా రాణించునని మనసారా ఆశించుచు, కవికి అభినందనలు తెలియఁ జేయుచున్నాను.
జైహింద్.

3, నవంబర్ 2017, శుక్రవారం

బిల్వవృక్షం ఎలా సృష్టించబడింది? .. .. .. బ్రహ్మశ్రీ చొప్పలట్ల సత్యనారాయణ గారి వివరణము.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో తెలుసుకుందాము. బ్రహ్మశ్రీ చొప్పలట్ల సత్యనారాయణ గారి వివరణము. 
మనకు తెలుసుకొన దగినది.
చూడండి.

ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి,
ఏం వరం కావాలో కోరుకోమన్నాడు.
అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది.
మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?" అని చెప్పింది.
ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు.
తద్వారా, .... ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు.
అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది.
అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది.
అందుకు కోపగించుకున్న వినాయకుడు, లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు.
గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి.
లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది.
ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి. అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు.
ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు.
అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు.
ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.
వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది.
యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి
'ఆకలి! ఆకలి!!' అని కేకలు వేయసాగింది.
అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి.
శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు.
అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది.
అందుకు ప్రసన్నుడైన పరమశివుడు,
*"తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు.*
*నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి.*
నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను.
దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి" అని దీవించాడు.
ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది.
 స్వస్తి.
చూచారుకదా!
అరుదగు వృత్తముల్ తెలియనద్భుతరీతిని తెల్పుచున్న మా
గురువరులయ్య మీరు. గుణ కోవిద! మీకు నమస్కరించెదన్.
నిరుపమ దైవ దర్శనము నిశ్చయమయ్య భవద్వచోనిధిన్.
తెరవును చూపుడయ్య పరతెంచిన పాఠక భక్తపాళికిన్.
ఆర్యా! ధన్యవాదములు.
జైహింద్.

2, నవంబర్ 2017, గురువారం

నాగ శ్రీ (కార) బంధ కందము. . రచన. శ్రీ కందుల నాగేంద్ర వరప్రసాద్.

2 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీమాన్ కందుల నాగేంద్ర వరప్రసాదు బంధకవి విరచిత శ్రీకార బంధ కందము తిలకించి, వారిని మీ వ్యాఖ్యలతో ప్రోత్సహించండి.
నాగ శ్రీ (కార) బంధ కందము. 
రచన. శ్రీ కందుల నాగేంద్ర వరప్రసాద్.
కం. శంకర! భవహర! శ్రీ కర! 
తంకవమున నుంటిమి గద తకపిక లాడన్ 
శంకర! మంచిది కా దభ
యంకర! మము గాచ వేగ! అభయము లిడరా! 
జైశ్రీరామ్ 
ఇట్లు
కందుల నాగేంద్ర వరప్రసాద్..
చూచిరికద కందుల కృత
ప్రాచీన ప్రబంధ కంద ప్రాభవ రచనన్?
వేచుటదేలను వ్యాఖ్యను
సూచితముగ వ్రాసి శుభము చూపుడు సుగతిన్.
బంధకవి వరప్రసాద్ గారికి అభినందనలు.
జైహింద్.