గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జులై 2017, శనివారం

నూతన ఛందములలో గర్భ కవిత 90. . . . రచన . . . శ్రీ వల్లభ

 జైశ్రీరామ్.
శశిరేఖ. అభిషేక. శమనా. శమన. మురిసిలు. సమ్మతిదూర. తర్జనీ.తద్భాను. ముదమారు. గుణపద. నరజానీ. నారజభా. ఉపకరిణీ. రజానస. మూనాళ్ళ. గర్భ. భవిష్యవాణీ వృత్తము. 
                                         రచన. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.                                                              
భవిష్యవాణీ వృత్తము.
మురిసిపడెదేల .మూనాళ్ళ ముచ్చటలకు ముదము గాదుమోసమీజగాన
చరితగనవేల చానాళ్ళు కీర్తులలర. చదిరబుద్ధి శాసితంబు గాదు. 
గరిక తపనేల .కానంగ  ముక్తి. జనుము గదియ నెంచి గాసిలంగ నేల .
పరము మదినెంచు పానంబు గానములను పదిలమంద భాసిలంగ శ్రీలు. 
                      గర్భగత వృత్తములు. 
1. మురిసి పడె దేల
చరిత గన వేల .
గరిక తపనేల. 
పరము మదినెంచు .
2. మూనాళ్ళ ముచ్చటలకు 
చానాళ్ళు కీర్తులలర 
కానంగ ముక్తి జనుము. 
పానంబు గానములను .
3.ముదముగాదు
చదిర బుద్ధి
.గదియనెంచి.
పదిలమంద 
4. మోసమీజగాన. 
శాసితంబుగాదు .
గాసిలంగ నేల. 
బాసిలంగ శ్రీలు. 
5.మురిసి పడెదేల  మూనాళ్ళ ముచ్చటలకు. 
చరిత గనవేల చానాళ్ళు కీర్తు లలర
గరిక తపనేల. కానంగ ముక్తి జనుము.
పరము మదినెంచు పానంబు గానములను.
6.మురిసి పడెదేల .మూనాళ్ళ ముచ్చటలకు ముదము గాదు
చరిత గనవేల చానాళ్ళు కీర్తు లలర చదిర బుద్ధి. 
గరిక తపనేల కానంగ ముక్తి జనుము గదియ నెంచి .
పరము మదినెంచు పానంబు గానములను పదిలమంద. 
7. మూనాళ్ళ ముచ్చటలకు ముదము గాదు.
చానాళ్ళు కీర్తు లలర  చదిర బుద్ధి 
కానంగ ముక్తి జనుము గదియ నెంచి .
పానంబు గానములను పదిలమంద .
8.మూనాళ్ళ ముచ్చటలకు ముదముగాదు. మోస మీజగాన 
చానాళ్ళు కీర్తు లలర చదిర బుద్ధి శాసి తంబు గాదు .
కానంగ ముక్తి జనుము గదియ నెంచి గాసిలంగ నేల.
పానంబు గానములను పదిల మంద బాసిలంగ శ్రీలు 
9..మూనాళ్ళ ముచ్చటలకు ముదముగాదు మోసమీజగాన మురిసిపడె దేల.
చానాళ్ళు కీర్తు లలర చదిరబుద్ధి శాసితంబు గాదు చరిత గనవేల 
కానంగ ముక్తి జనుము గదియ నెంచి గాసిలంగ నేల గరిక తపనేల .
పానంబు గానములను పదిలమంద  బాసిలంగ శ్రీలు పరము మది నెంచు. 
10.ముదము గాదు మోసమీజగాన .
చదిరబుద్ధి శాసి తంబు గాదు.
గదియనెంచి గాసిలంగ నేల. 
పదిల మంద భాసిలుగ శ్రీలు. 
11.ముదము గాదు మోసమీ జగాన మురిసి పడె దేల .
చదిర బుద్ధి శాసితంబు గాదు చరిత గనవేల 
గదియ నెంచి గాసిలంగ నేల గరిక తపనేల .
పదిల మంద భాసిలంగ శ్రీలు పరము మదినెంచు 
12.ముదముగాదు మోసమీజగాన మురిసి పడెదేల మూనాళ్ళ ముచ్చటలకు
చది ర బుద్ధి శాసితంబు గాదు చరితగనవేల చానాళ్ళు కీర్తులలర .
గదియ నెంచి గాసిలంగ నేల గరిక తపనేల ానంగ ముక్తి జనుము. 
పదిలమంద భాసిలంగ శ్రీలు పరముమదినెంచు పానంబు గానములను .
13. . మోసమీజగానమురిసి పడె దేల 
శాసితంబు గాదు చరిత గన వేల 
గాసిలంగ నేల గరిక తపనేల 
భాసిలంగ శ్రీలు పరముమది నెంచు .
14. .మోసమీజగాన మురిసి పడె దేల మూనాళ్ళ ముచ్చటలకు .
శాసితంబు గాదు చరిత గనవేల చానాళ్ళు కీర్తు లలరు .
గాసిలంగ నేల  గరిక తపనేల కానంగ ముక్తి  జనుము .
బాసిలంగ శ్రీలు పరము మదినెంచు పానంబు గానములను. 
15.  మోసమీజగాన మురిసి పడె దేల మూనాళ్ళ ముచ్చటలకు ముదముగాదు .
శాసితంబు గాదు చరిత గనవేల చానాళ్ళు కీర్తు లలర చదిర బుద్ధి .
గాసిలంగ నేల గరిక తపనేల కానంగ ముక్తి జనుము  గదియ నెంచి
బాసిలంగ శ్రీలు పరము మది నెంచు పానంబు గానములను పదిలమందు .
                                           


భవిష్య వాణి .ఉత్కృతి .న.స.య.జ.న.న.ర.జ.గల. .యతులు .8.16.21. 

గర్భ గత వృత్తములు 
1. శశిరేఖ. ఉష్ణిక్ .న.స.ల. వృ.సం.96.
2. అభిషేక. అనుష్టుప్ .త.భ.లల. వృ.సం. 245.
3.శమనా.సుప్రతిష్ట .న.గల. వృ.సం. 124. 
4.శమన. గాయిత్రి ర.జ.వృ.సం.43. 
5.మురిసిఅతిశక్వక్వరీ .న.స.య.జ.న. యతి.8.
6.  సమ్మతిదూర .కృతి .యతి .8.
7.తర్జనీ అతిజగతి .త.భ.న.స.ల. యతి 9.
8. తద్భాను .అతిధృతి .త.భ.న.స.జ.ర.ల.యతులు 9.14.
9.ముదమారు .త.భ.న.స.జ.న.న.గల. యతులు. 9.14.20.
10.గుణపద .త్రిష్టుప్. న.ర.జ.గల. యతి6. 
11.నరజాని .ధృతి .న.ర.జ.భ.న.జ. యతి12.
12.నారజభా .ఉత్కృతి .న.ర.జ.భ.న.జ.త.భ.లల. యతులు .6.12.19.
13.ఉపకరిణి .అతిజగతి .ర.జ.న.సల.యతి .7.
14.రజానస .ప్రకృతి .ర.జ.న.స.య.జ.న. యతి14. 
15.మూనాళ.ఉత్కృతి .ర.జ.న.స.య.జ.న.న.గల.యతులు .7.14.22.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
భవిష్య వాణీ వృత్తము చక్కని పేర్లతో పలురకముల నూతన్ ఛందస్సులను అవలీలగా రచించి మాకందిస్తున్న శ్రీ వల్లభవఝులవారి ప్రతిభ అనిర్వచ నీయము . కృతజ్ఞతలు.శ్రీ చింతా సోదరులు శ్లాఘ నీయులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.