గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జులై 2017, శనివారం

నూతన ఛందములలో గర్భ కవిత 83. . . . రచన . . . శ్రీ వల్లభ

జైశ్రీరామ్
విషయము: భద్రక.ముక్తిదా.మదినిండు.ప్రభాసినీ. క్షేమార్తి. శ్రేయస్కర. నీతిగుణ.క్షేమకరి గర్భ శ్రీమంత. వృత్తము.
రచన. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ
శ్రీమంత వృత్తము
శ్రీమంతుండెవ్వండీ భువి క్షేమంబాసించుచొడ్ల శ్రేయోవాంచాలుడెపోనీతిిన్
నీమంబున్నిష్టన్వీడక నేమంబారంనొప్పి నేయంబాసించు మహాత్ముండౌ.
రామంబౌ రామంబెంచుచు రామా రామాయటంచువ్రాయన్బూనుంభువి భాగ్యంబుల్
 కామారిం గొల్చుం భక్తిని కామంబౌ కీర్తి నంటు గాయాలంబాపు భిషగ్గౌచున్. 
1, శ్రీమంతుండెవ్వండీ భువి
నీమంబుంనిష్టం వీడక
రామంబౌ రామంబెంచుచు
కామారిం గొల్చుం భక్తిని.
2. క్షేమంబాసించు చొడ్ల
నేమంబారంగ నొప్పి
రామా రామా.యటంచు
కామంబౌ కీర్తినంటు. 
3. శ్రేయోవాంచాలుడె పో నీతిన్.
శ్రేయంబాసించు మహాత్ముండౌ. 
వ్రాయంబూనుం భువి భాగ్యంబుల్.
గాయాలంమాన్పు భిషగ్గౌచున్.
4. శ్రీమంతుం డెవ్వండీ భువి క్షేమంబాసించు చొడ్ల
నీమంబుం నిష్టం వీడక నేమంబారంగ నొప్పి 
రామంబౌరామంబెంంచుచు రామా రామా యటంచు
కామారిం గొల్చుం భక్తిం కామంబౌకీర్తి నంటు. 
5. క్షేమంబాసించు చొడ్లశ్రేయోవాంఛాలుడెపపో నీతిన్. 
నేమంబారంగ నొప్పి నేయంబాసించు మహాత్ముండౌ
రామా రామా యటంచువ్రాయంబూనుం భాగ్యంబుల్.
కామంబౌ కీర్తి నంటు గాయాలంమాన్పు భిషగ్గౌచున్. 
6. క్షేమంబాసించుచొడ్ల శ్రేయోవాంచాలుడెపో నీతిన్ శ్రీమంతుండెవ్వండీ భువి.
నేమంబారంగ నొప్పి నేయంబాసించు మహాత్ముండౌ నీమంబుం నిష్టం వీడక.
రామా రామా యటంచు వ్రాయంబూనుం భువి భాగ్యంబుల్ రామంబౌ రామం బెంచుచు.
కామంబౌ కీర్తినంటు గాయాలంమాన్పు భిషగ్గౌచున్ కామారింగొల్చుంభక్తిని
7. శ్రేయోవాంఛాలుడెపో నీతిన్  శ్రీమంతుం డెవ్వండీ భువి
నేయంబాసించు మహాత్ముండౌ  నేయంబారంగ నొప్ప
రాయంబూనుం భువిభాగ్యంబుల్ రామారామా యటంచు. 
గాయాలంమాన్పు భిషగ్గౌచున్ కామారింగొల్చుంభక్తిని. 
8. శ్రేయోవాంఛాలుడెపోనీతిన్ శ్రీమంతుండెవ్వండీ భువి క్షేమంబాసించుచొడ్ల.
నేయంబాసించు మహాత్ముండౌ నేయంబారంగ నొప్పి నీమంబుం నిష్టంవీడక. 
రామారరామా యటంచు వ్రాయంబూనుం భువిభాగ్యంబుల్ రామంబౌరామంబెంచుచు
కామంబౌ కీర్తి నంటు గాయాలంమాన్పుభిషగ్గౌచుచున్ కామారిం గొల్చుం భక్తిని.

శ్రీమంతవృత్తము. 
సంకృతి. మ.మ.స.మ.జ.మ.భ.మ. యతులు. 9.16.
గర్భగత వృత్తములు 
1. భద్రక    .అనుష్టుప్. మ.మ.లల. వృ.సం. 193. 
2. ముక్తిదా. ఉష్ణిక్ .మ.ర.ల. వృ.సం. 81. 
3. మదినిండు బృహతీ. మ.భ.ర.వృ.సం. 177. 
4. ప్రభాసినీ. అతిశక్వరీ .మ.ర.స.మ.జ. యతి .9. 
5. క్షేమార్తి .అష్టీ. మ.ర.య.త.య.గ. యతి 8. 
6. శ్రేయస్కర. సంకృతి. యతులు. 8.17.
7. నీతిగుణ.అత్యష్టీ. మ.భ.మ.మ.మ.ల.ల.
8.క్షేమకరి .సంకృతి. మ.భ.మ.మ.మ.స.మ.జ. యతులు. 10.18.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝుల వారి గగన మంటిన రచనలు గాంచగల అదృష్టము ఈజన్మకు లభించడం మా పూర్వ జన్మ సుకృతం. పండితు లిరువురికీ ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.