గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జులై 2017, బుధవారం

నూతన ఛందములలో గర్భ కవిత 87. . . . రచన . . . శ్రీ వల్లభ

జైశ్రీరామ్. 
స్థితి. మోహినీ. వెలిఛాయా. పరంతప .పాలకత్రయ.జనితా.వెలగల. గుణనిధి. వచసా. జీవిక.చందనా. మంజుల. తారక. సరయూ.సారావళీ. ఘనా. యశసా. సాయుధ. స్మరామి. గర్భ.పురందరవృత్తము.
        రచన. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.!జుత్తాడ. 
పురందర వృత్తము.
విలువైన కాలంబు విలువెంచి వెలగొంచు వెలిగించు జీవంబు పేర్మి నెంచి
కలి యైన.లోకంబు కలనంబు కలిగించు కల లీల తోపించు కర్మ బట్టి .
వెలు గొందు దైవంబు వెల నెంచు వెలు గౌచు వెలి వోని తేజాన .పేర్మినందు
కుల పోరు జీవంబు కులు కెంచి కులమెల్ల కొలి మేల త్రోసావు  కర్ము డౌచు.
1. విలువైన.కాలంబు
కలియైన లోకంబు
వెలుగొందు దైవంబు
కుల పోరు జీవంబు.
2. విలువెంచి వెలగొంచు
కలనంబు కలిగించు
వెలనెంచు వెలుగౌచు
కులుకెంచి కులమెల్ల.
3. వెలిగించు జీవంబు
కలలీల తోపించు.
వెలివోని తేజాన
కొలిమేల త్రోసావు. 
4.పేర్మి నెంచి
కర్మ బట్టి
పర్మ మెంచ
పేర్మి నందు
5విలువవెంచి               వెలగొంచు                     వెలిగించు
కలనంబు                   కలిగించు                        కలలీల
వెలనెంచు                 వెలుగౌచు                        వెలివోని
కలుకెంచి                    కులమెల్ల                        కొలిమేల
6.విలువైన కాంబు విలువెంచి వెలగొంచు
కలియైన లోకంబు కలనంబు కలిగించు 
వెలుగొందు దైవంబు వెలనెంచు వెలుగౌచు.
కులపోరు జీవంబు కులుకెంచి కులమెల్ల.
7. విలువైన కాలంబువిలువెంచి వెలగొంచు వెలిగించు .
కలియైన లోకంబు కలనంబు కలిగించు కలలీల.
వెలుగొందు దైవంబు వెలనాంచు వెలుగౌచు వెలివోని.
కులపోరు జీవంబు కులుకెంచి కులమెల్ల కొలిమేల.
8. విలువైన కాలంబు విలువెంచి వెలగొంచు జీవంబు.
కలియైన లోకంబు కలనంబు కలిగించు తోపించు
వెలుగొందు దైవంబు వెలనెంచు వెలుగౌచు తేజాన.
కులపోరు జీవంబు కులుకెంచి కులమెల్ల త్రోసావు
9. విలువెంచి వెలగొంచు వెలిగించు జీవంబు .
కలనంబు కలిగించు కలిలీల తోపించు
వెలనెంచు వెలుగౌచు వెలివోని తేజాన. 
కులుకెంచి కు లమెల్ల కొలిమేల త్రోసావు.
10. విలువెంచి వెలగొంచు వెలిగించు జీవంబు పేర్మి నెంచి.
కలనంబు కలిగించు కలిలీల తోపించు కర్మ బట్టి.
వెలనెంచు వెలుగౌచు వెలివోని తేజాన పేర్మి నందు 
కులుకెంచి కులమెల్ల కొలిమేల త్రోసావు కర్ము డౌచు .
11.విలువెంచి వెలగొంచు వెలిగించు జీవంబు పేర్మి నెంచి విలువైన కాలంబు. 
కలనంబు కలిగించు కలలీల తోపించు కర్మబట్టి కలియైన లోకంబు. 
వెలనెంచు వెలుగౌచు వెలివోని తేజానపేర్మి నందు వె గొందుదైవంబు. 
కులుకెంచి కులమెల్ల కొలిమేల త్రోసావు కర్ముడౌచు కలపోరు జీవంబు .
12.వెలిగించు జీవంబు పేర్మి నెంచి 
కల లీలతోపపించి కర్మబట్టి 
వెలివోని తేగొఅపేర్మి నందు
కొలిమేల త్రోసావు కర్ము డౌచు. 
13. వెలిగించు జీవంబు పేర్మి నెంచి విలువైన కాలంబు 
కలలీల తోపించు కర్మబట్టి కలియైన లోకంబు 
వెలివోని తేజాన పర్మమెంచు వెలుగొందు దైవంబు
కొలిమేల త్రోసావు కర్ము డౌచు కులపోరు జీవంబు.
14. వెలిగించు జీవంబు పేర్మి నెంచి విలువైన కాలంబు విలువెంచి.
కలలీలతోపించు కర్మ బట్టి కలియైన లోకంబు  కలనంబు. 
వెలివో ని తేజాన పర్మమెంచువెలుగొందు దైవంబు వెల నెంచు .
కొలిమేల త్రోసావు కర్ముడౌచు కులపోరు జీవంబు కులుకెంచి .
15. 
వెలిగించు జీవంబు పేర్మి నెంచి విలువైన కాలంబు విలువెంచి వెలగొంచు.
కలలీల తోపించు కర్మబట్టి కలియైన లోకంబు కలనంబు కలిగించు .
వెలివోని తీజానపేర్మినందు   వెలుగొందు దైవంబు వెల నెంచు వెలుగౌచు. 
కొలిమేల త్రోసావు కర్ముడౌచు  కులపోరు జీవంబు కులుకెంచి కులమెల్ల
16. 
వెలగొంచు వెలిగించు జీవంబు 
కలిగించు కలలీల తోపించు 
వెలుగౌచు వెలి వోని తేజాన 
కులమెల్ల కొలిమేల త్రోసావు .
17.
వెలగొంచు వెలిగించు పేర్మి నెంచి 
కల్గించు కలలీల కర్మ బట్టి. 
వెలుగౌచు వెలవోని పేర్మి నందు
కులమెల్ల కొలిమేల కర్ముడడౌచు. 
18.
వెలగొంచు వెలిగించు జీవంబు పేర్మి నెంచి విలువైన కాలంబు
 కలిగించు కలలీల తోపించు కర్మ బట్టి  కలయైన లోకంబు. 
వెలుగౌచు వెలివోని తేజాన పేర్మి నందు వెలుగొందు దైవంబు .
కులమెల్ల కొలిమేల త్రోసావు కర్ముడౌచు కులపోరు జీవంబు . 
19.
వెలగొంచు వెలిగించు జీవంబు పేర్మినెంచి విలువైన కాలంబు విలువెంచి . 
కలిగించు కలలీల తోపించు కర్మబట్టి కలయైన లోకంబు కలనంబు. 
వెలుగౌచు వెలివోని తేజాన పేర్మినందు వెలుగొందు దైవంబు వెల నెంచు  
కులమెల్ల కొలిమేల త్రోసావు కర్ముడౌచు కులపోరు జీవంబు కులుకెంచి.
పురందర.ఉత్కృతి స.య.న.భ.జ.స.య.జ.గల .యతులు. 8.12.16. 
గర్భ గతవృత్తములు 
1 .స్థితి .ఉష్ణిక్ స.జ.ల.వృ.సం.108.
2.మోహినీ. అనుష్టుప్ .స.న.గల. వృ.సం.188. 
3.వెలిఛాయ .ఉష్ణిక్. స.జ.గ. వృ.సం.44.
4. పరంతప .ప్రతిష్ట .ర.ల.వృ.సం.11.
5.పాలక. ప్రతిష్ట. స.ల.వృసం.12. 
6. జనితా. అతి శక్వరి .స.య.న.భ.జ. యతి 8. 
7.వెలగల. అతిధృతి .స.య.న.భ.జ.స.ల.యతులు 8.12.
8.గుణనిధి ఆకృతి.స.య.న.భ.జ.స.య.ల.యతులు 8.12.
9. వచసా. అతి శక్వరి .స.న.భ.జ.త. యతి 9.
10.  జీవిక .అతిధృతి. స.న.భ.జ.త.ర.ల యతులు. 9.16. 
11. చందన. ఉత్కృతి. స.న.భ.జ.త.ర.న.గల.యతులు. 9.16.20.
12. మంజుల.త్రిష్టుప్ .స.య.జ.గల. యతి.8.
13. తారక. ధృతి. స.య.జ.భ.జ.త. యతి .12.
14. సరయూ. ఆకృతి. స.య.జ.భ.జ.త.స.ల. యతులు 8.12. 
15.సారావళి. ఉత్కృతి. స.య.జ.భ.జ.త.స.న.గల.యతులు.8.12.19.
16.ఘనా. త్రిష్టుప్. స.న.ర.గల. యతి5.
17.యశసా. అతిశక్వరి .స.న.ర.ర.జ.యతి12.
18. సాయుధ. ఆకృతి. స.న.ర.ర.జ.స.జ.ల.యతు లు 12.16. 
19.స్మరామి .ఉత్కృతి. స.న.ర.ర.జ.స.జ.న.గల.యతులు. 5.12.16.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పండితులకు శిరసువంచి పాదాభి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.