గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జులై 2017, మంగళవారం

అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో:- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం. 
ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ. వరాహ పురాణం

తే.గీ. రావి, నిమ్మ, మఱ్ఱి, ప్రాతుమొక్కొక్కటి,
రెండు లుంగుషములు, రెండు దాడి
మముల నామ్ల ద్రువులు మహినైదు పూజాతి
చెట్లు పదియు పెంచ చెలఁగు సుగతి.

భావము. ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.