గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జులై 2017, సోమవారం

నూతన ఛందములలో గర్భ కవిత 78. . . . రచన . . . శ్రీ వల్లభ

జైశ్రీరామ్.
ప్రమాణీ త్రయ, యతిర్నవపంచచామర,ముక్కలిజర ద్వయ, శుభాననా,తరంగిణీ గర్భ. తరంగిణీవృత్తము.  
రచనవల్లభవఝల అప్పలనరసింహ మూర్తి, జుత్తాడతే,దీ.  22.6.2017.
తరంగిణీవృత్తము
సుదూర దూరగాములం     సుభూత భూత భూతికృత్    శుభాలనేర్చవైచితే శివా
ప్రదోషకాలమందునం         ప్రభావిభావ భాస్వకా         ప్రబోధమంద గొల్చితే హరా
పదాంబుజాలగొల్వగన్       ప్రభో వరాంగ జంగమా       స్వభావ శుద్థ మేర్చుమా పరా
సుధీర ధీర విక్రమా           సుభాననా పరంతపా        శుభాంగ నంది వాహనా భవా

1. సుదూర దూరగాములం     సుభూత భూత భూతికృత్      శుభాలనేర్చవైచితే శివా
  ప్రదోషకాలమందునం          ప్రభావిభావ భాస్వకా             ప్రబోధమంద గొల్చితే హరా
  పదాంబుజాలగొల్వగన్        ప్రభో వరాంగ జంగమా            స్వభావ శుద్థ మేర్చుమా పరా
  సుధీర ధీర విక్రమా            సుభాననా పరంతపా             శుభాంగ నంది వాహనా భవా

2. సుదూర దూరగాములం సుభూత భూత భూతికృత్
   ప్రదోషకాలమందునం  ప్రభావిభావ భాస్వకా
   పదాంబుజాలగొల్వగన్  ప్రభో వరాంగ జంగమా
   సుధీర ధీర విక్రమా సుభాననా పరంతపా
3. సుభూత భూత భూతికృత్ శుభాలనేర్చవైచితే శివా.
   ప్రభావిభావ భాస్వకా ప్రబోధమంద గొల్చితే హరా
   ప్రభో వరాంగ జంగమా స్వభావ శుద్థ మేర్చుమా పరా
   సుభాననా పరంతపా శుభాంగ నంది వాహనా భవా
  శుభాలనేర్చవైచితే శివా సుదూర దూరగాములం
  ప్రబోధమంద గొల్చితే హరా ప్రదోషకాలమందునం
  స్వభావ శుద్థ మేర్చుమా పరా పదాంబుజాలగొల్వగన్
  శుభాంగ నంది వాహనా భవా సుధీర ధీర విక్రమా
4. శుభాలనేర్చవైచితే శివా సుదూర దూరగాములం సుభూత భూత భూతికృత్
   ప్రబోధమంద గొల్చితే హరా ప్రదోషకాలమందునం ప్రభావిభావ భాస్వకా
   స్వభావ శుద్థ మేర్చుమా పరా పదాంబుజాలగొల్వగన్ ప్రభో వరాంగ జంగమా
   శుభాంగ నంది వాహనా భవా సుధీర ధీర విక్రమా సుభాననా పరంతపా
5. సుభూత భూత భూతికృత్ శుభాలనేర్చవైచితే శివా సుదూర దూరగాములం
    ప్రభావిభావ భాస్వకా ప్రబోధమంద గొల్చితే హరా ప్రదోషకాలమందునం          
    ప్రభో వరాంగ జంగమా స్వభావ శుద్థ మేర్చుమా పరా పదాంబుజాలగొల్వగన్
    సుభాననా పరంతపా శుభాంగ నంది వాహనా భవా సుధీర ధీర విక్రమా
      
1 ,ప్రమాణీ, అనుష్టుప్, ,,లగ, వృ.సం,86.
2, యతిర్నవ పంచ చామరవృత్తం ,,,,,,
3, ముక్కలిజరవృత్తం యతి,9,,,,రజ,,..
4, శుభాననా, సంకృతి, యతులు,11,17.,,,,,,,,. 
5, తరంగిణీ, ఉత్కృతి,,,,,,రజ,,లగ, యతులు,9,17..  
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పారిజాత పరిమళ భరితమైన నవ తరంగిణీ వృత్తము వివిధ ఛందస్సులను విందు చేస్తున్నందులకు గురువులు శ్రీవల్లభ వఝులవారికి కృతజ్ఞతలు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.